అసోం రైల్లో దొరికిన బాంబు
గువాహటి: అసోంలోని గువాహటికి సమీపంలోని ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైల్లో శక్తివంతమైన బాంబును పోలీసులు గుర్తించారు. కెందుకొండ రైల్వేస్టేషన్ లో రైలు ఆగినప్పుడు భద్రతా సిబ్బంది బాంబు కనుగొన్నారు. ప్లాస్టిక్ కవర్ లో టవల్ లో చుట్టి వైర్లు అతికించివున్న బాంబును గుర్తించినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
ఆరు కేజీలున్న బాంబును నిపుణుల బృందం నిర్వీర్యం చేసిందని తెలిపారు. దీబ్రుఘర్ లో ఆదివారం సంభవించిన బాంబు పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 25 మందిపైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రైల్లో బాంబు దొరకడం తీవ్రకలకలం రేపింది. బాంబు పేలకముందే గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.