bombay highcourt
-
‘పుణె పోర్షే కారు’ ప్రమాదం: పోలీసులపై బాంబే హైకోర్టు ప్రశ్నల వర్షం
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె పోర్షే కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులపై బాంబే హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రమాద సమయంలో కారు నడిపిన మైనర్‌కు ఒకసారి బెయిల్ ఇచ్చి మళ్లీ కస్టడీలోకి తీసుకోవడం ఏంటని బాంబే హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. బెయిల్ మంజూరు తర్వాత కూడా మైనర్‌ను అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచడంపై అతడి సమీప బంధువు ఫైల్ చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం(జూన్21) విచారించింది. పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ భారతి డాంగ్రే, జస్టిస్ మంజూష దేశ్‌పాండేలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.‘కారు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఇది దురదృష్టకరమే. అయితే కారు నడిపిన మైనర్ కూడా ఒక రకంగా బాధితుడే. ఏ నిబంధన కింద బెయిల్తర్వాత అతడిని పోలీసులు తిరిగి కస్టడీలోకి తీసుకుంటారు. ఇది నిర్బంధం కిందకు రాదా. కనీసం పోలీసులు బెయిల్ రద్దు పిటిషన్ కూడా వేయలేదు. కేవలం బెయిల్ ఆర్డర్ సవరించాలని పిటిషన్ వేశారు.దానిపైనే తీర్పు ఇస్తూ మైనర్‌ను అబ్జర్వేషన్ హోమ్‌కు పంపారు. ఏ రకమైన రిమాండ్ ఇది. ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చి మళ్లీ ఏ నిబంధనల ప్రకారం కస్టడీలోకి తీసుకున్నారు’అని బెంచ్ ప్రశ్నించింది.అయితే మైనర్ బెయిల్ ఆర్డర్ మార్చి అతడిని అబ్జర్వేషన్ హోమ్‌కు పంపడం సరైనదే అని ప్రాసిక్యూషన్ వాదించింది. దీంతో ఈ పిటిషన్‌పై తీర్పును కోర్టు మంగళవారానికి రిజర్వు చేసింది. కాగా, మే 19వ తేదీ తెల్లవారుజామున పుణెలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లను వేగంగా వచ్చిన పోర్షే కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువ ఇంజినీర్లు మృతి చెందారు. ఈ ప్రమాదానికి కారణమైన మైనర్‌కు జువైనైల్ బోర్డు తొలుత బెయిల్ ఇచ్చింది. అయితే దేశవ్యాప్తంగా బెయిల్‌పై తీవ్ర నిరసన రావడంతో తర్వాత మైనర్‌ను అబ్జర్వేషన్ హోమ్‌కు పంపిస్తూ ఆదేశాల్లో మార్పు చేశారు. -
కొడుకు పెళ్లికి ముందే.. కొచ్చర్ దంపతులకు భారీ ఊరట, జైలు నుంచి విడుదల
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త చందా కొచ్చర్ అరెస్ట్ అక్రమమంటూ బాంబే హైకోర్ట్ తీర్పు వెలువరించింది. దీంతో మంగళవారం చందా, దీపక్ కొచ్చర్లు జైలు నుంచి విడుదలయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా వీడియో కాన్ గ్రూప్‌కు రూ.3వేల కోట్ల రుణం మంజూరు చేశారంటూ గతేడాది డిసెంబర్ 23న సీబీఐ అధికారులు కొచ్చర్ దంపతుల్ని అరెస్ట్ చేశారు. జనవరి 25న కొచ్చర్ల కుమారుడు వివాహం జరగాల్సి ఉండగా.... అంతకంటే ముందే వారిద్దరి అరెస్ట్ సరైంది కాదంటూ కోర్టు తీర్పు ఇవ్వడంతో భారీ ఊరట లభించినట్లైంది. కోర్టు తీర్పులో ఏముందంటే? కేసు నమోదు చేసిన నాలుగేళ్ల తర్వాత ఆ జంటను అరెస్టు చేయడానికి గల కారణాన్ని అరెస్ట్ మెమోలలో పేర్కొనలేదని కోర్టు నిన్న తెలిపింది. "అరెస్ట్ మెమోలలో పేర్కొన్న పిటిషనర్లను అరెస్టు చేయడానికి కారణం తప్పనిసరి నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమే" అని పేర్కొంది. నిందితులు చేసిన తప్పు ఒప్పుకోకపోతే.. వాళ్లు విచారణకు సహకరించలేమని చెప్పలేమని తెలిపింది. అవినీతి నిరోధక చట్టం కింద తమ అరెస్టు చట్టవిరుద్ధమని, దర్యాప్తు ప్రారంభించేందుకు చట్టంలోని సెక్షన్ 17ఎ కింద అనుమతి తప్పనిసరి అని, ఈ దర్యాప్తును ప్రారంభించడానికి ఏజెన్సీకి అలాంటి అనుమతి లేదని కొచ్చర్ దంపతులు గతంలో కోర్టు ముందు వాదించారు. కాగా, ఇప్పటి ఐసీఐసీఐ రుణం కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌ను కూడా సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చదవండి👉 పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి, ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్’ -
వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో లింకు కేసులో మధ్యంతర బె యిల్‌పై ఉన్న విప్లవ కవి వరవరరావు(82)కు బాంబే హైకోర్టు ఊరట కల్పించింది. నవంబర్ 18వ తేదీ వరకు తలోజా జైలు అధికారులకు ఆయన లొంగిపోవాల్సిన అవసరం లేదని తెలిపింది. వరవరరావు వేసిన పిటిషన్‌పై విచారణను వచ్చే నెలకు వా యిదా వేసింది. అనారోగ్య కారణాలతో తలోజా జైలులో ఉన్న వరవరరావుకు బాంబే హైకో ర్టు ఫిబ్రవరి 22వ తేదీన ఆరు నెలల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయన సెప్టెంబర్ 5వ తేదీన తిరిగి కస్టడీకి వెళ్లాల్సి ఉంది. బెయిల్‌ను పొడిగించాలంటూ ఆయన వేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. బెయిల్‌పై ఉండగానే హైదరాబాద్ వెళ్లాలన్న వినతిపై వేరుగా పిటిషన్ దాఖలు చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. -
కరోనా: రూ. 150కే టీకా ఇవ్వాలి!
ముంబై: సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్‌లు తమ వ్యాక్సిన్లను అందరికీ సమానంగా రూ. 150కే విక్రయించేలా ఆదేశించాలని కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు టీకాలను వేర్వేరు రేట్లకు విక్రయించడంపై న్యాయవాది ఫయాజ్ ఖాన్ ఈ పిల్లో సవాలు చేశారు. ప్రస్తుతం టీకా ఒక అత్యవసర వస్తువని, అందువల్ల దీని సరఫరా, నిర్వహణను ప్రైవేట్ రంగం చేతుల్లో ఉంచకూడదని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ కారణంగా సంభవిస్తున్న మరణాలతో ప్రజల్లో పెరుగుతున్న భయాన్ని ఈ ఫార్మా కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయని విమర్శించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం కంపెనీలు ఉత్పత్తి చేసిన టీకాల్లో 50 శాతాన్ని కేంద్రానికి సరఫరా చేయాల్సిఉంటుంది. మిగిలిన 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, లేదా ఓపెన్ మార్కెట్లో సదరు కంపెనీలు విక్రయించుకోవచ్చు. కానీ ఈ సంక్షోభ తరుణంలో ధరను ప్రభుత్వమే నియంత్రించాలని, కంపెనీల దోపిడికి అవకాశం ఇవ్వకూడదని పిల్లో కోరారు. రాష్ట్రాలు ఓపెన్ మార్కెట్లో టీకాలను కొనాలని కేంద్రం సూచించడాన్ని సవాలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం టీకా సరఫరా చేస్తుందని, ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయకపోగా, ఓపెన్ మార్కెట్లో అధిక ధరకు కొనేలా ప్రేరేపిస్తోందని పిటీషనర్లు ఆరోపించారు. అందువల్ల కోర్టు జోక్యం చేసుకొని కంపెనీలు సమాన రేట్లకు టీకాలిచ్చేలా ఆదేశాలివ్వాలని కోరారు. సీరమ్ సంస్థ టీకాను కేంద్రానికి రూ. 150కి, రాష్ట్రాలకు రూ. 400, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 600కు విక్రయిస్తోందని తెలిపారు. భారత్ బయోటెక్ రాష్ట్రాలకు రూ. 600కు, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 1200కు టీకాను అమ్ముతోందన్నారు. ఈ అసమానతలు నివారించేందుకు కేంద్రం ముందుకు రావాలని కోరారు. చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని బెంచ్ ముందుకు ఈ పిల్ విచారణకు వచ్చే అవకాశముంది. చదవండి: లక్ష ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు -
బాంబే హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: శరీరానికి శరీరం తాకకుండా బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పటికీ ‘పోక్సో’ చట్టం కింద లైంగిక వేధింపులుగా పరిగణించలేమని తేల్చిచెబుతూ కేసులో నిందితుడికి విముక్తి కలిగిస్తూ బాంబే హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా మహారాష్ట్ర ప్రభుత్వానికి, నిందితుడికి నోటీసు జారీ చేసింది. రెండు వారాల్లోగా ప్రతిస్పందించాలని ఆదేశించింది. బాంబే హైకోర్టు నాగపూర్ ధర్మాసనం జనవరి 19న ఇచ్చిన తీర్పుపై అప్పీల్ దాఖలు చేయాలని అటార్నీ జనరల్‌కు సూచించింది. నాగపూర్ ధర్మాసనం తీర్పును సవాలు చేస్తూ ‘యూత్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ఎస్.ఎ.బాబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ హాజరై నాగపూర్ ధర్మాసనం తీర్పు వివరాలను తెలియజేశారు. గతంలో ఏ కోర్టు కూడా ఇలాంటి తీర్పు ఇవ్వలేదని, ఇది ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
అర్నబ్‌కు దక్కని ఊరట
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్నబ్ గోస్వామికి న్యాయస్థానం నుంచి ఊరట దక్కలేదు. 2018 నాటి కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. అయితే, ఈ విచారణ అసంపూర్తిగా ముగియడంలో అర్నబ్‌కు బెయిల్ లభించలేదు. శనివారం విచారణ కొనసాగిస్తామని బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చిచెప్పింది. ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో అర్నబ్‌ను బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ను కించపర్చేలా టీవీలో చర్చ నిర్వహించారని, అందుకే సభా హక్కుల ఉల్లంఘన చర్యలు ప్రారంభిస్తామంటూ అర్నబ్‌కి మహారాష్ట్ర శాసనసభ గతంలో నోటీసిచ్చింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టుకెక్కారు. నోటీసుపై కోర్టుకు వెళ్లడం చెల్లదని, జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ అసెంబ్లీ సెక్రెటరీ గతంలో అర్నబ్‌కి లేఖ రాశారు. విచారణ సందర్భంగా కోర్టు.. ‘పిటిషనర్‌ను బెదిరించేలా లేఖ ఎందుకు రాశారు? రెండు వారాల్లోగా వివరణ ఇవ్వండి’ అని అసెంబ్లీ సెక్రెటరీకి షోకాజ్ నోటీసు ఇచ్చింది. -
కళ్లజోళ్ల కోసం ఒక్కో జడ్జికి రూ.50వేలు
ముంబై: కళ్ళజోళ్లు కొనుగోలు చేసేందుకు బొంబాయి హైకోర్టులోని ప్రతి న్యాయమూర్తికి సంవత్సరానికి రూ. 50 వేలు చెల్లించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూపొందించిన గవర్నమెంట్ రిసొల్యూషన్(జీఆర్)ను సోమవారం ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రాల చట్టం, న్యాయవ్యవస్థ జీఆర్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. న్యాయమూర్తులు, వారి జీవిత భాగస్వాములతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా దీని పరిధిలోకి వస్తారు. ఈ మొత్తంలో పునరావృత ఖర్చులు కూడా ఉంటాయి. ఈ జీఆర్‌పై జూలై 10 జిఆర్ న్యాయ సలహాదారు, జాయింట్ సెక్రటరీ యోగేశ్ అమేటా సంతకం చేశారు. -
ఒక నేరం.. 2 చట్టాలు.. ఒక శిక్ష
న్యూఢిల్లీ: ఒకే నేరాన్ని రెండు వేర్వేరు చట్టాల ప్రకారం విచారించొచ్చని, కానీ రెండుసార్లు శిక్ష విధించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. గుట్కా అక్రమ రవాణా కేసులో బాంబే హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ మహారాష్ట్ర పోలీసులు దాఖలుచేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్య చేసింది. గుట్కా, పాన్ మసాలా అక్రమ రవాణా, నిల్వ, అమ్మకాలపై ఆహార భద్రతా ప్రమాణాల(ఎఫ్ఎస్ఎస్) చట్టం కింద కేసు పెట్టాలని, ఐపీసీ వర్తించదని గతంలో బాంబే హైకోర్టు తెలిపింది. తాజాగా ఈ తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెడుతూ ‘ఏదైనా ఒక చర్య లేదా ఉల్లంఘనను రెండు వేర్వేరు చట్టాల ప్రకారం నేరంగా పరిగణిస్తే, నేరస్తుడిని రెండు లేదా ఒకే చట్టం ప్రకారం విచారించొచ్చు. కానీ అదే నేరానికి రెండుసార్లు శిక్ష విధించకూడదు’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుత కేసులో మహారాష్ట్ర పోలీసులు ఐపీసీ ప్రకారం కూడా విచారణ ప్రారంభించడానికి అనుమతిచ్చింది. ఒకే నేరాన్ని రెండు వేర్వేరు చట్టాల ప్రకారం విచారించడానికి ఎలాంటి పరిమితులు లేవని, రెండుసార్లు శిక్ష విధించడమే ఆమోదయోగ్యం కాదని స్పష్టతనిచ్చింది. ఐపీసీ విస్తృతిని నిర్వచించడంలో బాంబే హైకోర్టు పొరబడిందని పేర్కొంది. మరోవైపు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తనిఖీలు వివాదాస్పదవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రముఖ సాంకేతిక నిపుణుడు, ఆధార్ ప్రాధికార సంస్థ మాజీ చైర్మన్ నందన్ నిలేకని సాయం కోరింది. -
పాస్‌పోర్టు అప్పగించాలని అద్నాన్ సమీకి ఆదేశం
ముంబై: పాకిస్థానీ గాయకుడు అద్నాన్ సమీకి మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. మాజీ భార్య సబాహ గలదారీ దాఖలు చేసిన కేసులో అద్నాన్ సమీ తన పాస్‌పోర్టును దర్యాప్తు అధికారులకు అప్పగించాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సబాహ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ ఆర్పీ సొందుర్బాల్ బుధవారంనాడు పాస్ పోర్ట్ అప్పగించాలని ఆదేశించారు. తనను హింసించిన కేసులో ముందస్తు బెయిల్ పొందిన అద్నాన్, హైకోర్టు మే 2009న ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలేదని కోర్టుకు నివేదించింది. ఇద్దరి పూచీకత్తుపై హైకోర్టు అద్నాన్క ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే జామీను ఇచ్చిన వ్యక్తులు జూలైలో తాము అద్నాన్ జామీను నుంచి వైదొలుగుతున్నట్లు తెలపారు. ఈ మేరకు కోర్టు అనుమతినిచ్చింది. అప్పటి నుంచి అద్నాన్కు జామీను ఇవ్వడానికి మరెవ్వరూ ముందుకు రాలేదు. దీంతో సబాహ న్యాయవాదులు మహేశ్ జత్మలానీ, ఎడిత్ డేలు కోర్టు ఆదేశాల ప్రకారం జామీన్దారులను ఏర్పాటు చేయడంలో అద్నాన్ విఫలమయ్యాడని, ఇది కోర్టు ఆదేశాల ఉల్లంఘనని న్యాయస్థానానికి నివేదించారు. కాగా అద్నాన్ అనారోగ్యం కారణంగా కోర్టుకు హాజరుకాలేకపోతున్నాడని అతని న్యాయవాది కోర్టుకు తెలిపాడు. ఇదిలా ఉండగా, అద్నాన్ నివాసముంటున్న లోఖండ్వాలా కాంప్లెక్స్‌లోని ఫైవ్ ఇన్ వన్ ఓబబెరాయ్ స్కైగార్డెన్ ఫ్లాట్లను ఖాళీ చేసి సబాహకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఫ్లాట్లలో అద్నాన్ తన మూడవ భార్య రోయా ఫరీబితో కలిసి నివసిస్తున్నాడు. ఈ ఫ్లాట్లు తన తల్లిగారి ఆస్తి అని సబాహ కోర్టుకు తెలిపింది. -
పుణే బస్ డ్రైవర్ మరణశిక్ష వాయిదా
ముంబై: పుణే బస్ డ్రైవర్ మరణ శిక్షను బాంబే హైకోర్టు వాయిదా వే సింది. అధికారుల మీద కోపంతో బస్సును అడ్డదిడ్డంగా నడిపి తొమ్మిది మంది మృతికి, 37 మంది గాయాలపాలు కావడానికి కారకుడైన సంతోష్ మానేకు ట్రయల్ కోర్టు ఏప్రిల్ 8న మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. తనకు విధించిన శిక్షపై మానే వాదనను ట్రయల్ కోర్టు వినలేదన్న కారణంతో మానేకు విధించిన మరణ శిక్షను హైకోర్టు వాయిదా వేసింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఖరారు చేసే సందర్భంలో న్యాయమూర్తి పీవీ హర్దాస్, పీఎన్ దేశ్‌ముఖ్‌లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. మానే వాదనను కూడా వినాల్సిన అవసరాన్ని న్యాయస్థానం గుర్తించాలని పేర్కొంది. కేసును మళ్లీ ట్రయల్ కోర్టుకే బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. మానే తరఫు వాదనను కూడా వినాలని ట్రయల్ కోర్టుకు సూచిందింది. మానేను అక్టోబర్ 15న ట్రయల్ కోర్టులో హాజరుపర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఆయన తరఫు వాదన కూడా విన్న తర్వాత న్యాయమూర్తి శిక్షను విధించాలని పేర్కొంది.