Bonalu jathara
-
నల్గొండ జిల్లాలో అంగరంగ వైభవంగా పాతనగర బోనాల ఉత్సవాలు (ఫొటోలు)
-
Bonalu 2023: వైభవంగా ఉజ్జయినీ మహంకాళి బోనాలు
రాంగోపాల్‌పేట్: చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్ దంపతులతో పాటు వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి దేవాలయానికి వచ్చారు. ఆయన సతీమణి స్వర్ణ అమ్మవారికి బోనం సమర్పించారు. మంత్రి మొదటి పూజ చేసిన అనంతరం 4.15 గంటలకు సాధారణ భక్తులను అనుమతించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం ముఖ్యమంత్రి కేసీఆర్ తన సతీమణితో కలిసి అమ్మవారిని దర్శించుకుని పట్టువ్రస్తాలు సమర్పించి పూజలు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, వేద పండితులు, అర్చకులు పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ కేకే తదితరులు కూడా సీఎంకు స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ వచ్చారు. కాగా హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కె.కవిత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీలు వి.హన్మంతరావు, అంజన్‌కుమార్ యాదవ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ కవిత బంగారు బోనంతో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి వచ్చే సమయంలో విడిగా వచ్చిన కవిత, తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం తల్లిదండ్రులతో కలిసి వెళ్లారు. పద్మారావు ఇంట్లో విందుకు సీఎం మహంకాళి అమ్మవారికి పూజలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి నేరుగా టకారాబస్తీలోని డిప్యూటీ స్పీకర్ పద్మారావు నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులతో కలిసి బోనాల విందును ఆరగించారు. సీఎంతో పాటు ఆయన సతీమణి, మంత్రులు మల్లారెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కవిత తదితరులు ఉన్నారు. -
ఇక ఆన్లైన్లో బోనం.. ఈసారి లష్కర్ బోనాలతో శ్రీకారం
సాక్షి, హైదరాబాద్ : ఆషాఢమాసం ప్రారంభంతో తెలంగాణలో బోనాల సందడి మొదలవుతుంది. ఈ మాసం మూడో ఆదివారం జరిగే లష్కర్ బోనాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. తలపై బోనం పెట్టుకుని భక్తిశ్రద్ధలతో ఉజ్జయినీ మహంకాళీ ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంటికి చేరుకుంటారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా అందరూ ప్రత్యక్షంగా బోనం సమర్పించే పరిస్థితులు లేవు. దీంతో ఆలయ నిర్వాహకులకు సరికొత్త ఆలోచన వచ్చింది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మన పేరుతో నిర్వాహకులే అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. అందులోని బియ్యాన్ని ప్రసాదంలా పోస్టు ద్వారా ఇంటికి పంపుతారు. వాటిని వండుకుని ప్రసాదంగా స్వీకరించొచ్చు. తొలిసారిగా ఈ ఏడాది లష్కర్ బోనాలతో ఈ వినూత్న ప్రయోగానికి దేవాదాయ–తపాలాశాఖలు సంయుక్తంగా శ్రీకారం చుట్టనున్నాయి. భద్రాద్రి తలంబ్రాలతో మొదలు కోవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో ఆలయాల్లోకి భక్తులను అనుమతించలేదు. ముఖ్యమైన వేడుకలు నిర్వహించుకోవాల్సి వస్తే, ఆలయాలకు వెళ్లకుండానే జరుపుకోవాల్సిన పరిస్థితి. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేసినా కరోనా భయంతో చాలామంది ఆలయాలకు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలకు దేవాదాయ శాఖ ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. భద్రాద్రి రాముడి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించే పరిస్థితి లేనందున, ఆన్లైన్లో గోత్ర నామాలతో పాటు ఇతర వివరాలను ముందుగా నమోదు చేసుకుంటే.. వారి పేరిట పూజాదికాలు నిర్వహించి పోస్టు ద్వారా ముత్యాల తలంబ్రాలు, మిశ్రీ ప్రసాదాన్ని ఇంటికే పంపే ఏర్పాట్లు చేసింది. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, సికింద్రాబాద్ గణేశ్ మందిరం, కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయం, కొండగట్టు ఆంజనేయస్వామి మందిరం, సికింద్రాబాద్ ఉజ్జయినీ ఆలయం, కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయాల్లో కూడా ఆన్లైన్ పూజలతో పోస్టు ద్వారా ప్రసాదం అందించే వెసులుబాటు కల్పించారు. రుసుము రూ.200! బోనాలను కూడా ఆన్లైన్ ద్వారా సమర్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి రూ.200 రుసుము నిర్ధారించే వీలుంది. ఆ రుసుమును తపాలాకార్యాలయాల్లో చెల్లించి పేరు నమోదు చేసుకుంటే భక్తుల పేరుతో ఉజ్జయినీ మహంకాళీకి ఆలయ సిబ్బంది బోనం సమర్పించి అందులోని బియ్యం నుంచి 20 గ్రాములు, కుంకుమ, పొడి ప్రసాదాన్ని పోస్టు ద్వారా వారి ఇంటికి పంపుతారు. ఈ మేరకు తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, భవిష్యత్తులో మరిన్ని దైవిక సేవలను ఆన్లైన్ ద్వారా నిర్వహించే ఏర్పాటు చేస్తున్నారు. సికింద్రాబాద్ గణేశ్ మందిరంలో మోదక హవనాన్ని నిర్వహిస్తారు. దీనికి సంబంధించి కూడా తపాలాశాఖతో దేవాదాయ శాఖ ఒప్పందం కుదుర్చుకుంటోంది. విభూది, పొడి ప్రసాదం, కుంకుమ, గరిక లాంటి వాటిని పోస్టు ద్వారా పంపుతారు. -
లాల్ దర్వాజా బోనాలు..
-
లాల్ దర్వాజా బోనాలు.. భక్తులకు నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్ : ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామునే బలగంప కొనసాగింది. అనంతరం అమ్మవారికి అర్చకులు జల కడవ సమర్పించారు. ఆ తర్వాత ఆలయ కమిటీ తరఫున అధికారికంగా అమ్మవారికి ఒక్క బోనాన్ని సమర్పించింది. సాయంత్రం ఆరు గంటలకు శాంతి కల్యాణం జరగనుంది. సోమవారం పోతరాజు స్వాగతం, రంగం (భవిష్యవాణి) కార్యక్రమం పూర్తయిన తర్వాత పరిమితంగా కమిటీ సభ్యులతో ఘట ఊరేగింపు ఉంటుంది. పోలీసుల దిగ్భంధంలో ఆలయ పరిసరాలు కరోనా వైరస్ ప్రభావం కారణంగా బోనాలకు భక్తులను అనుమతించడం లేదు. మరోవైపు పోలీసులు...ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆలయానికి వచ్చే అన్ని మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు కోవిడ్ నిబంధనలలో భాగంగా నో ఎంట్రీ సూచికలను ఏర్పాటు చేశారు. నాగుల చింత నుండి లాల్ దర్వాజా, ఓల్డ్ ఛత్రినాక పీఎస్ నుండి లాల్ దర్వాజా, గౌలిపురా లాల్ దర్వాజా రోడ్లు మూసివేశారున. (హైదరాబాద్ గాలి తిరిగింది!) ఇళ్లలోనే అమ్మవారికి బోనాల సమర్పణ.. ఇళ్లలోనే బానాల సమర్పణకు భక్తులు సిద్ధమయ్యారు. వాస్తవానికి పాతబస్తీలో ఆదివారం బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అయితే ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో కేవలం ఆయా ప్రాంతాలలోని దేవాలయాల్లో కమిటీ తరఫున మాత్రమే అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. -
బోనాల జాతర షురూ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి మినీ జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం అయిదు గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు ఒడిబియ్యం సమర్పించారు. పోతురాజుల నృత్యాలతో అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరిగింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగా బోనాలకు ముందు వచ్చే శుక్రవారాన్ని మినీ జాతరగా పిలుస్తారు. పాతబస్తీలో మొదలైన సందడి మరోవైపు పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జీఎచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్, నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ కలశ స్థాపన ద్వారా ఉత్సవాలను ప్రారంభించారు. ఉత్సవాల నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ రూ. 25 కోట్లు కేటాయించింది. బోనాలు జరిగే ఆలయాల వద్ద శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. -
వింటే భారతం చూస్తే బోనం
పండుగల సందర్భాలలో నగరాల్లో నివాసం ఉంటున్నవారు తమ గ్రామాలకు తరలి వెళ్తారు. బోనాలు, మహంకాళి జాతరలకు మాత్రం గ్రామాల నుంచి ప్రజలు నగరాలకు చీమల వరుసలుగా తరలివస్తారు. బోనాలు ఇంతటి విశిష్టతను సంతరించుకోడానికి కారణం.. అవి మాతృస్వామ్యపు వైభవాలు కావడమేనని తాజాగా వెలువడిన ఛాయాచిత్ర ఖచిత మహోద్గ్రంథం ‘బోనాలు– మహంకాళిజాతర’లో ఆ పుస్తక ప్రధాన సంపాదకుడు, ప్రముఖ సినీ దర్శకుడు బి.నరసింగరావు; పుస్తక పదకర్త, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్వాహకులు మామిడి హరికృష్ణ అంటున్నారు. అనాదికాలం నుంచీ స్త్రీ దేవతలను ఆరాధించే సంప్రదాయం మన సంస్కృతిలో ఉంది. మానవ పరిణామక్రమంలో నిరంతరాయంగా ప్రవహిస్తోన్న భావధార ఆ సంప్రదాయం. ఇందులో కాలానుగుణంగా అనేక ఆచారాలు, విధి విధానాలు ప్రవేశించి ఈ ఆరాధన ఒక జీవన విధానంగా స్థిరపడింది. హైదరాబాద్–సికింద్రాబాద్.. జంట నగరాల్లో ప్రజలు జరుపుకునే బోనాలు జాతర.. స్త్రీ దేవతారాధనలో తనదైన ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ‘బోనం తెలంగాణ ఆత్మ అయితే, బతుకమ్మ తెలంగాణ జీవితం’ అంటారు బి.నరసింగరావు. బోనం ఇవ్వడం అంటే తమ కష్టసుఖాల్లో నువ్వు తోడుగా ఉన్నావమ్మా అని సాధారణ ప్రజలు దేవతకు కృతజ్ఞత చెప్పడం. పురాతన కాలం నుంచీ బోనాలు సమర్పించే సంప్రదాయం ఉంది. ఆ వైనాలను ఇతిహాసాల నుంచి, చరిత్ర నుంచి వివరిస్తూ, ‘మదర్ రైట్స్’ గ్రంథ రచయిత బారన్ ఒమర్ రోల్ఫ్ మాతృదేవతారాధనల గురించి అనేక ఆసక్తికరమైన అంశాలను ఆ పుస్తకంలో ప్రస్తావించారు. గ్రీకు దేవత డెమటార్, ఉపఖండపు దేవత చాముండి.. ప్రజలను అంటురోగాల నుంచి కాపాడే స్త్రీ శక్తులు. క్రీ.పూ. ఇరవై వేల సంవత్సరాల నాటికే తమిళనాడులోని అడిచెన్నలూరు, ఆస్ట్రియా, రష్యా దేశాలలో లభించిన త్రికోణాకారపు ప్రతిమల సారూప్యతలను వివరిస్తూ, సింధు నాగరికతలో మాతృదేవత.. ప్రధాన దైవంగా స్థిరపడినట్లు రోల్ఫ్ రాశారు. ఆసక్తికరమైన ఆ వివరాలు కూడా ‘బోనాలు– మహం కాళి జాతర’ పుస్తకంలో ఉన్నాయి. మనిషి నేటి రూపాన్ని, ఆహారపు అలవాట్లను సంతరించుకునే క్రమంలో తాము స్వీకరించే ఆహారం మార్పులకు లోనైనట్లే బోనాల సంప్రదాయంలో, స్థలకాలాదుల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. తొలినాళ్లలో గ్రామాలకు మాత్రమే పరిమితమైన బోనాలు.. మెట్రో నగరంలో కుటుంబాలు సమూహాలుగా మారి జరుపుకునే పండుగగా పరిణామం చెందింది. జంట నగరాలలో శ్రావణ–ఆషాఢ మాసాలలో (రుతువులు మారి అంటువ్యాధులు ప్రబలేందుకు ఆస్కారం ఉన్న జూన్–జూలై–ఆగస్ట్ మాసాలలో) జరిగే బోనాలు, మహంకాళి జాతర సందర్భంగా గ్రామాల నుంచి ప్రజలు నగరానికి తరలి వస్తారు. పిల్లాజెల్లలను రోగాల బారి నుంచి కాపాడండమ్మా అని అర్థిస్తూ, నగరంలోని బోనాల జాతర సందర్భంగా ప్రధానంగా పోచమ్మ, ఎల్లమ్మ దేవతలకు బోనాలు సమర్పిస్తారు. ఇవన్నీ పైపైన తెలిసిన విషయాలే కానీ, తెలియనివి, తెలుసుకోవలసినవి అయిన విశేషాలెన్నింటినో ఒక పిక్టోరియల్ హిస్టరీగా ఈ పుస్తకం కనువిందు చేసి, దివ్యానుభూతిని కలిగిస్తుంది. అపురూప భావచిత్రాలు శివరామాచారి శిల్పం ముఖచిత్రంగా, విద్యాసాగర్ లక్కా పసుపు పారాణి పాద చిత్రం బ్యాక్ కవర్‌గా వెలువడిన ‘బోనాలు : మహంకాళి జాతర’ పుస్తకంలో పద్నాలుగు మంది సిద్ధహస్తులైన స్టిల్ ఫొటోగ్రాఫర్లు తీసిన జాతర ఫోటోలతో పాటు.. అన్నవరం శ్రీనివాస్ ప్రాథమిక వర్ణాలను ఉపయోగించి చిత్రించిన పది పెయింటింగుల బోనాల సంప్రదాయపు అపురూప భావచిత్రాలు కూడా ఇందులో ఉన్నాయి. (పుస్తకం వివరాలను ఇవాళ్టి ‘సాహిత్యం’పేజీలో చూడొచ్చు). -
లాల్ దర్వాజా బోనాల జాతరలో నేతల సందడి
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని లాల్‌దర్వాజా మహంకాళీ ఆలయంలో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల్లో అంబారి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రభుత్వం ఖర్చుతో నిర్వహిస్తున్నామనీ, అన్ని శాఖల సమన్వయంతో బోనాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నామనీ, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందని తెలిపారు. బోనాల పండగ గొప్ప సంస్కృతి.. బోనాల పండుగ తెలంగాణ ప్రజలకు లభించిన గొప్ప సంస్కృతి అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. ఎమ్మెల్సే రాంచంద్రా రెడితో కలిసి ఆయన ఆదివారం మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి ఆలయ కమిటీ సభ్యులు సన్మానం చేశారు. తమ సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపదేవిదంగా తెలంగాణ ప్రజల బోనాలు జరుపుకుంటారని లక్ష్మణ్ అన్నారు. బోనాల పండగకు రాష్ట్ర పండుగ హోదా ఇచ్చినప్పటికీ మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో సైతం బోనాలు నిర్వహించాం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో ఢిల్లీలో సైతం బోనాలు నిర్వహించామని జనసమితి పార్టీ అధ్యక్షుడు ఫ్రొఫెసర్ కోదండరాం అన్నారు. అప్పుడు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బయటకు రాగానే తెలంగాణ ప్రకటన వెలువడిందని గుర్తు చేశారు. ఆయన మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. బోనాలలో సొంత మొక్కులు ఏం కోరుకోనని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఫలాలు అందరికీ అందాలని కోరుకున్నానని వెల్లడించారు. -
ప్రభుత్వంపై, అధికారుల పనితీరుపై జోగిని స్వర్ణలత ఆగ్రహం
-
ప్రభుత్వంపై, అధికారులపై అమ్మవారి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై, అధికారుల పనితీరుపై జోగిని స్వర్ణలత ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు బోనం సమర్పించామని సంతోష పడుతున్నారు.. కానీ నాది నాకే సమర్పించారని చెప్పారు. బంగారు బోనం సమర్పించినా.. తాను దుఖంతో ఉన్నానని.. తన దర్శనానికి వచ్చే భక్తులు సైతం ఈ ఏడాది దుఃఖంతో వచ్చారని స్వర్ణలత అన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో భాగంగా అమ్మవారు స్వర్ణలత ద్వారా భవిష్యవాణి వినిపించారు. తనకు బంగారు బోనం వద్దని.. సంతోష బోనం సమర్పించాలని అమ్మవారు రంగంలో సూచించారు. ‘నా సన్నిధికి వస్తున్న భక్తులు దుఖంతో వస్తున్నారు. దుఖంతోనే పోతున్నారు. ఈ ఏడాది మాత్రం భక్తులు సంతోషంగా లేరు. నా భక్తులు సంతోషంగా ఉన్నారని మీరు మాత్రమే అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. మాటల్లో ఉన్నంతగా చేతల్లో మాత్రం పనులు లేవు. నా బిడ్డలు, అడపడుచులందరు ఎడుపులతో ఉన్నారు. మీరు ప్రజలను ఇబ్బంది పెట్టినా.. నేను మాత్రం ప్రజలను సంతోషంగా చూసుకుంటాను. ప్రజలకు మేలు చేస్తున్నామని అనుకుంటున్నారు.. కానీ కీడు చేస్తున్నారు. ప్రజలందరూ శాపాలు పెడుతున్నారు. నేను ఎప్పుడు శాపం పెట్టలేదు. ప్రజలను సంతోషంగా చూసుకుంటాను. ఆ భాద్యత నాది. నా ఆశీర్వాదం అందరికి ఉంటుంది. నాకు మాత్రమే మొక్కులు సమర్పించడం కాదు. ప్రజలను సంతోషపెట్టండి. వచ్చే రోజుల్లో నా భక్తులకు ఇబ్బందులు కాకుండా చూసుకోండి. నేనెప్పుడూ న్యాయం పక్షాన నిలబడుతా. కోరినన్ని వర్షాలు ఉన్నాయి. వచ్చే రోజుల్లో వర్షాలు కురుస్తాయి. పాడి పంటలు బాగా పండుతాయని’ అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. శ్యామల కామెంట్లపై స్పందించిన తలసాని -
ఉజ్జయినీ మాత బోనాల జాతర
-
ప్రజలకు ఏ కష్టం రానివ్వను....
-
ప్రజలకు ఏ కష్టం రానివ్వను....
సికింద్రాబాద్: ప్రజలకు ఏ కష్టం రానివ్వను...ప్రజలందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది, ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయంలో రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజలందరికీ ఎలాంటి భారం, భయం లేకుండా చూసుకునే బాధ్యత తనదని ఆమె భవిష్యవాణి ద్వారా తెలిపారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని స్వర్ణలత రంగంలో పేర్కొన్నారు. తన ఆజ్ఞ లేకుండా ఏ పనీ చేయవద్దని సూచించారు. భవిష్యవాణి అనంతరం అమ్మవారిని అంబారీపై ఊరేగించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిచ్చారు. -
వైభోగ బోనం
* కన్నుల పండువగా లష్కర్ సంబురాలు * అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు * భక్తి పారవశ్యాన ఊగిన శివసత్తులు * తల్లి దర్శనానికి ప్రముఖుల తాకిడి * భక్తి పారవశ్యాన ఊగిన శివసత్తులు * ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు * కన్నుల పండువగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి సంబురాలు * అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: డప్పుల దరువులు....పోతరాజుల వీరంగాలు....శివసత్తుల పూనకాలు....అమ్మాబయలెల్లినాదో తల్లీ బయలెల్లినాదో... అంటూ మహంకాళి అమ్మవారిపై అచంచల భక్తివిశ్వాసాలతో ఊగిపోయిన భక్తులు...ఘనంగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న మహిళలు, దర్శించుకున్న అశేష భక్తజనవాహిని,డీజేల హోరులో ఉర్రూతలూగిన యువత. తెలంగాణ రాష్ట్ర పండుగ వేళ సికింద్రాబాద్ ఉజ్జయినీ మాత బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. జగజ్జననిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు. సికింద్రాబాద్‌లోని అన్ని ప్రధాన రహదారులు,వీధులు కిటకిటలాడాయి. ఉదయం 4 గంటలకు అభిషేకాలు, మహా హారతితో తల్లికి విశేష పూజలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ , మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డిలు తొలి పూజలో పాల్గొన్నారు. వారితో పాటు ఆలయ ఈవో అశోక్‌కుమార్, ఫౌండర్ ట్రస్టీ సురిటీ కృష్ణలు ఉన్నారు. జంటనగరాలతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్ రాష్ట్ర పండుగగా గుర్తించిన ఈ ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సతీ సమేతంగా మధ్యాహ్నం 1.30 గంటలకు అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలను సమర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 10 గంటలకు దర్శించుకున్నారు. బోనాలు, సాక సమర్పించే భక్తులతో పాటు , శివసత్తుల పూనకాలు, ఫలహార బండ్ల, తొట్టెల సమర్పణల ఊరేగింపులతో ఆదివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సికింద్రాబాద్ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. వీఐపీల తాకిడి ఆలయంలోకి వెళ్లేందుకు పలువురు ప్రయత్నించడంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. ప్రముఖుల రాకపోకలతో క్యూలైన్లో ఉన్న వారు అమ్మవారి దర్శనంకోసం రెండు గంటలకు పైగా ఉండాల్సి వచ్చింది. అమ్మ ఆశీర్వాదంతో అభివృద్ధి: హోం మంత్రి మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. ఇందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడాలని మొక్కుకున్నానని చెప్పారు. ఈ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకూ, భక్తులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీసులను నియమించామని చెప్పారు. ప్రముఖుల పూజలు ఆలయాన్ని దర్శించుకున్న పలువురు నేతలకు స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి టీ పద్మారావులు కలసి అమ్మవారికి పూజలు చేశారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీలు బండారు దత్తాత్రేయ, కె.కేశవరావు, కవిత, మల్లారెడ్డి, నంది ఎల్లయ్య, బీబీ పటేల్, సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, వివేకానందగౌడ్, ఎర్రబెల్లి దయాకర్, జీ సాయన్న, గీతారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, డిప్యూటీ మేయర్ జి.రాజ్‌కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ ఎంపీలు అంజన్‌కుమార్‌యాదవ్, అల్లాడి రాజ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కృష్ణయాదవ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, విమలక్క ప్రత్యేక పూజలు చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్‌రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, ఐపీఎస్ అధికారులు జితేందర్, శివప్రసాద్, మల్లారెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలి: కేసీఆర్ తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరినీ అమ్మవారు చల్లగా చూడాలని తాను మొక్కుకున్నానని సీఎం కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. మహంకాళి అమ్మదయ వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. వర్షాలు పడి ప్రజలంతా పాడి పంటలతో, సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. బోనాలను రాష్ట్ర ఉత్సవాలుగా ప్రకటించామని ప్రస్తుతం ఎలా ఉన్నా వచ్చే వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. సయోధ్య చెదరకూడదని : చంద్రబాబు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు ప్రజల మధ్య సయోధ్య చెదరకుండా వారు కలసిమెలసి జీవించేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. వానలు కురిసి రైతుల ఇబ్బందులు తొలగిపోవాలని మొక్కుకున్నట్లు తెలిపారు. అలాగే బాబు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన శ్రీగురు రేణు దత్తాత్రేయస్వామి పాదపూజలో పాల్గొని, భగవాన్ రామదూత స్వామి ఆశీస్సులు అందుకున్నారు.