bonthu rammoham
-
ప్రజల సహకారంతోనే జపాన్, సింగపూర్ అభివృద్ధి..
సాక్షి, హైదరాబాద్ : కుకట్పల్లి జేఎన్టీయూ యునివర్శిటీ ఆడిటోరియంలో స్వచ్ఛ పాఠశాల, స్వచ్ఛ కమ్యూనిటీ కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ బోంతు రామ్మోహన్, విద్యాశాఖ కార్యదర్శి డా. బి జనార్దనరెడ్డి, మున్సిపల్ శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో ప్రతి విద్యార్థి పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థలు తమ సంస్థ ఆవరణంలో పరిశుభ్రత పాటించాలని.. తడి, పొడి చెత్తను వేరు చేయటంతో పాటు టాయిలెట్స్ క్లీనింగ్‌లో కూడా శుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అపరిశుభ్రత వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి విద్యార్థులు తెలుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం ఇరవై తొమ్మిది లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారిలో ప్రతిరోజు ముప్పై శాతం మంది అనారోగ్య కారణాలతో స్కూల్‌కు హాజరు కావడం లేదని తెలిపారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా పాఠశాలల పరిశుభ్రతకు పాధాన్యతను ఇస్తున్నాయని అన్నారు. అందుకే పాఠశాలలు, కళాశాలలలో విద్యా ప్రమాణాలతో పాటు పరిశుభ్రత కూడా అవసరమని, చెత్త లేకుండా చేయడంతో పాటు ప్లాస్టీక్ వినిమోగాన్నికూడా తగ్గించాలని ఆయన పేర్కొన్నారు. కాగా మేయర్ బోంతు రామ్మోహన్ కూడా మాట్లాడుతూ.. పాఠశాల, కళాశాలల విద్యార్థులు వారి ఇంటి పరిపరాలను శుభ్రంగా ఉండేలా చుసుకోవాలని అన్నారు. విద్యార్థులు ఎవరైతే పరిశుభ్రత పట్ల చక్కటి అవగాహన కలిగి ఉంటారో వారు తమని తాము స్వచ్ఛ అంబాసిడర్లుగా భావించుకుంటూ ఆయా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. స్వచ్ఛత పాటించకపోవడం వల్లే నగరంలో దోమలు వ్యాప్తి చెందుతాయని అన్నారు. హైదరాబాద్ నగరంలో దాదాపు కోటి మందికి పైగా జనాభా ఉందని, జీహెచ్ఎంసీ తరపున ఇరవై వేల మంది మున్సిపాలిటి సిబ్బంది ఉన్నారని ఆయన వెల్లడించారు. అలాగే వీరితో పాటు ప్రజలు కూడా స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలని, జపాన్, సింగపూర్ వంటి దేశాలలో అభివృద్ది ప్రజల సహకారంతోనే జరిగిందని పేర్కొన్నారు. నగరంలో జీహెచ్ఎమ్సీ మాత్రమే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతుందని, ఇళ్లలోని చెత్తను నాలల్లో వేసి నిర్లక్ష్యంగా వ్వవహరించోద్దని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంటూ ఇతురులలో కూడా ఛైతన్యం తీసుకురావాలని ఆయన సూచించారు. -
నెక్ట్స్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో కొందరు ఆశావహులు షాక్‌కు గురయ్యారు. టికెట్లు ఖరారైన అభ్యర్థులు ఉత్సాహంతో రంగంలోకి దిగుతుండగా, టికెట్ వస్తుందనే విశ్వాసంతో ఉన్న వారు, ఆశించిన వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు పార్టీ జాబితాపై టీఆర్ఎస్ ముఖ్యుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్లను చివరిక్షణం వరకు ప్రకటించకుండా ఉంటే అయో మయం, గందరగోళం, ఒత్తిళ్లు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కొందరు నేతలు వ్యాఖ్యా నిస్తున్నారు. టికెట్ తమకే వస్తుందని ఎవరికివారే ప్రచారం చేసుకోవడం, పార్టీ శ్రేణుల్లో చీలికలు, గ్రూపులు, వైషమ్యాలు పెరిగిపోతాయని వాదిస్తున్నారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం వల్ల అంతర్గత అంశాలను సరిచేసుకోవడానికి, గెలుపు కోసం పోరాటంపైనే దృష్టి కేంద్రీకరించడానికి సాధ్యం అవుతుందని అంటున్నారు. అయితే , పార్టీ శ్రేణుల అభిప్రాయాలను, క్షేత్రస్థాయి అంశాలను చర్చించకుండా ఒకేసారి టికెట్లను ప్రకటించడం వల్ల నేతలు మరోదారి చూసుకునే అవకాశం ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. పార్టీ అభ్యర్థిత్వం ఖరారైన నాయకులు మాత్రం కార్యరంగంలోకి దూకారు. వనరులను సిద్ధం చేసుకుంటూ, క్షేత్రస్థాయి పరిస్థితులను చక్కదిద్దుకోవడంపై దృష్టి పెట్టారు. అసంతృప్తిలో పలువురు నేతలు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి వివిధ స్థాయిల్లో పని చేస్తున్న నాయకులు టికెట్లపై ఆశలు పెంచుకున్నారు. కొందరు సిట్టింగులను మార్చి తమకే టికెట్లు వస్తాయనే విశ్వాసంతో పార్టీ ముఖ్యులు, కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే నాయకులున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన వారి నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో పోటీచేసి, అప్పటి నుంచి పార్టీలో పని చేస్తున్నా అవకాశం రాని నేతలు అసంతృప్తితో ఉన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే, స్పీకర్ ఎస్.మధుసూదనాచారికి టికెట్‌ను ప్రకటించడంతో ఆ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన గండ్ర సత్యనారాయణరావు తిరుగుబాటు గళమెత్తారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో టి.రాజయ్యను ప్రకటించడంతో రాజారపు ప్రతాప్ రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన కుమార్తె కావ్యకు ఇదే నియోజకవర్గం నుంచి టికెట్ ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. డోర్నకల్ నుంచి సత్యవతీ రాథోడ్, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. మునుగోడు నియోజకవర్గంలో వెంకటేశ్వర్రావు తన సత్తాను చూపిస్తానని ప్రకటించారు. నల్లగొండ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసిన దుబ్బాక నర్సింహారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. సంగారెడ్డి నుంచి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఉప్పల్ నియోజకవర్గం నుంచి టికెట్‌ను ఆశించిన మేయర్ బొంతు రామ్మోహన్ అలిగినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యామ్నాయాలపై అన్వేషణ టీఆర్ఎస్లో టికెట్లు ఆశించి, భంగపాటుకు గురైన నాయకులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో టీఆర్ఎస్ నుంచి తలుపులు మూసుకుపోవడంతో అందుబాటులో ఉన్న అవకాశాలేమిటనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తమ అనుచరులు, సన్నిహితులతో చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటే బాగుంటుందనే దానిపై మాట్లాడుకుంటున్నారు. టికెట్లు రాకున్నా, ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ నుంచి అవకాశాలు రాకుంటే స్వతంత్రంగా బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. -
రాయితీపై డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని వార్షికాదాయం రూ. 6 లక్షలలోపు ఉన్న ప్రభుత్వ.. ప్రైవేటు ఉద్యోగులకు శుభవార్త. వీరికి రాయితీపై ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సహకారం అందించాల్సిందిగా శుక్రవారం ఢిల్లీ వెళ్లిన మంత్రి కేటీ రామారావు, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కోరారు. దీనికి ఆయన సానుకూల సంకేతాలిచ్చినట్లు మేయర్ రామ్మోహన్ తెలిపారు. ఆయన జీహెచ్ఎంసీలో విలేకరుల తో మాట్లాడుతూ... సంవత్సరాదాయం రూ. 6 లక్షల లోపు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతరుల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కు గృహ నిర్మాణ పథకం కింద నిధులివ్వాల్సిందిగా కోరామన్నారు. నగరంలో నిర్మిస్తు న్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలన్నింటితో కలిపి దాదాపు రూ.9 లక్ష లు ఖర్చవుతోంది. వార్షికాదా యం రూ.6 లక్షలలో పు ఉన్న దిగువ మధ్య తరగతి వారికి ఒక్కో ఇంటికి కేం ద్రం రూ.2.50 లక్ష లు ఇస్తే.. జీహెచ్ఎం సీ రూ.2 లక్షలు సా యం చేస్తుందని చెప్పారు. లబ్ధిదారుల వాటాగా రూ. 2 లక్షలు చెల్లిస్తే.. మిగతా వ్యయాన్ని బ్యాంకు రు ణాల ద్వారా అందించే యోచన ఉందన్నారు. దీనికి విధి విధానాలు రూపొందించాల్సి ఉందన్నారు. లబ్ధిదారులకు జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు నగరంలో నిర్మాణం పూర్తయి... ఖాళీగా ఉన్న జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని మేయర్ చెప్పారు. ఈ ఇళ్లలో అక్రమంగా ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తామని చెప్పారు. మరుగుదొడ్లు లేనివారు వాటిని నిర్మించుకునేందుకు యూనిట్‌కు రూ.12 వేల వంతున ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. స్మార్ట్‌సిటీ ద్వారా అందే రూ.100 కోట్లు నగరానికి చాలవని... వేరే పథకం ద్వారా పెద్దమొత్తంలో నిధులివ్వాల్సిందిగా మంత్రి కేటీఆర్ కోరారన్నారు. నిర్మాణం పూర్తయిన స్లాటర్ హౌస్‌లను వందరోజుల ప్రణాళికలో భాగంగా వినియోగంలోకి తెస్తామన్నారు. వాటిపై ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటామని... స్లాటర్ హౌస్‌లకు సంబంధించి ఢిల్లీలో జరిగిన సదస్సులోనూ ఈ అంశం ప్రస్తావనకొచ్చింద ని ఆయన తెలిపారు. త్వరలో వ్యర్థాల రీ సైక్లింగ్... ఢిల్లీ తరహాలో నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా వివిధ పరిమాణాల్లో కంకర, ఇసుక, మట్టి తదితరమైనవి వెలువడే యూనిట్‌ను హైదరాబాద్‌లో త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగైదు ప్రాంతాల్లో ఇలాంటివి ఏర్పాటుకు యోచిస్తున్నామని చెప్పారు. దీనికి త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. ఘన వ్యర్థాల(చెత్త) నిర్వహణ కేంద్రాలను కూడా వీలైనన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు.