born baby
-
ఢిల్లీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్ విహార్‌లో శనివారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బేబీ కేర్ న్యూ బోర్న్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో మొదలైన మంటలు చుట్టుపక్కలున్న మరో రెండు భవనాలకు సైతం వ్యాపించినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. మొత్తం 16 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చామన్నారు. ఆస్పత్రి రెండో అంతస్తులో నిల్వ ఉంచిన ఆక్సిజన్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. మంటలు వ్యాపించిన ఆస్పత్రి భవనం నుంచి మొత్తం 12 మంది శిశువులను బయటకు తీసుకురాగా వారిలో ఏడుగురు చనిపోయారని ఫైర్ చీఫ్ అతుల్ గర్గ్ చెప్పారు. మిగతా ఐదుగురిలో కొందరు స్వల్పంగా గాయపడ్డారన్నారు. మంటలను గమనించిన స్థానికులు, షహీద్ సేవా దళ్ కార్యకర్తలు కలిసి భవనం వెనుక వైపు నుంచి నిచ్చెనల ద్వారా పైకెక్కి చిన్నారులను కిందికి తీసుకువచ్చారని ప్రత్యక్ష సాకు‡్ష్యలు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది పరారైనట్లు చెబుతున్నారు. ఆస్పత్రి యజమాని నవీన్ కిచిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నామని షాదారా డీసీపీ సురేంద్ర చౌదరి చెప్పారు. ఈ దారుణంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. ధైర్యంగా ఉండాలని బాధిత కుటుంబాలను కోరారు. -
కోర్టులో నామకరణం
కొచ్చి: ఆ.. పేరులో ఏముందిలే అని కొందరు అనుకుంటారు కానీ ఆ పేరు కూడా ఒక ప్రహసనంగా మారిందని కేరళలో జరిగిన ఒక ఘటన నిరూపించింది. కన్నబిడ్డకు పేరు పెట్టడంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయిన తల్లిదండ్రులు కోర్టుకెక్కడంతో మూడేళ్ల వయసున్న వారి కుమార్తెకు కేరళ హైకోర్టు పేరు పెట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కేరళకి చెందిన దంపతులు విభేదాలతో విడి విడిగా ఉంటున్నారు. తల్లి సంరక్షణలో వారి మూడేళ్ల వయసున్న కుమార్తె ఉంటోంది. ఆ పాప బర్త్ సర్టిఫికెట్లో పేరు లేదు. ఆ తల్లి కూతురికి పేరు పెట్టి సర్టిఫికెట్లో చేర్చాలని సదరు అధికారుల్ని సంప్రదిస్తే తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి హాజరై పేరు చెబితే రిజిస్టర్ చేస్తామన్నారు. అప్పటికే విభేదాలతో దూరమైన దంపతులు పేరు విషయంలో కూడా రాజీకి రాలేకపోయారు. భార్య చెప్పిన పేరు భర్తకి, భర్త చెప్పిన పేరు భార్యకి నచ్చలేదు. కూతురు తన వద్దే ఉండడంతో తల్లి కోర్టుకెక్కింది. చివరికి కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బెచు కురియన్ థామస్ ఆ పాపకు పేరు పెట్టారు. పాప శ్రేయస్సు, తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలు, వారి సంస్కృతి, సామాజిక పరిస్థితులు అన్నీ పరిగణనలోకి తీసుకొని పేరు పెట్టినట్టు న్యాయమూర్తి వెల్లడించారు. కానీ ఏం పేరు పెట్టారో మాత్రం ఆయన బయటపెట్టలేదు. -
ఆ నరరూప రాక్షసికి ఎలాంటి శిక్ష?
లండన్: విధి నిర్వహణలో భాగంగా.. కంటికి రెప్పలా నవజాత శిశువుల్ని చూసుకోవాల్సిన నర్సు మానవత్వాన్ని సైతం మరిచి ఉన్మాదిగా మారింది. ఆసుపత్రిలో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఏడుగురు శిశువులను చంపేసింది. బ్రిటన్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతంలో.. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంజెక్షన్ ద్వారా శిశువుల రక్తంలోకి గాలిని పంపడం, నాసోగ్యాస్ట్రిక్ గొట్టాల ద్వారా వారి కడుపులోకి పాలు, నీటిని బలవంతంగా పంపడం, శ్వాసనాళాలకు అంతరాయం కలిగించడం.. పసికందుల్ని ఆ నరరూప రాక్షసి చేసిన పనులు. మరో ఆరుగురు శిశువులనూ చంపడానికి యత్నించినట్లు వెల్లడైంది. ఇంగ్లండ్‌లోని చెస్టర్‌లో కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న లూసీ లెబ్టీ(33) ఈ దారుణాలకు ఒడిగట్టింది. లూసీ 2015-16 మధ్య కాలంలో ఈ హత్యలకు పాల్పడింది. ఆస్పత్రిలో ఎటువంటి స్పష్టమైన కారణాలు లేకుండా, ఆకస్మికంగా ఆరోగ్యం విషమించి ఏడుగురు శిశువులు మృతి చెందారు. ఈ అన్ని సందర్భాల్లోనూ ఆస్పత్రి నవజాత శిశువుల వార్డులో లూసీ విధుల్లో ఉన్నట్లు తేలింది. భారతీయ మూలాలున్న వైద్యుడు రవి జయరాం సహా ఇతర వైద్యులు లూసీపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శిశుమరణాలపై 2017 మే నెలలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చివరకు ఆమెను మాంచెస్టర్ క్రౌన్ కోర్టు శుక్రవారం ఆమెను దోషిగా తేలింది. సోమవారం ఆమెకు శిక్ష ఖరారు చేయనుంది. అయితే ఈ నరరూప రాక్షసికి ఎలాంటి శిక్షలు పడతాయో అనే ఉత్కంఠ నెలకొంది ఇప్పుడు. ‘నేను చెడ్డదాన్ని. నేనే ఇలా చేశాను. వారిని ఉద్దేశపూర్వకంగా చంపాను. ఎందుకంటే నేను వారిని చూసుకునేంత మంచిదాన్ని కాదు’ అని రాసి ఉన్న కాగితాలు ఆమె ఇంట్లో లభ్యమయ్యాయి. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబరులో కోర్టు విచారణ మొదలైంది. అయితే, లెట్బీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. నవజాత శిశువుల వార్డులో లోపాలను కప్పిపుచ్చేందుకే అక్కడి సీనియర్ వైద్యులు తనపై నిందలు మోపారని ఆమె తరఫు లాయర్ వాదించారు.పసిగుడ్డుల ప్రాణం తీయడానికి ఆమె ఎంచుకున్న మార్గాలు మానవత్వానికి మచ్చలా నిలిచాయనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. -
మంచిమాట..నీ నిశ్చలమైన మనసే నీవు
అన్ని భావాలలోకి అతి ముఖ్యమైనది ‘నేను’ అనే భావం. వ్యక్తిత్వమనే భావం కూడా అన్ని భావాలకీ మూలమే. ఏ భావమైనా దేనినో ఒకదానిని ఆశ్రయించే ఉదయిస్తుంది. అహంకారమే భావాలకి నిలయం. అంటే, భావాల వ్యాపకం అహంకారానికి సంబంధించినదే. నువ్వు, అతడు, అది అంటూ మధ్యమ ప్రథమ పురుషలకి సంబంధించినవి ‘నేను’ అనే ఉత్తమ పురుషలకి తప్ప ఇంకెవరికీ గోచరించవు. అందువల్ల ఉత్తమ పురుష ఉదయించిన తరువాతనే అవీ ఉదయిస్తాయి. అంటే కలిసే వస్తాయి. కలిసే అణగిపోతాయి. .ఈ ‘నేను’ అనేది ఎక్కడినుండి ఉదయిస్తున్నది? దాని కోసం లోపల వెతకాలి. అప్పుడు అది మాయమవుతుంది. మనస్సంటే ఆలోచనల సమూహమే. అన్ని ఆలోచనలకు మూలం ‘నేను’ అనే భావం. కాబట్టి మనస్సు అంటే ‘నేను’ అనే ఆలోచనే. ‘నేను’ అనే ఆలోచన పుట్టుకే వ్యక్తి జననం కూడ. దాని మరణమంటే వ్యక్తి మరణమే. ఈ ‘నేను’ అనే భావాన్ని వదిలించుకోవాలి. అది సజీవంగా ఉన్నంతకాలమూ బాధ తప్పదు. ‘నేను’ పోతే, బాధా పోతుంది. నేను ఫలానా వ్యక్తినని, అంతటి వాడిని, ఇంతటి వాడిని, అలాంటి వాడిని, ఇలాంటి వాడిని అనే విజ్ఞానాన్ని పక్కన పెట్టి, నీవు నువ్వుగా ఉండటం ‘నీ నిజస్వరూపం’. ఆత్మయే చైతన్యంగా మారి ’నేను ఫలానా’ అని గిరిగీసుకోవటమే ’అహం’. అంతకు మించి ‘అహం’ అంటూ ప్రత్యేకంగా లేదు. విషయాలతో మమేకం చెందకుండా మనసును గమనిస్తే దైవమే మన మనసు, తనువు, ఇంద్రియాలు, ప్రపంచంగా మారిందని అర్ధం అవుతుంది. దీనికి కారణం నువ్వు కాదని తెలుసుకుంటే, కర్తృత్వంపోయి శాంతి వస్తుంది. మనకి మనసు స్వరూపమే కాదు, దాని క్రియలు కూడా పూర్తిగా తెలియవు. కేవలం ఆలోచనల ద్వారా ఈ శరీర బాహ్యక్రియలు చేయించేది మాత్రమే మనసని అనుకుంటున్నాం. మనస్సుతో కుస్తీ పడకండి. మీ మనస్సు ఎక్కడికీ వెళ్ళదు. అది ఇక్కడే ఉండి దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. మీరు కేవలం మీ ఆలోచనల వల్ల అలా మోసగింపబడుతున్నారు. అది ఇక్కడే ఉంది. దేని గురించో ఊహించుకుంటోంది. అది ఎక్కడికీ వెళ్ళడం లేదు. మీరు దానితో ఎంతగా మమేకం అయిపోయా రంటే మీరు మీ మనస్సు మరెక్కడో ఉంది అని అనుకుంటున్నారు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు కాని విషయాలతో మిమ్మల్ని మీరు, గుర్తించుకుంటున్నారు. మీ మనస్సు అన్నది నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. మీరు ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకుని మీ మనస్సుని ఆపాలని చూస్తున్నారు. మీరు ఒక లక్ష సంవత్సరాలు తీసుకున్నా సరే.. ఇది జరగదు... మీ మనస్సు ఒక పెద్ద గందరగోళం. ఎందుకంటే.. మీరు ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. మీరు మీ శరీరంతో.. మీరు వేసుకొన్న దుస్తులతో.. మీ జుట్టుతో.. ఎన్నో విషయాలతో.. మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. ఇప్పుడు మీ మనస్సు అంతు లేనట్లుగా, అలా వెళ్లిపోతూనే ఉంటుంది. మీరు దానిని ఆపలేరు. మీరు ఇక్కడ కూర్చొని, ధ్యానం చెయ్యాలనుకుంటూ ఉన్నారు. మీరు ఏ బయటికి వెళ్ళడం గురించో, సినిమా గురించో, స్నేహితుడి గురించో, మరో దాని గురించో ఆలోచిస్తారు. మీకు అందరూ ఏమి చెప్పారంటే భగవంతుడి గురించి ఆలోచించండి, అన్నీ సరిగ్గానే ఉంటాయి అని. మీరు ఆ భగవంతుని గురించి ఆలోచించినప్పుడు మీమనస్సు ఎక్కడెక్కడికో వెళుతుంది. మనస్సు తత్త్వం అలాంటిది. దీనిని మీరు ఆపలేరు. ఎందుకంటే, మీరు ఏవైతే కాదో అటువంటి విషయాలతో, మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. ఇక్కడ మనం మీ మనస్సుని నియంత్రించడం గురించి మాట్లాడడం లేదు. మీరు ఏది కాదో, అన్న దాని పట్ల అవగాహన పెంచుకోవాలి. మీ మొట్టమొదటి గుర్తింపు మీ శరీరం. మీరు మీ శరీరంతో, మీరు వేసుకొన్న దుస్తులతో, మీ జుట్టుతో, ఎన్నో విషయాలతో.. మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. మీ భార్యా, మీ పిల్లలూ, మీ కుటుంబం, మీ విద్యా, మీ మతమూ ఇవన్నీ అంతులేనన్ని గుర్తింపులు.. ఇన్ని గుర్తింపులతో మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అది అలా కుదరదు. అందుకనే, నేను శూన్యం అని ఒక చిన్న, సరళమైన సాధన చేయాలి. దీని ద్వారా మీరు మీకూ, మీ మనస్సుకీ కొంత దూరం ఏర్పరచుకోవచ్చు. ఈ దూరం ఏర్పడిన తరువాత, అది గోల చేసే మనసైనా సరే.. పర్వాలేదు. మీరు, దాని నుంచి విడవగలరు. ఒకసారి మీరు, మీ మనసు నుంచి విడిపడిపోయిన తరువాత మీరు, మీ గుర్తింపులన్నింటి నుంచీ విడవగలరు. ఎందుకంటే, ఈ మనస్సే మీలో ఈ గుర్తింపులని తయారు చేస్తూ ఉంది. అందుకని అన్ని రకాల విషయాలనూ ఆలోచించకండి. ప్రతి రోజూ రెండుసార్లు, పదిహేను నిమిషాల పాటూ, మీ గందరగోళాన్నంతా పక్కన పెట్టి కూర్చోండి. మీరు ధ్యానం కూడా చెయ్యనక్కర్లేదు. కేవలం కూర్చోండి. జరగాల్సినవి అవే జరుగుతాయి. – భువనగిరి కిషన్ యోగి ► మీ పొరపాటు ఆలోచనలన్నిటినీ విడిచి పెట్టిన క్షణాన మీ మనస్సు ఒక అద్దంలా మారిపోతుంది. అప్పుడది ఏమీ చేయదు. అన్నిటినీ ప్రతిబింబిస్తూ ఉంటుంది. ► మీ మనస్సు ఒక యంత్రాంగం. దానిలో స్పష్టత ఉన్నప్పుడే అది బాగా పని చేస్తుంది. ► నిశ్చలంగా ఉన్నప్పుడు ఉండే నీ ఉనికే ‘నీ నిజస్వరూపం’ -
చనిపోయిన రోజే మళ్ళీ పుట్టారు
-
అమ్మా.. నాన్నా.. ఏడున్నారు?
– బిడ్డను కని మృతి చెందిన తల్లి – పారిపోయిన తండ్రి – తనకు పట్టదన్న తాత – ఏడుస్తూ పాలకోసం ఎదురు చూస్తున్న అనాథ శిశువు చీరాల: కేవ్.. కేవ్.. అంటూ పండంటి మగబిడ్డ అమ్మ కడుపులో నుంచి బయట పడ్డాడు. కానీ వాడు దురదృష్టవంతుడు కాబోలు. వెంటనే తల్లిని పోగొట్టుకున్నాడు. అంతకంటే ముందుగానే ఆమె భర్త అని చెప్పుకున్న వ్యక్తి ఎక్కడికో పారిపోయాడు. కనీసం మృతురాలి తండ్రి.. అంటే తాత అయినా వచ్చి ఎత్తుకుంటాడనుకుంటే.. తనకు సంబంధం లేదంటూ వెళ్లిపోయాడు. తల్లి శవానికి మునిసిపాలిటీవాళ్లు అంతిమ సంస్కారాలు చేశారు. మరి లోకం చూసిన ఈ బాబుకు సంస్కారాలు నేర్పించి అక్కున చేర్చుకొనేదెవరు? ఈ హృదయ విదారక సంఘటన చీరాల ఆస్పత్రిలో చోటు చేసుకుంది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా నిద్రపోవాల్సిన ఆ బిడ్డ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఎవరూలేని అనాథగా మారిపోయాడు. పురిటి నొప్పులతో బాధపడుతున్న భవాని అనే మహిళను ఈపూపాలెం పీహెచ్సీ సిబ్బంది 108లో మంగళవారం రాత్రి చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వాహన సిబ్బంది వెంట భవానీ భర్తనంటూ ఓ వ్యక్తి కూడా వచ్చాడు. అయితే ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న డాక్టర్‌తో పాటు ఇతర వైద్య సిబ్బంది ఆమె పరిస్థితి చూసి కంగారు పడ్డారు. అయితే తనకు మూడో కాన్పని, తనను ఇంటికి పంపించాలని ఆ మహిళ బాత్రూమ్లోకి వెళ్లి తలుపులు మూసుకుంది. చాలాసేపు ఆస్పత్రి సిబ్బంది బతిమలాడగా బయటకు వచ్చింది. ఆమె చాలా బలహీనంగా ఉండటంతో పాటు బీపీ కూడా కనిపించడంతో గుంటూరు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. దీంతో భర్తనని చెప్పుకున్న వ్యక్తి అక్కడి నుంచి మాయమయ్యాడు. పాలుపోని సిబ్బంది భవానికి కాన్పు చేయడంతో మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఎక్కువగా రక్తం పోతుండటంతో గుంటూరు తీసుకెళ్లాని 108 వాహన సిబ్బందికి సూచించడంతో బయలు దేరారు. కారంచేడు రోడ్డులోని రక్షిత మంచినీటి చెరువు సమీపంలోకి వెళ్లగానే మృతి చెందింది. మృతదేహం మున్సిపాలిటికి అప్పగింత.. వైద్య సిబ్బంది వివరాలు సేకరించగా మృతురాలి తండ్రి స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద అవ్వారు వీధిలో నివాముంటున్నాడని తెలుసుకుని పిలిపించారు. తన కుమారై చాలా కాలం క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. తనకు సంబంధం లేదని.. దహన సంస్కారాలు చేయలేనన్నాడు. దీంతో శవాన్ని మున్సిపాలిటీవారు స్వాధీనం చేసుకున్నారు. ఎవరిదారి వారు చూసుకోవడంతో ఏమీ తెలియని అమాయక జీవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కనీసం చైల్డ్‌లైన్ సిబ్బంది అయినా స్పందిస్తారో లేదో! అధిక రక్తస్రావంతోనే మృతి చెందింది భవానికి రక్తం లేకపోవడంతో చాలా బలహీనంగా ఉంది. దానికి తోడు కాన్పు సమయంలో ఆమెకు రక్తం అధిక రక్తస్రావమైంది. ఆమె వద్ద ఎటువంటి మెడికల్ రికార్డు లేదు. డ్యూటీలో ఉన్న వైద్యులు కాన్పు చేశారు. మాయ బటయటకు రాకపోవడంతో అధికంగా రక్తస్రావమైంది. శిశువు బలహీనంగా ఉండడంతో ఎన్బీయూసీలో ఉంచాం.– సీహెచ్ ప్రసన్నకుమార్, సూపరింటెండెంట్