Botsa Jhansi
-
సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
ఎంవీపీ కాలనీ: ‘మీ సమస్య ఏదైనా.. ఏ అవసరమొచ్చినా బొత్స సత్తిబాబు మీ వెంట ఉన్నాడు. అన్నదమ్ముడిగా మీ మధ్య పెరిగాను.. మీ ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో ఈ స్థాయికి చేరాను.. ఆ ఆదరణ ఎల్లప్పుడూ నాకు, మా పార్టీకి కావాలి’అంటూ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర వాసుల ఎదుట తన ఆకాంక్షను వెల్లడించారు. విశాఖ నగరంలో నివసిస్తున్న ఉత్తరాంధ్ర వాసుల ఆత్మీయ సమావేశం లాసన్స్ బే కాలనీలోని వైఎస్సార్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కార్యాలయంలో జరిగింది.మంత్రితో పాటు బొత్స ఝాన్సీ పాల్గొని ఉత్తరాంధ్ర వాసులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధే లక్ష్యంగా రాజకీయాల్లో సేవలు అందించానన్నారు. ఇందుకు అనుగుణంగానే ఉత్తరాంధ్ర ప్రజానీకం తనకు, తన కుటుంబానికి వెన్నుముకగా నిలిచిందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తరువాత కూడా తమ నుంచి మునుపటి భరోసాను పొందవచ్చునన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఉత్తరాంధ్ర ప్రజలంతా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు సైనికుల్లా పనిచేసి అఖండ మెజారీ్టతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక పేజీ ఉండాలన్నదే సీఎం జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని మంత్రి బొత్స పేర్కొన్నారు.ఇందుకు అనుగుణంగానే అవినీతికి తావులేకుండా రాష్ట్ర ప్రజలకు ఐదేళ్లుగా సుపరిపాలన అందించడంతో పాటు పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగించారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే సీఎం జగన్ వంటి నాయకుడు దేశ రాజకీయ చరిత్రలో లేరన్నారు. మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజలకు నమ్మకం, భరోసా, ధైర్యం అందించారన్నారు. ప్రతిపక్ష పార్టీల మాదిరిగా ఎలాంటి బూటకపు హామీలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చిడమే సీఎం జగన్ అజెండా అన్నారు. లక్ష కోట్లతో విజన్ విశాఖ పేరిట నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి ఉత్తరాంధ్ర వాసులు కష్టపడి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు కోలా గురువులు, తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో కాపు ఆత్మీయ సమావేశం..!
-
175/175 గ్యారంటీ..బొత్స ఝాన్సీ
-
బొత్స ఝాన్సీ సమక్షంలో వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
-
కనకమహాలక్ష్మి ఆలయంలో బొత్స ఝాన్సీ ప్రత్యేక పూజలు
-
కరోనా పరీక్షలు చేయించుకున్న మంత్రి, ఎంపీ
సాక్షి, విజయనగరం : కరోనా నిర్ధారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తుంది. మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలకు విజయనగరంలోని వారి నివాసంలోనే వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అలాగే పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్‌కి కూడా పరీక్షలు నిర్వహించారు. ముగ్గురికి కరోనా నెగటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. మరోవైపు కరోనా నియంత్రణపై టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశమైంది. కరోనా నివారణకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషిచేస్తున్నారని బొత్స అన్నారు. ఇదే వ్యూహాన్ని కొనసాగించి జిల్లాను కరోనా రహితంగా నిలపాలని కోరారు. డయాలసిస్, క్యాన్సర్ రోగులు ఆస్పత్రులకు వెళ్లేందుకు.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పాలు, కూరగాయలు విక్రయించే వారికి సహకరించాలని మంత్రి బొత్స విజ్ఞప్తి చేశారు. -
ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు సిగ్గుచేటు
-
'వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది'
బొబ్బిలి : కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెట్టినా.. దాని ప్రభావం పెద్దగా ఉండదని విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. బుధవారం ఆమె బొబ్బిలిలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరు ఏది చేయడానికైనా హక్కు ఉందన్నారు. అయితే సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున కిరణ్ సీఎం అయ్యారు కనుక దాన్ని గుర్తుపెట్టుకుంటేనే మనుగడ ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం వాల్తేరును రైల్వే జోన్‌గా చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అన్ని సౌకర్యాలు ఉన్న విశాఖను రాజధాని చేయాలని, సీమాంధ్రకు విద్య, ఉపాధి, వైద్యం, సాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. -
విజయనగరంలో బొత్స ఇంటి వద్ద ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విజయనగరం లోక్‌సభ సభ్యురాలు బొత్స ఝాన్సీ ఇంటిని గురువారం ఉదయం సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు ముట్టడించారు. బొత్స ఝాన్సీ తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అయితే ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా అప్పటికే ఆమె నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దాంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అయితే సమైక్యవాదులు,పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో ఇరువైపులా తోపులాట జరిగింది. ఆ తోపులాటలో ఓ ఉపాధ్యాయుడు గాయపడ్డాడు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి యనని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
సీమాంధ్ర నేతల భేటీకి బొత్స ఝాన్సీ డుమ్మా
హైదరాబాద్ : సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు, తెలంగాణపై కేంద్రం ముందుకు వెళుతున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలు శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని క్లబ్ హౌజ్‌లో భేటీ అయ్యారు. అయితే మినిస్టర్స్ క్వార్టర్స్‌లోనే ఉన్నా భేటీకి రావడం ఇష్టంలేని ఎంపీ బొత్స ఝాన్సీ బయటకు వెళ్లిపోయారు. కాగా అధిష్టానం విభజనపై వెనక్కు తగ్గేది లేదని చెబుతుండడం, సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. దీంతో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకునేందుకు వీరంతా సమావేశమయ్యారు. ఈ భేటీకి కావూరి, పల్లంరాజు, పురంధేశ్వరి, ఎంపీలు లగడపాటి, బాపిరాజు, కేవీపీ, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు హాజరయ్యారు. అయితే రాజీనామాలు చేయాలా? వద్దా? అనే విషయంలో సీమాంధ్ర ప్రాంత ఎంపీల్లో ఏకాభిప్రాయం లేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అంతకు ముందు వెల్లడించారు. ఏడుగురు సీమాంధ్ర ఎంపీలు రాజీనామాలు ఆమోదింపజేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కొంత మంది సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలకు సుముఖంగానే ఉన్నారని చెప్పారు.