మనోజ్ సంచలనం
రియో ఒలింపిక్స్ పురుషుల లైట్‌వెయిట్ (64 కేజీ) విభాగంలో భారత బాక్సర్ మనోజ్ కుమార్ తొలి రౌండ్లో విజయంతో ప్రి-క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత ఎవల్దాస్తో పోరులో మనోజ్ 2-1తో విజయం సాధించాడు. పురుషుల బాంటమ్ వెయిట్ (56కేజీల) విభాగంలో భారత బాక్సర్ శివ థాపా.. క్యూబాకు చెందిన రామిరెజ్ రొబీసీ చేతిలో 0-3తో ఓటమి పాలయ్యాడు. మరోవైపు, భారత బాక్సర్లు రియో ఒలింపిక్స్‌లో నిషేధం నుంచి తప్పించుకున్నారు. బాక్సర్లు ధరించాల్సిన దుస్తులు ఏఐబీఏ ప్రమాణాలకు అనుగుణంగా లేవని.. దీంతో నిషేధం తప్పదని హెచ్చరికలు రావటంతో... వెంటనే కొత్తవాటిని తెప్పించి ఇచ్చారు.
గోల్ఫ్
పురుషుల వ్యక్తిగత ఈవెంట్ (రెండో రౌండ్)
అనిర్బర్ లాహిరి, శివ్ చౌరాసియా
సమయం: సాయంత్రం 4.00 గంటల నుంచి
షూటింగ్
పురుషుల 50మీ. రైఫిల్ ప్రోన్
చైన్ సింగ్, గగన్ నారంగ్
సమయం: సాయంత్రం 5.30 గంటల నుంచి
పురుషుల స్కీట్ (క్వాలిఫికేషన్స్)
మైరాజ్ ఖాన్
సమయం: సాయంత్రం 6.00 గంటల నుంచి
పురుషుల 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్
(క్వాలిఫికేషన్స్)
గుర్ప్రీత్ సింగ్
సమయం: రాత్రి 8.45 గంటల నుంచి
బ్యాడి మంటన్
మహిళల డబుల్స్ (గ్రూప్ ‘ఎ’)
గుత్తా జ్వాల - అశ్విని x పీక్-ముస్కెన్స్ (నెదర్లాండ్స్)
సమయం: సాయంత్రం 5.30 గంటల నుంచి
పురుషుల డబుల్స్ (గ్రూప్ ‘డి’)
సుమీత్- మను అత్రి x చాయ్-హోంగ్ (చైనా)
సమయం: రాత్రి 7.50 గంటల నుంచి
ఆర్చరీ
పురుషుల వ్యక్తిగత ఈవెంట్ ప్రిక్వార్టర్స్
అతాను దాస్ x లీ సుంగ్ యెన్ (కొరియా)
సమయం: సాయంత్రం 5.43 గంటల నుంచి
అథ్లెటిక్స్
పురుషుల 400మీ. పరుగు హీట్స్
మొహమ్మద్ అనాస్ యహియా
సమయం: సాయంత్రం 6.23 గంటల నుంచి
మహిళల షాట్‌పుట్
మన్‌ప్రీత్ కౌర్
సమయం: సమయం 6.35 గంటల నుంచి
పురుషుల 800మీ. హీట్స్
జిన్సన్ జాన్సన్
సమయం: సాయంత్రం 6.58 గంటల నుంచి
పురుషుల డిస్కస్ త్రో (క్వాలిఫికేషన్స్)
వికాస్ గౌడ
సమయం: రాత్రి 7.25 గంటల నుంచి
పురుషుల
20కి.మీ నడక
గుర్మీత్ సింగ్, మనీష్ సింగ్, క్రిష్ణన్ గణపతి
సమయం: రాత్రి 11.00 గంటల నుంచి
పురుషుల లాంగ్‌జంప్
అంకిత్ శర్మ
శనివారం తెల్లవారుజామున 5.50 గంటల నుంచి
పురుషుల హాకీ
భారత్ x కెనడా
సమయం: రాత్రి 9.00 గంటల నుంచి
బాక్సింగ్
పురుషుల మిడిల్ వెయిట్ 75కేజీ ప్రిక్వార్టర్స్
వికాస్ కృషన్ యాదవ్ x ఓండర్ సిపాల్ (టర్కీ)
సమయం: శనివారం తెల్లవారుజామున
3.00 గంటల నుంచి
స్టార్‌స్పోర్ట్స్ - 1, 2లలో ప్రత్యక్ష ప్రసారం