BOxing champion
-
బాక్సింగ్‌లో రాణిస్తున్న పేదింటి క్రీడాసుమం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆ అమ్మాయి బరిలోకి దిగితే పతకం సొంతం కావల్సిందే.. పంచ్ కొడితే ప్రత్యర్థి బెంబేలెత్తాల్సిందే.. ప్రతిభకు పేదరికం అడ్డం రాదని నిరూపించింది షేక్ నస్రీనా. బాక్సింగ్ బరిలో ప్రత్యర్థులను తన కిక్‌తో గడగడలాడించి 15 బంగారు, 2 రజత పతకాల్ని తన ఖాతాలో వేసుకుంది. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తోంది. ప్రతిభకు తగిన ప్రోత్సాహం లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూపులు చూస్తోంది. ప్రభుత్వ తోడ్పాటు ఉంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధిస్తానని ధీమాగా చెబుతోంది. ఆమె పేరు షేక్ నస్రీనా. ఊరు రాజమహేంద్రవరం. ఆ నగరంలోని ఐఎల్టీడీ ప్రాంతానికి చెందిన నస్రీనా తండ్రి షేక్ మస్తాన్ చిరు వ్యాపారం చేస్తూంటారు. తల్లి షేక్ మీరా టైలరింగ్ చేస్తూ ఆయనకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. బాక్సింగ్‌లో ఓనమాలు ఇలా.. నస్రీనా చిన్నాన్న హైదరాబాద్‌లో ఉంటారు. ఆయన ఇంటికి 2014లో వెళ్లిన ఆమె.. అక్కడ తన ఈడు పిల్లలు వివిధ క్రీడల్లో రాణించడం చూసి స్ఫూర్తి పొందింది. బాక్సింగ్‌లో విశ్వవిజేత టైసన్ పోరాడటాన్ని టీవీల్లో చూసి ఈ క్రీడపై ఆసక్తి పెంచుకుంది. ఆడపిల్లలకు క్రీడలు ఎందుకని ఇరుగుపొరుగు వారు నిరుత్సాహపరిచారు. కానీ కుమార్తె కోరికను తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో నస్రీనా హైదరాబాద్‌లో చిన్నాన్న ఇంటి వద్దనే ఉండి తొమ్మిదో తరగతి చదువుతూ, ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) బాక్సింగ్ కోచ్ ఓంకార్ యాదవ్ వద్ద ఈ క్రీడలో ఓనమాలు నేర్చుకుంది. తరువాత తల్లిదండ్రులు రాజమహేంద్రవరంలో ఉండటంతో హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చేసింది. జిల్లాకు చెందిన అంతర్జాతీయ బాక్సింగ్ కోచ్ చిట్టూరి చంద్రశేఖర్ వద్ద శిక్షణకు చేరింది. నస్రీనా పట్టుదల, ఆట పట్ల ఆసక్తి, చలాకీతనాన్ని గుర్తించిన చంద్రశేఖర్ ఆమెకు బాక్సింగ్‌లో మెళకువలు నేర్పించారు. కౌంటర్ ఎటాక్, మిక్సింగ్, ఫుట్‌వర్క్, స్పీడ్, స్టామినా, ఫిట్‌నెస్‌లో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రెండేసి గంటల చొప్పున శిక్షణ ఇచ్చి, మేటి క్రీడాకారిణిగా తీర్చిదిద్దారు. దీంతో తొమ్మిదో తరగతి నుంచే నస్రీనా పాఠశాల స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడం మొదలు పెట్టింది. శాప్ ఆధ్వర్యాన నిర్వహించిన రాష్ట్ర స్థాయి వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొని మరిన్ని మెళకువలు నేర్చుకుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో రాజమహేంద్రవరానికే చెందిన సినీ నటుడు ఆలీ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌లు నస్రీనా శిక్షణకు కొంత ఆర్థిక సహాయం అందించి, ప్రోత్సహించారు.స ప్రస్తుతం నస్రీనా రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. అలాగే త్వరలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచి కామన్వెల్త్, ప్రపంచ బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యేందుకు ఢిల్లీలో అంతర్జాతీయ కోచ్, ఒలింపియన్ హయతుల్లా నైబీ వద్ద శిక్షణ పొందుతోంది. సాధించిన విజయాలు ► మధురైలో జరిగిన ఇండియన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ పోటీల్లో బంగారు పతకంతో పాటు బెస్ట్ బాక్సర్ పతకం. ►ఏడు రాష్ట్రాల మహిళల సౌత్ జోన్ పోటీల్లో 64, 66 కేజీల విభాగాల్లో బంగారు పతకం. ►అంతర్జాతీయ స్థాయిలో నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన బాక్సింగ్ పోటీల్లో పసిడి పతకం. ►2021లో మహారాష్ట్రలోని పుణేలో జరిగిన ప్రొఫెషనల్ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం. ►2022లో జరిగిన ఏపీ స్టేట్ సీనియర్ బాక్సింగ్ పోటీలో రెండు పతకాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపిక. ►ఇటీవల తిరుపతిలో జరిగిన ఏపీ సీఎం కప్ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తా.. బాక్సింగ్ నేర్చుకుంటున్న తొలి రోజుల్లో కంటిపై గాయం కావడంతో వద్దన్న అమ్మానాన్న ఇప్పుడు నన్ను ప్రోత్సహిస్తున్నారు. నా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అంతర్జాతీయ పోటీల ఎంపికకు తీసుకునే శిక్షణకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందిస్తే ఒలింపిక్స్‌లో తప్పకుండా బంగారు పతకం సాధిస్తాను. – షేక్ నస్రీనా ప్రోత్సాహం అందిస్తే పతకం ఖాయం నేను తొలి నుంచీ కుస్తీ పోటీల్లో పాల్గొనేవాడిని. ఆడపిల్లలకు కుస్తీ పోటీలు ఎందుకులే అనుకున్న తరువాత నస్రీనాలో ఉన్న ఉత్సాహం చూసి ప్రోత్సహించాం. ఇప్పుడు ఎన్నో బంగారు పతకాలు సాధిస్తోంది. సామాన్య కుటుంబం కావడంతో నస్రీనాకు సరైన ఆహారం, ఇతర సౌకర్యాలు అందించలేకపోతున్నాం. నస్రీనాకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తే దేశానికి బంగారు పతకం తీసుకురావడం ఖాయం. – షేక్ మస్తాన్, షేక్ నస్రీనా తండ్రి -
వీల్‌చైర్‌లో మైక్ టైసన్.. బాక్సింగ్ దిగ్గజానికి ఏమైంది..?
దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ గురించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ 'లైగర్'లో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం వరకు సినిమా ప్రమోషన్స్‌లో బిజిబిజీగా గడిపిన మైక్ టైసన్.. తాజాగా వీల్‌చైర్‌లో కూర్చొని కదలలేని పరిస్థితిలో కనిపించిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన అభిమానులు లెజెండరీ బాక్సర్‌కు ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు. లైగర్ షూటింగ్లో హుషారుగా కనిపించిన యోధుడు కర్ర పట్టుకు కూర్చొని, ఇతరుల సాయంతో ముందుకు కదులుతున్న దృశ్యాలను చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. Former heavyweight boxing champion Mike Tyson’s health failing him and says his ‘expiration date may come really soon’ Mike Tyson is pictured in a wheelchair at Miami Airport, raising new fears for his health amid problems with sciatica. pic.twitter.com/ITHHAwfJQK — Zedbugs (@Zedbugs1) August 17, 2022 ఈ దృశ్యాలు టైసన్ మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నుంచి బయటకు వస్తున్నప్పుడు తీసినవిగా చెబుతున్నారు. టైసన్ ఈ పరిస్థితిలో ఉన్నప్పటికీ కొందరు సెల్ఫీల కోసం ఎగబడిన వైనం విస్మయానికి గురి చేస్తుంది. టైసన్ ఈ స్థితిపై ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. టైసన్ గతకొంతకాలంగా వెన్నునొప్పి, సయాటికాతో బాధపడుతున్నట్లు తెలిసింది. డాక్టర్లు టైసన్‌ను వీల్ చైర్ వాడాలని సూచించారట. విషయం తెలుసుకున్న అభిమానులు.. ప్రపంచాన్ని ఏలిన దిగ్గజ బాక్సర్‌కు ఈగతి పట్టిందేనని వాపోతున్నారు. 56 ఏళ్ల టైసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎక్స్పైరీ డేట్‌కు దగ్గర పడుతున్నానని చెప్పిన మాటల గురించి ప్రస్తుతం జనం చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే, విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం లైగర్ ఈనెల (ఆగస్టు) 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా బాలీవుడ్ క్యూటీ అనన్య పాండే నటించగా.. టైసన్ కీ రోల్ పోషించాడు. ఇక మైక్ టైసన్ ప్రొఫెషనల్ కెరీర్ విషయానికొస్తే.. టైసన్ ఇరవై ఏళ్ల వయసుకే తన దూకుడుతో ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగాడు. జూన్ 30, 1966లో జన్మించిన టైసన్.. చిన్నవయసులోనే అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా ఎదిగాడు. బాల్యంలో ఎన్నో కష్టాలు, వేధింపులు ఎదుర్కొన్న టైసన్.. స్ట్రీట్ఫైట్లలో పాల్గొని జైలు పాలయ్యాడు. లైంగిక వేధింపులు, ఇతరత్రా వివిదాల కారణంగా అతను 38సార్లు జైలుకెళ్లాడు. టైసన్ జైల్లో ఉండగానే బాక్సింగ్ దిగ్గజం ముహమ్మద్ అలీని కలిశాడు. 1997లో ప్రత్యర్థి ఇవాండర్ హోలిఫీల్డ్ చెవి కొరికి 3 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాడు. టైసన్ కెరీర్ రికార్డు 50 విజయాలు-20 ఓటములుగా ఉంది. చదవండి: విజయ్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న మైక్ టైసన్.. ఎంతంటే -
బాక్సర్ కావాల్సిన కుర్రాడు గ్యాంగ్‌స్టర్‌గా మారాడు..
న్యూఢిల్లీ: జాతీయ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచిన ఓ కుర్రాడు.. చెడు సహావాసాలు, వ్యసనాల కారణంగా బంగారం లాంటి భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకొని గ్యాంగ్‌స్టర్‌గా మారి, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలోకెక్కాడు. హర్యానాలోని సోనేపట్ జిల్లా గానౌర్ గ్రామానికి చెందిన దీపక్ పహల్ అనే 25 ఏళ్ల యువకుడు, చిన్నప్పటి నుంచి బాక్సర్ కావాలని కలలుకన్నాడు. అయితే చెడు సహవాసాల కారణంగా అతను ట్రాక్ తప్పాడు. బాక్సింగ్ రింగ్‌లో రికార్డులు సృష్టించాల్సిన అతను ప్రస్తుతం పోలీసు రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా నిలిచాడు. కిడ్నాప్, మర్డర్ సహా పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న అతనిపై పోలీసులు 2లక్షల రివార్డు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని సోనేపట్ జిల్లాకు చెందిన దీపక్ పహల్, చిన్నతనం నుంచి బాక్సింగ్ క్రీడపై మక్కువ పెంచుకున్నాడు. అతనికి 12 ఏళ్ల వయసున్నప్పుడు బీజింగ్ ఒలంపిక్స్‌లో విజేందర్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. విజేందర్ సింగ్‌ను స్పూర్తిగా తీసుకున్న అతను.. ఎలాగైనా ఆ స్థాయికి చేరాలని స్థానిక బాక్సింగ్ క్లబ్లో సాధన చేయడం మొదలు పెట్టాడు. దీపక్‌లోని ప్రతిభను గమనించిన కోచ్ అనిల్ మాలిక్ అతనికి కఠినమైన శిక్షణను అందించాడు. దీంతో క్లబ్లో చేరిన మూడేళ్లకే 2011లో అతను జూనియర్ స్థాయిలో జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆతరువాత జాతీయ బాక్సింగ్ జట్టులో స్థానం సంపాదించిన అతను భారత్ తరఫున ఎన్నో పతకాలు సాధించాడు. అయితే చెడు స్నేహాల కారణంగా దీపక్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. నేరగాళ్లతో ఏర్పడిన పరిచయం అతన్ని ఢిల్లీలో గోగి అనే గ్యాంగ్‌స్టర్ వద్దకు చేర్చింది. గోగి.. ఉత్సాహవంతులైన కుర్రాలను చేరదీసి, ఒక ముఠాగా మార్చి సుపారీ హత్యలు చేయించేవాడు. దీపక్ స్వతాహాగా చురుకైన కుర్రాడు కావడంతో కొద్ది కాలంలోనే గోగి బృందంలో కీలక సభ్యుడిగా మారిపోయాడు. హత్యలు, దొమ్మీలలో ఆరితేరిపోయాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం పెరోల్‌పై బయటకు వచ్చిన అతను.. పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఓ హత్య కేసుకు సంబంధించి గోగీని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కస్టడీ నుంచి గోగిని తప్పించడానికి పహల్ ఏకంగా పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డాడు. గత వారంలో గోగిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దీపక్ మార్గమధ్యంలో కాల్పులు జరిపాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో గోగి మరణించగా, దీపక్ తప్పించుకున్నాడు. ప్రస్తుతం దీపక్‌పై ఢిల్లీ పోలీసులు 2 లక్షల రివార్డును ప్రకటించారు. కొడుకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారడంపై తల్లి, కోచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపక్ సాధించిన పతకాలు చూసి అతని తల్లి కన్నీరుమున్నీరవుతుంది. ఏదో ఒక రోజు దేశమంతా నా గురించి మాట్లాడుకోవాలని చెప్పిన కుర్రాడు చివరికి ఇలా తయారవుతాడని ఊహించలేదంటున్నాడు కోచ్ అనిల్ మాలిక్. -
కుస్తీ మే సవాల్
స్త్రీకి జీవితంలో ప్రతిదీ ఒక కుస్తీనే.అలాంటి స్త్రీ.. కుస్తీ పోటీల్లో ఉంటే..భర్త చప్పట్లు కొట్టకపోతే ఎలా?!‘బెటర్ హాఫ్’గా ఒప్పుకున్నప్పుడుచేతికి రింగు తొడిగిస్తారు. బాక్సింగ్ చేసే చోటు కూడా రింగే. భార్య బాక్సింగ్ రింగ్‌ని ప్రేమించింది.భర్త భార్యను ప్రేమించాలి.. ‘విత్ దిస్ రింగ్’! ‘‘నీపై నాకున్న ప్రేమకు సాక్షిగా ఈ ఉంగరాన్ని నీ వేలికి తొడుగుతున్నాను. విత్ దిస్ రింగ్ (ఈ ఉంగరంతో) నేనెప్పుడూ నీకు తోడుగా నీ వెంటే ఉంటానని, నీకు విధేయుడైన భర్తగా / విధేయురాలినైన భార్యగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను’’.వధువు, వరుడు ఉంగరాలు మార్చుకున్నారు. పెళ్లి అయిపోయింది. జనవరి 1 అది. పెళ్లికి వచ్చినవాళ్లలో ముగ్గురు స్నేహితురాళ్లు ఉన్నారు. వారిలో ఒకరు కెరీర్లో పైపైకి ఎదగాలని కోరుకుంటున్న అమ్మాయి. ఇంకొకరు మంచి కాలమిస్టుగా ఎదుగుతున్న అమ్మాయి. మరొకరు ఒక అడుగు పైకి ఎగబాగుతూ, ఒక అడుగు కిందికి జారుతూ ఉన్న నటి. ఆ పెళ్లిలో ఆ ముగ్గురూ ఒక ఒప్పందానికి వస్తారు. సరిగ్గా ఏడాది లోపు తాము కూడా పెళ్లి చేసుకోవాలని. అంతగా పెళ్లిలోని ఆ రింగ్ సెరిమనీ వాళ్లలో ఉత్సాహం తెస్తుంది. పెళ్లిప్రమాణాల్లో ‘విత్ దిస్ రింగ్’ అనే మాటకు ఈ ముగ్గురు అమ్మాయిల చెంపలు కెంపులవుతాయి. నాలుగేళ్ల క్రితం అమెరికన్ టెలివిజన్ చానల్ ‘లైఫ్‌టైమ్’లో వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామాలోని థీమ్ ఇది. ఆ టీవీ మూవీ పేరు ‘విత్ దిస్ రింగ్’. ‘విత్ దిస్ రింగ్’ అనే పేరుతోనే ఇండియాలో ఈ ఫిబ్రవరిలో యూట్యూబ్‌లోకి ఒక డాక్యుమెంటరీ అప్లోడ్ అయింది. అందులోనూ ముగ్గురు అమ్మాయిలు ఉంటారు. మనకు తెలిసిన అమ్మాయిలే. మేరీకోమ్, సరితాదేవి, చోటో లోరా. ముగ్గురూ బాక్సర్లు. ‘నువ్వసలు అమ్మాయివేనా?’, ‘నీకు పెళ్లెలా అవుతుందనుకున్నావ్?’, ‘కండలున్న ఆడదాన్ని ఏ మగాడు చేసుకుంటాడు?’, ‘పరువు తియ్యడానికి పుట్టావే నువ్వు నా కడుపున’, ‘ఊళ్లో అంతా నవ్వుతున్నారు’, ‘నీ నడక ఎలా మారిపోతోందో తెలుసా.. ఆడతనాన్ని వెతుక్కోవలసి వస్తోంది’.. ఎన్ని మాటలు!! అన్నీ పడ్డారు. బాక్సింగ్ ప్రాణం అనుకున్నారు. కష్టాలు అనుభవించారు. తినీ తినకా బరిలో నిలబడ్డారు. ప్రత్యర్థిని ఎదుర్కొన్నారు. పతకాలు సాధించారు. ఊరేం సంతోషించలేదు. పతకం మెడలో వేసుకోడానికి పనికొస్తుంది. పతకానికి తాళి కడతాడా ఎవరైనా.. ఎంత బంగారు పతకమైనా! వ్యంగ్యం, అవమానాలు! తట్టుకుని నిలబడ్డారు. దేశమే తలెత్తి చూసేంత ఎత్తుకు ఎదిగారు. బాక్సింగ్ రింగ్.. ఈ ముగ్గురి ఫస్ట్ మ్యారేజ్. ఆ తర్వాతే మ్యారేజ్ రింగ్. ఇంట్లో వద్దన్న పని చెయ్యడం కష్టం. ఊరు వద్దన్న పని చెయ్యడం ఇంకా కష్టం. ఆ రెండు కష్టాలనూ వీళ్లు బాక్సింగ్‌తో ముఖం మీద.. ముఖం మీద గుద్దేసి, విజేతలయ్యారు. ‘విత్ దిస్ రింగ్’ అనే ఈ డాక్యుమెంటరీ ఇప్పటికిప్పుడు యూట్యూబ్‌లో మీకు అందుబాటులో ఉంది. అయితే ఇవాళ మనస్టోరీ పై ముగ్గురి స్నేహితురాళ్లు, కింది ముగ్గురు మహిళా బాక్సర్ల గురించి కాదు. అమీషా జోషి, అన్నా సర్కిస్సియన్ అనే ఇద్దరు అమ్మాయిల గురించి! మేరీ కోమ్, సరితాదేవి, ఛోటో లోరాలపై డాక్యుమెంటరీ తీసింది వీళ్లే. బాక్సర్లుగా ఎదగడానికి ఆ ముగ్గరూ ఎంత కష్టపడ్డారో, వాళ్లపై డాక్యుమెంటరీ తియ్యడానికి వీళ్లిద్దరూ అంత కష్టపడ్డారు. గంటన్నర నిడివి ఉన్న ఈ చిత్రాన్ని తియ్యడానికి వీళ్లకు పదేళ్లు పట్టింది!!అమీషా, అన్నా ఎవరికి వారుగా ఫిల్మ్మేకర్లు. చిన్న వయసే. కెనడాలో ఉంటారు. అనుకోకుండా కలుసుకున్నారు. ఎవరైనా బయోపిక్‌లు, బయోబుక్లు తేవాలంటే.. ఇన్స్పైరింగ్ పీపుల్ ఎవరా అని వెదకుతారు. వీళ్లకు ఆ సమస్య లేదు. ప్రతి మహిళ జీవితమూ ఇన్స్పైరింగే వీళ్ల ఉద్దేశంలో. అయితే మేరీ, సరిత, ఛోటోల స్టోరీ అనుకున్నప్పుడు ఇన్స్పైరింగ్ని పక్కన పెట్టి, వాళ్ల స్ట్రగుల్‌ని ముఖ్యాంశంగా తీసుకున్నారు. ఎక్కడో ఈశాన్య భారతదేశంలో, పేదరికంలో, సంప్రదాయాల చట్రాల్లో ఉన్న ఆడపిల్లలు ఏంటి, బాక్సింగ్ రింగ్‌లోకి రావడమేంటి! వచ్చి విజయం సాధించడం ఏంటి! డాక్యుమెంటరీ తియ్యాల్సిందే అనుకున్నారు. ఊరికే అవుతుందా? రిసెర్చ్ అవసరం. ఆట టఫ్‌గా ఉంటుంది. ట్రైనింగ్ ఇంకా టఫ్‌గా ఉంటుంది. ఇక లేత బలహీనమైన ఎముకలు గల ఆ అమ్మాయిల మనోబలం వాటికి మించి టఫ్‌గా ఉందని.. అన్నా, అమీషలకు తెలుస్తూనే ఉంది. బయల్దేరారు. ఆ ముగ్గురు బాక్సర్లు పుట్టిన ఊరికి, ఆడిన ఊరికీ, పతకం గెలిచిన ఊరికీ తిరిగారు. శ్రమ పడ్డారు. నోట్స్ రాసుకున్నారు. షూట్స్ చేశారు. డబ్బులు ఖర్చుపెట్టారు. మరి వీటన్నిటికీ టైమ్? ఇద్దరూ ఉద్యోగాలు చేసేవాళ్లే. సెలవురోజుల్లో కొంత పని. సెలవు పెట్టి కొంత పని. ఇలా పదేళ్లు.. ఓ భారీ నీటì పారుదల ప్రాజెక్టును కట్టినట్లుగా.. జీవితం అనే ఒక బరిలో, బాక్సింగ్ అనే ఇంకో బరిలో మేరీ, సరితా ఛోటో ఎలా నెగ్గుకొచ్చిందీ చిత్రీకరించారు. అన్నా అయితే ఒక ఆటగా బాక్సింగ్‌ను ఎప్పుడూ ఇష్టపడలేదు. మేరి, సరిత, ఛోటోల ఆట చూశారు కాబట్టి ఇష్టపడ్డారు. మామూలుగానైతే విస్మయపరిచే అనామక స్త్రీల జీవితాలను అన్నాను నమ్మోహనపరుస్తాయి. అయితే ఈ ముగ్గురి గురించి విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు.. ఒక స్త్రీ జీవన పోరాటాన్ని డాక్యుమెంటరీని తీయడానికి అవసరమైన స్క్రీన్ ప్లే అన్నాకు లభించింది.పదేళ్ల తర్వాతనైనా డాక్యుమెంటరీ పూర్తయినందుకు అమీషా కూడా విశ్రాంతిగా వేళ్లు విరుచుకుంటున్నారు. ‘బాబోయ్.. చిన్న పనైతే కాదు’’ అని నవ్వుతోంది అమీషా. డాక్యుమెంటరీ కోసం ఈ ఇద్దరూ రోజూ సాయంత్రాలలో, శని ఆదివారాల్లో పూర్తిగా డే అంతా పని చేశారు. ప్రాజెక్టులో సగభాగం పూర్తయ్యాక.. సగంలో ఆపేద్దాం అని కూడా అనుకున్నారు. ఒళ్లంతా సినిమా రీళ్లు చుట్టుకుపోయి తమను బందీలను చేసినట్లు ఫీలయ్యారు. సొంత డబ్బు సరిపోవడం లేదు. ఫండింగ్ చేసేవాళ్లు.. మహిళల బాక్సింగ్ అంటే చిన్న పంచ్లాంటి చూపు విసిరి.. మీకేం పనిలేదా? పని లేని పనికి ఫండింగ్ కూడానా అన్నట్లు వెళ్లిపోయేవారు. ఓ రోజు అమీషా అంది... ‘‘మనకేనా ఈ ఎగ్జయింట్మెంట్! ప్రపంచానికి లేదా?’’ అని. ‘మేరీ కోమ్’ సినిమా బాగా ఆడింది. ‘దంగల్’ ఇంకా బాగా ఆడింది. ఒకటి బాక్సింగ్. ఇంకొకటి రెజ్లింగ్. రెండూ స్త్రీలు చేసినవే. ఆ ధైర్యంతో ముందుకు వెళ్లారు. డబ్బు సంపాదించడం కోసం కాదు. ముందసలు జనాల్లోకి వెళ్లాలి. పెళ్లి, పిల్లలు కాకుండా కెరియర్లో ఎదగాలన్న అభిలాష ఉన్న యువతుల జీవితాల్లో ఎంత కష్టం ఉంటుందో తెలియాలి. మహిళా బాక్సింగ్‌లో ఇండియాకు, కెనడాకు తేడా ఉంటుంది. కెనడా కన్నా ఇండియా చాలా నయం. కెనడానే కాదు, తక్కిన దేశాలతో పోలిస్తే కూడా.. ఉమెన్ బాక్సింగ్ ఈవెంట్‌కి ఇండియాలో డబ్బులు కుమ్మరించే స్పాన్సరర్లు చాలామందే ఉంటారు. కెనడాలో ఫండింగే ఉండదు. మహిళలు ఒక హాబీగా మాత్రమే ఆడతారు. వాళ్లకు సొంత జిమ్‌లు ఉంటాయి. ట్రైనర్‌ను పిలిపించుకుని అక్కడే శిక్షణ పొందుతారు. ముందు జాబ్ చూసుకుంటారు. బాక్సింగ్ పోటీలకు వెళ్లాలనుకున్నప్పుడు.. అప్పుడు ఫండ్ రైజింగ్ కోసం చూస్తారు. ఇండియాలో అసలు చదువుతున్నప్పుడే ఆర్థిక సహాయం చేసేవాళ్లుంటారు. ప్రభుత్వమూ ముందుకొస్తుంది. బాగా ఆడితే ఉద్యోగం ఇస్తుంది. ఒకసారి ఉద్యోగం వచ్చాక జీవితం స్థిరపడిననట్లే. ఇన్ని అవకాశాలు, సదుపాయాలు ఉన్నా కూడా భారతదేశంలో మహిళా బాక్సర్లు కుటుంబ ఆంక్షల వల్ల, పెళ్లి కాదేమోనన్న పెద్దవాళ్ల భయాల వల్ల ఆశను చంపుకోవలసి వస్తోంది. ఈ విషయాలన్నీ అన్నా, అమీషా ఇండియా టూర్లో ఉన్నప్పుడు అర్థం చేసుకున్నారు. వాటన్నిటినీ డాక్యుమెంటరీలో.. చూసింది చూసినట్లు చూపిస్తే ఈ ముగ్గురూ ఎగిరిపోయి, భారతదేశంలో క్రీడలకు లభిస్తున్న ప్రోత్సాహం ఒక్కటే కనిపిస్తుంది. అందుకే మొదట మేరీ కోమ్ చుట్టూ ఆమె నిజ జీవితాన్ని ఒక కథగా అల్లుకున్నారు. తర్వాత మిగతా ఇద్దరి లైఫ్‌ని, లైఫ్ అచీవ్మెంట్స్నీ తీసుకున్నారు. లైఫ్ అచీవ్మెంట్ అంటే బాక్సింగ్‌లో బంగారు పతకాలు, అర్జున అవార్డులు కాదు. బరి వరకు వెళ్లే లోపు సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఎదురయ్యే పంచ్‌లను తప్పించుకోవడం. మరి పెళ్లి?! పెళ్లి పెద్ద పంచ్ స్త్రీ కెరీర్‌కి. అర్థం చేసుకునే మనిషి, హెల్ప్ చేసే మనిషి భర్తగా దొరికితే కెరీర్లో ఎదురయ్యే అవాంతరాలన్నీ వాటంతటవే పక్కకు తప్పుకుంటాయి. మేరీకోమ్‌కి, సరితకు పెళ్లయింది. మేరీ కోమ్ భర్త.. పిల్లల్ని భద్రంగా చూసుకుంటాడు. ఆట ఆడేందుకు అవసరమైన స్థిమితత్వాన్ని ఆమెకు చేకూరుస్తాడు. సరిత భర్త కూడా అంతే. వాళ్లకొక కొడుకు. సరిత ఈవెంట్స్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు వాడికి తల్లీ తండ్రీ అతడే. వాస్తవానికి మేరీ, సరిత.. పెళ్లయ్యాకే మెరుగైన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వీళ్లిలా శ్రమ పడడం, భర్త సహకరించడం.. డాక్యుమెంటరీలో ఇవేవీ నేరుగా చూపించలేదు అన్నా, అమీషా. చూస్తుంటే తెలిసిపోతుంది.. చిన్న మాట, చిన్న సహాయం తోడుగా ఉంటే స్త్రీలు ఎంత కష్టమైన ఆటలోనైనా అత్యున్నతస్థాయిలో రాణించగలరని.ఇంతకీ ఈ డాక్యుమెంటరీకి ‘విత్ దిస్ రింగ్’ అని పేరెందుకు పెట్టినట్లు?‘‘నీపై నాకున్న ప్రేమకు సాక్షిగా ఈ ఉంగరాన్ని నీ వేలికి తొడుగుతున్నాను. విత్ దిస్ రింగ్ (ఈ ఉంగరంతో) నేనెప్పుడూ నీకు తోడుగా నీ వెంటే ఉంటానని, నీకు విధేయుడైన భర్తగా / విధేయురాలినైన భార్యగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను’’.. అనే పెళ్లి ప్రమాణంలోని ఈ మాటను ఇక్కడ మనం మరొక రకంగా అర్థం చేసుకోవాలి. ‘నిన్నే కాదు.. ఆటపై ఉన్న నీ ఇష్టాన్నీ ప్రేమిస్తున్నాను’ అని. జీవిత భాగస్వామిగా నీ ఇష్టానికి పూర్తి భాగం ఇస్తాను’ అని కూడా! అన్నా.. అమీష అభినందనీయులు. ►పతకం మెడలో వేసుకోడానికి పనికొస్తుంది. పతకానికి తాళి కడతాడా ఎవరైనా.. ఎంత బంగారు పతకమైనా! వ్యంగ్యం, అవమానాలు! తట్టుకుని నిలబడ్డారు. దేశమే తలెత్తి చూసేంత ఎత్తుకు ఎదిగారు. ►అర్థం చేసుకునే మనిషి, హెల్ప్ చేసే మనిషి భర్తగా దొరికితే స్త్రీకి కెరీర్లో ఎదురయ్యే అవాంతరాలన్నీ వాటంతటవే పక్కకు తప్పుకుంటాయి. ►లైఫ్ అచీవ్మెంట్ అంటే బాక్సింగ్‌లో బంగారు పతకాలు, అర్జున అవార్డులు కాదు. బరి వరకు వెళ్లే దారిలో సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఎదురయ్యే పంచ్‌లను తప్పించుకోవడం. మరి పెళ్లి?! పెళ్లి పెద్ద పంచ్ స్త్రీ కెరీర్‌కి. -
పెహల్వాన్ రెడీ అవుతున్నాడు
కన్నడ స్టార్ హీరో సుదీప్ తన నెక్ట్స్ సినిమా కోసం పెహల్వాన్‌గా మారబోతున్నారు. యస్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ‘పెహల్వాన్’ సినిమాలో సుదీప్ బాక్సింగ్ చాంపియన్‌లా కనిపించనున్నారట. ఈపాత్ర కోసం తన ఫిజిక్‌ని ఆల్రెడీ మార్చే పనిలో ఉన్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లారెన్ స్టోవాల్ ‘పెహల్వాన్’ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ డిజైన్ చేయనున్నారట. ‘కెప్టెన్ అమెరికా: సివిల్ వార్, హంగర్ గేమ్స్’ వంటి హాలీవుడ్ చిత్రాలతో పాటు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’కు ఫైట్స్ కంపోజ్ చేశారు లారెన్. ప్రస్తుతం సుదీప్ ‘పెహల్వాన్, కోటి గొబ్బ 3’, తెలుగులో ‘సైరా’ సినిమాలతో బిజీగా ఉన్నారు. -
సంచలన వ్యాఖ్యలు చేసి క్షమాపణ చెప్పిన దిగ్గజం!
మనీలా: బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్థులను గడగడలాడించడంలోనే కాదు.. వివాదస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ తాను మేటి అనిపించుకున్నాడు బాక్సింగ్ మాజీ దిగ్గజం. ఎనిమిది సార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా నిలిచిన దిగ్గజం మానీ పాక్వియావో సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్వలింగ సంపర్కులు జంతువుల కన్నా హీనమైన వారని వ్యాఖ్యానించాడు. ఫిలిప్పీన్స్ సెనేట్ లో స్థానం కోసం పోటీపడుతున్న తరుణంలో ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు రాజకీయంగా కూడా పెను దుమారం రేపాయి. ఈ మే నెలలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. భార్యతో పాటు ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. తాను ఎవరిని విమర్శించడం లేదని, బైబిల్ లో పేర్కొన్న విషయాలనే తాను ప్రస్తావించినట్లు పేర్కొన్నాడు. ఆయనపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు తాను చేసిన పనిని తప్పు అని గ్రహించాడు. హోమో సెక్సువల్స్ ను దూషించినందుకు తనను క్షమించాలని కోరాడు. 'జంతువులు కూడా స్వలింగ సంపర్కం చేస్తాయి. అయినా అవే నయం. వాటికి ఆడా, మగా అనే తేడా అయినా ఉంది. పురుషులు- పురుషులతో, మహిళలు - మహిళలతో సెక్స్ లో పాల్గొనడం జంతువుల కంటే దారుణం' అని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. వైస్ గండా అనే ఓ గే ఈ విషయంపై తీవ్రంగా స్పందించాడు. ట్విట్టర్లో ఆ బాక్సర్ పై విమర్శల వర్షం కురిపించాడు. పాక్వియావో తనకు తానుగా దేవుడు అని ఫీలవుతున్నాడు. కానీ, రాజకీయాలకు కావాలసింది నైపుణ్యం ఉన్నవాళ్లంటూ గండా మండిపడ్డాడు. ఇప్పటికీ తాను తన వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని.. ఎందుకంటే పవిత్ర బైబిల్ లో స్వలింగ సంపర్కం తప్పు అని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించాడు. దేవుడు మిమ్మల్ని అందర్నీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను అని బాక్సర్ పాక్వియావో చెప్పుకొచ్చాడు. -
బాక్సింగులో గెలిచాడు.. 45 కోట్లతో కార్లు కొన్నాడు!
క్రీడాకారులకు, వాహనాలకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. సచిన్ టెండూల్కర్‌కు ఫెరారీ కారంటే భలే ఇష్టం. మహేంద్రసింగ్ ధోనీకి బైకులంటే ఎక్కడలేని ప్రేమ. ఇక ఇటీవలే ప్రపంచంలో అత్యంత ఖరీదైన బాక్సింగ్ ఫైటులో విజయం సాధించి దాదాపు రూ. 1200 కోట్లు గెలుచుకున్న ఫ్లాయిడ్ మేవెదర్.. ఆ డబ్బుతో ముందుగా ఏం చేశాడో తెలుసా? అందులో దాదాపు 45 కోట్ల రూపాయలు పెట్టి మంచి ఖరీదైన కార్లు ఓ పది కొని పారేశాడట. జుట్టున్న అమ్మ ఎన్ని కొప్పులైనా పెట్టుకుంటుందని నానుడి. అలా.. చేతినిండా డబ్బుంది కాబట్టి ఎన్ని కార్లయినా కొంటాడన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచంలో ధనవంతుల్లోకెల్లా ధనవంతులు అనుకున్నవాళ్లు కూడా ఇన్ని కార్లు, అదీ అన్నీ ఖరీదైన కార్లు కొని ఉండరని టాక్. ఆయన కొన్న కార్ల జాబితా ఇదీ.. రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూప్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ మెర్సిడిస్ మేబాష్ ఎస్600 మెర్సిడిస్ జి63 ఏఎంజీ వి8 బైటర్బో బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ బుగట్టి గ్రాండ్ స్పోర్ట్ బుగట్టి వేరాన్ ఫెరారీ 458 స్పైడర్ మెక్లారెన్ 650ఎస్ స్పైడర్ లాంబోర్గిని అవెంటాడర్ ఎల్పీ700-4 రోడ్‌స్టర్ -
సాకారమైన స్వప్నం...మా ‘మేరీ కోమ్’కు అవార్డు!
‘‘నా తొలి చిత్రమైన ‘మేరీ కోమ్’కు సకుటుంబ వినోదం అందించిన ఉత్తమ పాపులర్ చిత్రంగా జాతీయ అవార్డు వచ్చిందని తెలిసి, ఉద్వేగానికి గురవుతున్నా. అసలిది నమ్మలేకపోతున్నా. ఎన్నడూ లేనంత ఆనందంగా ఉంది. మన దేశంలోని మణిపూర్‌కు చెందిన బాక్సింగ్ చాంపియన్ ఎం.సి. మేరీకోమ్ జీవితంపై ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. ఈ నిజజీవిత పాత్రలోకి ప్రియాంకా చోప్రా అద్భుతంగా పరకాయ ప్రవేశం చేసింది. ఏ నూతన చిత్ర దర్శకుడికైనా ఈ గుర్తింపు వాస్తవరూపం ధరించిన సుందర స్వప్నం లాంటిదే!’’ -‘మేరీ కోమ్’ చిత్రంతో దర్శకుడైన ఒమంగ్ కుమార్ -
మేరీ కామ్ ఏడ్చేశారు..!
‘‘ఒక పాత్ర కోసం ఎలాంటి త్యాగం అయినా చేయడానికి సిద్ధపడేవాళ్లే అసలు సిసలైన కళాకారులు. అందంగా మాత్రమే కాదు.. కథ డిమాండ్ చేస్తే అందవిహీనంగా కూడా కనిపించడానికి రెడీ అయిపోవాలి’’ అని ప్రియాంకా చోప్రా పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఆమె చేసిన చిత్రాలు ఒక ఎత్తయితే.. ఇప్పుడు చేసిన ‘మేరీ కామ్’ మరో ఎత్తు అవుతుంది. బాక్సింగ్ చాంపియన్ మేరీ కామ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం కోసం ప్రియాంక చాలా కష్టాలు పెడ్డారు. కండలు పెంచారు.. బాక్సింగ్ నేర్చుకున్నారు. ఇంకా ఎన్నో వ్యయప్రయాసలకోర్చారు. బుధవారం ‘మేరీ కామ్’ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. విడుదల చేసిన కొద్ది సమయంలోనే ప్రియాంకకు భారీ ఎత్తున ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలో నటించడంపట్ల తన ప్రియాంక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ -‘‘క్లిష్టమైన పాత్రలు ఒప్పుకున్నప్పుడు నేను సవాలుగా తీసుకుంటా. ముఖ్యంగా మేరీ కామ్ లాంటి పాత్రలు ఓ ఛాలెంజ్. నా నిజజీవితానికీ, ఈ పాత్రకూ దగ్గర పోలికలుంటాయి. మాది చాలా చిన్న పట్టణం. అయినప్పటికీ అన్ని అడ్డు గోడలనూ ధైర్యంగా తొలగించుకుని, ఈ స్థాయికి చేరుకున్నాను. జీవితంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ అన్ని ఎల్లలు దాటినవారే’’ అని చెప్పారు. ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో ఆమె గుండులో కనిపిస్తారు. దీని గురించి చెబుతూ -‘‘ఈ సన్నివేశం గురించి దర్శకుడు చెప్పగానే, కుదరదనలేదు. వెంటనే ఓకే అన్నాను. గుండుతో ఉన్నట్లుగా మేకప్ చేసుకుని లొకేషన్లోకి ఎంటరయ్యా. ఓ పాత్ర ఒప్పుకున్న తర్వాత దాని కోసం నిజాయతీగా ఏం చేయడానికైనా వెనకాడను’’ అని ప్రియాంక అన్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని మేరీ కామ్ చూశారని, ఉద్వేగానికి గురై ఏడ్చేశారని ప్రియాంక తెలిపారు. ‘‘ఆమె కంట తడిపెట్టుకోవడం చూసిన తర్వాత, ‘మేరీ కామ్’ జీవిత చరిత్రకు న్యాయం చేశామనే నమ్మకం నూటికి నూరు పాళ్ళు కలిగింది’’ అని ప్రియాంక అన్నారు. -
మాజీ బాక్సింగ్ ఛాంపియన్ కిడ్నాప్.. హత్య
వెనిజువెలాకు చెందిన మాజీ బాక్సింగ్ ఛాంపియన్ ఆంటోనియో సెర్మెనోను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి.. అనంతరం హతమార్చారు. సెర్మెనో గతంలో ప్రపంచ బాక్సింగ్ అసోసియేషన్ నుంచి సూపర్ బాంటమ్ వెయిట్, ఫెదర్ వెయిట్ ఛాంపియన్‌గా ఉండేవారు. 1980లు, 90లలో ఈ రెండు విభాగాల్లో ఆయనదే రాజ్యం. 44 ఏళ్ల సెర్మెనోను ఆయన కుటుంబ సభ్యులతో సహా అందరినీ సోమవారం నాడు అపహరించారు. మంగళవారం నాడు తూర్పు కారకాస్ ప్రాంతంలో ఆయన మృతదేహం జాతీయ రహదారి మీద పడి కనిపించింది. ఆయన మరణానికి వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో సంతాపం తెలిపారు. వెనిజువెలాలో ఇటీవలి కాలంలో హింసాత్మక సంఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటిని అరికట్టేందుకు గాను ప్రభుత్వం ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమాల్లో సెర్మెనో శిక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. తద్వారా యువకులను వీధిపోరాటాలకు దూరం చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అయితే, సెర్మెనో హత్యకు కారణాలేంటన్న విషయాన్ని అధికారులు ఇంతవరకు వెల్లడించలేదు. -
విజేందర్ శుభారంభం
అల్మాటీ (కజకిస్థాన్): డ్రగ్స్ వివాదం నేపథ్యంలో కొన్నాళ్లపాటు ఆటకు దూరంగా ఉన్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఈ హర్యానా బాక్సర్ శుభారంభం చేశాడు. గురువారం జరిగిన పురుషుల 75 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో విజేందర్ 3-0తో (30-27, 30-26, 30-26) హ్యాంపస్ హెన్రిక్సన్ (స్వీడన్)పై గెలిచాడు. 2009 ఈవెంట్లో విజేందర్ కాంస్య పతకం నెగ్గి ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన భారత తొలి బాక్సర్‌గా చరిత్ర సృష్టించాడు. ‘ఇక్కడకు వచ్చినప్పటి నుంచి జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నాను. రెండు రోజులుగా మందులు వాడుతున్నాను. తొలి రౌండ్లో గెలిచినందుకు సంతోషంగా ఉంది. ఇది ఆరంభం మాత్రమే. శారీరకంగా బలహీనంగా ఉన్నా మానసికంగా దృఢంగా ఉండాలని ఈ బౌట్‌కు ముందు కోచ్‌లు చెప్పారు. నేను సానుకూల దృక్పథంతో బరిలోకి దిగి విజయాన్ని అందుకున్నాను ’ అని విజేందర్ వ్యాఖ్యానించాడు. శనివారం జరిగే రెండో రౌండ్లో యూరోపియన్ చాంపియన్ జాసన్ క్విగ్లీ (ఐర్లాండ్)తో విజేందర్ పోటీపడనున్నాడు. శుక్రవారం జరిగే పోటీల్లో ఇద్దరు భారత బాక్సర్లు బరిలోకి దిగనున్నారు. కెడ్డీ ఆగ్నెస్ (సీషెల్స్)తో మన్‌ప్రీత్ (91 కేజీలు); ఫాతి కెలెస్ (టర్కీ)తో మనోజ్ కుమార్ (64 కేజీలు) తలపడతారు.