brahmana association
-
పేరి కామేశ్వరరావు అభినందన సభ
-
అనంత శ్రీరామ్‌పై బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం
నెల్లూరు: ప్రముఖ రచయిత అనంత శ్రీరామ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవలె వరుడు కావలెను సినిమాలో అనంత శ్రీరామ్ రాసిన ‘దిగు దిగు నాగ’ పాటపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. దేవతలను కించపరిచేలా లిరిక్స్ ఉన్నాయంటూ అనంత శ్రీరామ్‌పై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు చిల్లకూరు పీఎస్‌లో అనంత శ్రీరామ్‌పై బ్రాహ్మణ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఒరిజినల్ పాటలో ఉన్న అద్భుతమైన భావాన్ని పాడు చేశారని, డబ్బు కోసం దేవతలకు కించపరుస్తున్నరంటూ మండిపడ్డాయి. నాగ ప్రతిమలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన బ్రాహ్మణ సంఘాలు అనంత శ్రీరామ్‌కు ఉన్న మంద బుద్ది పోవాలంటూ చురకలంటించారు. వెంటనే చిత్రం నుంచి ఈ పాటను తొలగించాలని డిమాండ్ చేస్తూ వెంకటగిరిలో నిరసనకు దిగారు. ఇప్పటికే అనంత శ్రీరామ్‌పై బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు నెల్లూరులోని చిల్లకూరు పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా నాగశౌర్య, రీతూ వర్మలు హీరో హీరోయిన్లుగా నటించిన వరుడు కావలెను చిత్రానికి లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. -
బ్రాహ్మణులంటే బాబుకు లెక్కలేదు: కోన
సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయని, ఈ ప్రభుత్వ పోకడ చూస్తుంటే చంద్రబాబుకు బ్రాహ్మణులంటే లెక్కేలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి వ్యాఖ్యానించారు. విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ.. ఐవైఆర్ కృష్ణారావు లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని బయటకు పంపించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వంలో చూశామన్నారు. రమణ దీక్షితులు లాంటి ఆగమ శాస్త్ర పండితులను అన్యాయంగా టీడీపీ ప్రభుత్వం బయటకు పంపించిందని విమర్శించారు. చంద్రబాబు దయవల్ల ఈ రోజు ఎన్నికలు క్యాష్, కాస్ట్ ఉంటేనే రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. బ్రాహ్మణ సంఘాలతో ఆత్మీయ సమావేశం ఈ నెల 10న మధ్యాహ్నాం 2 గంటలకు సిరిపురం విజ్ఞాన్ స్కూల్ గ్రౌండ్స్‌లో బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ సమావేశం ఉంటుందని, దీనికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరవుతారని కోన రఘుపతి వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం అభివృద్ధికి వైఎస్సార్సీపీ చేయబోయే అంశాల మీద సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. -
కలెక్టర్ వ్యాఖ్యలపై వివరణ కోరిన హెచ్చార్సీ
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వివరణ కోరింది. ఈ ఘటన పూర్వాపరాలను నివేదించాలంటూ డీజీపీ, సీఎస్‌లను ఆదేశించింది. బ్రాహ్మణ కల్చర్‌పై కలెక్టర్ ఎ.మురళి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారంటూ కొందరు బ్రాహ్మణ సంఘాల నాయకులు సోమవారం హెచ్చార్సీని ఆశ్రయించారు. తమ మనోభావాలను కలెక్టర్ దెబ్బతీశారని, అటవీ జంతువులను చంపాలంటూ గ్రామస్తులను కోరారని ఫిర్యాదు చేశారు. అంతకుముందు వారు రాష్ట్ర ఛీప్ సెక్రటరీ ఎస్.పి.సింగ్‌ను కూడా కలిశారు. కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ పూర్వకాలంలో మనుషులు అడవి పంది మాంసం తినేవారని.. బ్రాహ్మణ కల్చర్ వచ్చిన తర్వాత ఆహారపు అలవాట్లు మారాయంటూ కామెంట్ చేశారు. తన మాటలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగటంతో కలెక్టర్ మురళి క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే.