Brutally attacks
-
చైనీయుడనుకుని సిక్కిం వాసిపై దాడి
బనశంకరి: సిక్కిం రాష్ట్రానికి చెందిన వ్యక్తిని చైనా పౌరునిగా భావించిన కొందరు దుండగులు అతన్ని తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన ఆగస్టు 16న బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. పశి్చమ సిక్కింలోని రించేస్పాంగ్‌కు చెందిన దినేశ్ సుబ్బా (31) ఏడు నెలలుగా బెంగళూరులోని ఒక రెస్టారెంటులో పనిచేస్తున్నాడు. 15వ తేదీ రాత్రి స్నేహితుల రూంలో పార్టీ చేసుకుని తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. చైనా వాడికి ఇక్కడేం పని అని దూషిస్తూ ఇనుపరాడ్‌తో కొట్టారు. తీవ్రంగా గాయపడిన దినేశ్ సుబ్బా రోడ్డుపై పడి ఉండగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
దారుణం: ‘మా అమ్మాయినే వేధిస్తావా?’ మెడకు బెల్ట్ బిగించి..
భోపాల్: బంధువుల అమ్మాయిని వేధించారని ఓ యువకుడిపై కొందరు దారుణంగా ప్రవర్తించారు. మెడకు బెల్ట్ బిగించి గొడ్డును లాక్కెళ్లినట్లు లాక్కెళ్లారు. లాక్కెళ్తూనే తీవ్రంగా దాడి చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో భయోత్పాతం కలిగిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. రేవా జిల్లాలో బల్దావ్ జాదవ్ (28) ఓ యువతిని వేధించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ అమ్మాయి తరఫు వారు బల్దావ్‌ను ముగ్గురు వెంట పట్టుకుని వచ్చారు. నిర్మానుష్య ప్రాంతంలో అతడి మెడకు బెల్ట్ కట్టేశారు. చదవండి: యువతకు గుడ్‌న్యూస్.. నిరుద్యోగ భృతి, 80 శాతం ఉద్యోగాలు మీకే.. ఒకరు బెల్ట్‌తో బల్దావ్‌ను పట్టుకుని నిల్చుని ఉండగా మరొకరు కర్రలతో దాడి చేస్తున్నాడు. ఇంకొకరు ఆ దృశ్యాలను వీడియో తీస్తున్నాడు. విచక్షణా రహితంగా జాదవ్‌పై దాడి చేశారు. తీవ్ర రక్తగాయాలైనా కూడా కొట్టారు. తర్వాత బెల్ట్ తీసి పెద్ద కర్రలతో దాడి చేశారు. ఇంకోసారి వెంటపడతావా? అని ప్రశ్నించగా ‘లేదు.. ఇంకోసారి’ రాను అంటూ ఆ యువకుడు రోదిస్తూనే చెబుతున్నాడు. అతడిని హెచ్చరించి పంపించివేశారు. దాదాపు మూడు నిమిషాల పాటు చిత్రహింసలు పెట్టారు. దానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. చదవండి: డ్రగ్స్ వార్.. మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా స్వీకరణ ఈ వీడియో చూసిన పోలీసులు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారు. నిందితులు ముగ్గురు పరారయ్యారని అదనపు సూపరింటెండెంట్ పోలీస్ శివ్‌కుమార్ వర్మ తెలిపారు. ఆ వీడియో 8-10 రోజుల కిందటదని చెప్పారు. వారెవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
ఆరేళ్ల పాపపై పైశాచికం
అహ్మదాబాద్: ఆరేళ్ల పసిపాపపై ఓ దుర్మార్గుడు పైశాచికత్వం ప్రదర్శించాడు. చిన్నారి మర్మావయవాల్లోకి ఇనుప రాడ్‌ను చొప్పించి రాక్షసుడిలా ప్రవర్తించాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సోలా ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన సెక్యూరిటీ గార్డ్ కౌశాల్ అనిల్‌సింగ్ చౌహాన్(24) ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇతడు గతంలో సోలా ప్రాంతంలోనే పనిచేశాడు. ఆ సమయంలో పాప తల్లిదండ్రులతో గొడవ లు జరిగాయి. ఈ కారణంగానే పాపను శారీరకంగా హింసించాడని పోలీసులు తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శనివారం చౌహాన్‌ను కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో మహిళా సురక్ష సమితి అనే ఎన్జీవోకు చెందిన 50 మంది సభ్యులు అతడిని చితకబాదారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ఉద్దేశం తమకు లేదని, అయితే ఈ కోర్టులు, పోలీసులు మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించలేకపోతున్నప్పుడు సహనం నశిస్తోందని ఎన్జీవో వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీ భట్ చెప్పారు. ఇప్పటిదాకా ఇలా 27 మంది కామాంధులకు దేహశుద్ధి చేసినట్లు తెలిపారు.