చైనీయుడనుకుని సిక్కిం వాసిపై దాడి | Sikkim Man Called Chinese and Brutally Thrashed in Bengaluru | Sakshi
Sakshi News home page

చైనీయుడనుకుని సిక్కిం వాసిపై దాడి

Published Sun, Aug 20 2023 6:37 AM | Last Updated on Sun, Aug 20 2023 6:37 AM

Sikkim Man Called Chinese and Brutally Thrashed in Bengaluru - Sakshi

బనశంకరి: సిక్కిం రాష్ట్రానికి చెందిన వ్యక్తిని చైనా పౌరునిగా భావించిన కొందరు దుండగులు అతన్ని తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన ఆగస్టు 16న బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌సిటీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. పశి్చమ సిక్కింలోని రించేస్పాంగ్‌కు చెందిన దినేశ్‌ సుబ్బా (31) ఏడు నెలలుగా బెంగళూరులోని ఒక రెస్టారెంటులో పనిచేస్తున్నాడు.

15వ తేదీ రాత్రి స్నేహితుల రూంలో పార్టీ చేసుకుని తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. చైనా వాడికి ఇక్కడేం పని అని దూషిస్తూ ఇనుపరాడ్‌తో కొట్టారు. తీవ్రంగా గాయపడిన దినేశ్‌ సుబ్బా రోడ్డుపై పడి ఉండగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement