Electronics City
-
చైనీయుడనుకుని సిక్కిం వాసిపై దాడి
బనశంకరి: సిక్కిం రాష్ట్రానికి చెందిన వ్యక్తిని చైనా పౌరునిగా భావించిన కొందరు దుండగులు అతన్ని తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన ఆగస్టు 16న బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. పశి్చమ సిక్కింలోని రించేస్పాంగ్‌కు చెందిన దినేశ్ సుబ్బా (31) ఏడు నెలలుగా బెంగళూరులోని ఒక రెస్టారెంటులో పనిచేస్తున్నాడు. 15వ తేదీ రాత్రి స్నేహితుల రూంలో పార్టీ చేసుకుని తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. చైనా వాడికి ఇక్కడేం పని అని దూషిస్తూ ఇనుపరాడ్‌తో కొట్టారు. తీవ్రంగా గాయపడిన దినేశ్ సుబ్బా రోడ్డుపై పడి ఉండగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
రాజధానిలో తొమ్మిది ప్రత్యేక నగరాలు
‘మాస్టర్‌ప్లాన్’లో ఇవే అమరావతికి ఆకర్షణలు సాక్షి, విజయవాడ బ్యూరో : రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో వివిధ రంగాలకు సంబంధించి తొమ్మిది ప్రత్యేక (థీమ్ సిటీలు) నగరాలను ప్రతిపాదించారు. దేనికదే ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న వీటిని అమరావతికే ఆకర్షణ అని చెబుతున్నారు. గవర్నమెంట్ సిటీ 564 హెక్టార్లలో నిర్మించే ప్రభుత్వ నగరంలో రెండు టౌన్‌షిప్‌లు నిర్మించనున్నారు. అసెంబ్లీ, సచివాలయం, ముఖ్యమంత్రి నివాసం, రాజ్‌భవన్, విభాగాధిపతుల కార్యాలయాలను ఈ నగరంలో నిర్మిస్తారు. అసెంబ్లీ భవనాన్ని అత్యద్భుత రీతిలో నిర్మించి పర్యాటకులను ఆకర్షించాలని ప్రతిపాదించారు. జస్టిస్ సిటీ ప్రభుత్వ నగరానికి దక్షిణం వైపున జస్టిస్ సిటీని నిర్మించనున్నారు. కోర్టులు, వాటి అనుబంధ సౌకర్యాలతో 566 హెక్టార్లలో ఈ నగరాన్ని ఏర్పాటు చేస్తారు. ఫైనాన్స్ సిటీ వాటర్‌ఫ్రంట్‌కు ఎదురుగా ఆర్థిక కార్యకలాల కేంద్రమైన సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌ను ఫైనాన్స్ సిటీ పేరుతో ఏర్పాటు చేస్తారు. 566 హెక్టార్లలో నిర్మితమయ్యే ఈ నగరంలో వాణిజ్య భవనాలు, బహుళ ప్రయోజన అభివృద్ధి కార్యకలాపాల కేంద్రాలుంటాయి. రాజధాని నగరంలోని అన్ని ప్రాంతాల వారు ఇక్కడికి చేరుకునేందుకు అనువుగా రెండు ఎంఆర్టీ (మెట్రో) లైన్లు ప్రతిపాదించారు. వాటర్‌ఫ్రంట్ ప్లాజా, రిక్రియేషనల్ ఐల్యాండ్ నగరంలో ప్రత్యేక ఆకర్షణలుగా తీర్చిదిద్దనున్నారు. వాటర్‌ఫ్రంట్ ప్లాజాలో రెండు ఐకానిక్ టవర్లుంటాయి. నాలెడ్జ్ సిటీ జస్టిస్, ఆర్థిక నగరాలకు దక్షిణం వైపు విద్య, విజ్ఞాన నగరాన్ని ప్రతిపాదించారు. నాలెడ్జ్ పార్కు, హౌసింగ్ యూనివర్సిటీ క్యాంపస్, పలు కళాశాలలతో 1,445 హెక్టార్లలో ఈ నగరం ఏర్పాటవుతుంది. 2050 నాటికి ఈ నగరంలో 1.20 లక్షల ఉద్యోగాల కల్పనతోపాటు 5,73,575 మంది నివాసం ఉండేలా తీర్చిదిద్దాలనేది లక్ష్యం. ఎలక్ట్రానిక్స్ సిటీ దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ఈ నగరంలో నెలకొల్పాలని లక్ష్యం. 731 హెక్టార్లలో నిర్మించే ఈ నగరంలో 2,73,500 నైపుణ్య ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యం నిర్దేశించారు. హెల్త్ సిటీ 1,349 హెక్టార్లలో నిర్మించే హెల్త్ సిటీలో 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది లక్ష్యం. స్పోర్ట్స్ సిటీ క్రీడా నగరంలో భారీ స్టేడియాలు, ఈవెంట్ కేంద్రాలు, అంతర్జాతీయ స్థాయి క్రీడా కేంద్రాలను నెలకొల్పుతారు. 650 హెక్టార్లలో ఈ నగరాన్ని నిర్మిస్తారు. మీడియా సిటీ అనంతవరం సమీపంలో మీడియా, కల్చరల్ నగరాన్ని 677 హెక్టార్లలో నిర్మించనున్నారు. సాంస్కృతిక, కళా కేంద్రాలు ఏర్పాటు చేసి 1.5 లక్షల మందికి వాటిల్లో ఉద్యోగాలు కల్పించాలని పేర్కొన్నారు. టూరిజం సిటీ ఉండవల్లి గుహల మీదుగా కృష్ణానదికి అభిముఖంగా 531 హెక్టార్లలో పర్యాటక నగరాన్ని నిర్మిస్తారు. వాటర్ టూరిజం ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. -
రంగాలవారీగా రాజధాని అభివృద్ధి
-
రంగాలవారీగా రాజధాని అభివృద్ధి
♦ రాజధానిలో పరిపాలన, ఆధ్యాత్మిక, పర్యాటక, క్రీడా తదితర నగరాల నిర్మాణం ♦ ఏ గ్రామంలో ఏ నిర్మాణం అనేదానిపై స్పష్టమైన ప్రతిపాదనలు ♦ ఐదు దశల్లో పది విభాగాల పూర్తికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన సర్కారు సాక్షి, విజయవాడ బ్యూరో: కొత్త రాజధాని అమరావతి దశ, దిశను నిర్దేశించడంలో పది ప్రాధాన్యతలను గుర్తించి దశలవారీగా నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాజధాని గ్రామాలను పరిపాలన, విద్య, వైద్యం, ఆధ్యాత్మిక, క్రీడలు, టూరిజం తదితర రంగాల్లో ప్రత్యేక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనుంది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో కొన్నింటికి మాత్రమే కీలక నిర్మాణాలను పరిమితం చేశారు. మిగిలిన గ్రామాలకు సంబంధించి ఏ గ్రామంలో ఏ ప్రత్యేక విభాగం అభివృద్ధి చేయనున్నది తాజాగా గుర్తించారు. మొత్తం ఐదు దశల్లో పది విభాగాల అభివృద్ధికి సర్కారు కార్యాచరణ రూపొందించింది. వివరాలివీ.. ► రాయపూడి ప్రాంతంలో రాజ్‌భవన్, అసెంబ్లీ, సచివాలయం, శాఖల కమిషరేట్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ క్వా ర్టర్స్, ప్రభుత్వ అతిథిగృహాలను నిర్మిస్తారు. ► అనంతవరాన్ని ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చేస్తారు. ► కృష్ణాయపాలెంలో ప్రభుత్వ, ప్రైవేటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులతోపాటు ప్రత్యామ్నాయ వైద్య విధానం, వైద్య సంస్థలు, అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రుల(మెడికల్ సిటీ)ను ఏర్పాటు చేస్తారు. ► ఐనవోలులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, వృత్తివిద్యా కళాశాలలు, ఇంటర్నేషనల్ స్కూల్స్, టెక్నాలజీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లు, బిజినెస్ స్కూల్స్, బేసిక్ ఆర్ అండ్ డి సంస్థలు(విద్యా నగరం) నిర్మాణానికి ప్రతిపాదించారు. ► ఉండవల్లిలో ఐకాన్ టవర్లు, వంతెనలు, మ్యూజియంలు, రివర్ ఫ్రంట్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్(పర్యాటక నగరం)ను అభివృద్ధికి ప్రతిపాదన చేశారు. ► అబ్బిరాజుపాలెంను స్పోర్ట్స్ యూనివర్సిటీ, అథ్లెటిక్స్ స్టేడియాలు, స్పోర్ట్స్ అకాడమీలు, ఆక్వాటెక్ స్టేడియాలు, మల్టీపర్సస్ స్టేడియాలు, ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియాలు, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గోల్ఫ్‌కోర్స్ నిర్మాణాలతో క్రీడానగరంగా తీర్చిదిద్దే ప్రతిపాదన చేశారు. ► ఉద్ధండరాయునిపాలెంలో ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకులతోపాటు ఇంటర్నేషనల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ సంస్థల(ఆర్థిక నగరం)ను ఏర్పాటు చేస్తారు. ► నేలపాడులో హైకోర్టు, ట్రిబ్యునళ్లు, న్యాయ యూనివర్సిటీ, న్యాయసంస్థలు, లోకాయుక్త ప్రధానమైన సంస్థల(న్యాయ నగరం)ను ఏర్పాటు చేస్తారు. ► శాఖమూరులో పరిశోధన, అభివృద్ధి, ఐటీ, ఐటీఈఎస్, ఏరోస్పేస్ రీసెర్స్, బయోటెక్, మెడికల్ రీసెర్చ్‌తోపాటు టెక్నాలజీ ఇంక్యుబేటర్స్(నాలెడ్జ్ సిటీ) ఏర్పాటు చేస్తారు. ► బేతపూడిలో సెల్యులర్ ఫోన్లు, ఆడియో, వీడియో అప్లయన్సెస్, సౌరశక్తి ఉత్పాదన సామాగ్రి, సెమీ కండక్టర్లు, సెన్సర్లు, గృహోపకరణాలు తయారు(ఎలక్ట్రానిక్స్ సిటీ) వంటివి ఏర్పాటు చేయనున్నారు. -
ఓఆర్ఆర్ బయటకూ విస్తరించిన రియల్ బూమ్
ప్రస్తుతం హైదరాబాద్ జనాభా 80 లక్షలకు పైమాటే. 2041 నాటికి ఈ సంఖ్య 2.50 కోట్లు దాటుతుందని అంచనా. ఈ నేపథ్యంలో నగరంపై పడే ఒత్తిడిని తట్టుకోవాలంటే శివార్లలో చిన్న నగరాల నిర్మాణం అవసరమంటున్నారు నిపుణులు. త్వరలోనే దాదాపు 160 కి.మీ. పొడవునా నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ఓఆర్ఆర్ చుట్టూ ఒక్కో నగరం 3,813 చ.కి.మీ. విస్తీర్ణంలో మొత్తం 13 మినీ నగరాలను నిర్మించేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. శంషాబాద్ లో మెడికల్ సిటీ, కీసరలో నాలెడ్జ్ సిటీ, ఘట్కేసర్లో ఐటీ సాఫ్ట్వేర్ సిటీ, గుండ్లపోచంపల్లిలో బయో, ఫార్మా సిటీ, బొంగ్లూరులో ఐటీ హార్డ్‌వేర్ , ఎలక్ట్రానిక్స్ సిటీ, శామీర్‌పేటలో రిక్రియేషన్ సిటీ, కోకాపేట్లో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సిటీ, పటాన్చెరులో మీడియా సిటీ/ మార్కెట్ సెంటర్, ఆదిభట్ల, తక్కుగూడలో ఎయిరోస్పేస్ సిటీ, మేడ్చల్, తెల్లాపూర్-నాగులపల్లిలో ఇన్‌ల్యాండ్ కాంటినెంటల్ డిపోలు రానున్నాయి. దీంతో ఇప్పటివరకు ఓఆర్ఆర్ లోపల ఉన్న రియల్ బూమ్ కాస్త ఓఆర్ఆర్ వెలుపలి ప్రాంతాలకూ విస్తరించిందని కాడోల్ ప్రాపర్టీస్ పార్టనర్ విక్రమ్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఐటీ హబ్‌కు నేరుగా రవాణా వ్యవస్థ ఉన్న తెల్లాపూర్, కొల్లూరుల్లో అభివృద్ధి మరింత శరవేగంగా సాగుతోందన్నారు. డెరైక్ట్ కనెక్టివిటీ: ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే మెరుగైన రవాణా వ్యవస్థ, ధరలు అందుబాటులో ఉంటేనే సాధ్యం. ఈ విషయంలో కొల్లూర్ మాత్రం ముందు వరుసలోనే ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు 15 నిమిషాల్లో, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు, మెహదీపట్నానికి 25 నిమిషాల్లో, ఓఆర్ఆర్ (ఎగ్జిట్ నం:2) 5 నిమిషాల ప్రయాణ వ్యవధిలోనే ఉందీ ప్రాంతం. గచ్చిబౌలి, కోకాపేట్ పరిసరాల్లో స్థిరాస్తి ధరలు ఎక్కువగా ఉండటంతో ఉద్యోగులు సుదూర ప్రాంతాల నుంచి గంటల కొద్దీ ప్రయాణం చేస్తూ గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల్లోని కార్యాలయాలకు చేరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొనుగోలుదారులకు, పెట్టుబడిదారులకు స్థిరాస్తి రంగంలో కొత్త పెట్టుబడి ప్రాంతంగా అవతరించింది కొల్లూరు. కొల్లూరే బెటర్ చాయిస్: బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, హైటెక్ సిటీల్లో సొంతిల్లున్న వాళ్లు రెండో ఆస్తిగా బెంగళూరు, చెన్నై వంటి ఇతర నగరాలకు వెళ్లే వాళ్లు. కానీ, ప్రస్తుతం వారి రెండో ఆస్తిని కూడా తెల్లాపూర్, కొల్లూర్ ప్రాంతాల్లో ఉండేందుకే ఇష్టపడుతున్నారు. దీంతో ఇవి ఉన్నత శ్రేణి వర్గాలుండే ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో లక్షకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరికీ ప్రీమియం ఇళ్లను, షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్ వంటి వసతులను కల్పించేందుకు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. ధరలూ అందుబాటులో ఉండటం, మెరుగైన రవాణా వ్యవస్థ ఉండటంతో పెట్టుబడిదారుల దృష్టంతా ఇప్పుడు కొల్లూర్ పైనే. ఇప్పటికే కడోల్ ప్రాపర్టీస్, 9ఎం డెవలపర్స్, గోల్డెన్ గేట్ ప్రాపర్టీస్ వంటి నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి.