BSBDA
-
జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్లపై పరిమితులు ఎత్తేయాలి
న్యూఢిల్లీ: జీరో బ్యాలన్స్తో కూడిన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతాల నుంచి డిజిటల్ చెల్లింపులపై ఉపసంహరణ పరిమితులు ఎత్తివేయాలని ఐఐటీ బోంబే నివేదిక సూచించింది. ఈ ఖాతాలకు సంబంధించి విత్‌డ్రాయల్ పరిమితులు ఆర్బీఐ నియంత్రణల వెలుపల ఉండాలని అభిప్రాయపడింది. ఈ కామర్స్ లావాదేవీలపై 0.3 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటును ప్రభుత్వం అమలు చేసేందుకు అనుమతించాలి సూచించింది. 0.3 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) రూపంలో ఏటా రూ.5,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని, దీన్ని యూపీఐ సదుపాయాల బలోపేతానికి ఉపయోగించకోవచ్చని పేర్కొంది. డిజిటల్ పేమెంట్ ఫెసిలిటేషన్ ఫీజు మాదిరే ఈ కామర్స్ మర్చంట్స్, ఇనిస్టిట్యూషన్స్ నిర్వహించే డిజిటల్ లావాదేవీలపై ఎండీఆర్ విధించొచ్చని తెలిపింది. ‘‘ప్రస్తుత డిజిటల్ చెల్లింపుల దశకంలో.. డిజిటల్ చెల్లింపులను పాత తరానికి చెందిన సేవింగ్స్ డిపాజిట్ ఖాతాల ఉపసంహరణ పరిమితుల పరిధి నుంచి తొలగించాలి. కొన్ని బ్యాంక్‌లు లావాదేవీలపై నియంత్రణలు విధిస్తున్నాయి. ఉదాహరణకు ముంబైకి చెందిన ఒక బ్యాంక్ ఒక నెలలో బీఎస్‌బీడీ ఖాతాల నుంచి 10 సార్ల వరకే ఉపసంహరణలను పరిమితం చేసింది. సేవింగ్స్ ఖాతా అన్నది లావాదేవీల కోసం కాదు. కనీస పొదుపు కోసం. ధనిక, పేద మధ్య ఈ ఖాతాల విషయంలో వ్యత్యాసం చూపకూడదు. కావాలంటే ఖాతాలను బట్టి సర్వీజు చార్జీలు భిన్నంగా ఉండొచ్చు. అంతే కానీ, సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ల మధ్య ఉపసంహరణ లావాదేవీల పరంగా పరిమితులు విధించడం వివక్ష కిందకు వస్తుంది. సమానత్వ హక్కుకు భంగం కలిగిస్తుంది’’అని ఈ నివేదిక పేర్కొంది. -
సర్వీసు చార్జీల పేరుతో ఎస్బీఐ భారీగా వడ్డీంపు..!
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 2017-18 నుంచి అక్టోబర్ 2021 వరకు ఖాతాదారుల నుంచి సుమారు ₹346కోట్లను చార్జీల రూపంలో వసూలు చేసింది. ఉచిత సేవలకు మించి వినియోగదారులు అదనపు సేవలను వినియోగించినందుకు 2017-18 నుంచి అక్టోబర్ 2021 వరకు ₹345.84 కోట్లను ఎస్బీఐ వసూలు చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి భగవత్ కరద్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఆగస్టు 30, 2020 నాటి సీబీడీటీ మార్గదర్శకాల ప్రకారం.. రూపే డెబిట్ కార్డు, యుపీఐ, యుపీఐ క్యూఆర్ కోడ్ ఎలక్ట్రానిక్ మోడ్ లను ఉపయోగించి నిర్వహించే లావాదేవీలపై జనవరి 1, 2020న లేదా ఆ తర్వాత సేకరించిన ఛార్జీలను తిరిగి చెల్లించాలని, భవిష్యత్తు లావాదేవీలపై ఛార్జీలు విధించరాదని బ్యాంకులకు సలహా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆర్బిఐ మార్గదర్శకాల ప్రకారం.. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(పిఎమ్‌జెడివై) కింద తెరిచిన ఖాతాలతో సహా ప్రాథమిక సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా(బిఎస్‌బిడిఎ) తెరిచిన వినియోగదారులకు ఉచితంగా సేవలు అందిస్తుంది. అలాగే, వీరు బ్యాంకు ఖాతాలలో ఎలాంటి కనీస మొత్తం నిల్వ చేయాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం… ఖాతాదారులు ఖాతాల నుంచి నెలకు నాలుగు సార్లు ఏటీఎం ద్వారా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి తోడు బ్యాంకు ఏవైనా వాల్యూ యాడెడ్ సేవలు అందిస్తుంటే, వాటిపై ఎలాంటి చార్జీలు వసూలు చేయకూడదు. 2014 సెప్టెంబర్‌లో ఆర్బీఐ దీనికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఇది ఆయా బ్యాంకుల విచక్షణకు లోబడి ఉంటుందని చిన్న మెలిక పెట్టింది. దీనిని అడ్డుపెట్టుకుని బ్యాంకులు సామాన్య ప్రజానీకం ఉపయోగించే బీఎస్‌బీడీఏ, ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన ఖాతాలపై సర్వీసు చార్జీల పేరుతో ప్రత్యేక వడ్డింపులు మోపుతున్నాయి. (చదవండి: టయోటా వాహన కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్..!) -
State Bank of India: డిజిటల్ ఛార్జీల మోతపై క్లారిటీ ఇచ్చిన ఎస్బీఐ
State Bank of India Clarifies on Reports of Unpaid Refund: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) డిజిటల్ చెల్లింపుల అదనపు ఛార్జీల విషయంపై క్లారిటీ ఇచ్చింది. 2017 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2019 మధ్య కాలంలో డిజిటల్ చెల్లింపుల సమయంలో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(పిఎంజెడివై) ఖాతాదారుల నుంచి వసూలు చేసిన రుసుములో భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత ఇంకా తిరిగి ఇవ్వాల్సి ఉందని మీడియాలో వస్తున్న వార్తలపై ఎస్బిఐ వివరణ ఇచ్చింది. డిజిటల్ లావాదేవీల కోసం తన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్‌బీడీ) ఖాతాదారుల నుంచి ఎటువంటి లావాదేవీ రుసుమును వసూలు చేయమని ఎస్బిఐ ఒక ప్రకటనలో తెలిపింది. "ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఎస్బిఐ బీఎస్‌బీడీ ఖాతాదారుల నుంచి రుసుముల రూపంలో వసూలు చేసిన రూ.254 కోట్లలో కేవలం 90 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చింది. ఇంకా రూ.164 కోట్లను ఎస్బీఐ చెల్లించాల్సి ఉంది" అని ఐఐటీ-ముంబై తయారు చేసిన నివేదిక గత వారం తెలిపింది. ఈ కాలంలో ఒక్కో ఖాతా నుంచి బ్యాంకు రూ.17.70 వసూలు చేసినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ నివేదికపై ఎస్బిఐ స్పందిస్తూ.. “యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యుపీఐ), రూపే డెబిట్ కార్డ్‌లను ఉపయోగించే లావాదేవీలతో సహా ఇతర డిజిటల్ లావాదేవీలకు బీఎస్‌బీడీ ఖాతాదారులు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు" అని స్పష్టం చేసింది. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా బీఎస్‌బీడీ ఖాతాదారుల మొదటి నాలుగు విత్ డ్రాలకు ఎటువంటి ఛార్జీలు ఉండవని ఎస్బిఐ స్పష్టం చేసింది. (చదవండి: దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాల బ్యాన్..! నితిన్ గడ్కరీ క్లారిటీ!) -
ఎస్బీఐ : జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కస్టమర్లకు హెచ్చరిక. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు విధించే సేవా ఛార్జీలను సవరించింది. ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేయడం, చెక్‌బుక్, ఇతర ఆర్థిక లావాదేవీలకు జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తన వెబ్సైట్లో పేర్కొంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఇందులో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇతర అకౌంట్లలో అయితే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం తప్పనిసరి. ఒకవేల మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ హోల్డర్లకు బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు వస్తుంది. నెలలో నాలుగు సార్లు ఉచితంగా బ్యాంక్ బ్రాంచ్‌లో, ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు డ్రా చేస్తే సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీ రూ.15+జీఎస్టీ వర్తిస్తుంది. అంటే ఎస్బీఐ, నాన్ ఎస్బీఐ ఏటీఎంలల్లో, బ్రాంచ్‌లో కలిపి ఒక నెలలో నాలుగు సార్లు మాత్రమే డబ్బులు డ్రా చేసే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్స్ ఉచితంగా అందిస్తుంది. ఆ తర్వాత మరో 10 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.40+జీఎస్టీ, 25 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.75+జీఎస్టీ చెల్లించాలి. 10 చెక్స్‌తో ఎమర్జెన్సీ చెక్ బుక్ కావాలంటే రూ.50+జీఎస్టీ చెల్లించాలి. సీనియర్ సిటజన్లకు చెక్ బుక్‌పై కొత్త సర్వీస్ ఛార్జీ వర్తించదు. ఇక ఎస్బీఐ, నాన్ ఎస్బీఐ బ్రాంచ్‌లల్లో ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులు జరిపే నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించరు. చదవండి: ఐఎఫ్ఎస్సీ కోడ్లను అప్డేట్ చేసుకోండి -
గుడ్‌న్యూస్ : నో మినిమం బ్యాలెన్స్
సాక్షి, ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలు (బీఎస్‌బీడీఏ), లేదా నో ఫ్రిల్స్ అకౌంట్స్‌గా పిలిచే ఖాతాల్లో కనీస నగదు నిల్వ ఉండాలన్న నిబంధనను ఎత్తివేసింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు విత్ డ్రాలపై నిబంధనలను కూడా సడలించింది. నెలకు 4 సార్లు బ్యాంకులు, ఏటీఎంల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే బ్యాంకు ఖాతాల్లో ఎన్నిసార్లైన డిపాజిట్ చేసుకునే సదుపాయంతోపాటు ఉచిత ఏటీఎం లేదా డెబిట్ కార్డు జారీ, యాక్టివేషన్ ఛార్జీలు వసూలు చేయరాదని ఆదేశించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు కేంద్ర బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధనను ఇప్పుడు కేంద్ర బ్యాంకు తొలగించింది. వీరికి కనీస సదుపాయాలకు తోడు చెక్‌బుక్‌తో పాటు ఇతర సేవలనూ ఉచితంగా పొందే అవకాశం ఇప్పుడు ఆర్బీఐ కల్పించింది. అయితే ఈ సదుపాయాలు కల్పిస్తున్నందుకు గాను వారినుంచి మినిమం బాలెన్స్ చార్జీలు వసూలు చేయరాదని ఆర్బీఐ పేర్కొంది అయితే బీఎస్‌బీడీ ఖాతాకు సంబంధించి ఎటువంటి చార్జీ లేకుండానే ఏటీఎం కార్డు, పాస్‌పుస్తకం లభిస్తుంది. ఖాతా ఉన్న ఖాతాదారులు మరి ఏ ఇతర ఖాతాను కలిగి వుండడానికి వీల్లేదు. ఒక వేళ వుంటే అకౌంట్‌ను ఓపెన్ చేసిన 30 రోజుల వ్యవధిలోనే సదరు ఖాతాను మూసి వేయాల్సి వుంటుంది. అంతేకాదు నో ఫ్రిల్ ఖాతాలను తెరవడానికి ముందే...తనకు ఇతర బ్యాంకుల్లో బీఎస్‌బీడీ ఖాతా ఏదీ లేదని ధృవీకరణ కూడా చేయాల్సి వుంది. -
ఆ ఖాతాలపై భారీగా చార్జీల బాదుడు
సాక్షి, ముంబై: నో ఫ్రిల్స్ (జీరో బ్యాలెన్స్) బ్యాంకు ఖాతాలనుంచి కూడా కొన్ని బ్యాంకులు భారీగా చార్జిలను బాదేస్తున్నాయని తాజా నివేదిక తేల్చింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్‌బీడీఏ) ఖాతాలనుంచి నిబంధనలకు విరుద్ధంగా చార్జీలను వసూలు చేస్తున్నాయని ఐఐటీ బోంబే ప్రొఫెసర్ ఆశిష్‌దాస్ నివేదించారు. నెలలో నాలుగు విత్ డ్రాలు మించితే ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా సదరు ఖాతాదారులపై పెనాల్టీని భారీగా విధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం రూపకల్పనలో ఉన్న లోపాల కారణంగా బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి మరీ కస్టమర్లపై అధిక చార్జీలను విధిస్తున్నాయంటూ ఓ నివేదికను రూపొందించి ఆశిష్‌దాస్ విడుదల చేశారు. కస్టమర్ ఐదో డెబిట్ లావాదేవీ నిర్వహించిన వెంటనే బ్యాంకులు స్వచ్ఛందంగా ఆయా ఖాతాల్ని అధిక బ్యాలన్స్ నిర్వహణ, చార్జీలు ఉండే సాధారణ ఖాతాలుగా మార్చేస్తున్నాయని ఆశిష్‌దాస్ తన నివేదికలో పేర్కొన్నారు. ఇలా స్వచ్చందంగా ఖాతాల్ని మార్చడానికి ఆర్బీఐ చెక్ పెట్టాలని ఆయన కోరారు. ప్రస్తుతం నాలుగు ఉపసంహరణల తరువాత, వినియోగదారుడు ఆన్లైన్ కొనుగోళ్లను చేయలేక పోతున్నారన్నారు. భీమ్ యాప్‌ద్వారా లేదా రూపే డెబిట్ కార్డు ద్వారా డబ్బు బదిలీ లేదా రోజువారీ కొనుగోళ్లకు ఉపయోగించుకోలేకపోతున్నారని తెలిపారు. తక్కువ నగదు ఉన్న ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా బీఎస్‌బీడీఏ ఖాతాలో నెలవారీ కనీస లావాదేవీలపై నియంత్రణలు తొలగించాలని కూడా సూచించారు. నాలుగో ఉపసంహరణ తర్వాత బీఎస్‌బీడీఏ కస్టమర్లు ఐదో ఆన్లైన్ లావాదేవీకి అవకాశం లేని విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అంతేకాదు ఇది డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహ కార్యక్రమానికి ప్రతికూలమని కూడా ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సేవలను అందరికీ దగ్గర చేయాలని తీసుకొచ్చిన పథకం బీఎస్‌బీడీఏ ఖాతా. వాస్తవానికి బీఎస్‌బీడీఏ ఖాతాల్లో కనీస బ్యాలన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. ఖాతాదారులకు ఉపసంహరణలకు పరిమితి ఉంది కానీ, డిపాజిట్లపై పరిమితి లేదు. కానీ, ఈ ఖాతా నిర్వహణ విషయంలో కొన్ని పరిమితులను ఆయుధంగా మార్చుకున్న బ్యాంకులు ఖాతాదారులకు చెప్పకుండానే రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాగా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా నెలలో నాలుగు సార్లకు మించి ఉపసంహరణలు జరిగితే ఐదో ఉపసంహరణ జరిగిన తక్షణమే బ్యాంకులు ఆయా ఖాతాలను పొదుపు ఖాతాలుగా మార్చేసి, చార్జీల బాదుడుకు సిద్ధపడుతున్నాయి. అంటే సాధారణ సేవింగ్ ఖాతాల్లోలాగా హై మినిమం బ్యాలెన్స్, సర్వీస్ చార్జీలను వర్తింపచేస్తుందన్నమాట. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయాలన్న లక్ష్యంతో 2012లో ఆర్బీఐ బీఎస్‌బీడీఏ పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 54 కోట్ల బీఎస్‌బీడీఏ ఖాతాలు ఉండగా, వీటిలో సగానికిపైగా ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన ఖాతాలే కావడం విశేషం. -
విదేశీ బ్యాంకుల్లో సైతం జీరో బ్యాలెన్స్ అకౌంట్లు
ముంబై: మారుమూల ప్రాంతాల ప్రజలతోసహా దేశంలోని అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్య సాకారం దిశలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం బలహీన వర్గాలకు చెందిన పేదలు సైతం ఇకపై విదేశీ బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను తెరవవచ్చు. ఈ మేరకు ఆర్బీఐ బుధవారం ఒక ప్రకటన జారీచేసింది. ‘తన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్‌బీడీఏ) మార్గదర్శకాలు భారత్‌లో బ్రాంచీలు కలిగిన విదేశీ బ్యాంకులు సహా అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు వర్తిస్తాయని ఆర్బీఐ పేర్కొంది. దీనితో పేదలు సైతం హెచ్ఎస్బీసీ, సిటీబ్యాంక్, స్టాండెర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వంటి విదేశీ బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్లను ప్రారంభించి, ఉచిత ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ సౌలభ్యాన్ని పొందడానికి మార్గం సుగమం అయ్యింది. నమోదు చేసుకోని ఎన్బీఎఫ్సీలపై చర్యలు నియంత్రణ సంస్థలో రిజిస్టర్ చేసుకోకుండా డిపాజిట్లు సమీకరిస్తున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై (ఎన్బీఎఫ్సీ) కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ జనరల్ మేనేజర్ (నాన్ బ్యాంకింగ్ విభాగం) అర్చన మంగళగిరి హెచ్చరించారు. బాంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం 1,263 ఎన్బీఎఫ్సీలు ఉండగా.. 96 సంస్థలు ఆర్బీఐ దగ్గర రిజిస్టరు చేసుకోకుండానే డిపాజిట్లు సమీకరిస్తున్న సంగతి వెల్లడైందని అర్చన పేర్కొన్నారు. నోట్ల దండలు వద్దు... కరెన్సీ నోట్లతో దండలు చేసి వాడవద్దని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రజలను కోరింది. పెళ్లిళ్లు, పెద్ద పెద్ద రాజకీయ ర్యాలీలు, మతపరమైన, ఇతర సందర్భాల్లో నోట్ల దండలను ఉపయోగించడం రివాజుగా మారిందని, దీనిని నివారించాలని ఆర్బీఐ తాజా ప్రకటన వెల్లడించింది. కరెన్సీ నోట్లను దండలుగా చేయడంవల్ల వాటి రూపం మారిపోతుందని, వాటి మన్నిక తగ్గుతుందని పేర్కొంది. దేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా కరెన్సీ నోట్లను గౌరవించాలని, వాటిని దుర్వినియోగం చేయవద్దని సూచించింది. నోట్లు ఎక్కువ కాలం చలామణిలో ఉండేలా వాటిని జాగ్రత్తగా వినియోగించాలని పేర్కొంది. మంచి కరెన్సీ నోట్లను దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలందరూ ఆర్బీఐ మంచి నోట్ల విధానానికి తగిన విధంగా సహకరించాలని కోరింది.