BSNL cell tower
-
బీఎస్ఎన్ఎల్ చవకైన ప్లాన్.. రూ.275 ప్లాన్‌తో 3300జీబీ.. ఆఫర్ లాస్ట్ డేట్ ఇదే!
BSNL Rs.275 Broadband Plan: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day 2022) సందర్భంగా తమ కస్టమర్ల కోసం అదరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం చవకైన ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. తక్కువ ధరలో అధిక ప్రయోజనాలు యూజర్లకు కలిగే విధంగా ఈ ప్లాన్‌ని ప్రకటించింది. అయితే ఈ ప్లాన్ పరిమిత కాలమే ఉంటుందన్న బీఎస్ఎన్ఎల్ తాజాగా ఆ ఆఫర్ చివరి తేదీని వెల్లడించింది. ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకోసం సరికొత్త ప్లాన్ రూ. 275 బీఎస్ఎన్ఎల్(BSNL) తన ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకోసం సరికొత్త ప్లాన్ రూ.275ను ప్రకటించింది. ప్రత్యేకంగా ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 60 Mbps స్పీడ్‌తో 3300జీబీ (3.3TB) వరకు డేటా లభిస్తుంది. అయితే ఇది ప్రమోషనల్ ప్లాన్ కాబట్టి, ఈ ఆఫర్ పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక ప్లాన్‌ను అక్టోబర్ 13వ తేదీ వరకే అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తాజాగా ప్రకటించింది. అంటే ఈ రూ.275 ప్లాన్ బెనిఫిట్స్ పొందాలంటే అక్టోబర్ 13వ తేదీలోగా రీచార్జ్ చేసుకోవాలి. కొత్త కస్టమర్లు, ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వాడుతున్న కస్టమర్లు కూడా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. రూ.275 భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వివరాలు ఇవే బీఎస్ఎన్ఎల్ రూ.275 ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఆఫర్ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు ఆఫ్షన్లకు కూడా వ్యాలిడిటీ మాత్రం 75 రోజులు ఉంటుంది. డేటా కూడా 3.3టీబీ(3.3TB) అంటే 3,300జీబీ వరకు డేటా లభిస్తుంది. అయితే ఇందులో ఓ ఆప్షన్‌కి 30Mbps, మరో ఆప్షన్‌కి 60Mbps స్పీడ్ లభిస్తుంది. వినియోగదారులు ఈ ప్లాన్‌లో తమకు నచ్చిన ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. డేటా కోటా పూర్తవగానే 2Mbps స్పీడ్‌తో ఇంటర్నెట్ వస్తుంది. చదవండి: టెన్షన్ పెడుతున్న కొత్త రకం బ్యాంకింగ్ వైరస్.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులూ జాగ్రత్త! -
సెల్ టవర్ పేల్చేసిన మావోయిస్టులు
వెంకటాపురం(కె): జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం(కె) మండలం ఎదిరలో మావోయిస్టులు ఆదివారం అర్ధరాత్రి బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్‌ను పేల్చివేశారు. ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా ఈ నెల 5న మావోయిస్టు పార్టీ దండ కారణ్యం– తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఆర్అండ్ బీ ప్రధాన రహదారి పక్కన ఉన్న సెల్‌టవర్‌ను అర్ధరాత్రి 11.40 గంటలకు పేల్చివేశారు. 60 మంది సాయుధులైన మావోయిస్టులతో పాటు 150 మందికిపైగా గొత్తికోయలు విల్లంబులు ధరించి పాల్గొన్నట్లు తెలిసింది. గ్రామంలోకి రాత్రి ప్రవేశించిన మావోయిస్టులు గంటకుపైగా హల్చల్ చేసినట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలాల మధ్య వచ్చివెళ్లే వాహనాలను గంటపాటు నిలిపివేసి రోడ్డును దిగ్బంధించినట్లు తెలిసింది. ఆరోగ్య ఉపకేంద్రం వద్ద బ్యాటరీతో టవర్‌ను పేల్చివేశారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించి నినాదాలు చేస్తూ అర్ధరాత్రి 12.30 గంటలకు అడవిలోకి వెళ్లిపోయారు. -
మిర్యాలగూడలో సెల్ టవర్ ఎక్కిన యువకుడు
మిర్యాలగూడ (నల్గొండ జిల్లా): నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఒక యువకుడు ఆదివారం మధ్యాహ్నం బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కాడు. దామచర్ల మండలం తిమ్మాపురం గ్రామం తూర్పు తాండాకు చెందిన రాము మిర్యాలగూడలోని ఎన్ఎస్సి క్యాంప్‌లో ఉన్న మణికంఠ హోటల్లో పనిచేసేవాడు. కొద్దిరోజుల క్రితం హోటల్ యజమానితో పొసగక మానేశాడు. తనకు చెందిన స్టవ్‌ను తీసుకెళ్లాడు. దాంతో ఆగ్రహించిన హోటల్ యజమాని లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదుచేసి స్టవ్ చోరీ చేశాడని కేసు పెట్టాడు. దాంతో పోలీసులు రామును పోలీస్‌సేస్టేషన్ తీసుకెళ్లి వాళ్ల రీతిలో ట్రీటేమెంట్ ఇచ్చారు. దాంతో ఆవేదనకు గురైన రాము హోటల్ యజమాని కేసు పెట్టడంవల్లే ఇదంతా అయిందని ఆదివారం మధ్యాహ్నం సెల్ టవర్ ఎక్కాడు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ద్గమని నచ్చచెబుతున్నారు. అయినా తను ససేమిరా అంటున్నాడు. -
సరిహద్దుకు భారీగా బలగాలు
చర్ల : సత్యనారాయణపురంలోని బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకున్న కాల్పుల ఘటనతో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. సరిహద్దులోని అటవీప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. సోమ, మంగళవారాల్లో సరిహద్దు ప్రాంతానికి చేరుకున్న గ్రేహౌండ్స్, డిస్ట్రిక్ట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్, సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి. ఒక్కసారిగా భారీగా బలగాలు చేరుకోవడంతో సరిహద్దుల్లోని ఆదివాసీ గ్రామాల గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. సత్యనారాయణపురం కాల్పుల ఘటనలో పాల్గొన్న మావోయిస్టులు, మిలిటెంట్లు, మిలీషియా సభ్యుల ఆచూకీ కోసం తీవ్రంగా బలగాలు శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సరిహద్దు ప్రాంతాల్లోని ఎర్రంపాడు, చెన్నాపురం, బత్తినపల్లి, కుర్నపల్లి, ఎర్రబోరు, బోదనెల్లి, కురకట్‌పాడు, డోకుపాడు, తిప్పాపురం తదితర గ్రామాలలోని ఆదివాసీలను వారు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులకు ఆదివాసీలు సహకరించవద్దని, ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బందులు కల్గించే వారికి సహకరించి ఇబ్బందులు తెచ్చుకోవద్దంటూ ఆదివాసీలకు పోలీసులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివాసీ గ్రామాల నుంచి ప్రజలు వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. -
చిట్ డబ్బులు ఇవ్వలేదని సెల్ టవర్ ఎక్కి..
వ్యక్తి ఆత్మహత్యాయత్నం గంటపాటు హైడ్రామా మేనేజర్ హామీతో కథ సుఖాంతం నర్సీపట్నం, న్యూస్‌లైన్ : తనకు రావలసిన సొమ్ము చెల్లింపులో ఓ ప్రైవేటు చిట్‌ఫండ్ కంపెనీ వేధిస్తోందంటూ ఒక వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విశాఖజిల్లా నర్సీపట్నానికి చెందిన గొర్లి లక్ష్మీనారాయణ(35) స్టీల్సామగ్రి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పట్టణంలోని శ్రీరామ్ చిట్స్ కంపెనీలో రూ.5లక్షల చీటీ కడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రెండు నెలల క్రితం చీటీ పాడుకున్నాడు. కంపెనీ నిబంధనల ప్రకారం ముగ్గురు వ్యక్తుల ష్యూరిటీతో పాటు రూ.లక్ష డిపాజిట్ కూడా చేశాడు. మరో ష్యూరిటీ కావాలని కంపెనీ ప్రతినిధులు నిబంధన విధించడంతో మనస్థాపానికి గురయ్యాడు. దీంతో బుధవారం సాయంత్రం వీర్రాజు థియేటర్ సమీపంలోనిబీఎస్ఎన్ఎల్ సెల్‌టవర్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమందించడంతో పట్టణ ఎస్ఐ అప్పారావు సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. భార్యాపిల్లలు కిందకు రావాలని వేడుకున్నారు. శ్రీరామ్ చిట్స్ మేనేజర్ వచ్చి చీటీ మొత్తాన్ని ఇస్తానని హామీ ఇచ్చేవరకు కిందకు దిగనని మొండికేశాడు. గంటపాటు సెల్‌టవర్‌పైనే ఉండిపోయాడు. పెద్ద ఎత్తున జనం అక్కడకు చేరుకున్నారు. ఎస్ఐ అప్పారావు శ్రీరామ్‌చిట్స్ మేనేజర్‌కు ఫోన్‌చేసి రప్పించారు. గురువారం చిట్‌సొమ్ము చెల్లిస్తానని పోలీసుల సమక్షంలో మేనేజర్ హామీ ఇవ్వడంతో లక్ష్మీనారాయణ సెల్‌టవర్ నుంచి దిగాడు.