Buddhadeb Bhattacharya
-
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కన్నుమూత
-
Buddhadeb Bhattacharya: నేను బుద్ధదేవ్ మాట్లాడుతున్నా...!
లోక్‌సభ ఎన్నికల్లో గెలవడానికి పారీ్టలు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ప్రచారం పర్వంలో కృత్రిమ మేధ (ఏఐ)తో ఇప్పటికే జోరుగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా పశి్చబెంగాల్లో సీపీఎం కూడా ఇదే దారి పట్టింది. కొద్ది రోజుల క్రితం ఏఐ యాంకర్ ‘సమత’ను ప్రచారంలోకి దింపిన ఆ పార్టీ, తాజాగా బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు దిగ్గజం బుద్ధదేవ్ భట్టాచార్య వీడియోను కూడా అలాగే తయారు చేసింది! ఏఐ సహాయంతో సరిగ్గా మాజీ బుద్ధదేవ్ ప్రతిరూపాన్ని, వాయిస్‌ను రూపొందించింది. 2 నిమిషాల 6 సెకన్ల నిడివితో కూడిన వీడియో సందేశం సాయంతో అటు బీజేపీ, ఇటు తృణమూల్‌పై ఏకకాలంలో దాడి చేసింది. ‘‘బెంగాల్లో ఉపాధి లేదు, మహిళలకు గౌరవం లేదు. రాష్ట్రం అవినీతికి అడ్డాగా మారుతోంది. రాష్ట్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, పరిశ్రమలొస్తాయని, వ్యవసాయం మెరుగుపడుతుందని, పిల్లలకు ఉద్యోగాలొస్తాయని తృణమూల్ చెప్పిన మాటలన్నీ నీటిమూటలే అయ్యాయి. అంతా అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ కూడా జనాల జీవితాలతో ఆడుకుంటోంది. నోట్ల రద్దు నుంచి మొదలుకుని కార్పొరేట్ లూటీ దాకా సర్వం కొద్ది మంది కుబేరులకు మేలు చేసే నిర్ణయాలే. తాజాగా మోదీ సర్కారు ఎన్నికల బాండ్ల అవినీతికి పాల్పడింది. దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. దేశాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేసే పనిలో పడింది. ఈ ఆటలను సాగనీయొద్దు. అందుకు మన ముందున్న మార్గం పోరాటం ఒక్కటే. ఈ పోరాటంలో గెలవాలంటే ఈ ఎన్నికల్లో లెఫ్ట్ డెమొక్రటిక్ సెక్యులర్ అభ్యర్థులనే గెలిపించండి’’ అంటూ వీడియోలో బుద్ధదేవ్ విజ్ఞప్తి చేశారు! ఇంటికే పరిమితం... తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బుద్ధదేవ్ కొంతకాలం కిందట ఆస్పత్రిలో చేరారు. కోలుకుని ఇంటికి తిరిగొచి్చన తర్వాత బయటికి కనిపించడమే లేదు. పూర్తి విశ్రాంతిలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వామపక్ష కార్యకర్తలు, మద్దతుదారుల్లో ఉత్సాహాన్ని నింపడానికి సీపీఎం ఇలా బుద్ధదేవ్‌తో కూడిన ఏఐ వీడియోను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే వీడియోను రూపొందించిన తరువాత బుద్ధదేవ్ కుటుంబానికి వినిపించి, వారి అనుమతితోనే సామాజిక వేదికల్లో పోస్ట్ చేసింది పార్టీ. బుద్ధదేవ్ సందేశం వామపక్ష కార్యకర్తలకు ఎంతో ఉత్తేజాన్నిస్తుందని సీపీఎం నమ్ముతోంది. అంతేకాకుండా రాష్ట్ర ఓటర్లను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుందని భావిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స..
కలకత్తా: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(79) ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన్ని ఈ రోజు మధ్యాహ్నం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్‌పై ఉన్నారు. 'ప్రస్తుతం ఆయన కండీషన్ విషమంగా ఉంది. ఆక్సిజన్ స్థాయిలు 70కి పడిపోయాయి. దీంతో ఆయన సృహలో లేరు. అనంతరం ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స కొనసాగిస్తున్నాం.' అని వైద్యులు తెలిపారు. 2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన బుద్ధదేవ్ భట్టాచార్య.. గత కొంతకాలంగా ఆనారోగ్యం బారిన పడ్డారు. సీఓపీడీ సమస్యతో పాటు పలు వయస్సు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సీపీఐఎమ్ పాలిటీబ్యూరోతో పాటు సెంట్రల్ కమిటీ నుంచి కూడా ఆయన 2015లో తప్పుకున్నారు. రాష్ట్ర సెక్రటేరియట్ నుంచి 2018లో తన సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఆయన భార్య మీరా భట్టాచార్య, కూతురు సుచేతన భట్టాటార్య ఆస్పత్రికి వచ్చారు. ఇదీ చదవండి: Lalu Prasad Yadav: అనారోగ్యం నుంచి కోలుకున్న లాలూ.. బ్యాడ్మింటన్ ఆడుతూ.. -
భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు
కలకత్తా: పదేళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక నాయకుడిగా వెలుగొందారు. అలాంటి వ్యక్తి భార్య చెల్లెలు అంటే డాబుగీబు దర్పంతో ఉంటుందని అనుకుంటే పొరపాటే. ఆమె ఫుట్‌పాత్‌పై భిక్షమెత్తుకుంటున్న దౌర్భాగ్యపు పరిస్థితి. పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా బరాబజార్ ప్రాంతంలోని దున్లాప్‌లో ఆమె మాసిపోయిన దుస్తులతో కనిపించింది. ఫుట్‌పాత్‌పైనే ఆమె జీవనం గడుపుతున్న దుస్థితి. చదవండి: మహిళలు జన్మనివ్వడానికే.. మంత్రులుగా పనికి రారు బుద్ధదేవ్ భట్టాచార్య పదేళ్ల పాటు బెంగాల్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన భార్య మీరా. ఆమె సోదరినే ఇరా బసు. ఫుట్‌పాత్‌పై ఉంటున్న ఇరా వైరాలజీలో పీహెచ్డీ చేసింది. ఆమె అద్భుతంగా ఆంగ్లంతోపాటు బెంగాలీ మాట్లాడగలదు. అంతేకాదు రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నీస్ క్రీడాకారిణి. క్రికెట్లో కూడా రాష్ట్రస్థాయిలో ఆడింది. అలాంటి ఇరా రెండేళ్లుగా ఫుట్‌పాత్‌పై నివసిస్తోంది. 1976లో ప్రియానాథ్ బాలిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఇరా బసు 2009లో పదవీ విరమణ పొందారు. ఆమె టీచర్‌గా ఉన్నప్పుడు బావ బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో బరానగర్‌లో ఉంటున్న ఆమె ఖర్దాలోని లిచూ బగాన్‌కు మకాం మార్చారు. కొన్నాళ్లకే ఏమైందో ఏమోగానీ ఆమె పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు దున్లాప్‌లోని ఫుట్‌పాత్‌పై జీవనం సాగిస్తోంది. ఆమె అలా జీవనం సాగించడంపై ఆమె పనిచేసిన ప్రియానాథ్ పాఠశాల హెడ్ మిస్ట్రెస్ కృష్ణకాలి చందా స్పందించారు. ‘ఇరా బసు మా పాఠశాలలోనే బోధించారు. పదవీ విరమణ అనంతరం పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోమని చెబితే ఇంతవరకు ఆమె పత్రాలు సమర్పించలేదు. ఆమె ఎందుకు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోలేదో తెలియదు’ అని పేర్కొన్నారు. అయితే మొన్న ఉపాధ్యాయ దినోత్సవం నాడు మాత్రం ఇరాబసును కొందరు స్థానిక సంఘాల నాయకులు సన్మానించారు. పూలమాల.. శాలువా వేసి సన్మానించారు. ఆ సమయంలో ఇరా బసు మాట్లాడింది. ‘నన్ను ఎంతో మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా నన్ను ప్రేమిస్తున్నారు. కొందరు నన్ను కౌగిలించుకుని కన్నీళ్లు పెడతారు’ అని తెలిపింది. ఈ సందర్భంగా తన బావ బుద్ధదేవ్ భట్టాచార్య గురించి మాట్లాడింది. ‘నేను టీచర్‌గా ఉన్నప్పుడే అతడి నుంచి ఎలాంటి లబ్ధి పొందను. నా కుటుంబ వివరాలు తెలుసుకున్న వారందరూ నాకు వీఐపీ గుర్తింపు ఇవ్వనవసరం లేదు’ అని స్పష్టం చేసింది. ఆమె ఫుట్‌పాత్‌పై జీవిస్తున్నది తెలుసుకున్న అధికారులు ఆమెను వెంటనే అంబులెన్స్‌లో కలకత్తాకు తీసుకెళ్లారు. ఆమెకు వైద్యారోగ్య పరీక్షలు చేయించి చికిత్స అందించే అవకాశం ఉంది. ఆమె బాగోగులు ప్రభుత్వం చూసుకునే అవకాశం ఉంది.