Bullet-proof
-
ఇయం వార్తా శ్రూయంతాం
ప్రపంచం నెదర్లాండ్స్‌లో ఒక కంపెనీ బుల్లెట్-ప్రూఫ్ బట్టల దుకాణాన్ని ప్రారంభించింది. ఇందులో బుల్లెట్-ప్రూఫ్ టైతో సహా టీషర్ట్‌ల వరకు అమ్ముతారు. ఇవి నేరస్థుల కోసం మాత్రం కాదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది అయిదుమంది సహచర సైనికులను కాల్చి వేసిన కేసులో దక్షిణ కొరియా సైనికుడు లిమ్‌కు మిల్ట్రీ కోర్టు మరణశిక్ష విధించింది క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో తాజా చిత్రాలను క్యూబన్ స్టేట్ మీడియా విడుదల చేసింది. ఆయన ఆరోగ్యంపై వచ్చిన పుకార్లకు ఈ ఫోటోలు సమాధానం చెబుతాయని అధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్‌లో ఒక బస్సుపై జరిగిన పెట్రోల్ బాంబు దాడిలో 15 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు ప్రఖ్యాత సింగర్ విట్నీ హస్టన్ కూతురు బాబీ క్రిస్టినా కోమలోకి వెళ్లిపోయారు. ఆమె వయసు 21 సంవత్సరాలు. -
చంద్రబాబుకు మరో రెండు కాన్వాయ్‌లు
సాక్షి, హైదరాబాద్: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి మరో రెండు అధికారిక కాన్వాయ్‌లు సమకూరనున్నాయి. వీటిలో ఒక కాన్వాయ్‌ను విజయవాడలో, మరొకటి తిరుపతిలో ఉంచాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రస్తుతం సీఎంకు హైదరాబాద్‌లో ఒక కాన్వాయ్ ఉంది. సీఎం రాష్ట్ర పర్యటనకు వెళ్లినప్పుడు దీనినే తరలిస్తున్నారు. లేదంటే అక్కడ రిజర్వ్‌లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వినియోగిస్తున్నారు. కొత్త రాజధాని నిర్మాణం ప్రారంభమైన తరవాత చంద్రబాబు దాదాపు ప్రతి వారం విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలకు వెళ్తారని అధికారులు చెప్తున్నారు. అందువల్ల విజయవాడలో ప్రత్యేకంగా కాన్వాయ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పుణేలో ఆర్డర్ ఇచ్చిన సఫారీ వాహనాలు పది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఆ తరవాత మరో కాన్వాయ్‌కు ఆర్డర్ ఇవ్వనున్నారు. దీనిని సీఎం సొంత జిల్లాలో ఉన్న తిరుపతిలో ఉంచాలని భావిస్తున్నారు. -
సి ఎం కోసం బుల్లెట్‌ప్రూఫ్ బస్సు
ప్రతిపాదన సిద్ధం చేస్తున్న పోలీసు శాఖ హైదరాబాద్: సీఎం కేసీఆర్ కోసం ప్రభుత్వం అత్యాధునిక బుల్లెట్‌ప్రూఫ్ బస్సును కొనుగోలు చేస్తోంది. అన్నిరకాల హంగులతో దాన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఇందుకు దాదాపు రూ.5 కోట్ల వరకు ఖర్చు కానుందని సమాచారం. బస్సును సిద్ధం చేసే బాధ్యతను ఆర్టీసీకి అప్పగించారు. త్వరలో ఇందుకు టెండర్లు పిలవబోతున్నారు. మెర్సిడెస్ బెంజ్, వోల్వో, ఇసూజూ లాంటి అంతర్జాతీయ కంపెనీల్లో ఒకదానికి టెండర్ అప్పగించనున్నారు. ఈ బస్సును అన్ని హంగులతో రూపొం దించనున్నారు. గతంలో దివంగత నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా అధికారులు ఒక ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది పాతబడిపోయింది. పైగా రాష్ట్ర విభజన వల్ల దాన్ని ఏదో ఓ రాష్ట్రానికి కేటాయించాల్సి ఉంది. దీంతో తనకు విడిగా ఓ బస్సును ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం ఆదేశించడంతో పోలీసు విభాగం దానిపై దృష్టి సారించింది.