సి ఎం కోసం బుల్లెట్‌ప్రూఫ్ బస్సు | Bulletproof bus for C M | Sakshi
Sakshi News home page

సి ఎం కోసం బుల్లెట్‌ప్రూఫ్ బస్సు

Published Tue, Oct 21 2014 1:22 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

సి ఎం కోసం బుల్లెట్‌ప్రూఫ్ బస్సు - Sakshi

సి ఎం కోసం బుల్లెట్‌ప్రూఫ్ బస్సు

ప్రతిపాదన సిద్ధం చేస్తున్న పోలీసు శాఖ

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కోసం ప్రభుత్వం అత్యాధునిక బుల్లెట్‌ప్రూఫ్ బస్సును కొనుగోలు చేస్తోంది. అన్నిరకాల హంగులతో దాన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఇందుకు దాదాపు రూ.5 కోట్ల వరకు ఖర్చు కానుందని సమాచారం. బస్సును సిద్ధం చేసే బాధ్యతను ఆర్టీసీకి అప్పగించారు. త్వరలో ఇందుకు టెండర్లు పిలవబోతున్నారు. మెర్సిడెస్ బెంజ్, వోల్వో, ఇసూజూ లాంటి అంతర్జాతీయ కంపెనీల్లో ఒకదానికి టెండర్ అప్పగించనున్నారు.

ఈ బస్సును అన్ని హంగులతో  రూపొం దించనున్నారు. గతంలో దివంగత నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా అధికారులు ఒక ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది పాతబడిపోయింది. పైగా రాష్ట్ర విభజన వల్ల దాన్ని ఏదో ఓ రాష్ట్రానికి కేటాయించాల్సి ఉంది. దీంతో తనకు విడిగా ఓ బస్సును ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం ఆదేశించడంతో పోలీసు విభాగం దానిపై దృష్టి సారించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement