చంద్రబాబుకు మరో రెండు కాన్వాయ్‌లు | two Convey's for chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు మరో రెండు కాన్వాయ్‌లు

Published Tue, Dec 2 2014 7:42 AM | Last Updated on Wed, Oct 17 2018 3:49 PM

చంద్రబాబుకు మరో రెండు కాన్వాయ్‌లు - Sakshi

చంద్రబాబుకు మరో రెండు కాన్వాయ్‌లు

సాక్షి, హైదరాబాద్: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి మరో రెండు అధికారిక కాన్వాయ్‌లు సమకూరనున్నాయి. వీటిలో ఒక కాన్వాయ్‌ను విజయవాడలో, మరొకటి తిరుపతిలో ఉంచాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రస్తుతం సీఎంకు హైదరాబాద్‌లో ఒక కాన్వాయ్ ఉంది. సీఎం రాష్ట్ర పర్యటనకు వెళ్లినప్పుడు దీనినే తరలిస్తున్నారు. లేదంటే అక్కడ రిజర్వ్‌లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వినియోగిస్తున్నారు. కొత్త రాజధాని నిర్మాణం ప్రారంభమైన తరవాత చంద్రబాబు దాదాపు ప్రతి వారం విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలకు వెళ్తారని అధికారులు చెప్తున్నారు.

అందువల్ల విజయవాడలో ప్రత్యేకంగా కాన్వాయ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పుణేలో ఆర్డర్ ఇచ్చిన సఫారీ వాహనాలు పది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఆ తరవాత మరో కాన్వాయ్‌కు ఆర్డర్ ఇవ్వనున్నారు. దీనిని సీఎం సొంత జిల్లాలో ఉన్న తిరుపతిలో ఉంచాలని భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement