CABG Surgery
-
Heart stent surgery: స్టెంటేశాక రెస్టెంత? బెస్టెంత?
ఇటీవలగుండె జబ్బుల తర్వాత చాలామందికి స్టెంట్ వేయడం, ఇక కొందరిలోనైతే బైపాస్ అని పిలిచే సీఏబీజీ సర్జరీ చేయాల్సి రావడం మామూలే. గుండెకు నిర్వహించే ఇలాంటి ప్రోసిజర్ తర్వాత, ఆ బాధితుల్ని ఎప్పట్నుంచి నార్మల్‌గా పరిగణించ వచ్చు, లేదా ఎప్నట్నుంచి వారు తమ రోజువారీ పనులు చేసుకోవచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం...నిజానికి ఓ ప్రోసిజర్ తర్వాత నార్మల్ కావడం అన్నది వారివారి శరీర ధర్మం, ఫిట్నెస్, గాయం పూర్తిగా తగ్గేందుకు పట్టే సమయం... ఇలా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ సగటు కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే... తమ ఫిట్నెస్, తమ పనులు ఇక తాము చేసుకోగలమనే ఆత్మవిశ్వాసాన్ని బట్టి ఈ సమయం కాస్త అటు ఇటుగా ఉంటుందని తెలుసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా సర్జరీ జరిగినప్పుడు వీలైనంత తర్వాత సాధారణ స్థితికి రావాలని బాధితులందరికీ ఉంటుంది. అంతేకాదు... గాయమంతా పూర్తిగా మానేవరకు అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉండరు. అంతకంటే చాలా ముందుగానే... అంటే 80 శాతం తగ్గేనాటికే తమతమ మామూలు పనులు మొదలుపెట్టేస్తుంటారు. బాధితులు తమ ్రపోసీజర్ అయిన ఆరు వారాల తర్వాత నుంచి నిరభ్యంతరంగా పనులు మొదలు పెట్టవచ్చు. అయితే అప్పటికి తగ్గింది కేవలం 80శాతం మాత్రమే కావడం వల్ల కొన్ని బరువైన పనులు చేయడం మాత్రం అంత మంచిది కాకపోవచ్చు.డిశ్చార్జీ అయిన ఆరువారాల తర్వాతి నుంచి... చేయదగిన పనులు : 🔸తేలికపాటి నడక / (వాకింగ్) బట్టలు ఉతకడం (మెషిన్ ఉపయోగించి మాత్రమే) 🔸శ్రమలేనంతవరకు అంట్లు తోముకోవడం / పాత్రలు శుభ్రం చేసుకోవడం 🔸శ్రమలేనంతవరకు వంట చేసుకోవడం 🔸శ్రమ లేనంతవరకు / తేలికపాటి శారీరక శ్రమతో ఇల్లు శుభ్రం చేసుకోవడం ▶️శ్రమ లేనంతవరకు మెట్లు ఎక్కడం (ఈ ప్రక్రియలో శ్రమగా అనిపించినా / ఆయాసం వచ్చినా మళ్లీ ఈ పని చేయకూడదు. ఆమాటకొస్తే... శ్రమ అనిపించిన లేదా ఆయాసంగా అనిపించిన ఏ పనినైనా బలవంతంగా చేయకూడదని గుర్తుంచుకోవాలి).చేయకూడని పనులు : 🔸బరువైనవి ఎత్తడం (ప్రధానంగా 5 కిలోలకు మించినవేవీ ఎత్తడం సరికాదు) 🔸బరువైన వాటిని అటు ఇటు లాగడం లేదా తోయడం 🔸వాహనం నడపడం.ఎనిమిది వారాల తర్వాత :🔸మనకు జరిగిన ప్రోసిజర్‌లో... శస్త్రచికిత్సలో భాగంగా ఎదుర్రొమ్ము ఎముకకు గాటు పెట్టి విడదీసి ఉంటే... అది ఆరు నుంచి ఎనిమిది వారాల నాటికి 80 శాతం తగ్గుతుంది. ఆరు / ఎనిమిది వారాలు దాటాక వాహనాన్ని నడపడం (డ్రైవింగ్) మొదలుపెట్టవచ్చు. మనం చేసే పని భౌతికమైన శ్రమతో కూడుకున్నది కాకపోతే మన వృత్తులకు / కార్యాలయానికి వెళ్లవచ్చు. ఆరు వారాలు దాటాక మళ్లీ యథాతథ స్థితిలోకి వచ్చేందుకు అవసరమైన కార్యకలాపాలు చేయడానికి (కార్డియాక్ రీహ్యాబిలిటీషన్కు) ఇది అనువైన సమయమని తెలుసుకోవాలి. ఈ సమయంలో గుండెపై ఒత్తిడి పడకుండానే... దాని పనితీరు / సామర్థ్యం (ఎండ్యూరెన్స్) పెంచుకునే వ్యాయామాలు మొదలుపెట్టాలి. అలా తేలిగ్గా మొదలుపెట్టి శ్రమతెలియనంత వరకు ఆ వ్యాయామాల తీవ్రతను పెంచుకుంటూ పోవచ్చు. శ్రమ అనిపించగానే మళ్లీ తగ్గిస్తూ... అలా క్రమంగా మీ యథాపూర్వక స్థితిలోకి వెళ్లడం మంచిది. ఇది చేస్తున్న క్రమంలో మనకు ఏ శ్రమ తెలియకపోతే... మనం అన్ని పనులూ ఎప్పుడెప్పుడు చేయవచ్చో మనకే క్రమంగా అర్థమవుతూ ఉంటుంది.పది, పన్నెండు వారాల తర్వాత అది శస్త్రచికిత్సా / మరో ప్రక్రియా... అది ఏదైనప్పటికీ... పది, పన్నెండు వారాలు గడిచాక... అంతకు మునుపు చేసిన పనులన్నీ ఎలాంటి శ్రమ లేకుండా చేయగలుగుతుంటే... ఆపై ఇక నిర్భయంగా... తేలికపాటి పరుగు (జాగింగ్), టెన్నిస్‌లాంటి ఇతరత్రా ఆటలు ఆడుకోవచ్చు. (అయితే ఆడే సమయంలో శ్రమ ఫీల్ అవ్వకుండా తేలిగ్గా చేయగలిగితేనే ఆ పనులు కొనసాగించాలి). రోజూ 30 నిమిషాల చొప్పున కనీసం వారంలో ఐదు రోజులు వ్యాయామాలు చేయాలి. దాని గుండెకు తగినంత బలం చేకూరి... దీర్ఘకాలంలో మేలు జరుగుతుంది.మానడానికి టైమ్ ఇవ్వండి : ఏదైనా గాయం మానడానికి పట్టే సమయం... ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. అందుకే ఏ కొద్దిపాటి శ్రమ అనిపించినా మళ్లీ తేలికపనులకు వచ్చేసి మళ్లీ శ్రమ కలిగించే పనులవైపునకు మెల్లగా క్రమక్రమంగా వెళ్తుండాలి. బాధితులకు డయాబెటిస్ లేదా ఇతరత్రా ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే గాయం మానడం మరింత ఆలస్యమవుతుంది. అందుకే ఆరువారాల సమయాన్ని ఒక సాధారణ ్రపామాణిక సమయంగా మాత్రమే పరిగణించాలి. ఎవరిలోనైనా ఏదైనా గాయం పూర్తిగా అంటే 100 శాతం మానడానికి కనీసం ఏడాది సమయం తీసుకుంటుందని గుర్తుంచుకోవాలి. అందుకే ఏదైనా పనిని చేయడచ్చా లేదా అన్న విషయాన్ని ఎవరికి వారు తెలుసుకోడానికి ఉన్న ఒకే ఒక మార్గం... ‘ఆ పనిని తేలిగ్గానే చేయడానికి సాధ్యమవుతోందా, లేదా’ అనే విషయాన్ని చూసుకోవాలి. అలా ఏదైనా పని చేస్తునప్పుడు నొప్పి అనిపించినా, ఆయానం వచ్చినా లేదా గాయం వద్ద అసౌకర్యంగా ఉన్నా ఆ పనిని వెంటనే ఆపేయాలి.ఏదైనా పని సరికాదని గుర్తుపట్టడం ఎలా? ▶️అసాధారణమైన / తట్టుకోలేనంతగా నొప్పి వచ్చినప్పుడు ▶️ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఎదుర్మొమ్ము వద్ద ‘కలుక్కు’మని అనిపించినా లేదా అలాంటి శబ్దం వచ్చినా ▶️ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఎదుర్రొమ్ము గాయం ఎర్రబారినా లేదా ఆ గాయం నుంచి స్వల్పంగానైనా రక్తం / చీము లాంటి స్రావాలు వస్తున్నా ▶️దగ్గినప్పుడు ‘కలుక్కు’మన్నా ▶️సుదీర్ఘంగా శ్వాస తీసుకున్నప్పుడు ‘కలుక్కు’మన్నా. (ఇలా జరిగినప్పుడు ఎదుర్రొమ్ముకు వేసిన కుట్లు తెగాయేమోనని అనుమానించి, వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షింపజేసుకోవాలి). ఈ విషయాలన్నింటినీ ఎవరికి వారు గమనించుకుంటూ స్వీయ పరిశీలన ద్వారా రొటీన్ పనుల్లోకి క్రమక్రమంగా ప్రవేశించాలి. -
సీఏబీజీ సర్జరీ అంటే మనం చెప్పుకునే బైపాస్ సర్జరీయే!
కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 65. ఒక రోజు ఛాతీనొప్పి వస్తే పరీక్షించిన డాక్టర్లు సీఏబీజీ సర్జరీ చేయాలని అని చెప్పారు. సీఏబీజీ అంటే ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - సరళ, భద్రాచలం గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు, రక్తసరఫరాలో అవరోధం కలగకుండా, సీఏబీజీ అనే సర్జరీ చేసి, రక్తాన్ని ఇతర మార్గాల్లో (బైపాస్ చేసిన మార్గంలో) గుండెకండరానికి అందేలా చేసే ఆపరేషనే సీఏబీజీ. మనం ఇంగ్లిష్‌లో సాధారణంగా బైపాస్ సర్జరీ అని పిలిచే దీన్ని వైద్యపరిభాషలో కరొనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అని వ్యవహరిస్తారు. దాని సంక్షిప్తరూపమే ఈ సీఏబీజీ ఆపరేషన్. ఇందులో కాళ్లు లేదా చేతులపై ఉన్న రక్తనాళాలను తీసి, గుండెకు అడ్డంకిగా ఏర్పడిన రక్తనాళాలకు ప్రత్యామ్నాయంగా, రక్తాన్ని బైపాస్ మార్గంలో అందించేలా అమర్చుతారు. సాధారణంగా ఒక బ్లాక్ (అడ్డంకి)ని బైపాస్ చేయాలంటే ఒక రక్తనాళం అవసరం. గుండె వద్ద ఉన్న రక్తనాళాన్ని నేరుగా బైపాస్ చేసే ప్రక్రియను రీ-వాస్క్యులరైజేషన్ అంటారు. ఛాతీకి కుడి, ఎడమ వైపున ఉన్న రక్తనాళాలను ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ అంటారు. గుండెకు ఎడమవైపున ఉన్న నాళాన్ని లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అర్టరీ అని అంటారు. ఈ రక్తనాళాన్ని బ్లాక్ అయిన నాళాల వద్ద బైపాస్ మార్గంలా కలుపుతారు. దీర్ఘకాల ప్రయోజనాలతో పాటు రోగి త్వరగా కోలుకుంటున్నందున ఇప్పుడు బైపాస్‌లోనూ సరికొత్త విధానాన్ని పాటిస్తున్నారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత, భవిష్యత్తులో ఇలా మార్చిన రక్తనాళాల్లోనూ కొవ్వు పేరుకోకుండా హృద్రోగులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రక్తనాళాల్లో పేరుకున్న బ్లాక్స్‌ను అధిగమించి, రక్తాన్ని గుండెకు చేరవేసేందుకు వీలుగా బైపాస్ సర్జరీ చేస్తారు. అంతే తప్ప ఇది చేయడం వల్ల అప్పటికే ఉన్న గుండెజబ్బు తొలగిపోయిందని పేషెంట్ అపోహ పడకూడదు. అందుకే రోగి మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవే... రోగికి హైబీపీ ఉన్నట్లయితే దాన్ని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకునేలా డాక్టర్ సూచించిన మందులు తీసుకోవాలి. అలాగే రోగికి డయాబెటిస్ ఉంటే, రక్తంలోని చక్కెరపాళ్లు ఎల్లప్పుడూ అదుపులో ఉండేలా మందులు తీసుకుంటూ, కొవ్వులు తక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ఇక పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తక్షణం పూర్తిగా మానేయాలి. డాక్టర్లు సూచించిన తగిన వ్యాయామాలు చేస్తూ ఉండాలి. డాక్టర్ అనూజ్ కపాడియా సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్