call diversion
-
తస్మాత్ జాగ్రత్త.. కాల్ చేసి ]401]తో కలిపి డయల్ చేయాలని చెబుతున్నారా..
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. బాధితులకు తెలియకుండా వారితోనే కాల్ డైవర్షన్ యాక్టివేట్ చేయిస్తున్నారు. ఆపై వారి వాట్సాప్‌ను తమ అధీనంలోకి తీసుకుని డబ్బు కోరుతూ పలువురికి సందేశాలు పంపుతున్నారు. నగరానికి చెందిన ఓలా గ్రాడ్యుయేట్ బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం ప్రకారం వివరాలు.. నగరానికి చెందిన బాధితురాలికి మంగళవారం 96––––––44 నుంచి ఫోన్ వచ్చింది. జియో సర్వీస్ సెక్షన్ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి సర్వీస్‌లో ఇబ్బందిపై కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేశారా? అని అడిగాడు. తాను అలాంటి ఫిర్యాదులేమీ చేయలేదని బాధితురాలు చెప్పింది. తమ రికార్డుల్లో ఫిర్యాదు నమోదై ఉందని చెప్పిన కేటుగాడు అది క్లోజ్ కావాలంటే తాను చెప్పినట్లు చేయాలన్నాడు. ]401] తర్వాత 709–––––57 నంబర్ జోడించి రింగ్ చేయాలని చెప్పాడు. అతడి మాటలు నిజమే అని నమ్మిన ఆమె అలానే చేశారు. దీంతో నేరుగా ప్రమేయం లేకుండా తెలియకుండానే ఆమె ఫోన్లో కాల్ డైవర్షన్ యాక్టివేట్ అయింది. ఆమెకు రావాల్సిన కాల్స్ అన్నీ కేటుగాడు సూచించిన 709–––––57 నంబర్‌కు వెళ్తున్నాయి. అంతటితో ఆగని అతగాడు ఆమె వాట్సాప్‌ను తన అధీనంలోకి తీసుకోవాలని భావించాడు. దీనికోసం తన ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఈ యాప్ యాక్టివేట్ కావాలంటే అందులో వినియోగదారుడి ఫోన్ నంబర్ పొందుపరచాలి. ఆపై దానికి ఎస్సెమ్మెస్ లేదా కాల్ రూపంలో వచ్చే ఆరు అంకెల యాక్టివేషన్ కోడ్ పొందుపరచాలి. చదవండి: రి‘కార్డ్’ స్థాయిలో క్రెడిట్!.. జాగ్రత్తగా ఉండకపోతే జేబుకు చిల్లే కేటుగాడు తన ఫోన్లోని వాట్సాప్‌లో బాధితురాలి నంబర్ పొందుపరిచి, కాల్ రూపంలో యాక్టివేషన్ కోడ్ వచ్చే ఆప్షన్ ఎంచుకున్నాడు. దీంతో బాధితురాలి ఫోన్‌కు రావాల్సిన ఈ కాల్ డైవర్షన్ కారణంగా కేటుగాడు పొందుపరిచిన 709–––––57 నంబర్‌కు వచ్చింది. దీని ద్వారా ఆ యాప్ యాక్టివేట్ చేసుకోవడంతో బాధితురాలి వాట్సాప్ అతడి అధీనంలోకి వెళ్లిపోయింది. ఆపై అసలు కథ మొదలెట్టిన సైబర్ నేరగాడు ఆమె వాట్సాప్ కాంటాక్ట్స్ లిస్ట్‌లో ఉన్న అందరికీ సందేశాలు పంపాడు. అత్యవసరంగా రూ.10 వేలు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా బదిలీ చేయాలని వాటిలో సూచించాడు. ఆ మొత్తాన్ని 709–––––57 నంబర్‌కు పంపాలని కోరాడు. వారి ద్వారా విషయం తెలుసుకున్న బాధితురాలు బుధవారం సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నేరగాళ్లు వాడిన ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఫోన్ కాల్స్ నమ్మవద్దు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ నమ్మవద్దు. సరిచూసుకోకుండా ఆ ఫోన్లు చేసిన వాళ్లు చెప్పినట్లు చేస్తే ఆర్థికంగా నష్టపోవడంతో పాటు వ్యక్తిగత డేటాను కోల్పోవాల్సి వస్తుంది. ]401]తో ఏ నంబర్ కలిపి డయల్ చేస్తామో ఆ నంబర్‌కు కాల్ డైవర్షన్ యాక్టివేట్ అయిపోతుంది. దీన్ని గమనించిన వాళ్లు డీ యాక్టివేట్ చేసుకోవాలంటే ఫోన్లోని కాల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఈ–బైక్స్ తయారీ సంస్థ అథర్ ఎనర్జీ లిమిటెడ్ పేరుతో నగరవాసికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు డీలర్షిప్ అంటూ ఎర వేశారు. అతడు సరి చూసుకోకుండా నమ్మేయడంతో రూ.12 లక్షలు కాజేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అపరిచితులు చేసే ఫోన్ కాల్స్ వలలో పడకుండా ఉండాలి. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ -
లక్నో కేంద్రంగా కాల్ రూటింగ్!
సాక్షి,సిటీబ్యూరో: హైటెక్ పద్దతిలో ఇంటర్నేషనల్ కాల్స్‌ను వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ) పద్దతిలో లోకల్ కాల్స్‌గా మార్చే కాల్ రూటింగ్ ఎక్స్ఛేంజ్ దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రసిస్ట్ స్క్వాడ్ (యూపీ ఏటీఎస్) అధికారులు గుర్తించారు. ఇటీవల అక్కడి లాల్బాగ్ ఏరియాలో దాడులు చేసి ఓ ఎంబీఏ విద్యార్థి సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి విచారణ నేపథ్యంలో ఈ ప్రధాన ఎక్స్ఛేంజ్కు హైదరాబాద్‌లోనూ ఓ బ్రాంచ్ ఉన్నట్లు తేలింది. ఆ వివరాలు సేకరించిన ఏటీఎస్ ఇక్కడి వారిని పట్టుకునేందుకు త్వరలో ఓ ప్రత్యేక బృందాన్ని సిటీకి పంపనుంది. విదేశాల నుంచి ఓ వ్యక్తి చేసే ఫోన్ కాల్ అక్కడి ఎక్స్ఛేంజి నుంచి నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్‌కు చేరతాయి. అక్కడి నుంచి ఇంటర్నేషనల్ గేట్ వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చి అక్కడి నుంచి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేదా శాటిలైట్ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇక్కడికి చేరిన ఫోన్‌కాల్ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్న ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌ల ద్వారా కాల్ రిసీవ్ చేసుకునే ఫోన్‌కు వస్తుంది. ఈ విధానం మొత్తం సెకను కన్నా తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇక్కడి ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌లకు సైతం విదేశీ కాల్ ఆపరేటర్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ మొత్తం చెల్లించకుండా తప్పించుకునేందుకు అక్కడి కాల్ ఆపరేటర్లే ఇక్కడ వ్యవస్థీకృత ముఠాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దేశం నుంచి ఓ కాల్ విదేశాలకు వెళ్లాలంటే (ఔట్ గోయింగ్) కచ్చితంగా అది సర్వీస్ ప్రొవైడర్ ద్వారానే జరగాలి. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్ పైనా ఏజెన్సీల నిఘా ఉంటుంది. అనుమానాస్పద దేశాలు, వ్యక్తులు, నంబర్ల నుంచి వచ్చే వాటిని ట్యాప్ కూడా చేస్తారు. ఇందుకు ఉపకరించే సాధనాలు దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఉన్న ఇండియన్ ఇంటర్నేషనల్ గేట్‌వే ఐఎల్‌డీ ఆపరేటర్లకు ఉంటాయి. వారికి చిక్కకుండా హైటెక్ పద్దతిలో ఇంటర్నేషనల్ కాల్స్‌ను వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పద్దతిలో లోకల్ కాల్స్‌గా మారుస్తుంటారు. విదేశీ ఆపరేటర్లు ఇక్కడి ఏజెన్సీలకు డబ్బు చెల్లించకుండా ఉండేందుకు, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఉపకరించే విధంగా ఓ విధానాన్ని రూపొందించారు. ఇక్కడ ఉంటున్న కొందరితో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసేలా చేస్తారు. ఆ తర్వాత విదేశంలో ఉన్న ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చిన ఫోన్ కాల్ అక్కడ డేటాగా మారిపోతుంది. దానిని ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఇక్కడ ఏర్పాటు చేయించిన అత్యాధునిక పరికరాలకు పంపిస్తారు. వీరి దగ్గర ఉండే గేట్వేలు ఈ డేటాను మళ్లీ కాల్‌గా మారుస్తాయి. వాటిని అనుసంధానించి ఉన్న సీడీఎమ్ఏ ఎఫ్‌డబ్ల్యూటీలకు చేరుతుంది. స్థానికంగా (లోకల్) బోగస్ వివరాలతో తీసుకున్న ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డులను సేకరించి ఈ సీడీఎమ్ఏ ఎఫ్‌డబ్ల్యూటీలను తయారు చేస్తారు. గేట్‌వే నుంచి వీటికి వెళ్లిన అంతర్జాతీయ కాల్ లోకల్‌గా మారిపోయి ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డునకు చెందిన నెంబరు (లోకల్) నుంచి వస్తున్నట్లు ఆ ఫోన్ అందుకునే వారికి కనిపిస్తుంది. దీని వల్ల విదేశాల్లో ఉండే వ్యక్తికి సైతం కాల్చార్జ్ తగ్గుతుంది. ఇలాంటి గ్యాంగుల్లో మహారాష్ట్రకు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ సచిన్‌రాజ్ ఇస్సాక్, లక్నో, వారణాసిలకు చెందిన డిగ్రీ విద్యార్థులు చంచల్ మిశ్రా, సుజీత్ సింగ్ కీలక పాత్రధారులుగా ఉన్నారు. వీరు హైదరాబాద్‌తో పాటు వారణాసి, ముంబై, చెన్నైల్లో కొందరి సహకారంతో బ్రాంచ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడిక్కడ స్థానికులకు వీటి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఈ రూటింగ్ వల్ల దేశంలోని ఆపరేటర్ల ఆదాయం, ప్రభుత్వానికి రావాల్సిన పన్నులకు గండిపడుతోంది. ఇందుకు సహకరించిన స్థానికులకు హవాలా రూపంలో కమీషన్ పంపిస్తుంది. ఈ గ్యాంగ్ చెన్నై, నేపాల్ ఫిలిప్పీన్స్, శ్రీలంకల్లోనూ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది. వీరి వ్యవహారాలను గుర్తించిన యూపీ ఏటీఎస్ గురువారం సచిన్, చంచల్, సుజిత్‌లను పట్టుకుంది. సాధారణంగా ఈ తరహా కాల్స్‌ను ఎక్కువగా ఉగ్రవాదులు, అసాంఘికశక్తులు వాడుకుంటారు. యూపీలోని అనేక ప్రాంతాలు వీటికి అడ్డాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యవస్థీకృతంగా సాగుతున్న రూటింగ్ వ్యవహారాన్ని వారు సీరియస్‌గా తీసుకున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఏజెంట్లపై దాడులు చేయడానికి ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. -
హైటెక్ మోసగాళ్ల గుట్టురట్టు
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడలో టూటౌన్ పోలీసులు హైటెక్ మోసాన్ని గుట్టురట్టు చేశారు. బుధవారం ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్నేషన్ కాల్స్‌ను డైవర్ట్ చేస్తోన్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదర్ల గణేష్, గుమశ్రీకొండ రామదాసు, బుస్సా శ్రీధర్, ఉలవల ముసలయ్య అనే వ్యక్తులు చైనాకు చెందిన స్కైన్ నెట్ అనే సంస్థతో ఓ ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం సిమ్ క్యారియర్ల ద్వారా ఇంటర్నేషనల్ కాల్స్ డైవర్ట్ చేస్తూ భారత టెలికాం ఆదాయానికి గండికొట్టసాగారు. అంతేకాకుండా వారు హైదరాబాద్‌లోనూ కాల్స్ డైవర్ట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారినుంచి పది లక్షల విలువైన సిమ్ క్యారియర్లు, ఇన్వర్టర్లు, వివిధ కంపెనీలకు చెందిన 800 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఓన్లీ ఇన్ కమింగ్..!
సాక్షి, సిటీబ్యూరో: హైటెక్ పద్దతిలో ఇంటర్నేషనల్ కాల్స్‌ని వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ) పద్దతిలో లోకల్ కాల్స్‌గా మార్చే కాల్ రూటింగ్ ఎక్స్ఛేంజ్లు ఇక్కడి కాల్స్‌ను (ఔట్ గోయింగ్) బయటి దేశాలకు పంపలేవు. కేవలం ఆయా దేశాల నుంచి వచ్చే వాటి మాత్రమే లోకల్ కాల్స్‌గా మార్చి ఇక్కడి వారికి (ఇన్కమింగ్) అందించగలవు. నగరంలోని మూడు చోట్ల అక్రమ ఎక్ఛ్సేంజ్‌లు ఏర్పాటు చేసి, రూటింగ్‌కు పాల్పడుతున్న ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఆ మొత్తం ఎగ్గొట్టడానికే... విదేశాల నుంచి ఓ వ్యక్తి చేసే ఫోన్ కాల్ అక్కడి ఎక్స్ఛేంజి నుంచి నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్‌కు చేరతాయి. అక్కడ నుంచి ఇంటర్నేషనల్ గేట్ వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చి అక్కడ నుంచి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేదా శాటిలైట్ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇక్కడకు చేరిన ఫోన్‌కాల్ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్న ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌ల ద్వారా ఇక్కడ కాల్ రిసీవ్ చేసుకునే ఫోన్‌కు వస్తుంది. ఈ విధానం మొత్తం సెకను కన్నా తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇక్కడి ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్ఛ్సేంజ్‌లు సైతం విదేశీ కాల్ ఆపరేటర్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ మొత్తం చెల్లించకుండా తప్పించుకోవడానికి అక్కడి కాల్ ఆపరేటర్లే ఇక్కడ వ్యవస్థీకృత ముఠాలను ఏర్పాటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలోనే సూత్రధారులంతూ విదేశాల్లోనే ఉంటారు. కొందరు సూత్రధారులు వివిధ ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ కాల్ రూటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి దందాలు చేస్తుంటారు. ఇక్కడి నుంచి ఓ కాల్ విదేశాలకు వెళ్ళాలంటే (ఔట్ గోయింగ్) కచ్చితంగా అది సర్వీస్ ప్రొవైడర్ ద్వారానే జరగాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్ పైనా ఏజెన్సీల నిఘా ఉంటుంది. అనునుమానాస్పద దేశాలు, వ్యక్తులు, నెంబర్ల నుంచి వచ్చే వాటిని ట్యాప్ కూడా చేస్తారు. ఇందుకు ఉపకరించే సాధనాలు దేశలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఉన్న ఇండియన్ ఇంటర్నేషనల్ గేట్‌వే ఐఎల్‌డీ ఆపరేటర్లకు ఉంటుంది. వారికి చిక్కకుండా హైటెక్ పద్దతిలో ఇంటర్నేషనల్ కాల్స్‌ని వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పద్దతిలో లోకల్ కాల్స్‌గా మారుస్తుంటారు. రూటింగ్ జరిగేది ఇలా... విదేశీ ఆపరేటర్లు ఇక్కడి ఏజెన్సీలకు డబ్బు చెల్లించకుండా ఉండేందుకు, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఉపకరించే విధంగా ఓ విధానాన్ని రూపొందించారు. ఇక్కడ ఉంటున్న కొంత మందికి ఇంటర్నెట్ ద్వారా ఎరవేసి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసేలా చేస్తారు. అలా ఏర్పాటయిన తరవాత విదేశంలో ఉన్న ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చిన ఫోన్ కాల్ అక్కడ డేటాగా మారిపోతుంది. దాన్ని ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఇక్కడి వారిని ఎరవేసి ఏర్పాటు చేయించిన అత్యాధునిక పరికరాలకు పంపిస్తారు. వీరి దగ్గర ఉండే గేట్వేలు ఈ డేటాను మళ్లీ కాల్‌గా మారుస్తాయి. వాటిని అనుసంధానించి ఉన్న సీడీఎమ్ఏ ఎఫ్‌డబ్ల్యూటీలకు చేరుతుంది. స్థానికంగా (లోకల్) బోగస్ వివరాలతో తీసుకున్న ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డులను సేకరించి ఈ సీడీఎమ్ఏ ఎఫ్‌డబ్ల్యూటీలను తయారు చేస్తారు. గేట్‌వే నుంచి వీటికి వెళ్లిన అంతర్జాతీయ కాల్ లోకల్‌గా మారిపోయి ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డునకు చెందిన నెంబరు (లోకల్) నుంచి వస్తున్నట్లు ఆ ఫోన్ అందుకునే వారికి కనిపిస్తుంది. దీని వల్ల విదేశాల్లో ఉండే వ్యక్తికి సైతం కాల్‌ఛార్జ్ తగ్గుతుంది. దేశంలోని అనేక ఆపరేటర్లను రావాల్సిన ఆదాయం, ప్రభుత్వానికి రావాల్సిన పన్ను దెబ్బతింటున్నాయి. ఈ కారణంగానే ప్రాధాన్యం... ఆదివారం సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన ముఠాకు సంబంధించిన సమాచారం వారికి నిఘా వర్గాల నుంచి అందింది. పాక్ సహా ఇతర దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు భారత్‌లోని సైనిక, నిఘా సంస్థల అధికారుల్ని ట్రాప్ చేయడానికి చూస్తుంటాయి. దీనికోసం వారు ‘హనీ ట్రాప్’ విధానం వినియోగిస్తారు. ఆయా దేశాలకు చెందిన అధికారులే మహిళలు, యువతులుగా ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుంటారు.అధికారుల నుంచి వ్యక్తిగత సమాచారం సంగ్రహిస్తారు. ఆపై ఆ ఫొటోలను, సమాచారం చూపి స్తూ తమకు అనుకూలంగా మారాలంటూ బ్లాక్ మెయిల్‌కు దిగుతారు. ఈ కాల్స్ చేయడానికి కాల్ రూటింగ్ విధానాన్నే వినియోగిస్తారు. -
కాల్ కేటుగాళ్లు
► కాల్ డైవర్షన్ రాకెట్ గుట్టురట్టు! ► అంతర్జాతీయ ఇన్కమింగ్ కాల్స్ లోకల్‌గా మార్పు ► సూత్రధారులు విదేశాల్లో, హైటెక్ పద్దతిలో వ్యవహారం ► ఏజెన్సీల నిఘాకు చిక్కకుండా ఫోన్లు చేసేందుకు ఆస్కారం ► హబీబ్‌నగర్‌లో సైబర్ క్రైమ్ కాప్స్ దాడి, అదుపులో నిందితులు హైదరాబాద్: విదేశాల నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్ పైనా ఏజెన్సీల నిఘా ఉంటుంది. అనునుమానాస్పద దేశాలు, వ్యక్తులు, నెంబర్ల నుంచి వచ్చే వాటిని ట్యాప్ కూడా చేస్తారు. ఇందుకు ఉపకరించే సాధనాలు దేశం లోని నాలుగు ప్రధాన నగరాల్లో ఉన్న ఇండియన్ ఇంటర్నేషనల్ గేట్‌వే ఐఎల్‌డీ ఆపరేటర్లకు ఉంటుంది. వారికి చిక్కకుండా హైటెక్ పద్దతిలో ఇంటర్నేషనల్ కాల్స్‌ను వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పద్దతిలో లోకల్ కాల్స్‌గా మారుస్తున్న హైటెక్ ముఠాగుట్టును సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు గుట్టురట్టు చేశారు. అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌ను ఈ రకంగా మార్చడం ద్వారా ప్రభుత్వానికీ పన్ను రూపంలో రావాల్సిన కోట్ల ఆదాయానికి గండి పడుతోంది. విదేశాల నుంచి ఓ వ్యక్తి చేసే ఫోన్ కాల్ అక్కడి ఎక్సేంజి నుంచి నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్‌కు చేరతాయి. అక్కడ నుంచి ఇంటర్నేషనల్ గేట్ వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చి అక్కడ నుంచి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేదా శాటిలైట్ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇక్కడకు చేరిన ఫోన్‌కాల్ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్న ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌ల ద్వారా ఇక్కడ కాల్ రిసీవ్ చేసుకునే ఫోన్‌కు వస్తుంది. ఈ తతంగం అంతా సెకను కంటే తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌లకు సైతం విదేశీ కాల్ ఆపరేటర్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకునే వీరు తమ ఆదాయం నుంచి నిర్ణీత మొత్తాన్ని పన్నురూపంలో చెల్లిస్తారు. అయితే విదేశీ ఆపరేటర్లు ఇక్కడి వారికి డబ్బు చెల్లించకుండా ఉండేందుకు, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఉపకరించేలా ఓ విధానాన్ని రూపొందించారు. స్థానికులు కొందరికి ఇంటర్నెట్ ద్వారా ఎరవేసి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసేలా చేస్తారు. వాటి ద్వారా విదేశాల్లోని ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చిన ఫోన్ కాల్ అక్కడ డేటాగా మారిపోతుంది. దాన్ని ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఇక్కడి వారితో ఏర్పాటు చేయించిన అత్యాధునిక పరికరాలకు పంపిస్తారు. వీరి దగ్గర ఉండేగేట్వేలు ఈ డేటాను మళ్లీ కాల్‌గా మారుస్తాయి. వాటిని అనుసంధానించి ఉన్న సీడీఎమ్ఏ ఎఫ్‌డబ్ల్యూటీలకు చేరుతుంది. స్థానికంగా (లోకల్) బోగస్ వివరాలతో తీసుకున్న ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డులను సేకరించి ఈ సీడీఎమ్ఏ ఎఫ్‌డబ్ల్యూటీలను తయారు చేస్తారు. గేట్‌వే నుంచి వీటికి వెళ్లిన అంతర్జాతీయ కాల్ లోకల్‌గా మారిపోయి ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డునకు చెందిన నెంబరు (లోకల్) నుంచి వస్తున్నట్లు ఆ ఫోన్ అందుకునే వారికి కనిపిస్తుంది. దీని వల్ల విదేశాల్లో ఉండే వ్యక్తికి సైతం కాల్ఛార్జి తగ్గుతుంది. దీంతో దేశంలోని పలువురు ఆపరేటర్లకు రావాల్సిన ఆదాయం, ప్రభుత్వానికి రావాల్సిన పన్నులకు గండిపడుతోంది. దేశంలోని సర్వీసు ప్రొవైడర్ల ఆదాయానికి గండి కొట్టడం ద్వారా విదేశీ సర్వీసు ప్రొవైడర్ ఆ మొత్తాన్నీ మిగుల్చుకుంటున్నాడు. ఇక్కడ అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసి సహకరించిన స్థానికులు హవాలా రూపంలో కమీషన్ పంపిస్తుంది. నగరానికి చెందిని ఓ మహిళకు ఇటీవల ఓ నెంబర్ నుంచి అభ్యంతర, అశ్లీల సందేశాలు వస్తుండటంతో ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎంతగా ప్రయత్నించినా ఆ నెంబర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రాలేదు. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు ఇంటర్నెట్ ఆధారిత నెంబర్‌గా, వీఓఐపీ పరిజ్ఞానంతో పని చేస్తున్నట్లు గుర్తించారు. సదరు ఇంటర్నెట్ ఆపరేటర్‌ను సంప్రదించిన పోలీసులు హబీబ్‌నగర్ ప్రాంతంలో దాదాపు 60 కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. తొలుత పోలీసులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిందితుల తరఫు వారు దాదాపు గంట సేపు అడ్డుకున్నారు దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు, స్థానిక పోలీసులతో పాటు బస్తీ పెద్దల సహకారంతో ఇంట్లోకి ప్రవేశించి ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో పాటు భారీ ఉపకరణాలు, ఆరు ఎయిర్‌గన్స్, 10 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఆ ఆయుధాలు తమ ఫామ్‌హౌస్‌లో వినియోగించేవిగా నిందితులు వెల్లడించారు. వీరు నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ డైవర్షన్ కేంద్రాలు (అక్రమ ఎక్సేంజ్‌లు) ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేంద్రనగర్ సహా మిగిలిన ప్రాంతాల్లోని వాటిని గుర్తించడంతో పాటు మిగిలిన నిందితుల్ని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో కొన్ని ఎయిర్‌గన్స్ ఉన్నాయి. వీటికి లైసెన్స్ అవసరం లేదు. మరికొన్ని అత్యాధునిక హంటింగ్ గన్స్‌గా గుర్తించాం. వీటికి లైసెన్స్ అవసరమా? లేదా? అనేది పరిశీలిస్తున్నాం. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం’ అని అన్నారు.