call rates
-
బీఎస్ఎన్ఎల్ కాల్ రేట్లు 80% వరకు తగ్గింపు
కొత్త వినియోగదారులకు మొదటి రెండు నెలల్లో వర్తింపు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మొబైల్ కంపెనీ బీఎస్ఎన్ఎల్ కొత్త వినియోగదారులకు కాల్ రేట్లలో భారీ డిస్కాంట్‌ను ఆఫర్ చేస్తోంది. కంపెనీ మౌలిక సదుపాయాలను పునర్వ్యస్థీకరించామని, కొత్త వినియోగదారులకు మొబైల్ కాల్ రేట్లలో 80 శాతం వరకూ డిస్కౌంట్నిస్తామని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాత్సవ చెప్పారు. కొత్తగా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు మొదటి రెండు నెలల్లో కాల్ రేట్లలో 80 శాతం వరకూ డిస్కౌంట్నిస్తామని, నిమిషాల, సెకన్ల బిల్లింగ్ ప్లాన్లకు ఇది వర్తిస్తుందని వివరించారు. రూ.36 ప్లాన్ ఓచర్(సెకన్ బిల్లింగ్), రూ.37 ప్లాన్ ఓచర్(నిమిషాల బిల్లింగ్)లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. రూ.37 ప్లాన్ ఓచర్లో బీఎస్ఎన్ల్ నెట్‌వర్క్‌లో లోకల్, ఎస్టీడీ కాల్స్‌కు నిమిషానికి 10 పైసలు చార్జ్ చేస్తామని చెప్పారు. ఇతర నెట్వర్క్లకైతే ఈ చార్జీ నిమిషానికి 30 పైసలు ఉంటుందని తెలిపారు. ఇక రూ.36 ప్లాన్ ఓచర్లో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో లోకల్, ఎస్టీడీ కాల్స్‌కు ప్రతి మూడు సెకన్లకు 1 పైసా వంతున చార్జ్ చేస్తామని, ఇతర నెట్వర్క్లకైతే ప్రతి 3 సెకన్లకు 2 పైసలు చొప్పున చార్జీ ఉంటుందని వివరించారు. వినియోగదారుల సేవల కోసం ఏజీస్ బీపీవోతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఇక ఈ ఏడాది జూలై-నవంబర్ కాలానికి మొబైల్ నంబర్ పోర్టబిలిటి(ఎంఎన్‌పీ) కింద 1,24,158 మంది తమ నెట్వర్క్ నుంచి వెళ్లిపోగా, 1,57,564 మంది ఇతర నెట్‌వర్క్‌ల నుంచి తమ నెట్‌వర్క్‌లోకి వచ్చారని పేర్కొన్నారు. సెప్టెంబర్ చివరి నాటికి బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య 7.96 కోట్లకు చేరింది. సెప్టెంబర్‌లో కొత్తగా చేరిన మొబైల్ వినియోగదారుల విషయంలో టాప్ ఫైవ్ కంపెనీల్లో ఒకటిగా బీఎస్ఎన్ఎల్ నిలిచింది. -
ఆర్‌కామ్ కాల్ రేట్లు పెరిగాయ్
ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ ప్రధాన టారిఫ్‌ల కాల్ రేట్లను 20 శాతం పెంచింది. ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ రేట్ల పెంపు వర్తిస్తుందని కంపెనీ బుధవారం తెలిపింది. ఈ నెల 25 నుంచి ఈ పెరుగుదల అమల్లోకి వస్తుందని కంపెనీ సీఈవో (కన్సూమర్ బిజినెస్)గుర్దీప్ సింగ్ చెప్పారు. సెకన్‌కు 1.5 పైసలుగా ఉన్న టారిఫ్‌ను 1.6 పైసలకు పెంచామని వివరించారు. దీంతో డిస్కౌంటెడ్ టారిఫ్‌లు పొందే వినియోగదారుల బిల్లులు 20 శాతం పెరుగుతాయని వివరించారు. అంతే కాకుండా రూ.43, రూ.148, రూ.259 స్పెషల్ టారిఫ్ వోచర్లకు ఆఫర్ చేసే నిమిషాల సంఖ్యను కూడా తగ్గించామని పేర్కొన్నారు. పెరుగుతున్న వ్యయాలను తట్టుకోవడానికి, ఉచిత, డిస్కౌంట్ మినిట్స్‌ను తగ్గించే వ్యూహాంలో భాగంగా ఈ టారిఫ్‌లను పెంచామని తెలిపారు. ఈ టారిఫ్‌ల పెంపు కారణంగా ఆదాయం మెరుగుపడుతుందని, లాభదాయకతపై సానుకూల ప్రభావం పడుతుందన్నారు. ఇతర కంపెనీలదీ అదే దారి భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీలూ కాల్ రేట్లను పెంచాయి. డిస్కౌంట్ స్కీమ్‌లకు సం బంధించిన టారిఫ్‌లను పెంచడమే కాకుండా కొన్ని ఉచిత ప్రయోజనాలను తగ్గించాయి. వొడాఫోన్, ఐడియా సెల్యులార్ కంపెనీలు వోచర్ల వ్యాలిడిటీని 30 రోజుల నుంచి 24కు తగ్గించాయి. మొబైల్ ఇంటర్నెట్ సేవలందించడానికి భారీగానే పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందని, రేట్లను పెంచడం మినహా మరో మార్గమేదీ లేదని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విట్టల్ గత నెలలోనే పేర్కొన్నారు. -
టెల్కోల రాబడులు రెట్టింపు!
న్యూఢిల్లీ: టెలికం(టెల్కో) కంపెనీల నిర్వహణ లాభాల వృద్ధి రేటు రెండేళ్లలో రెట్టింపవుతాయని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. కాల్ రేట్లు పెరగడం, టెలికాం విధానాల్లో స్పష్టత రావడం, తదితరాలు దీనికి ప్రధాన కారణాలంటున్న ఈ సంస్థ వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు.., పెద్ద టెలికం కంపెనీల నిర్వహణ లాభాలు రెండేళ్లలో 20 శాతం పెరుగుతాయి. గత ఐదేళ్లలో ఈ కంపెనీల నిర్వహణ లాభాలు 10 % చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. దీంతో పోల్చితే రెండేళ్లలో నిర్వహణ లాభాలు రెట్టింపు కానున్నాయి. ఇటీవలే కొన్ని టెలికం కంపెనీలు కాల్ రేట్లను పెంచాయి. దీనికితోడు టెలికం విధానాల్లో స్పష్టత రావడం వృద్ధికి తోడ్పడనున్నది. టెలికం కంపెనీలకు నిమిషానికి సగటున వచ్చే ఆదాయానికి (ఏఆర్‌పీఎం), ప్రధాన టారిఫ్‌ల మధ్య తేడా 50 శాతంగా ఉంది. టెల్కోలు వినియోగదారులకు భారీస్థాయిలో డిస్కౌంట్ కాల్ రేట్లను ఆఫర్ చేస్తుండడమే దీనికి కారణం. పోటీ తీవ్రత తగ్గుతుండడంతో కంపెనీలు డిస్కౌంట్ కాల్ రేట్లను కూడా తగ్గిస్తున్నాయి. టారిఫ్‌లు నిర్ణయించే అధికారం మరో 2-3 ఏళ్లు టెలికం కంపెనీల చేతుల్లోనే ఉండబోతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టెలికాం కంపెనీల ఆదాయాల్లో 16 శాతంగా ఉన్న డేటా, వాల్యూ యాడెడ్ సర్వీసుల ఆదాయం మధ్య కాలానికి 20 శాతానికి చేరనున్నది. స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరుగుతుండడం, ధరలు తగ్గుతుండటంతో 3జీ సేవల విస్తరణ, డిమాండ్ పెరుగుతుండడం వంటి కారణాల వల్ల కూడా ఆదాయం మరింత పెరగనుంది. స్పెక్ట్రమ్ లభ్యత, స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన రిజర్వ్ ధర నిర్ణయం తదితర అంశాలు సానుకూలంగా పరిష్కారమవుతున్నాయి. -
రూపాయి రికవరీ 42 పైసలు అప్, 60.88 వద్ద క్లోజ్
ముంబై: రూపాయికి మద్దతునిచ్చేందుకు ప్రభుత్వం తాజాగా మరిన్ని చర్యలు తీసుకోవచ్చన్న అంచనాలతో దేశీ కరెన్సీ మారకం విలువ గురువారం గణనీయంగా బలపడింది. డాలర్‌తో పోలిస్తే.. ఆల్‌టైం కనిష్ట ముగింపు స్థాయిల నుంచి కోలుకుని 42 పైసలు పెరుగుదలతో 60.88 వద్ద ముగిసింది. దేశీ స్టాక్ మార్కెట్లు మెరుగ్గా ఉండటం, అటు విదేశాల్లో డాలరు బలహీనపడటం, దీంతో పాటు ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం సైతం రూపాయి బలపడటానికి దోహదపడ్డాయి. ఈ వారాంతంలోగా రూపాయికి మద్దతుగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముందంటూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అరవింద్ మయారాం సూచనప్రాయంగా తెలపడం రూపాయికి కాస్త ఊతమిచ్చింది. దేశీ కరెన్సీ మంగళవారం ఇంట్రాడేలో ఆల్‌టైం కనిష్టమైన 61.80 స్థాయికి పతనమైన సంగతి తెలిసిందే. ప్రతి సోమవారం రూ.22 వేల కోట్ల బాండ్ల అమ్మకం ఇదిలా ఉండగా, రూపాయి క్షీణతకి అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఫారెక్స్ మార్కెట్లో హెచ్చుతగ్గులను కట్టడి చేసే దిశగా ప్రతి సోమవారం రూ. 22,000 కోట్ల మేర ప్రభుత్వ బాండ్లను విక్రయించాలని నిర్ణయించింది. వేలం వ్యవధి ఎంత ఉంటుందన్నది.. వేలం తేదికి ఒక రోజు ముందుగా ప్రకటించడం జరుగుతుందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ద్రవ్య లభ్యతను సమర్ధంగా నిర్వహించేందుకు ఈ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ దోహదపడగలవని పేర్కొంది. డాలర్‌తో పోలిస్తే అంతకంతకూ క్షీణిస్తున్న రూపాయి మారకం విలువ మంగళవారం ఇంట్రాడేలో ఆల్‌టైం కనిష్టమైన 61.80ని తాకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రూపాయి పతనాన్ని నిలువరించే దిశగా.. ద్రవ్య సరఫరాను క ఠినతరం చేయడానికి, స్పెక్యులేషన్ కి అడ్డుకట్ట వేయడానికి ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంది.