Candle rallies
-
జాహ్నవి మృతికి సంతాపంగా అమెరికాలో క్యాండిల్ ర్యాలీ
అమెరికా సియాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల మృతి చెందిన సంగతి తెలిసిందే.అమెరికాలో పోలీసుల నిర్లక్ష్యంతో జరిగిన కారు ప్రమాదానికి బలైపోవడమే గాక మరణానంతరం కూడా వాళ్ల చేతుల్లో జాత్యహంకార హేళనకు గురైన తెలుగు యువతి జాహ్నవి కందుల ఉదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. జాహ్నవి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(AIA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA), బే ఏరియా తెలుగు అసోసియేషన్ సంస్థ(BATA) ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు.జాహ్నవి జ్ఞాపకార్థం కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో నిర్వహించిన ఈ క్యాండిల్ ర్యాలీలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాహ్నవి చిత్రపటానికి నివాళులు అర్పించి.. ఒక నిముషం పాటు మౌనం పాటించారు. సియాటెల్ పోలీసు అధికారి కారు ఢీకొని ప్రమాదంలో మరణించిన జాహ్నవికి న్యాయం జరగాలని ఈ సందర్భంగా నినదించారు. ఆమె మృతికి కారణమైన పోలీసు అధికారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె అకాల మరణంపట్ల ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ప్రముఖులు, నాయకులు సంతాపం తెలిపారు.జాహ్నవి కుటుంబానికి మద్దతుగా ఉంటామని వారు పేర్కొన్నారు. ఏపీ కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) ఈ ఏడాది జనవరి 23న రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది. దీనిపై పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్‌కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ అడెరెర్.. చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయ్యింది. -
నేడు వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీలు
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరుకు, రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న వరుస లైంగిక దాడులకు నిరసనగా నేడు (శనివారం) రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకు ఈ కొవ్వొత్తుల ర్యాలీలను చేపడతామని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దాచేపల్లిలో బాలికపై లైంగిక దాడి అత్యంత బాధాకరమని దీని పట్ల తమ పార్టీ తీవ్ర నిరసన తెలుపుతోందన్నారు. మహిళలకు, బాలికలకు అండగా ఉంటామని, భరోసా కల్పిస్తామని తెలియజేయడానికే ర్యాలీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రోద్భలంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, వారి నిర్లక్ష్య వైఖరే మహిళలపై దౌర్జన్యాలు జరగడానికి అవకాశం కల్పిస్తోందన్నారు. కాగా.. ఈ నెల 14న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ప్రవేశిస్తుందని, ఆ రోజుకు ఆయన 2000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమిస్తారని తెలిపారు. ఇప్పటివరకూ పాదయాత్ర జరిగిన జిల్లాల్లో ప్రజలు ప్రభుత్వం చేతిలో ఎలా వంచనకు గురయ్యారో వైఎస్ జగన్ ప్రత్యక్షంగా చూశారని అన్నారు. రాబోయే రోజుల్లో నవరత్నాలు ద్వారా వారికి భరోసా కల్పిస్తారని చెప్పారు. జగన్ పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు పాదయాత్రలు చేస్తాయన్నారు. చంద్రబాబు మోసాలను ఎండగడుతూ ప్రత్యేక హోదా, విభజన చట్టం అంశాలపై ఎలా మోసం చేశారో ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. 16న ‘వంచనపై గర్జన’ పేరుతో అన్ని కలెక్టరేట్ల వద్ద పార్టీ కార్యకర్తలు ధర్నాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబుకు బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. మహారాష్ట్ర బీజేపీ ఆర్థిక మంత్రి సుధీర్ భార్యకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. ప్రజాధనంతో చంద్రబాబు ధర్మపోరాటం అనే పేరుతో అధర్మ పోరాటం చేస్తున్నారన్నారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ప్రత్యేక హోదా వద్దని చెప్పి రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. ఏపీని అత్యాచారాలకు, అరాచకాలకు, ఎమ్మెల్యేల కొనుగోలుకు అడ్డాగా మార్చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మాఫియా, రేషన్ కార్డుల మాఫియా, జన్మభూమి మాఫియా, ల్యాండ్, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాలను తయారుచేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ఓటుకు కోట్లు తర్వాత రాజధానిని తెరమీదకు తెచ్చి తాత్కాలిక భవనాలు నిర్మించి ఎండాకాలం వర్షాలకే లీకులు వచ్చే పరిస్థితి తెచ్చారని దుయ్యబట్టారు. -
నాది తెలంగాణైనా హోదాకు మద్దతు: సంపూర్ణేష్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఉద్యమానికి హీరో సంపూర్ణేష్ బాబు మద్దతు ప్రకటించారు. ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమానికి తన మద్దతు పూర్తిగా ఉంటుందని స్పష్టం చేశారు. తాను తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడినే అయినప్పటికీ ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతిస్తున్నానని, హోదా వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందని, తెలుగువారంతా సంతోషంగా ఉంటారని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అంటే బిచ్చం అని.. హోదా అనేది స్థాయిని చూపించేది కావున ఆ స్టేటస్ కోసమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌరులు, యువత తీవ్రంగా శ్రమిస్తున్నారని, శాంతియుత పోరాటం చేస్తున్నారని దానికి తన మద్దతు ఉందన్నారు. ఎక్కడ చూసినా పోలీసులు మోహరించి ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తున్నారని, రిపబ్లిక్ డే రోజు కూడా బయటకు రానివ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క, తమ్మారెడ్డి భరద్వాజ కూడా హోదా ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఆర్కే బీచ్‌లో హోదా ఉద్యమానికి మద్దతుగా శాంతియుత దీక్ష చేస్తున్న వారికి మద్దతిచ్చేందుకు తాము వస్తే పోలీసులు అడ్డుకున్నారని, అక్కడికి వెళ్లలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు. పోలీసులు అడ్డుకోవడం అంటే కార్యక్రమం విజయవంతమైనట్లేనని తెలిపారు. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శాంతియుత ఆందోళనకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సమరోత్సాహంతో సన్నద్ధమైన విషయం తెలిసిందే. తమిళనాడులో విజయవంతమైన జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌లోనూ గణతంత్ర దినోత్సవం రోజు జిల్లా కేంద్రాల్లో శాంతియుత ఆందోళన చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. పాలకుల కళ్లు తెరిపించేలా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పేర్కొన్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు, లోక్‌సత్తా తదితర పార్టీలు, బీసీ సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు కూడా ప్రత్యేక హోదా సాధన కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించాయి. అలాగే, విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. -
'ఆంక్షలతో పోరాటాన్ని అణచలేరు'
-
నేడే ‘హోదా’ భేరీ
►రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో శాంతియుత ఆందోళనలు ►‘జల్లికట్టు’ పోరాటం స్ఫూర్తితో ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు ►పాల్గొననున్న వైఎస్సార్సీపీ, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు ►ఆందోళన కార్యక్రమాలకు అనుమతి లేదన్న పోలీసులు ►నేతలను ముందుగానే అదుపులోకి తీసుకోవాలని యోచన ►ఆంక్షలతో పోరాటాన్ని అణచలేరని యువత స్పష్టీకరణ సాక్షి నెట్వర్క్: ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శాంతియుత ఆందోళనకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సమరోత్సాహంతో సన్నద్ధమవుతున్నాయి. తమిళనాడులో విజయవంతమైన జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం రోజు జిల్లా కేంద్రాల్లో శాంతియుత ఆందోళన చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. పాలకుల కళ్లు తెరిపించేలా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పేర్కొన్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు, లోక్‌సత్తా తదితర పార్టీలు, బీసీ సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు కూడా ప్రత్యేక హోదా సాధన కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించాయి. అణచివేతకు ప్రభుత్వ కుట్ర ప్రత్యేక హోదా కోసం నినదించే గళాలను అణచివేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకారులను ఎక్కడికక్కడ నిలువరించేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరిస్తోంది. రాష్ట్రంలో ఆందోళనా కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రకటించారు. పలుచోట్ల 144 సెక్షన్ విధించారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొంటారని భావిస్తున్న ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాల ప్రతినిధులను ముందస్తుగానే అదుపులోకి తీసుకోవాలని యోచిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని తీరుతామని యువత తేల్చిచెబుతున్నారు. ఆర్కే బీచ్‌లో నిరసనకు జగన్ రాక విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో నిర్వహిం చనున్న కొవ్వొత్తుల ప్రదర్శనకు ఇప్పటికే జనం రాక మొదలైంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. విజయ నగరంలో గురువారం కోట జంక్షన్ నుంచి గంటస్తం భం మీదుగా అంబేడ్కర్ జంక్షన్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కూడలి వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వ తీరుపై నిరసన తెలపనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఫైర్‌స్టేషన్ సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. జిల్లాలో ఇప్పటికే 144 సెక్షన్ ఉండగా, మంగళవారం నుంచి సెక్షన్ 30 కూడా అమలు చేస్తున్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో కొవ్వొత్తుల ప్రదర్శనకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. సాయంత్రం ఐదు గంటలకు కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి ప్రారంభమయ్యే కొవ్వొత్తుల ప్రదర్శన భానుగుడి సెంటర్ వరకు కొనసాగనుంది. గుంటూరులోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు నేతలు, యువకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలీసుల తనిఖీలు అనంతపురంలోని సుభాష్‌రోడ్డులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖ రరెడ్డి విగ్రహం వద్ద నుంచి టవర్‌క్లాక్ వరకూ కొవ్వొత్తులతో భారీ ప్రదర్శన చేపట్టనున్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. నగరంలో బుధవారం యువతీ యువకులు పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కర్నూలు జిల్లా కేంద్రంలో ఆందోళన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజలు జిల్లా కేంద్రానికి తరలిరాకుండా పోలీసులు తనిఖీల పేరుతో హడావుడి చేస్తున్నారు. చిత్తూరు వీధుల్లో కొవ్వొత్తుల ర్యాలీకి నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒంగోలు కలెక్టరేట్ (ప్రకాశం భవనం) వద్ద కొవ్వొత్తుల ప్రదర్శనకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ జరపాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది.