వీరనారి లక్ష్మీ సెహగల్..
కెప్టెన్ లక్ష్మీ సెహగల్.. భారత స్వతంత్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ తరఫున కదంతొక్కిన వీర వనిత. అభినవ ఝాన్సీ లక్ష్మీబాయిగా పేరుతెచ్చుకున్న ఆమె నేతాజీ సైన్యంలో కెప్టెన్ స్థాయి వరకు ఎదిగారు. ఈ వీరనారి ఘన చరిత్రను గుర్తుచేసుకుంటూ ‘రిమెంబరింగ్ కెప్టెన్ లక్ష్మీ సెహగల్’ పేరుతో బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 1లోని లామకాన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ ప్రోగ్రామ్‌లో..
లక్ష్మీ సెహగల్ కూతురు రాజకీయ ప్రముఖురాలు సుభాషిని అలీ.. తల్లితో తన జ్ఞాపకాలను పంచుకోనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత లక్ష్మీ సెహగల్ జీవిత విశేషాలపై ఫిల్మ్‌మేకర్ షాద్ అలీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శిస్తారు. ప్రవేశం ఉచితం.