Carolina
-
అమెరికాలో బతుకమ్మ సంబరాలు..!
తెలంగాణ సంస్కృతికి చిహ్నహైన బతుకమ్మ సంబరాలు దేశ విదేశాల్లోనూ అంబరాన్నంటేలా ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడున్న వారి సంస్కృతి, నేపథ్యం మరువమని చెప్పేలా అంతా ఒకచోట చేరి పండుగలు చేసుకోవడం విశేషం. అమెరికాలో నార్త్ కరోలినా కాంకార్డ్ కానన్ రన్ ప్రన్థమ్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో ... బతుకమ్మ పాటలతో తెలంగాణ సంప్రదాయం మురుసింది.. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో తళుక్కుమనారు. (చదవండి: అమెరికాలో బతుకమ్మకు అధికారిక గుర్తింపు) -
మాల్లో గుచ్చుకున్న మేకు.. రూ.75 కోట్ల పరిహారం
అమెరికాలో ఓ మహిళ షాపింగ్ కోసం వాల్‌మార్టు మాల్‌కు వెళ్లితే అనుకోని ప్రమాదం జరిగింది. ఆమె మాల్‌లోకి ప్రవేశించి షాపింగ్ చేస్తున్న సమయంలో కాలికి తుప్పుపట్టిన ఇనుప మేకు గుచ్చుకుంది. చిన్న గాయం కాస్త ఇన్ఫెక్షన్గా మారటంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ కాలును కోల్పోవటంతో ఆరేళ్లపాటు వీల్‌ఛైర్‌కు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ ఘటన 2015 సౌత్ కరోలినాలోని వాల్ మార్టులో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో బాధితురాలైన ఏప్రిల్ జోన్స్ అనే మహిళ 2017లో వాల్‌మార్టు యాజమాన్యంపై నష్టం పరిహారం కేసును ఫ్లోరెన్స్ కౌంటీలోని కోర్టులో దాఖలు చేశారు. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు 10 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని వాల్ మార్టును ఆదేశించింది. ఆమె తరఫున వాదనలు జరిపిన అనస్టోపౌలో న్యాయ సంస్థ న్యాయవాదులు.. ఏప్రిల్ జోన్స్ ఆరేళ్లపాటు వీల్ ఛైర్‌కే పరిమితమైందని, ఆమె జీవితం ఈ ఘటన ద్వారా చెల్లాచెదురై ఇబ్బందులు ఎదుర్కొందని కోర్టుకు వివరించారు. వారి వాదనలను సమర్ధిస్తూ బాధిత మహిళకు 10 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 75 కోట్లు) నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించింది. ఆమె ప్రొస్తెటిక్ కాలును కొనుగోలు చేయడానికి.. భవిష్యత్తు వైద్య బిల్లులను కవర్ చేయడానికి నష్టం పరిహారం డబ్బును ఉపయోగిస్తుందని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ తీర్పుపై బాధితురాలు, ఆమె తరఫున వాదనలు వినిపించిన న్యాయసంస్థ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. -
ఫ్లోరెన్స్.. కేటగిరీ–4 తుపాను
విల్మింగ్టన్: అమెరికాకు పెనుముప్పుగా పొంచి ఉన్న కేటగిరీ–4 భీకర తుపాను ఫ్లోరెన్స్ గంటకు 225 కి.మీ. వేగంతో కరోలినా తీరానికి చేరువగా వచ్చింది. అప్రమత్తమైన తీర ప్రాం తంలోని ప్రజలు నిత్యావసరాలను వెంట తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. నీరు, ఆహారం, ఇతర తినుబండారాలు కొనేందుకు ప్రజలు మార్ట్ల ముందు బారులు తీరారు. చాలా దుకాణాల్లో ఇప్పటికే సరుకు నిల్వలు అయిపోయాయి. గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం హరికేన్ తూర్పు తీరాన్ని తాకొచ్చని అంచనా. ఆ తరువాత దాని ఉధృతి తగ్గి 30–60 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసే అవకాశాలున్నట్లు హెచ్చరించారు. దీని ఫలితంగా లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవడంతో పాటు, పర్యావరణం మీద కూడా భారీ ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఉత్తర, దక్షిణ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుపాను అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అత్యంత ప్రమాదకర కేటగిరీ–4కు చెందిన హరికేన్లు తూర్పు తీరాన్ని తాకడం అరుదని ఐరాస పేర్కొంది. -
అమెరికాను వణికిస్తున్న హరికేన్ ఫ్లోరెన్స్
-
ప్రత్యర్థి ‘మారిన్’ది...
♦ కరోలినా రూపంలో కొత్త కెరటం ♦ సైనా విజయాలకు అడ్డంకి ♦ భవిష్యత్తులోనూ హోరాహోరీకి అవకాశం ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఇన్నాళ్లూ చైనా ఆటగాళ్లను ఓడిస్తే చాలు... ఏదో ఒక పతకం చిరునామా వెతుక్కున్నట్లుగా వచ్చి చేతిలో వాలేది. చైనా గోడను దాటితే, చైనా డ్రాగన్‌ను పడగొడితే ఇక తిరుగులేదని భావన షట్లర్ల మదిలో ఉండేది. దానికి మన స్టార్ సైనా నెహ్వాల్ కూడా మినహాయింపు కాదు. షిజియాన్ వాంగ్ కానీ యిహాన్ వాంగ్ కానీ ...లేదంటే లీ జురుయ్ కావచ్చు. సైనా కెరీర్లో సాధించిన అత్యుత్తమ విజయాల్లో చైనీయులను ఓడించి సాధించినవే ఉన్నాయి. అయితే అనూహ్యంగా ఒక్క చైనా షట్లర్ కూడా లేకుండా తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో మహిళల సెమీఫైనల్స్ జరిగాయి. ఈ మార్పు ఇప్పుడు ఫైనల్లో మన సైనానే తాకింది. వరల్డ్ నంబర్‌వన్ కరోలినా మారిన్ రూపంలో ఇప్పుడు ఆమె ముందు కొత్త సవాల్ నిలిచింది. సూపర్ ఫాస్ట్‌గా... గత ఏడాది వ్యవధిలో ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సర్క్యూట్లో అత్యంత వేగంగా దూసుకొచ్చిన ప్లేయర్‌గా కరోలినాను చెప్పవచ్చు. ఎడమచేతి వాటం అయిన ఈ అమ్మాయి వరుస విజయాలతో తనదైన ముద్ర వేసింది. జూనియర్ యూరోపియన్ టోర్నీలలో నిలకడగా రాణించిన ఆమె 2013 వరకు కూడా సీనియర్స్ విభాగంలో చిన్నా చితకా టోర్నీలకే పరిమితమైంది. ఆ ఏడాది లండన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ విజయంతో తొలిసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ విజేతగా నిలవడంతో పాటు, ఈ ఏడాది నాలుగు పెద్ద టైటిల్స్ గెలవడం కరోలినాను స్టార్‌ను చేసింది. 2015లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్, మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్, ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్, తాజాగా మళ్లీ వరల్డ్ చాంపియన్‌షిప్ విజయం మారిన్ స్థాయిని పెంచాయి. ఈ ఏడాది జూన్ రెండో వారంలో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన మారిన్ దానిని ఇప్పుడు మరింత పటిష్ట పర్చుకుంది. ఏడాదిలో రెండోసారి... ఈ ఏడాది మార్చిలో ఆల్ ఇంగ్లండ్‌కు ముందు కరోలినాతో తలపడిన మూడుసార్లు సైనానే విజయం వరించింది. ఇండోనేసియా, ఆస్ట్రేలియన్ ఓపెన్లతో పాటు సొంతగడ్డపై జనవరిలో జరిగిన సయ్యద్ మోడి టోర్నీ ఫైనల్లో కూడా ఆమెను సైనా చిత్తు చేసింది. కానీ నెల రోజుల్లో సీన్ మారిపోయింది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఫైనల్లో మారిన్ చెలరేగింది. తొలి గేమ్ కోల్పోయి కూడా పట్టుదలగా ఆడిన ఆమె, చివరి గేమ్‌ను ఏకపక్షంగా 21-7తో నెగ్గి మరీ సత్తా చాటింది. ఇప్పుడు మరోసారి ఆమెకే వరుస గేమ్‌లలో సైనా దాసోహమంది. సైనాకంటే మూడేళ్లు చిన్నదైన (22 ఏళ్లు) ఈ స్పెయిన్ అందం మున్ముందు కూడా అడ్డంకిగా మారవచ్చు. సూపర్ సిరీస్‌లాంటి పెద్ద టోర్నీలే కాదు... వచ్చే ఏడాది ఒలింపిక్ పతకంపై గురి పెట్టిన హైదరాబాద్ క్రీడాకారిణికి ఏ దశలోనైనా ఎదురుకావచ్చు. ఇంత కాలం చైనా ప్లేయర్ల లోపాలను గుర్తించి సిద్ధమవుతూ వచ్చిన సైనా... ఇకపై కరోలినా కోసం కూడా కొత్త వ్యూహాలతో సాధన చేయాల్సి ఉంటుంది. -సాక్షి క్రీడావిభాగం