Cash withdrawal limit
-
నేటి నుంచి రూ.50వేలు తీసుకోవచ్చు
-
నేటి నుంచి రూ.50వేలు తీసుకోవచ్చు
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు విత్ డ్రా పరిమితులతో ఇబ్బందులు పడ్డ ఖాతాదారులకు నేటి నుంచి ఓ శుభవార్త. సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ నేటి నుంచి వారానికి రూ.50వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. జనవరి 30న జారీచేసిన నోటిఫికేషన్లో దశల వారీగా నగదు విత్ డ్రాలపై ఆంక్షలు ఎత్తివేస్తామని చెప్పిన ఆర్బీఐ, ఆ నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 20 నుంచి సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ వారానికి రూ.50వేలు డ్రా చేసుకోవచ్చు. ఇన్ని రోజులు ఈ పరిమితి రూ.24వేలుగా ఉండేది. మార్చి 13 నుంచి ఈ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నారు. ప్రస్తుతమైతే, కరెంట్ అకౌంట్ హోల్డర్స్‌కు నగదు విత్ డ్రాలపై ఎలాంటి పరిమితులు లేవు. వ్యవసాయదారులైతే వారానికి రూ.50 వేలు, వివాహానికి రూ.2.5 లక్షల విత్ డ్రాయల్స్‌ను అనుమతిస్తున్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ 2016 నవంబర్ 8న సంచలన ప్రకటన చేసిన అనంతరం రిజర్వు బ్యాంకు ఏటీఎంలలలో, బ్యాంకు బ్రాంచులలో నగదు విత్ డ్రాయల్స్‌పై ఆంక్షలు విధించింది. కొద్దికొద్దిగా కరెన్సీ కష్టాలు తొలగిస్తూ వస్తున్న ఆర్బీఐ, వారానికి విత్ డ్రా పరిమితిని రూ.50వేలకు పెంచిన సంగతి తెలిసిందే. (చదవండి: నగదు విత్ డ్రా పై ఆంక్షలు ఎత్తివేత!) -
నగదు విత్‌డ్రా పై ఆంక్షలు ఎత్తివేయాలి
-
విత్‌డ్రా పరిమితిని రూ.5లక్షలకు పెంచండి!
పెద్దనోట్ల రద్దుతో ఉత్పత్తి చైన్‌లో ఏర్పడిన అవాంతరాలకు ఆందోళన చెందుతున్న ఎగుమతిదారులకు వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. వారు కోరుతున్నట్లు విత్‌డ్రా పరిమితులు పెంచాలనే డిమాండ్‌ను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. నోట్ల రద్దు ప్రభావంతో ఉత్పత్తి చైన్‌లో ఏర్పడిన అడ్డంకులపై ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కౌన్సిల్ సోమవారం సీతారామన్‌తో భేటీ అయింది. నోట్ల రద్దుతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మంత్రితో కౌన్సిల్ చర్చించింది. ముడి పదార్థాల సేకరణ విభాగంలో ఎక్కువగా నగదు లావాదేవీలే జరుగుతాయని చాలామంది చెప్పినట్టు సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న విత్‌డ్రా పరిమితి రూ.50వేల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ఎగుమతిదారులు డిమాండ్ చేస్తున్నట్టు ఆమె తెలిపారు. కార్పెట్, హ్యాండ్లూమ్ వంటి రంగాల్లో కార్మికులు ఎక్కువగా ఉంటారని, ఈ రంగాలు నగదు లావాదేవీలపైనే పనిచేస్తాయని, వారు విత్‌డ్రా పరిమితిని రూ.3 లక్షలు లేదా రూ.4 లక్షలు లేదా రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఎగుమతిదారులు కోరుతున్న ఈ డిమాండ్లను వెంటనే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి దృష్టికి తీసుకెళ్తామని, వెంటనే దీనికి ఉపశమన చర్యలు తీసుకునేలా సహకరిస్తామని హామీ ఇచ్చినట్టు సీతారామన్ వివరించారు. నగదు ఉపసంహరణ పరిమితులతో కొన్ని రంగాలోని యూనిట్లు వారం రోజులు నిలిపివేయాలని నిర్ణయించగా.. కొన్ని యూనిట్లు 100 లేదా 70 శాతంగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 35 నుంచి 40 శాతానికి కుందించనున్నాయి.