విత్డ్రా పరిమితిని రూ.5లక్షలకు పెంచండి! | Exporters seek higher cash withdrawal limit, will urge Finance Ministry for relaxation: Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

విత్డ్రా పరిమితిని రూ.5లక్షలకు పెంచండి!

Published Mon, Nov 21 2016 6:28 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

విత్డ్రా పరిమితిని రూ.5లక్షలకు పెంచండి!

విత్డ్రా పరిమితిని రూ.5లక్షలకు పెంచండి!

పెద్దనోట్ల రద్దుతో ఉత్పత్తి చైన్లో ఏర్పడిన అవాంతరాలకు ఆందోళన చెందుతున్న ఎగుమతిదారులకు వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. వారు కోరుతున్నట్లు విత్డ్రా పరిమితులు పెంచాలనే డిమాండ్ను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు నిర్మలా సీతారామన్  హామీ ఇచ్చారు. నోట్ల రద్దు ప్రభావంతో ఉత్పత్తి చైన్లో ఏర్పడిన అడ్డంకులపై ఎక్స్పోర్టు ప్రమోషన్ కౌన్సిల్ సోమవారం సీతారామన్తో భేటీ అయింది. నోట్ల రద్దుతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మంత్రితో కౌన్సిల్ చర్చించింది. ముడి పదార్థాల సేకరణ విభాగంలో ఎక్కువగా నగదు లావాదేవీలే జరుగుతాయని చాలామంది చెప్పినట్టు సీతారామన్ పేర్కొన్నారు.
 
ప్రస్తుతమున్న విత్డ్రా పరిమితి రూ.50వేల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ఎగుమతిదారులు డిమాండ్ చేస్తున్నట్టు ఆమె తెలిపారు. కార్పెట్, హ్యాండ్లూమ్ వంటి రంగాల్లో కార్మికులు ఎక్కువగా ఉంటారని, ఈ రంగాలు నగదు లావాదేవీలపైనే  పనిచేస్తాయని, వారు విత్డ్రా పరిమితిని రూ.3 లక్షలు లేదా రూ.4 లక్షలు లేదా రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఎగుమతిదారులు కోరుతున్న ఈ డిమాండ్లను వెంటనే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి దృష్టికి తీసుకెళ్తామని, వెంటనే దీనికి ఉపశమన చర్యలు తీసుకునేలా సహకరిస్తామని హామీ ఇచ్చినట్టు సీతారామన్ వివరించారు. నగదు ఉపసంహరణ పరిమితులతో కొన్ని రంగాలోని యూనిట్లు వారం రోజులు నిలిపివేయాలని నిర్ణయించగా..  కొన్ని యూనిట్లు 100 లేదా 70 శాతంగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 35 నుంచి 40 శాతానికి కుందించనున్నాయి.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement