cassowary
-
ప్రతి రోజు రావడం.. రేగు పళ్లు తినడం.. ఏడాదిగా ఇదే పని
కొన్ని భయంకరమైన జంతువులను దూరం నుంచి చూడటమో లేక టీవీల్లో చూడటమో చేస్తాం. కానీ వాటిని నేరుగా చూడాలని అనుకోము. కానీ ఇక్కడొక వ్యక్తి షాపుకి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షి ఒకటి ప్రతిరోజు వస్తోందట. (చదవండి: ఘోర బస్సు ప్రమాదం...19 మంది దుర్మరణం) అసలు విషయంలోకెళ్లితే... ఆస్ట్రేలియాలో ఉత్తర క్వీన్స్‌ల్యాండ్‌లోని జులటెన్ నివశిస్తున్న టోనీ ఫ్లెమింగ్ అనే వ్యక్తి వడ్రంగి షాపుకి ఒక ప్రమాదకరమైన కాసోవరి అనే పక్షి రోజు వస్తోందట. పైగా ఈ కాసోవరి పక్షి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షి మాత్రమే కాదు చాలా శక్తిమంతంగా దాడిచేస్తాయి. అంతేకాదు ఈ కాసోవరి పక్షి 1.8 మీటర్ల పొడవు, 70 కిలోగ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. పైగా వాటి గోళ్లు 10 సెం.మీ వరకు పొడవు పెరుగతాయి. అందువల్లే అది చాలా భయంకరంగా దాడిచేస్తుంది. అయితే ఈ పక్షి ఒక ఏడాది నుంచి తన షాప్‌లోకి దర్జాగా వచ్చేయడమే కాక అక్కడ ఉన్న రేగు పళ్ళను తినేసి వెళ్లిపోతుందని చెబుతున్నాడు. చాలామంది తమ చుట్టపక్కల స్నేహితులు వచ్చి ఫోటోలు తీసుకుంటారని కూడా అంటున్నాడు. పైగా అది మా ఇంటి ఆవరణలో సైతం తిరుగుతున్నట్లు గమనించామని, పైగా స్థానికులు దానికి పెంపుడు జంతువు మాదిరిగా ఆహారం పెడుతున్నారని చెప్పాడు. అయితే టోనీ ఈ పక్షి "రోంపర్ స్టాంపర్" అని పేరు కూడా పెట్టాడు. కానీ ఇది స్థానికులందరితో కలిసి ఉండదని చెబుతున్నాడు. పైగా అక్కడ నగరంలో ప్రసిద్ధి గాంచిన పబ్‌లో కూడా తిరగడమే కాక అక్కడ రోడ్డుపై వెళ్లుతున్న ఒక వ్యక్తి పై దాడి కూడా చేసిందని అన్నాడు. అయితే అతను అదృష్టం కొద్ది ప్రాణాలతో బయటపడినట్లు టోనీ చెప్పుకొచ్చాడు. (చదవండి: ఆ పిల్లాడి కంటే ఈ కుక్క పిల్లే భలే మాట్లాడేస్తోంది!!!) -
మనుషుల్ని గోళ్లతో చీల్చి చంపేసే భయంకరమైన పక్షి గురించి తెలుసా?
కోట్ల ఏళ్ల కిందటి శిలాజం ఒకటి.. కోట్ల ఏళ్లనాటి జీవికి ప్రతిరూపం ఇంకోటి. రెండూ డేంజరే. ఒకదాని ఆనవాళ్లను ఇప్పుడే కొత్తగా కనుగొనగా.. మరోటి ఎప్పట్నుంచో మన మధ్యే ఉన్నా దానికి సంబంధించిన కొత్త సంగతులు ఇప్పుడే బయటపడ్డాయి. ఇందులో ఒకటి ‘సెరాటోసుచోప్స్ ఇన్ఫెరోడియోస్’ అనే రాక్షసబల్లికాగా.. మరోటి ఆ రాక్షస బల్లుల వారసత్వంగా మిగిలిన ‘కాస్సోవరీ’ అనే పక్షి. మరి ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? రెండు కొత్త డైనోసార్లు ఖడ్గమృగం లాంటి కొమ్ము.. మొసలిలాంటి తల..పది మీటర్ల పొడవు.. శత్రువులను చీల్చేసే బలమైన కోరలు.. ఓ భయంకరమైన కొత్త డైనోసార్ రూపమిది. ఇటీవలే యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ శాస్త్రవేత్తలు ఇంగ్లండ్ పరిధిలోని ‘ఐసిల్ ఆఫ్ వెయిట్’ ద్వీపంలో దీని శిలాజాలను గుర్తించారు. దానికి ‘సెరాటోసుచోప్స్ ఇన్ఫెరోడియోస్’ అని పేరుపెట్టారు. దీనికితోడుగా కనిపెట్టిన మరో కొత్త డైనోసార్‌కు ‘రిపరోవెనటార్ మిల్నెరీ’ అని పేరుపెట్టారు. 12.5 కోట్ల ఏళ్ల కింద ఇవి తిరుగాయని.. వీటిలో సెరాటోసుచోప్స్ భయంకరమైనదని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్ బార్కర్ తెలిపారు. వీటి పొడవు 29 అడుగుల వరకు ఉంటుందని, అందులో తల పొడవే 3 అడుగుల (మీటర్) వరకు ఉంటుందని వివరించారు. హెరోన్గా పిలిచే ఓ కొంగ వంటి పక్షి తరహాలో ఈ రెండు డైనోసార్లు కూడా చేపలను, ఇతర జంతువులను వేటాడి ఉంటాయని తెలిపారు. ఈ ‘ఐసిల్’లో ఎన్నో వింతలు ఇంగ్లండ్ పరిధిలోని ఐసిల్ ఆఫ్ వెయిట్ ద్వీపం ఎన్నో పురాతన శిలాజాలకు, వింతలకు నిలయం. ఇక్కడ కోట్ల ఏళ్లనాటి శిలాజాలను ఎన్నింటినో గుర్తించారు. మనం చెరువుల్లో, నదుల్లో నత్తలను చూస్తుం టాం. వాటి పరిమాణం మహా అయితే నాలుగైదు అంగుళాల వరకు ఉంటుంది. కానీ ఐసిల్ ద్వీపంలో కోట్ల ఏళ్లనాటి భారీ అమ్మోనైట్ (నత్త గుల్ల వంటి జీవి) శిలాజాన్ని 2020లో గుర్తించారు. 20 అంగుళాలు ఉన్న ఈ శిలాజం 95 కిలోలకుపైగా బరువు ఉండటం గమనార్హం. ఈ ద్వీపంలో నీయోవెనటర్, టెరోసార్ వంటి డైనోసార్లు, సూపర్టెరోసార్గా పిలిచే భారీ డైనోసార్ పక్షి, కాకి అంత పరిమాణంలో ఉండే మరో చిన్న డైనోసార్ పక్షి, కోట్ల ఏళ్ల నాటి మొసళ్లు, ఇతర జీవుల శిలాజాలను ఇప్పటికే గుర్తించారు. వాటన్నింటితో ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. డైనోసార్లను మరిపించేలా.. డైనోసార్లకు ఉండేలా తలపై పెద్ద ముట్టె.. పొడవైన ముక్కు.. రెండు కాళ్లకు కత్తుల్లాంటి పొడవాటి పదునైన గోళ్లు.. చూడగానే కాస్త డైనోసార్ల పోలికలు.. ‘కాస్సోవరీ’గా పిలిచే ఈ పక్షిని అత్యంత ప్రమాదకరమైన పక్షిగా పరిగణిస్తారు. ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తుంది. మనుషులు మొదట్లో పెంచుకున్నది కోళ్లు, బాతులను కాదు.. ఈ ‘కాస్సోవరీ’ పక్షులనేనట. తాజాగా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. ఆది మానవుల నివాస ప్రాంతాలపై అధ్యయనం చేస్తున్న ఈ శాస్త్రవేత్తలకు కొన్ని రకాల గుడ్ల పెంకులు, పక్షుల ఎముకలు లభించాయి. వాటిపై లేజర్ మైక్రోస్కొపీ, ఇతర పద్ధతుల్లో అధ్యయనం చేసి.. కాస్సోవరీ పక్షులకు చెందినవిగా గుర్తించారు. కొన్ని గుడ్లను కాల్చుకుని తిన్నట్టుగా, మరికొన్ని పొదిగి పిల్లలు బయటికి వచి్చనట్టుగా తేల్చారు. సుమారు 18 వేల ఏళ్ల కింద ఆది మానవులు వీటిని మాంసం, ఈకలు, గుడ్ల కోసం పెంచుకుని ఉంటారని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ క్రిస్టినా డగ్లస్ తెలిపారు. గోళ్లతో చీల్చేస్తుంది..! ఏకంగా ఆరు అడుగుల ఎత్తు, 59 కిలోల బరువు వరకు పెరిగే ఈ కాస్సోవరీ పక్షులు ప్రస్తుతం భూమ్మీద ఆస్ట్రిచ్‌ల తర్వాత అతిపెద్ద పక్షిజాతిగా చెప్పవచ్చని డగ్లస్ పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమైన పక్షి అని.. ఇతర పక్షులు, జంతువులతోపాటు మనుషులను కూడా గోళ్లతో చీల్చేసే సామర్థ్యం వీటికి ఉంటుందని తెలిపారు. ఆ్రస్టేలియాలోని న్యూగినియాలో స్థానికులు ఇప్పటికీ ఈ కాస్సోవరీ పక్షుల మాంసం తినడం గమనార్హం. యజమానిని చంపేసింది 2019లో అమెరికాలోని ఫ్లారిడాలో ఒక కాస్సోవరీ పక్షి.. తనను పెంచుకుంటున్న మార్విన్ హజోస్ అనే వ్యక్తిని గోళ్లతో చీల్చి చంపేసింది. విషయం ఏమిటంటే ఆయన ఓ పర్యావరణ ప్రేమికుడు. ఈ పక్షి ఒక్కదాన్నే కాదు.. ఇలాంటి చిత్రమైన మరో వంద రకాల పక్షులు, జంతువులను తన ఎస్టేట్‌లో పెంచేవాడు. ఆయన చనిపోయాక వాటన్నింటినీ వేలం వేశారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
వామ్మో.. ఇది చాలా డేంజర్ పక్షి!
చూడ్డానికి కలర్ఫుల్గా.. కాసింత కామెడీగా కనిపిస్తోంది కానీ.. ఇది ఖతర్నాక్ టైపు.. మన సినిమాల్లో కామెడీ విలన్లుంటారే.. పక్షుల్లో ఇది ఆ టైపన్నమాట.. పేరు కాసొవెరీ.. ఇంతకీ విలన్ అని ఎందుకు అన్నామంటే.. ఈమధ్యే ఓ మనిషిని ఇది ఫసాక్ చేసేసింది.. నమ్మడం లేదా.. దాని కాళ్ల వైపు ఓ లుక్కేసుకోండి.. చూశారుగా.. పిక్కలు ఎంత బలంగా ఉన్నాయో.. ఆ గోర్లు మినీ కత్తుల్లాగే.. అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వ్యక్తిని గాడిదలాగ కాళ్లతో ఎగిరెగిరి తన్నడంతో అతడు ఆస్పత్రిలో కన్నుమూశాడు.. అందుకే వీటిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పక్షుల్లో ఒకటిగా పిలుస్తారు. వీటిని పెంపుడు జంతువులుగా ఉంచుకోవాలంటే ప్రత్యేకమైన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దాని యజమానులు కొన్ని పరీక్షలు పాసవ్వాల్సి ఉంటుంది. అప్పుడే అధికారులు అనుమతిస్తారు. ఎగిరెగిరి తన్నింది కానీ.. నిజానికి ఇది ఎగరలేదు.. ఈమూ పక్షి టైపు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు వరకూ పెరుగుతుంది. 60 కిలోల బరువుంటుంది. ఇండోనేసియా, నార్త్ ఈస్ట్ ఆస్ట్రేలియాతోపాటు ఆసియాలోని పలు దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తనకేదైనా ముప్పు ఉందని భావిస్తేనే.. అది దాడి చేస్తుందట. అంటే.. దానికి భయం మొదలైందంటే.. మనకి బ్యాడ్‌టైమ్ మొదలైనట్లే! -
అతిథిని చూసి పరుగులు తీశారు!
సిడ్నీ: అనుకోని అతిథి ఇంటికి వస్తే ఎంతో సర్ ప్రైజింగ్ గా ఫీలవుతాం. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు అంటూ ఆనందంగా ఆహ్వానిస్తాం. పైగా ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరికి పడితే వారికి కనిపించని అరుదైన అతిథి వస్తే... ఇక ఆనందానికి అవధులే ఉండవు. కానీ ఓ ఆస్ట్రేలియన్ దంపతులు వారింటికి అరుదుగా వచ్చిన అతిథిని చూసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని భయంతో పరుగులు తీశారట. చుట్టుపక్కల వారి సహాయంతో పట్టుకొని బంధించేందుకు ప్రయత్నించారట. ఇంతకూ ఆ భయంకర అతిథి వివరాలేమిటో ఓసారి చూద్దామా...? ఆస్ట్రేలియాలో నార్త్ క్వీన్స్ ల్యాండ్ స్టేట్ లోని వాంగలింగ్ బీచ్ ప్రాంతంలో నివసించే పీటర్, సూ లీచ్ దంపతులు తమ ఇంటికి వచ్చిన జెయింట్ ఫ్లైట్లెస్ కాసోవరీ పక్షిని చూసి పరుగులు తీశారట. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షులుగా జెయింట్ ఫ్లైట్లెస్ కాసోవరీ జాతి పక్షులను చెప్తారు. అటువంటి పక్షి అనుకోకుండా ఆ దంపతుల ఇంటికి అరుచుకుంటూ రావడంతో ముందు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అదో ప్రమాదకర పక్షి అని గుర్తించి పరుగులు తీశారు. రెండు మీటర్ల పొడవు.. సుమారు 70 కిలోల బరువుండే ఆ పక్షి.. నల్లని రెక్కలు, పొడవైన ముక్కు, మెడవద్ద నీలిరంగు, తలపై చిన్నపాటి పించంతో చూసేందుకు మాత్రం పెద్ద సైజు నెమలిని పోలి ఉంటుంది. ముందుగా పక్షిని చూసిన తన భర్త... ఇంటికి ఎవరొచ్చారో చూడు.. అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడని, తీరా అది ప్రమాదకర కాసోవరీస్ పక్షి అని గుర్తించి అతడు డైనింగ్ టేబుల్ వెనక దాక్కున్నాడని, తాను మాత్రం బయటకు పరుగు తీశానని సూలీచ్ తెలిపింది. విషయం తెలసిన పొరుగువారు ఆ పక్షి అత్యంత ప్రమాదకరమైన పక్షి అని, దగ్గరలోని రైన్ ఫారెస్ట్ నుంచి వచ్చి ఉంటుందని, ఇంతకుముందెప్పుడూ ఎవరింటికీ రాలేదని తెలిపారని సూలీచ్ అంటోంది. ఆ ప్రమాదకరమైన, అరుదైన కాసోవరీ పక్షి జాతి.. ఆస్ట్రేలియా ఈశాన్య క్వీన్స్ ల్యాండ్ ప్రాంతంలోని రైన్ ఫారెస్టుల్లోనూ, కొన్ని ఐస్ ల్యాండ్ ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. అత్యంత బరువైన, పొడవైన ఆపక్షిని ప్రపంచంలోనే ప్రమాదకరమైన పక్షిగా గుర్తించారు. అది దాని పొడవైన కాళ్ళతో మనుషులు, పెంపుడు జంతువులపై దాడి చేస్తుంటుంది. 2003 లెక్కల ప్రకారం క్వీన్స్ ల్యాండ్ ప్రాంతంలో ఈ కాసోవరీ పక్షి దాడికి ఎనిమిదిమంది గురైనట్లు, 1926-1999 మధ్య ప్రాంతంలో తీవ్ర గాయాలైన ఒకరు మృతి చెందినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఆస్ట్రేలియాలో ఈ జాతి పక్షులు సుమారు 2 వేల వరకూ ఉండొచ్చని పదహారేళ్ళ క్రితంనాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తోంది.