
చూడ్డానికి కలర్‌ఫుల్‌గా.. కాసింత కామెడీగా కనిపిస్తోంది కానీ.. ఇది ఖతర్నాక్ టైపు.. మన సినిమాల్లో కామెడీ విలన్లుంటారే.. పక్షుల్లో ఇది ఆ టైపన్నమాట.. పేరు కాసొవెరీ.. ఇంతకీ విలన్ అని ఎందుకు అన్నామంటే.. ఈమధ్యే ఓ మనిషిని ఇది ఫసాక్ చేసేసింది.. నమ్మడం లేదా.. దాని కాళ్ల వైపు ఓ లుక్కేసుకోండి.. చూశారుగా.. పిక్కలు ఎంత బలంగా ఉన్నాయో.. ఆ గోర్లు మినీ కత్తుల్లాగే.. అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వ్యక్తిని గాడిదలాగ కాళ్లతో ఎగిరెగిరి తన్నడంతో అతడు ఆస్పత్రిలో కన్నుమూశాడు.. అందుకే వీటిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పక్షుల్లో ఒకటిగా పిలుస్తారు. వీటిని పెంపుడు జంతువులుగా ఉంచుకోవాలంటే ప్రత్యేకమైన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దాని యజమానులు కొన్ని పరీక్షలు పాసవ్వాల్సి ఉంటుంది. అప్పుడే అధికారులు అనుమతిస్తారు. ఎగిరెగిరి తన్నింది కానీ.. నిజానికి ఇది ఎగరలేదు.. ఈమూ పక్షి టైపు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు వరకూ పెరుగుతుంది. 60 కిలోల బరువుంటుంది. ఇండోనేసియా, నార్త్ ఈస్ట్ ఆస్ట్రేలియాతోపాటు ఆసియాలోని పలు దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తనకేదైనా ముప్పు ఉందని భావిస్తేనే.. అది దాడి చేస్తుందట. అంటే.. దానికి భయం మొదలైందంటే.. మనకి బ్యాడ్‌టైమ్ మొదలైనట్లే!
Comments
Please login to add a commentAdd a comment