Cattle bones
-
ఇళ్ల మధ్యే కుళ్లిన మాంసం నిల్వలు
నెల్లూరు సిటీ: వందలాది ఇళ్లు.. అందరూ పేదలే.. నిత్యం వ్యాధులతో హాస్పిటల్ పాలవుతుంటారు.. ఏళ్ల తరబడి కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా ఆవు మాంసం వ్యాపారం చేస్తున్నారు. ఇళ్ల మధ్య ఆవులను వధించి, వాటి మాంసాన్ని ఇతర ప్రాంతాలకు, హోటల్స్, రెస్టారెంట్లకు తరలిస్తుంటారు. ఆదివారం ఎంహెచ్ఓ వెంకటరమణ తన బృందంతో ఆకస్మిక దాడులు చేశారు. నిల్వ మాంసాన్ని గుర్తించారు. కుళ్లిపోయిన మాంసం, ఎముకలను గోదాముల్లో నిల్వ చేసి ఉంచిన వైనాన్ని చూసి అధికారులు అవాక్కయ్యారు. సుమారు 400 కేజీ ల మేర నిల్వ ఆవు మాంసాన్ని నిర్వీర్యం చేయగా, ఫ్రీజర్లను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వివరాల మేరకు.. పలుమార్లు చెప్పినా.. నగరంలోని బోడిగోడతోట ప్రధాన రహదారిలో కొందరు వ్యక్తులు స్కిన్ మర్చంట్స్ కింద అనుమతుల్లేకుండా వ్యాపారం చేస్తున్నారు. గోదాములో వధించిన ఆవుల చర్మాన్ని తొలగించి, మాంసాన్ని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంకా కుళ్లిపోయిన మాంసం, ఆవుల ఎముకులు, వాటి కళేబరాలను నిల్వ చేశారు. ఏళ్ల తరబడి ఇళ్ల మధ్యే కళేబరాలను ఉంచడంతో స్థానికులకు దుర్వాసన వచ్చేది. ఎన్నిసార్లు నిర్వాహకులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. ఈక్రమంలో స్థానికులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కొన్నినెలలుగా దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. దీంతో హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ తన బృందంతో ఆదివారం ఉదయం ఆకస్మిక దాడులు చేశారు. కెమికల్ ఫ్యాక్టరీలకు నోటీసులు బోడిగోడతోట ప్రాంతంలో మూడు కెమికల్ ఫ్యాక్టరీలు నిర్వహిస్తున్నారు. వాటిని ఎంహెచ్ఓ వెంకటరమణ తనిఖీ చేశారు. ఫ్యాక్టరీకి సంబంధించిన పత్రాలను నిర్వాహకులు చూపలేదు. దీంతో ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో కెమికల్ ఫ్యాక్టరీలను నిర్వహించకూడదని వెంకటరమణ చెప్పారు. వాటికి నోటీసులు జారీ చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల్లో ఫ్యాక్టరీలను వేరే ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీ ఇళ్లలో ఇలా ఉంచుకుంటారా? నిబంధనల ప్రకారం ఇళ్ల మధ్య తోళ్ల వ్యాపారం చేయకూడదు. అయితే కొందరు వ్యక్తులు స్కిన్ మర్చంట్స్ పేరుతో ఆవులు, మేకలు, పొట్టేళ్ల తోళ్లను తొలగించి వాటిని ఎగుమతి చేస్తున్నారు. గోదాముల్లో కుళ్లిన మాంసాన్ని, ఎముకులను, కళేబరాలను నిల్వ చేశారు. వాటిని గుర్తించిన ఎంహెచ్ఓ వెంకటరమణ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇళ్లలో ఈవి«ధంగా ఉంచుకుంటారా అని ప్రశ్నించారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటారా? అంటూ మండిపడ్డారు. నిర్వాహకులు అధికారులతో వాగ్వాదం దిగడంతో స్థానికులు అధికారులకు అండగా నిలిచారు. నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనుదిరిగారు. ఇళ్లలో మాంసం నిల్వలు బోడిగోడతోటలో కొందరు ఇళ్లలో ఆవు మాంసాన్ని ఫ్రీజర్లలో నిల్వ చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అధికారులు దాడులు చేసి ఫ్రీజర్లలో భారీగా నిల్వ మాంసాన్ని గుర్తించారు. మాంసాన్ని హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. మాంసాన్ని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఫ్రీజర్లు, ఇతర వస్తువులను సీజ్ చేశారు. ఈక్రమంలో కొందరు అధికారుల కళ్లుగప్పి ఇళ్లలోని నిల్వ మాంసాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. పలువురు ఆవు మంసాన్ని కొన్ని హోటళ్లకు తరలిస్తున్నారని, దానిని మటన్‌లో కలిపి విక్రయిస్తున్నారని అధికారుల విచారణలో వెల్లడైంది. కఠిన చర్యలు తీసుకుంటాం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. కుళ్లిన మాంసాన్ని ఫ్రీజర్లలో నిల్వ చేసి ఉండడాన్ని గుర్తించాం. అదేవిధంగా గోదాముల్లో ఎముకులు, కుళ్లిన మాంసాన్ని నిల్వ చేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకున్నాం.– పిడుగు వెంకటరమణ, ఎంహెచ్ఓ -
కళేబరాల డెన్..!
-
గోధూళి కాలం
ఈ దృశ్యం దక్షిణ జర్మనీలోని కొనిగ్సీ సరస్సు ఒడ్డున గల షనాఫ్ గ్రామంలోనిది. ఈ యువతీయువకులు తమ ఆలమందల్ని కొండనుంచి దిగువకు తోలుకొస్తున్నారు. ఈ వేడుకను వారు ‘ఆల్మాబ్ట్రీబ్’ అంటారు. ఆల్ప్స్ పర్వత దేశాలైన ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, జర్మనీల్లో వేసవికాలంలో పశువులన్నీ ఆల్ప్స్ మైదానాల్లో గడ్డిమేస్తాయి. ఎండలు చల్లబడగానే తిరిగి లోయకు వచ్చేస్తాయి. తెగ జీవితం ఈ సంప్రదాయ విందు దృశ్యం యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబూదబీలో జరిగిన ‘ఇంటర్నేషనల్ హంటింగ్ అండ్ ఈక్వెస్ట్రియన్ ఎగ్జిబిషన్’లోనిది. రకరకాల కారణాలవల్ల తమ సంప్రదాయ జీవనశైలికి దూరమైన ఎమిరాటి ప్రజలు తిరిగి తమ తెగ, బదావియన్(ఎడారి జీవనశైలి) మూలాల్లోకి మరలాలన్న ప్రయత్నంలో ఉన్నారు. రాజనృత్యం ఫొటోలోని ఈ బాలికల ప్రదర్శన ఇండోనేషియాలోని సంబవ ద్వీపంలో జరిగిన ‘క్రాటన్ నూసాంతర’ ఉత్సవాల్లోనిది. ఇండోనేషియా ఎన్నో ద్వీపాలసమూహం. ప్రభుత్వ లెక్క ప్రకారం 8,844 చిన్నాపెద్దా దీవులున్నాయి. వీటన్నింటినీ ఎందరో సుల్తాన్లు పాలించారు. తమదేశ ఘనసంస్కృతిలో ఒకప్పుడు భాగమై, ఇప్పుడు క్రమంగా క్షీణిస్తున్న రాజవంశాల ప్రాబల్యాన్ని నిలుపుకోవడం ఎలాగనే ప్రధాన లక్ష్యంతో ఈ వేడుకలు రెండేళ్లకోసారి జరుగుతాయి. ద్వీపాల్లోని 82 సామ్రాజ్యాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు ఉత్సవంలో పాల్గొన్నారు. -
ఎముకలతో నూనె తయారీ
అడ్డాకుల/భూత్పూర్ : పశువుల ఎముకలతో ఎలాంటి అనుమతులు లేకుండానూనె తయారు చేస్తున్నారు. తద్వారా వచ్చే కలుషితనీరు, దుర్గంధభరిత వాసనను భరిం చలేక సమీప గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఐదేళ్లుగా ఈ అక్రమదందా కొనసాగుతోంది. స్థానికుల ఫిర్యాదుల మేరకు బుధవారం ఉదయం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కంపెనీపై దాడిచేసి.. నిర్వహణకు ఇచ్చిన పత్రాలను పరిశీలించారు. భూత్పూర్ మండలం తాటికొండ శివారులో ఉన్న లిబర్టీ ప్రొటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొనసాగుతున్న ఈ కంపెనీని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీచేశారు. ఎముకలతో తయారు చేసిన నూనెను పరిశీలించారు. అడ్డాకుల, భూత్పూర్ మండలాలకు చెందిన తహశీల్దార్లు జె.రాంకోటి, జె.పాండు, ఎస్ఐలు ముత్తినేని వెంకటేశ్వర్లు, లక్ష్మారెడ్డి, అడ్డాకుల జెడ్పీటీసీ సభ్యుడు జి.రామన్‌గౌడ్‌తో కలిసి కంపెనీని పరిశీలించారు. ఎమ్మెల్యే లోపలికి వెళ్లడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు వెంటనే పరారయ్యారు. కంపెనీలో కలి య తిరిగిచూడగా గుట్టలు పేరుకుపోయిన జంతువుల ఎముకలు, వీటి ఆధారంగా తయారుచేసే ఆయిల్, మహిళలు ధరించే పూసలు కనిపించాయి. ఈ కంపెనీలో అస్సాంకు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. కంపెనీకి సరైన అనుమతి పత్రాలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కంపెనీని సీజ్‌చేసి విచారణ చేపట్టాలని తహశీల్దార్లను ఆదేశించారు. అదేవిధంగా దాని పక్కన టైర్లతో ఆయిల్ తయారుచేసే మరో కంపెనీని ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించడం లేదని తెలిసి యజమానిపై మండిపడ్డారు. దీనిపై కూడా విచారణకు ఆదేశించారు. మూడు గంటల పాటు తీవ్ర దుర్గంధంలో కంపెనీలను పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట తాటికొండ సర్పంచ్ శ్రీధర్‌రెడ్డి, నాగార్జున్‌రెడ్డి, ఇంద్రయ్యసాగర్, శివరాములు, నర్సింహారెడ్డి, నారాయణగౌడ్, మురళీధర్‌గౌడ్, మద్ద తిరుపతయ్య యాదవ్ ఉన్నారు. నకిలీ అనుమతిచ్చిన కార్యదర్శి..! ఎముకలతో నూనె తయారీ కంపెనీ నిర్వాహణకు తాటికొండ సర్పంచ్ శ్రీధర్‌రెడ్డి సంతకం లేకుండా 2014 ఏప్రిల్ 10న అప్పటి పంచాయతీ కార్యదర్శి నకిలీ వృత్తి వ్యాపార లెసైన్స్‌ను జారీ చేశారు. దీన్ని గుర్తించిన ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి కార్యదర్శి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, గుట్టల సమీపంలో ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేసుకోవడంతో పాటు గుట్టల నుంచి కలపను అక్రమంగా వాడుకుంటున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. కల్తీనూనె వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడనుందని, నూనె విక్రయాలపై కూడా అధికారులు దృష్టి సారించాలని కోరారు.