Central election authority
-
శశి థరూర్‌కు షాక్.. ‘ఓటింగ్ అక్రమాల’ ఆరోపణలపై కాంగ్రెస్ ఫైర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు శశి థరూర్ వర్గం ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. ఈ అంశంపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసుదన్ మిస్త్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే..శశి థరూర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మిస్త్రీ. మీకు రెండు ముఖాలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేము మీ అభ్యర్థనను స్వీకరించాము. కానీ, మీరు మీడియా ముందుకు వెళ్లి కేంద్ర ఎన్నికల అథారిటీ మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నినట్లు ఆరోపించారు. మా సమాధానాలన్నిటితో మీరు సంతృప్తి చెందారని తెలియజేసేందుకు మా ముందు మీకు ఒక ముఖం ఉంది. మాపై ఈ ఆరోపణలన్నీ చేసిన మీడియాలో వేరే ముఖం ఉందని చెప్పడానికి నేను చింతిస్తున్నాను.’అని శశి థరూర్ తరఫు చీఫ్ ఎలెక్షన్ ఏజెంట్‌కు సమాధానం పంపించారు మిస్త్రీ. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలుడుతున్న క్రమంలో పోలింగ్ ప్రక్రియపై ఆరోపణలు చేస్తూ బుధవారం మధుసుదన్ మిస్త్రీకి లేఖ రాశారు థరూర్ పోలింగ్ ఏజెంట్. నాలుగు రకాల ఫిర్యాదులను అందులో పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్సులకు అనధికారిక సీల్స్ వేయటం, పోలింగ్ బూతుల్లో వేరే వ్యక్తులు ఉండటం, ఓటింగ్ జరుగుతున్న క్రమంలో అక్రమాలు, పోలింగ్ షీట్లు లేకపోవటం వంటి అంశాలను లేవనెత్తారు. ఈ ఎన్నికల్లో శశి థరూర్‌కు 1,072 ఓట్లు రాగా.. మల్లికార్జున్ ఖర్గేకు 7,897 ఏట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు: ఎప్పుడూ ఏకగ్రీవమే, కానీ.. ఇప్పుడే ఇలా! -
Congress president polls: ఇక ఖర్గే వర్సెస్ థరూర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ద్విముఖ పోరు తప్పదని తేలిపోయింది. మూడో అభ్యర్థి, జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో చివరకు బరిలో ఇద్దరే మిగిలారు. మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ పరస్పరం పోటీ పడబోతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నామినేషన్లను పరిశీలించామని, మొత్తం 20 పత్రాలు వచ్చాయని, సంతకాలు రిపీట్ కావడం, సరిపోలకపోవడం వంటి కారణాలతో 4 పత్రాలను తిరస్కరించామని చెప్పారు. నామినేషన్లలో భాగంగా ఖర్గే 14 పత్రాలు, థరూర్ 5 పత్రాలు, త్రిపాఠి ఒక పత్రం సమర్పించారు. త్రిపాఠి నామినేషన్‌ను తిరస్కరించామని, ఆయన పేరును ప్రతిపాదించిన వారిలో ఒకరి సంతకం సరిపోలలేదని, మరొకరి సంతకం రిపీట్ అయ్యిందని తెలిపారు. పోటీలో ఖర్గే, థరూర్ మిగిలారని మిస్త్రీ వెల్లడించారు. నామినేషన్ల ఉపసంహరణకు మరో వారం రోజులు గడువు ఉందని, అధ్యక్ష ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులపై ఈ నెల 8న పూర్తి స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. తిరస్కరణకు గురైన మరో మూడు పత్రాలు ఎవరు సమర్పించారన్న సంగతి మిస్త్రీ బయటపెట్టలేదు. ప్రతిపక్ష నేత పదవికి ఖర్గే రాజీనామా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి పదవికి మల్లికార్జున ఖర్గే రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే నిబంధనకు కట్టుబడి ప్రతిపక్ష నేత పోస్టు నుంచి తప్పుకున్నారు. ఆయన తన రాజీనామా లేఖను శుక్రవారం రాత్రి పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపించినట్లు కాంగ్రెస్ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఖర్గే రాజీనామాతో ఖాళీ అయిన పదవి కోసం కాంగ్రెస్ సీనియర్లు దిగ్విజయ్ సింగ్, పి.చిదంబరం, ప్రమోద్ తివారీ పోటీ పడుతున్నట్లు సమాచారం. గాంధీ కుటుంబం తటస్థమే: థరూర్ నాగ్‌పూర్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో సోనియా గాంధీ కుటుంబం తటస్థంగా వ్యవహరిస్తుందని శశి థరూర్ తెలిపారు. ఈ ఎన్నికలో అధికారిక అభ్యర్థి అంటూ ఎవరూ లేరంటూ గాంధీ కుటుంబం తనతో చెప్పిందని అన్నారు. అధ్యక్ష ఎన్నికలో పోటీ చేస్తున్న థరూర్ శనివారం ప్రచారం ప్రారంభించారు. మహారాష్ట్రలోని దీక్షాభూమి స్మారకం చిహ్నాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ వాద్రాను కలిశానని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక పూర్తి పారదర్శకంగా జరగాలని, పార్టీ బలోపేతం కావాలని వారు కోరుకుంటున్నారని వివరించారు. గాంధీ కుటుంబం తటస్థంగా ఉంటుందని, పార్టీ యంత్రాంగం మొత్తం పక్షపాతానికి తావులేకుండా వ్యవహరించాలని విన్నవించారు. గాంధీ కుటుంబం మల్లికార్జున ఖర్గే పట్ల మొగ్గుచూపుతోందా? అని ప్రశ్నించగా.. అలాంటి అనుమానాలు తనకు లేవని థరూర్ బదులిచ్చారు. -
కాంగ్రెస్ చీఫ్ ఎన్నికకు 3–4 రోజుల్లో షెడ్యూల్!
న్యూఢిల్లీ/జైపూర్: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధినేతను ఎన్నికొనేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ మరో 3–4 రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు సోమవారం తెలిపాయి. సెప్టెంబర్ 20లోగా నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ చెప్పారు. ఎన్నిక తేదీపై తుది నిర్ణయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీదేనని(సీడబ్ల్యూసీ) వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ చేపట్టాలని తాము కోరుకుంటున్నట్లు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు. రాహుల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొనేందుకు పార్టీ నేతలంతా సానుకూలంగా ఉన్నారని వివరించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని, పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాలని రాహుల్ గాంధీకి అశోక్ గహ్లోత్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఆయన నిరాకరిస్తే కార్యకర్తలు అసంతృప్తికి లోనవుతారని చెప్పారు. ఆనంద్ శర్మను బుజ్జగించే యత్నాల్లో కాంగ్రెస్ హిమాచల్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన ఆనంద్ శర్మను శాంతింపజేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఏఐసీసీ ఇన్చార్జి రాజీవ్ శుక్లా సోమవారం ఆయన్ను కలిసి, పార్టీ పదవిలో కొనసాగాలని కోరారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా శర్మతో ఫోన్లో మాట్లాడి, అనేక అంశాలపై చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీయే అంతిమ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాయి. -
రాహుల్ అంగీకరించకపోతే...బయటవారికే పగ్గాలు ఇస్తే?
రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారా? లేదా? ఇప్పుడు కాంగ్రెస్‌లో దీనిపైనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ సంసిద్ధంగా ఉన్నట్టు ప్రకటించడంతో అందరి దృష్టి రాహుల్ తదుపరి అడుగులపై పడింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకీ క్షీణిస్తూ ఉండడంతో పార్టీని ముందుకు నడిపించే నాథుడెవరన్న ఆందోళన మొదలైంది. రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తారో లేదో ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగే నాయకులు కూడా చెప్పలేకపోతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 21 సెప్టెంబర్ 20 మధ్య అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని గత ఏడాది అక్టోబర్‌లో కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2020లో జీ–23 పేరుతో కొందరు సీనియర్ నేతలు అధిష్టానంపై తిరుగుబాటు చెయ్యడంతో సోనియా పదవిని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు ఇంకా కొనసాగుతున్నారు. గాంధీ కుటుంబానికే సారథ్యం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతూ కాంగ్రెస్ ముక్త భారత్ అని నినదిస్తున్న నేపథ్యంలో గాంధీ కుటుంబమే పార్టీకి రథసారథిగా ఉండాలన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు తెరతీస్తూ ఎదురు తిరిగిన వారిపై సీబీఐ, ఈడీ అస్త్రాన్ని ప్రయోగిస్తోందన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో గాంధీ కుటుంబానికి చెందిన వారే పార్టీ పగ్గాలు చేపట్టాలని పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. అయితే రాహుల్ గాంధీ మనసులో ఏముందో ఎవరికీ అర్థం కావడం లేదు. అధ్యక్ష పదవిపై ఆయన వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. మరోవైపు బీజేపీ పదే పదే వంశపారంపర్య రాజకీయాలను ఎత్తి చూపిస్తూ ఉండడంతో ఆ తరహా రాజకీయాలపై దేశంలో కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ తాను అధ్యక్ష బాధ్యతలు చేపడితే ఆత్మరక్షణలో పడిపోతానని, ఆ పదవి తనని మరింత బలహీనుడిగా మారుస్తుందన్న ఆందోళన రాహుల్ గాంధీలో ఉందని రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ అభిప్రాయపడ్డారు. ‘‘24 అక్బర్ రోడ్: ఏ షార్ట్ హిస్టరీ ఆఫ్ ది పీపుల్ బిహైండ్ ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ ది కాంగ్రెస్’’తో పాటు పలు పొలిటికల్ పుస్తకాలు రచించిన ఆయన రాహుల్ ఆందోళన సరైనదే అయినప్పటికీ గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులే సారథిగా ఉంటేనే అధికార పార్టీ వారిని టచ్ చేయడానికి జంకుతుందని అభిప్రాయపడ్డారు. ప్రియాంక గాంధీని అధ్యక్షురాలిగా చేస్తే కాంగ్రెస్‌కి పూర్వ వైభవం వస్తుందని ఇటీవల ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్‌లో కొందరు నాయకులు డిమాండ్ చేసినప్పటికీ ఆమె మాత్రం అందుకు సుముఖంగా లేరు. బయటవారికే ఇస్తే.. ? గాంధీ కుటుంబం కాకుండా బయటవారు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి వస్తుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు మానసికంగా సంసిద్ధులవుతున్నారు. అలాంటప్పుడు పార్టీ పగ్గాలు ఎవరు స్వీకరిస్తే బాగుంటుందన్న చర్చ కూడా మొదలైంది. సీనియర్ నాయకులు డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే, సుశీల్ కుమార్ షిండే, అశోక్ గెహ్లాట్, కుమారి సెల్జా వంటి నాయకులైతే బాగుంటుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. స్వాతంత్య్రదినోత్సవం నాడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో అంబికా సోని జాతీయ జెండాని ఎగురవేయడంతో ఆమె కూడా రేసులో ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. సోనియాకి కరోనా సోకడంతో అంబికా సోని జెండా ఎగురవేశారే తప్ప ఆమెకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పని లేదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. బయటవారు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే పరిస్థితి రాదని, ఎన్నికలొచ్చే సమయానికి రాహుల్‌ని ఒప్పించగమన్న ధీమాలో ఓ వర్గం ఉంది. రాహుల్ అంగీకరించకపోతే...? ఒకవేళ రాహుల్ గాంధీ అధ్యక్షుడు అవడానికి సుముఖంగా లేకపోతే సోనియాగాంధీయే అధ్యక్షురాలిగా ఉండి ఆమెకు సహాయంగా కనీసం ముగ్గురు సీనియర్ నాయకుల్ని కార్యనిర్వాహక అధ్యక్ష పదవిలో నియమించాలని కొందరు నాయకు లు అభిప్రాయపడుతున్నారు. బయట వారికి పార్టీ పగ్గాలు అప్పగించి రాహుల్ గాంధీ వారికి ఒక గైడ్‌లా వ్యవహరిస్తే కుటుంబ రాజకీయాల విమర్శల నుంచి బయటపడవచ్చునని మరి కొందరి ఆలోచనగా ఉంది. గాంధీ కుటుంబానికి మన్మోహన్ సింగ్ లాంటి అత్యంత నమ్మకమైన నాయకుడి అవసరం కూడా ఉంది. కానీ కాగడా పెట్టి వెతికినా అలాంటి నాయకుడెవరూ కనిపించడం లేదని, ఇప్పుడు పార్టీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అదేనని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ మణీంద్ర నాథ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రెండాకులు దక్కేనా?
-
రెండాకులు దక్కేనా?
నేడు తుది విచారణ ఎదురుచూపుల్లో ఓపీఎస్ కలవరంలో చిన్నమ్మ సేన చెన్నై: రెండాకుల చిహ్నం ఎవరికి దక్కేనో అన్న ఉత్కంఠ అన్నాడీఎంకే శిబిరాల్లో బయలు దేరింది. బుధవారం కేంద్ర ఎన్నికల యంత్రాంగం(సీఈసీ) తుది విచారణ సాగించనుండంతో పన్నీరు శిబిరంలో ఎదురుచూపులు పెరిగాయి. ఇక, చిన్నమ్మ శశికళ శిబిరంలో కలవరం బయలు దేరింది. అమ్మ జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో వచ్చిన చీలికల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శిబిరం చేతికి చిక్కడంతో, పార్టీని, చిహ్నాన్ని కైవసం చేసుకునేందుకు మాజీ సీఎం పన్నీరుసెల్వం తీవ్రంగానే వ్యూహ రచనలు, కసరత్తుల్లో నిమగ్నం అయ్యారు. ఎన్నికల యంత్రాంగానికి ఆయన శిబిరం చేసిన ఫిర్యాదు విచారణ సాగుతూ వస్తోంది. పన్నీరుసెల్వం శిబిరం తమ వద్ద ఉన్న ఆధారాలు, రికార్డులను ఎన్నికల యంత్రాంగానికి సమర్పించాయి. పన్నీరు శిబిరాన్ని ఎదుర్కొనే విధంగా చిన్నమ్మ శిబిరం సైతం సీఈసీకి వివరణలు ఇచ్చి ఉన్నది. తమ చేతిలో ఉన్న ఆధారాలను సమర్పించారు. తాజాగా, ఆర్కేనగర్ ఉప ఎన్నిక జరగనుండడంతో అన్నాడీఎంకే చిహ్నం రెండాకుల కైవసం మీద తీవ్ర పోటీనే సాగుతోంది. ఈ సమయంలో బుధవారం ఎన్నికల యంత్రాంగం తుది విచారణ సాగించనుంది. ఇందులో ఎలాంటి నిర్ణయాలు వెలువడుతుందో, ఆ చిహ్నం ఎవరి చేతికి చిక్కుతుందో, అన్నాడీ ఎంకేలో నెలకొనబోయే రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ తాజాగా బయలుదేరింది. రెండాకులు దక్కేనా: గురువారంతో ఆర్కేనగర్ నామినేషన్ల పర్వం ముగియనుంది. ఈ దృష్ట్యా, బుధవారం ఆ చిహ్నం ఎవరికీ అన్నది సీఈసీ తేల్చాల్సి ఉంది. ఒక వేళ జాప్యం నెలకొన్న పక్షంలో ఆ చిహ్నంను సీజ్ చేయడం ఖాయం. దీంతో ఉప ఎన్నికల రేసులో ఉన్న రెండు శిబిరాల అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థుల చిహ్నాలను ఎంపిక చేసుకోవాల్సిందే. అయితే, విచారణను త్వరిత గతిన ముగియన్ను దృష్ట్యా, ఆధారాలు, రికార్డులు, వాస్తవాలు, విచారణలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా ఆ రెండు శిబిరాల్లో ఏదో ఒక శిబిరంకు ఆ చిహ్నం కేటాయించిన పక్షంలో అన్నాడిఎంకేలో ఉత్కంఠ తప్పదేమో. అయితే, ఆ చిహ్నం తమకు దక్కుతుందన్న ధీమాతో పన్నీరు శిబిరం ఎదురు చూపుల్లో ఉండటం గమనార్హం. అలాగే, చిన్నమ్మ శిబిరంలో కలవరం వీడటం లేదు. పైపైకి తమకు దక్కుతుందని భావిస్తున్నా, సీఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన తప్పడం లేదు. ఇక, ఈ చిహ్నం కోసం ఎదురు చూపుల కారణంగా రెండు శిబిరాల అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేయకుండా కాలం నెట్టుకు వస్తున్నారు.