Central Ministry of Health
-
వేగంగా పెరుగుతున్న కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో ఒక్కరోజే 22,775 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రోజూవారీ కొత్త కేసులు అత్యధికంగా నమోదు కావడం అక్టోబర్ 6 తర్వాత ఇదే తొలిసారి. ముఖ్యంగా గత నాలుగు రోజులుగా భారత్‌లో కోవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. మూడురోజులపాటు వరుసగా 9 వేలు, 13 వేలు, 16వేల పైచిలుకు డైలీ కేసులు నమోదు కాగా శుక్రవారం దాదాపు 23 వేల కేసులు నమోదు కావడం గమనార్హం. కొత్త కేసుల్లో ఒమిక్రాన్ కేసులు 161 ఉన్నాయి. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల 1,431కి చేరాయని, అదేవిధంగా దేశంలో యాక్టివ్ కేసులు లక్షను దాటాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నూతన కేసుల్లో అత్యధికం మహారాష్ట్రలో అది కూడా ముంబైలో నమోదయ్యాయి. దేశీయ డైలీ పాజిటివిటీ రేటు 2.05 శాతం వద్ద ఉండగా, వీక్లీ రేటు 1.10 శాతం వద్ద ఉంది. 24 గంటల్లో కరోనాతో కొత్తగా 406 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఇంతవరకు 145కోట్ల టీకా డోసులిచ్చారు. మరోవైపు టీనేజర్ల టీకా రిజిస్ట్రేషన్ శనివారంనుంచి కోవిన్ పోర్టల్‌లో మొదలైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అర్హులైన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వీరికి జనవరి 3 నుంచి టీకాలిస్తారు. 10 మంది మంత్రులకు కరోనా మహారాష్ట్రలో 10మందికి పైగా మంత్రులకు కనీసం 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పారు. అందువల్లే రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు తొందరగా ముగించామని వెల్లడించారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా ముంబై, పుణెలో కేసులు వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు. కేసులు ఇలాగే పెరిగితే రాష్ట్రంలో కఠిన నిబంధనలు అమలు చేస్తామన్నారు. కరోనా సోకిన రాజకీయ ప్రముఖుల్లో ఎంపీ సుప్రియా సూలే, మంత్రులు వర్షా గైక్వాడ్, యోశ్మతీ ఠాకూర్, కేసీ పద్వి, జితేందర్ అవ్హద్, ధనుంజయ్ ముండే, దిలీప్ వాల్సె తదితరులు ఉన్నారు. -
'ఈ నగరానికి ఏమైంది...?. ఎవరూ నోరు మెదపరేం’
ఈ నగరానికి ఏమైంది...?. ఒకవైపు పొగ... మరోవైపు ధూళి. ఎవరూ నోరు మెదపరేం’ అంటూ అటు టీవీల్లో, ఇటు సినిమా హాళ్లల్లోనూ ప్రకటనలు హోరెత్తుతున్నాయి. ప్రకటనల మాటేమో గానీ బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగరాదన్న చట్టం చేసి పదేళ్లైనా అమలుకు నోచుకోవడం లేదు. పొగ రాయుళ్లు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తూ చుట్టుపక్కల వారిని అనారోగ్యం బారిన పడేస్తున్నారు. ఈ విషయమై ఏ ఒక్క అధికారీ నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. – కర్నూలు(హాస్పిటల్) కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2008 అక్టోబర్ 2న సిగరెట్స్ అండ్ టుబాకో ప్రొడక్ట్స్ యాక్ట్(సీఓటీపీఏ–2008)ను రూపొందించింది. ఈ చట్టం ప్రకారం బస్టాండ్, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, మార్కెట్లు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, జనసంచారం ఉండే ప్రదేశాల్లో ధూమపాన నిషేధం. దీనిని అతిక్రమిస్తే రూ.200 జరిమానాతో పాటు జైలు శిక్ష విధించాలని చట్టం చెబుతోంది. పొగాకు ఉత్పత్తులను 18 ఏళ్లలోపు ఉన్న వారికి అమ్మినా జరిమానా విధించాలి. పొగాకు నియంత్రణ, బహిరంగ ధూమపానాన్ని అరికట్టేందుకు చట్టం అమలు బాధ్యతను పోలీసు శాఖకు అప్పగించింది. చాలా ప్రాంతాల్లో పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో పొగతాగే వారిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. కొందరు పోలీసులకు ఈ చట్టం ఒకటి ఉందనే విషయం కూడా తెలియదు. కొందరు పోలీసు అధికారులకు చట్టం గురించి అవగాహన ఉన్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సంకల్పం బాగున్నా ఆచరణలో చిత్తశుద్ధ లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. చదవండి: (Uday Kumar Reddy: ఎస్సైగా ఇక్కడే.. ఎస్పీగా ఇక్కడికే!) ప్రతి నెలా రూ.5 కోట్ల వ్యాపారం జిల్లాలో బీడీ, సిగరెట్, చుట్ట విక్రయాలు తగ్గడం లేదు. ధర ఎంతైనా వాటిని కొనుగోలు చేసి వాడుతున్నారు. ముఖ్యంగా వీటి టోకు వర్తక వ్యాపారులు కర్నూలు నగరంలోని పాతబస్తీలో అధికంగా ఉన్నారు. ఇక్కడి నుంచే నంద్యాల, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, బనగానపల్లి, ఆళ్లగడ్డ, శ్రీశైలం వంటి ప్రాంతాలకు పలువురు చిన్న తరహా డీలర్లు తీసుకెళ్లి అక్కడి రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి నెలా జిల్లాలో రూ.5 కోట్లకు పైగానే వ్యాపారం జరుగుతోందని అంచనా. పొగాకు ఉత్పత్తులతో వ్యాధులు.. పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల ఎక్కువగా ఊపిరితిత్తుల వ్యాధులైన బ్రాంకైటిస్, ఆయాసం, సీఓపీడీ, గుండెజబ్బులు, రక్తనాళాలు మూసుకుపోవడంతో పాటు నోటి క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, రక్త క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. బీడీ, సిగరెట్, చుట్టలను ప్రత్యక్షంగా తీసుకోకపోయినా వాటిని వాడిన వారు వదిలే పొగను పీల్చినా పైన చెప్పిన వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా ధూమపానం.. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకూడదని చట్టం చెబుతున్నా పొగరాయుళ్లు పట్టించుకోవడం లేదు. బస్టాండ్, టీ కొట్లు, రైల్వేస్టేషన్లు, రైళ్లు, బస్సులలో ధూమపానం చేస్తున్నారు. 18 ఏళ్లలోపు బాలురు సైతం ఈ దురలవాటుకు బానిసలు కావడం బాధాకరం. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికీ వీటిని విక్రయిస్తూ పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చట్టం ఏమి చెబుతుందంటే.. ►బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకుండా బోర్డులు ఏర్పాటు చేయాలి ►పాఠశాలలు, కళాశాలల వద్ద పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదు ►ధూమపానం అలవాటు ఉన్న వారి కోసం ప్రత్యేకంగా స్మోకింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. ►రైతులు, వ్యాపారులు, రెస్టారెంట్ యజమానులు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ►రెవెన్యూ, పోలీస్, వైద్యులు కలిసి అప్పుడప్పుడూ బహిరంగ ప్రదేశాల్లో దాడులు నిర్వహించి పొగతాగే వారికి జరిమానాలు విధించాలి. పొగ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం బీడీ, సిగరెట్, చుట్ట తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరం. వీటి వల్ల ఏటా ప్రపంచ వ్యాప్తంగా 64 లక్షల మంది మరణిస్తున్నారు. పొగతాగడం వల్ల సీఓపీడీ(క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్), క్యాన్సర్ వస్తుంది. 84 శాతం పొగతాగేవారు సీఓపీడీ వల్ల, 83 శాతం క్యాన్సర్ భారిన పడుతున్నా రు.దీంతో పాటు హార్ట్ ఎటాక్, కడుపు, నోటి క్యా న్సర్ వస్తాయి. పొగతాగడం వల్ల ఆస్టియోపోరోసిస్(ఎముకలు బలహీనపడటం) వస్తుంది. – డాక్టర్ వరప్రసాద్, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, కర్నూలు -
‘ది హెల్తీ స్టేట్స్, ప్రోగ్రెసివ్ ఇండియా’ ర్యాంకింగ్స్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆరోగ్య రంగంలో మెరుగుదల దిశగా ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ర్యాంకింగ్స్‌ను నీతి ఆయోగ్ ఈనెల 27న విడుదల చేయనుంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ‘ది హెల్తీ స్టేట్స్, ప్రోగ్రెసివ్ ఇండియా’ పేరుతో రాష్ట్రాల ఆరోగ్యరంగ పనితీరుపై ఈ ర్యాంకింగ్స్‌ను సిద్ధం చేశారు. 2017లో నీతి ఆయోగ్, కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ బ్యాంకు సహకారంతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరోగ్యం రంగం పనితీరు, ఆరోగ్య రంగ పురోభివృద్ధిని పెంపొందించేందుకు వార్షిక ఆరోగ్య సూచికను ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడంతోపాటు, పరస్పరం అనుభవాలను పంచుకునేందుకు ప్రోత్సహిస్తారు. -
దేశంలో తగ్గినట్టే తగ్గి పెరుగుతున్న కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ స్థిరంగా కొనసాగుతోంది. కేసుల నమోదు తగ్గకపోగా క్రమంగా పెరుగుతోంది. తాజాగా గురువారం లక్షా 34 వేల కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే రెండు వేలు అధికంగా నమోదయ్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 21,59,873 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా వాటిలో 1,34,154 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక మరణాలు 2,887 సంభవించాయి. మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఈమేరకు కరోనా బులెటిన్‌ను కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న వారు 2,11,499 మంది. వీరితో కలిపి ఇప్పటివరకు 2,63,90,584 కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 17,13,413. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారు 3,37,989మంది. టీకాల పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పొందిన వారు 24,26,265 మంది. మరణాల రేట్ 1.18 శాతం ఉండగా, యాక్టివ్ కేసుల శాతం 6.34. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 92.48 శాతంగా ఉంది. చదవండి: నిన్న తగ్గి నేడు పెరిగి.. కొనసాగుతున్న విజృంభణ -
మలేరియా కోరల్లో ఆదిలాబాద్ ఏజెన్సీ..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో మలేరియా మహమ్మారి పొంచి ఉంది. గతేడా ది అనేక మంది ఆదివాసీల ప్రాణాలు బలిగొన్న ఈ వ్యాధి ఈ ఏడాది కూడా విజృంభించడం ఖాయమని కేంద్ర వైద్యారోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలని నేషనల్ వెక్టర్న్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రాం (ఎన్వీబీడీసీపీ) ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఈ విభాగం తెలంగాణ రాష్ట్ర నోడల్ అధికారిణి డాక్టర్ సుమన్లతా వక్తల్ ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ వ్యాధి విజృంభించే మండలాల్లో ఆమె పరిస్థితిని పరిశీలించారు. అలాగే, ఖమ్మం ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎన్వీబీడీసీపీ ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. మలేరియా మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ అంశంపై దృష్టి సారించింది. తెలంగాణలో అత్యధిక మరణాలుండే ఆదిలాబాద్, ఖమ్మం వంటి జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఏటా మరణమృదంగమే.. జిల్లాలో గోండు గూడాలు, గిరిజన తండాల్లో ఏటా మరణ మృదంగం వినిపిస్తోంది. గతేడాది కూడా ఇంటికి ఒకరిద్దరు చొప్పున మంచం పట్టారు. ఒక్క గూడెంలోనే పదుల సంఖ్యలో జ్వరాలతో బాధపడ్డారు. వందలాది గ్రామాల్లో విషజ్వరాలు విజృంభించాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా వారాల తరబడి మంచానికే పరిమితమయ్యారు. ఈ జ్వరాల బారిన పడి పలువురి ప్రాణాలు సైతం గాలిలో కలిశాయి. గతేడాది ఇలాగే హైరిస్క్ గ్రామాలను వైద్యారోగ్య శాఖ గుర్తించింది. తీరా ఎపిడమిక్ సీజను ముంచుకొచ్చాక ఈ హైరిస్క్ గ్రామాలసంఖ్య అంచనాలకు మించిపోవడంతో వైద్యారోగ్య శాఖ దాదాపు చేతులెత్తేసింది. ఇలా ఏటా వైరల్ జ్వరాల బారిన పడి అనేక మంది ఆదివాసీలు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరి కలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హై రిస్క్‌లో 924 గ్రామాలు.. గతేడాది వర్షాకాలంలో మలేరియా వ్యాధి బారిన పడి 58 మంది ఆదివాసీలు మరణించినట్లు ఆదిలాబాద్ రిమ్స్ ప్రకటించింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆదివాసీలను రిమ్స్‌కు తరలించిన వారిలోనే 58 మరణాలున్నాయంటే.. వెలుగుచూడని మరణాలు ఇంకా ఎన్ని ఉన్నాయో అని ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా వైద్యారోగ్య శాఖ మలేరియా విభాగం గణాంకాల మేరకు గతేడాది రక్త పరీక్షలు నిర్వహించిన వారిలో 9,198 మంది మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా మలేరియా అధికారి అల్హం రవి తెలిపారు. మలేరియాతోనే మరణించినా కానీ, ఎక్కడ అధికారికంగా నమోదు కాలేదని ఆయన పేర్కొన్నారు. మలేరియా వ్యాధి పొంచి ఉన్న హైరిస్క్ గ్రామాలు జిల్లాలో 924 ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ గుర్తించింది. ముఖ్యంగా నార్నూర్, జైనూర్, సిర్పూర్(యు), తిర్యాణి, ఆసిఫాబాద్, కెరమెరి, ఇంద్రవెల్లి, ఉట్నూర్ తదితర మండలాల్లో ఈ హైరిస్క్ గ్రామాలను గుర్తించారు. -
ఈ సంవత్సరం ‘నీట్’ సాధ్యం కాదు
న్యూఢిల్లీ: ఈ ఏడాది వైద్య విద్య కోర్సుల్లో చేరేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష(నీట్)నిర్వహించడం ఆచరణ సాధ్యం కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నీట్ రద్దుపై తీర్పును సుప్రీంకోర్టు వాపసు తీసుకున్న నేపథ్యంలో.. ఇప్పటికే ప్రవేశపరీక్షలు ప్రారంభమయ్యాయని, ఒకట్రెండు పరీక్షలు అప్పుడే పూర్తయ్యాయని కేంద్రం తెలిపింది. ప్రతిఏటా మేలో నిర్వహించే ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్(పీఎంటీ)నూ మే నెల తొలి వారంలో నిర్వహిస్తామని చెప్పింది. అందువల్ల ఆచరణలో నీట్ పరీక్ష నిర్వహణ సాధ్యం కాదని పేర్కొంది.నీట్(నేషనల్ ఎలిజబులిటీ-ఎంట్రన్స్ టెస్ట్)పై జులై 18, 2013న ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు వాపసు సోమవారం వాపసు తీసుకోవడం తెలిసిందే.