Central Power Ministry
-
అంత డబ్బు మా దగ్గర్లేదు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోళ్ల కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆగస్టులో రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ కొనుగోళ్ల కోసం తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆ మేర వ్యయాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసి ముందస్తుగా ఎల్సీ జారీ చేసేందుకు మరో రెండు రోజులే ఉన్నాయి. ఈ నెల 31లోగా డిస్కంలు ఎల్సీ జారీ చేస్తేనే ఆ మేర విద్యుత్‌ను కేంద్ర, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఎల్సీ జారీ చేసే సత్తా తమకు లేదని చేతులెత్తేశాయి. ఎన్టీపీసీ వంటి కేంద్ర విద్యుదుత్పత్తి కంపెనీలతోపాటు ప్రైవేటు జనరేటర్ల నుంచి విద్యుత్ కొనుగోళ్లకు ప్రతి నెలా రూ.1,089 కోట్లు అవసరమని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం డిస్కంల వద్ద రూ.400 కోట్ల నిధులు మాత్రమే ఉన్నాయని, విద్యుత్ కొనుగోళ్లకు ముందస్తు ఎల్సీ జారీ చేసేందుకు రూ.1,000 కోట్లను కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆగస్టులో విద్యుత్ ఉద్యోగులకు జీతాల చెల్లింపుతో పాటు ఇతర ఖర్చులకు డిస్కంల వద్ద ఉన్న రూ.400 కోట్ల నిధులు ఆవిరైపోతాయని, ముందస్తుగా ఎల్సీ జారీ చేసే పరిస్థితి లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్సీ నిబంధన అమలును కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వాయిదా వేయని పక్షంలో, నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అత్యవసరంగా నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని ట్రాన్స్‌కో వర్గాలు పేర్కొంటున్నాయి. డిస్కంల వద్ద నిధులు లేనిపక్షంలో కనీసం వారం, పక్షం రోజులకు అవసరమైన విద్యుత్ కొనుగోళ్లకు అయినా ఎల్సీ జారీ చేయాల్సిందేనని కేంద్రం నిబంధన పెట్టింది. అదీ సాధ్యం కాని పక్షంలో ఏ రోజుకు ఆ రోజు అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ఒక రోజు ముందుగానే విద్యుత్ కంపెనీలకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ రూపంలో నిధులను బదిలీ చేయాలని చెప్పింది. ఈ విషయంలో విఫలమైన డిస్కంలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్లను ఆదేశించింది. మరో రెండు రోజుల్లోగా రాష్ట్ర డిస్కంలు ఎల్సీ జారీ చేయకపోయినా, కనీసం నగదు బదిలీ చేయకపోయినా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సమస్యలు తప్పవని ఆందోళన వ్యక్తమవుతోంది. నేడు దక్షిణాది రాష్ట్రాల భేటీ.. లెటర్ ఆఫ్ క్రెడిట్ నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ కమిటీ(ఎస్ఆర్పీసీ) సోమవారం బెంగళూరులో సమావేశమై తదుపరి కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఎల్సీ నిబంధనల అమలును వాయిదా వేయాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశాలున్నాయి. రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఇప్పటికే తప్పుబడుతూ కేంద్రానికి లేఖ రాసింది. -
మన డిస్కంలు.. ఓ మోస్తరు!
► డిస్కంల వార్షిక ర్యాంకులను ప్రకటించిన కేంద్రం ► తెలంగాణలోని రెండు డిస్కంలకు ‘బీ ప్లస్’ గ్రేడ్లు సాక్షి, హైదరాబాద్: కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల వార్షిక ర్యాంకింగ్స్ లో తెలంగాణలోని రెండు డిస్కంలకు ‘బీ ప్లస్ (ఆ+)’ గ్రేడ్లు దక్కాయి. ఓ మోస్తరు పనితీరు ఉన్న డిస్కంలకు ఈ రేటింగ్స్ దక్కా యి. నిర్వహణ, ఆర్థిక పరిస్థితి, నియంత్రణ చర్యలు, సంస్కరణల అమలు తీరును ప్రామాణికంగా తీసుకుని ఏటా కేంద్ర విద్యుత్ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న డిస్కంలకు వార్షిక రేటింగ్స్ కేటాయిస్తోంది. 2017కి ప్రకటించిన ఈ ర్యాంకింగ్స్‌లో గుజరాత్‌లోని 4 డిస్కంలు, ఉత్తరాఖండ్ డిస్కం ‘ఏ ప్లస్ (అ+)’ రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచాయి. ఆ తర్వాత కర్ణాటకలోని మూడు డిస్కంలు, హిమాచల్‌ప్రదేశ్ విద్యుత్ బోర్డు, మహారాష్ట్ర డిస్కంలతోపాటు ఏపీఈపీడీసీ ఎల్ ‘ఏ(అ)’ గ్రేడ్ సాధించాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీ ఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్పీడీసీఎల్) వివిధ రాష్ట్రాలకు చెందిన మరో ఆరు డిస్కంలతో కలసి ‘బీ ప్లస్ (ఆ+)’ గ్రేడ్‌ను సాధించాయి. దేశంలోని మరో పది డిస్కంలు బీ(ఆ) గ్రేడ్‌ను, ఐదు డిస్కంలు సీ ప్లస్ (ఇ+)గ్రేడ్‌ను, ఏడు డిస్కంలు సీ(ఇ) గ్రేడ్‌ను సాధించాయి. విద్యుత్ కొనుగోలు ధర అధికం తెలంగాణ డిస్కంల విద్యుత్ కొనుగోలు ధర అధికంగా ఉందని రేటింగ్స్ నివేదికలో కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. రాష్ట్ర డిస్కంల పనితీరులో ఆందోళనకర అంశాల జాబితాలో విద్యుత్ కొనుగోలు ధరలు అధికంగా ఉండ టాన్ని ప్రస్తావించింది. 2015–16లో టీఎస్ ఎస్పీడీసీఎల్ విద్యుత్ కొనుగోళ్ల కోసం యూనిట్‌కు రూ.4.55 వెచ్చించగా, టీఎస్ ఎన్పీడీసీఎల్ రూ.4.82 ఖర్చు చేసిందని వెల్లడించింది. 2017–18కి సంబంధించిన టారిఫ్ పిటిషన్‌ను రెండు డిస్కంలూ సకాలంలో ఈఆర్సీకి సమర్పించలేదంది. టీఎస్ఎస్పీడీసీఎల్లో విద్యుత్ బిల్లుల వసూళ్ల సమర్థత తగ్గిపోయిందని, నష్టాలు 13.38 శాతానికి పెరిగిపోయాయంది. టీఎస్ఎన్పీ డీసీఎల్ పరిధిలో వినియోగదారుల మీటరిం గ్ తక్కువగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. 2014–15తో పోల్చితే 2015–16లో మీటరింగ్ పెంపుదలలో మార్పు లేదంది. మన డిస్కంల బలాలివీ... రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో టారిఫ్ సబ్సిడీ విడుదల చేయడంతోపాటు 2016–17కి సం బంధించిన టారిఫ్ ఆర్డర్‌ను జారీ చేయడాన్ని డిస్కంల ప్రధాన బలాలుగా రేటింగ్‌ల నివే దిక పేర్కొంది. టీఎస్ఎస్పీడీసీఎల్ 88.50 శాతం బిల్లింగ్ సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేసింది. టీఎస్ఎన్పీడీసీఎల్ 2014–15లో 16.04 శాతం ఉన్న నష్టాలను 2015–16లో 15.79 శాతానికి తగ్గించుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేసింది. గ్రేడ్ల కేటాయింపు తీరు ఇదీ... ప్రముఖ రేటింగ్స్ నిర్వహణ సంస్థలు కేర్, ఇక్రా ఆధ్వర్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ డిస్కంల వార్షిక రేటింగ్స్ నిర్వహిం చింది. వివిధ అంశాల్లో డిస్కంల పనితీరు, నిర్వహణ సామర్థ్యం ఆధారంగా రేటింగ్స్ స్కోర్లను కేటాయించి గ్రేడ్లను ఈ సంస్థలు ఖరారు చేశాయి. 80–100 స్కోర్ సాధిస్తే (అత్యుత్తమ పనితీరు) ‘ఏ ప్లస్’, 65–80 స్కోర్‌కు (ఉత్తమ పనితీరు) ‘ఏ’ గ్రేడ్, 50–65 స్కోర్ సాధించిన డిస్కం (ఓ మోస్తరు పనితీరు)లకు బీ ప్లస్ గ్రేడ్, 35–50 స్కోర్ సాధిస్తే (సగటు కంటే తక్కువ పనితీరు) బీ గ్రేడ్, 20–35 స్కోర్ సాధిస్తే (అథమ పనితీరు) ‘సీ ప్లస్’ గ్రేడ్, 0–20 స్కోర్ సాధిస్తే (పనితీరు అత్యంత అథమం) ‘సీ’ గ్రేడ్‌ను కేటాయించారు. -
మనకు 17.. ఏపీకి 35
- హైదరాబాద్ తాగునీటికి 4, సాగర్ ఎడమకాల్వకు 13 టీఎంసీలు - జనవరికి కృష్ణా జలాలను పంచుతూ బోర్డు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: అనేక తర్జనభర్జనల అనంతరం జనవరి 20 వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంచుతూ కృష్ణా బోర్డు నిర్ణయం చేసింది. ప్రస్తుత లభ్యత నీటిలో తెలంగాణకు 17 టీఎంసీలు, ఏపీçకు 35 టీఎంసీలు పంచుతూ ఆదేశాలు జారీ చేసింది. జంట నగరాల తాగునీటి అవసరాల నిమిత్తం ఏఎంఆర్పీ కింద 4 టీఎంసీలు, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద 13 టీఎంసీలు కేటాయించింది. ఏపీకి కృష్ణా డెల్టాకింద 10 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వకు 15 టీఎంసీలు, ఎడమ కాల్వకు 3.1 టీఎంసీలు, హంద్రీనీవా కింద 7 టీఎంసీలు విడుదలకు అంగీకరించింది. ఈ మేరకు సోమవారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ ఆదేశాలు జారీచేశారు. నిజానికి సాగర్ కింది సాగు అవసరాలతో పాటు హైదరాబాద్, నల్లగొండ జిల్లా అవసరాలకు కలిపి 56 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ కోరుతూ వచ్చింది. అయితే ఇటీవల పట్టిసీమ వినియోగ లెక్కలు, మైనర్ కింద వినియోగం లెక్కలను పక్కనపెడుతూ 130 టీఎంసీల లభ్యత జలాల్లో తెలంగాణకు 43, ఏపీకి 87 టీఎంసీలు కేటాయిస్తూ బోర్డు ప్రతిపాదించింది. రబీ సాగు ఆలస్యమవుతుండటం, రైతుల నుంచి నీటి విడుదలపై డిమాండ్ పెరుగుతుండటంతో దీనికి తెలంగాణ అంగీకరించింది. అయితే బోర్డు ప్రతిపాదనను ఏపీ వ్యతిరేకించే రీతిలో తనకు 106 టీఎంసీలు కావాలని కోరింది. ఈ వివాదం కొలిక్కి రాకపోవడంతో సోమవారం బోర్డు జనవరి వరకు నీటిని పంపిణీ చేస్తూ నిర్ణయం చేసింది. అపెక్స్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి శ్రీశైలం నుంచి సాగర్‌కు 30 టీఎంసీలు విడుదల చేయాలని సూచించింది. ఈ నీటి విడుదల పూర్తిగా పవర్ హౌస్ ద్వారానే జరగాలని ఆదేశించింది. చేసిన విద్యుదుత్పత్తిని ఎలా పంపిణీ చేసుకోవాలన్న దానిపై కేంద్ర విద్యుత్ శాఖతో చర్చించుకుని ఇరు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు నిర్ణయానికి రావాలని కోరింది. ప్రాజెక్టుల కింద కేటాయించిన నీటిని ఎలా వాడుతున్నారన్నది ఈఎన్సీలు గమనిస్తూ ఉండాలని, సాగర్, శ్రీశైలం నీటి విడుదలను సంయుక్త కమిటీలు పర్యవేక్షిస్తాయని స్పష్టం చేసింది. -
‘మన్నవరం’ కొనసాగించే ఉద్దేశం లేదు
-
‘మన్నవరం’ కొనసాగించే ఉద్దేశం లేదు
కేంద్రమంత్రి గోయల్‌తో సమావేశం అనంతరం సీపీఐ నారాయణ వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: మన్నవరం విద్యుత్ ఉపకరణాల తయారీ ప్రాజెక్టును కొనసాగించబోమని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ పరోక్షంగా చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు నారాయణ తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో నెలకొన్న అపోహలను తొలగించాలని కోరుతూ నారాయణ, ఆ పార్టీ ఎంపీ డి.రాజా సోమవారం ఢిల్లీలో గోయల్‌తో సమావేశమయ్యారు. మన్నవరం పూర్తయితే ప్రత్యక్షంగా 7 వేల మందికి పరోక్షంగా 30 వేల మంది ఉపాధి లభిస్తుందని గోయల్‌కు వివరించారు. దీనిపై ప్రస్తుత పరిస్థితి ఏంటని, ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం ఉందా? అని వారు మంత్రిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. మన్నవరం ప్రాజెక్టు తరలిపోయేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్ర మంత్రితో చర్చించిన తరువాత.. ఆయన మాటలు చూస్తే ప్రాజెక్టును ప్రారంభించే ఉద్ధేశం కేంద్ర ప్రభుత్వానికి లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోందన్నారు.