central taxes
-
కేంద్ర పన్నుల్లో పెరిగిన తెలంగాణ వాటా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రూ. 26,216.38 (2.102 శాతం) కోట్ల వాటా లభించనుంది. అందులో ఆదాయ పన్ను రూ. 9,066.56 కోట్లు, కార్పొరేషన్ పన్ను రూ. 7,872.25 కోట్లు, కేంద్ర జీఎస్టీ æరూ. 7,832.19 కోట్లు, కస్టమ్స్ రూ. 1,157.45 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ. 243.98 కోట్లు, సరీ్వస్ టాక్స్ రూ. 0.86 కోట్లు, ఇతర పన్నులు రూ. 43.09 కోట్లు ఉన్నాయి.ఈ మేరకు 2024–25 బడ్జెట్ ప్రతిపాదనల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గతేడాది బడ్జెట్లో కేంద్ర పన్నుల రూపంలో తెలంగాణకు రూ. 23,066.20 కోట్లు కేటాయించగా దానితో పోలిస్తే ఈసారి బడ్జెట్లో పన్నుల వాటా రూ. 3,150.18 కోట్లు అధికం కావడం విశేషం.రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు బడ్జెట్ కేటాయింపులు ఇవీ..⇒ ఈ ఏడాది బడ్జెట్లో హైదరాబాద్ ఐఐటీ (ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులు)కి నిధుల కేటాయింపులో కోత విధించారు. గతేడాది రూ. 300 కోట్లు బడ్జెట్లో కేటాయించి మొత్తం రూ. 522.71 కోట్లు ఖర్చు చేయగా ఈ ఏడాది ఐఐటీ హైదరాబాద్ (ఈఏపీ)లకు రూ. 122 కోట్లు మాత్రమే కేటాయించారు. ⇒ తెలంగాణలోని గిరిజన యూనివర్సిటీ కోసం ప్రత్యేకంగా కేటాయింపులేవీ చేయలేదు. దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు కలిపి కేటాయింపులు చేశారు. అయితే గతేడాది తెలంగాణ, ఏపీలోని గిరిజన విశ్వవిద్యాలయాలకు కలిపి రూ. 37.67 కోట్లు కేంద్రంకేటాయించింది.⇒ హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్‌కు కేటాయింపుల్లో కోత విధించారు. గతేడాది రూ.115 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్లో కేవలం రూ.10.84 కోట్లే కేటాయించారు. ⇒ సింగరేణి కాలరీస్‌కు రూ. 1,600 కోట్లు, హైదరాబాద్‌లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్‌కు రూ. 352.81 కోట్లు, హైదరాబాద్ సహా దేశంలోని 7 నైపర్ సంస్థలకు కలిపి రూ. 242 కోట్ల మేర కేంద్రం కేటాయించింది. ⇒ హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌కు రూ. 28 కోట్లు, హైదరాబాద్ సహా మరో మూడు ప్రాంతాల్లో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ హిందీ సంస్థకు రూ. 16.54 కోట్ల మేర కేటాయింపులు చేసింది. ⇒హైదరాబాద్ సహా 12 నగరాల్లో ఉన్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ–డాక్)కు రూ. 270 కోట్లు, నేషనల్ ఫిషరీస్ డెవలస్‌మెంట్ బోర్డుకు రూ. 16.78 కోట్లు, స్వాతంత్య్ర సమరయోధులకు (పెన్షన్లు) రూ. 603.33 కోట్లు, హైదరాబాద్ జాతీయ పోలీసు అకాడమీ సహా పోలీసు విద్య, శిక్షణ, పరిశోధనకు మొత్తం రూ. 1,348.35 కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయించారు. ⇒హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ సహా దేశంలోని ఇతర స్వయం ప్రతిపత్తి సంస్థలకు కలిపి రూ. 940.66 కోట్లు, మణుగూరు సహా కోటా (రాజస్తాన్)లోని భార జల ప్లాంట్లకు రూ. 1,485.21 కోట్ల మేర కేటాయించారు. -
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోయాయి
-
ఆ రెండు పద్దులు.. రూ.62 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన రీతిలో కేంద్ర ప్రభుత్వం తగినన్ని గ్రాంట్లు ఇవ్వడం లేదని గత మూడు బడ్జెట్ల గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. పన్నుల్లో వాటా కింద ప్రతిపాదించిన నిధులు కూడా కేంద్రం ఇవ్వడం లేదని రాష్ట్రం ఆరోపిస్తోంది... కానీ, కేంద్రంపై ఆధారపడి ఉన్న రెండు పద్దుల కింద మాత్రం తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను చూపెట్టింది. వచ్చే ఏడాదికైనా కేంద్రం వైఖరిలో మార్పు రాకపోతుందా అనే ఆశతో పెట్టిన గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, కేంద్ర పన్నుల్లో వాటా కింద మొత్తం రూ. 62,730.01 కోట్ల మేర రాబడులను ఈసారి బడ్జెట్లో చూపెట్టడం గమనార్హం. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ.41,259.17 కోట్లు చూపెట్టగా, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.21,470.84 కోట్లు చూపారు. అయితే, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పద్దు కింద గత ఏడాది (2021–22) వచ్చింది కేవలం రూ.8,619 కోట్లు మాత్రమే. 2022–23 బడ్జెట్లో ఈ పద్దు కింద రూ. 41,001.73 కోట్లు వస్తుందని ప్రతిపాదించినా డిసెంబర్ నాటికి వచ్చింది రూ.7,770.92 కోట్లే. మిగిలిన మూడు నెలల్లో ఎంత వస్తుందనే అంచనా మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పద్దు కింద ఏకంగా రూ.30,250 కోట్లు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు 2022–23 సవరించిన అంచనాల్లో పేర్కొంది. అయితే, వచ్చే ఏడాది (2023–24)కి గాను తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో 30వేల కోట్లకు మరో రూ.11వేల కోట్లు అదనంగా ‘గ్రాంట్స్’రూపంలో రూ.41,259.17 కోట్లు వస్తాయని అంచనా వేయడం గమనార్హం. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి గ్రాంట్స్ పద్దు కింద రాష్ట్రం ఆశిస్తున్న మొత్తానికి, కేంద్రం ఇస్తున్న నిధులకు చాలా వ్యత్యాసం ఉంది. కరోనా కష్టకాలంలో 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో మినహా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు కాదు కదా అందులో సగం కూడా ఎప్పుడూ కేంద్రం ఇవ్వలేదు. పన్నుల్లో వాటా... పరవాలేదా? ఇక, కేంద్ర పన్నుల్లో వాటా విషయంలో ప్రతిపాదనలు, మంజూరు గణాంకాలు కొంత ఆశాజనకంగానే ఉన్నా కేటాయించిన మేరకు రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. కేంద్ర పన్నుల్లో వాటా కింద 2021–22లో రూ.18,720.54 కోట్లు కేంద్రం నుంచి రాగా, 2022–23 సవరించిన అంచనాల మేరకు రూ.19.668.15 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక, తాజా బడ్జెట్లో ఈ పద్దును రూ.21,470.84 కోట్లుగా చూపెట్టడం గమనార్హం. మొత్తం మీద కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయంగా విభేదాలున్నప్పటికీ కేంద్రంపై నమ్మకంతో తాజా బడ్జెట్లో ఈ రెండు పద్దుల కింద రూ.62 వేల కోట్ల (దాదాపు 20 శాతం) రాబడులు చూపారు. ఇదే విషయమై ఆర్థిక శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కేంద్ర పన్నుల్లో వాటా కింద రావాల్సిన నిధులను అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్రం తెలంగాణకు కూడా కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పద్దు కింద కొన్నేళ్లుగా తక్కువగానే వస్తున్నా కేంద్రంపై ఆశలు పెట్టుకునే ప్రతిపాదనలు చేశామని చెప్పారు. -
కేంద్రపన్నుల్లో పెరిగిన తెలంగాణ వాటా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రపన్నుల్లో రాష్ట్రవాటా పెరిగింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రపన్నుల్లో భాగంగా 2023–24లో తెలంగాణకు రూ. 21,470.98 (2.102 శాతం) కోట్లు రానున్నాయి. అందులో కార్పొరేషన్ పన్ను రూ.6,872.08 కోట్లు, ఆదాయపు పన్ను రూ.6,685.61 కోట్లు, సంపద పన్ను రూ.–0.18 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.6,942.66 కోట్లు, కస్టమ్స్ రూ.681.10 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.285.26 కోట్లు, సరీ్వస్ ట్యాక్స్ రూ.4.31 కోట్లను కేంద్రం కేటాయించింది. కాగా, గత బడ్జెట్లో కేంద్రపన్నుల రూ పంలో తెలంగాణకు రూ.17,165.98 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. గతేడాదితో పోలిస్తే రాష్ట్రానికి రానున్న పన్నుల వాటా రూ.4,305 కోట్లు అధికం. రాష్ట్ర సంస్థలకు కేటాయింపులు ఇవే... ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్ ఐఐటీకి రూ.300 కోట్లు, సింగరేణి కాలరీస్‌కు రూ.1,650 కోట్లు, హైదరాబాద్‌సహా దేశంలోని 7 నైపర్ సంస్థలకు కలిపి రూ.550 కోట్లు, హైదరాబాద్‌లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థకు రూ.392.79 కోట్లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్‌కు రూ.115 కోట్లు, ఇన్‌కాయిస్‌కు రూ.27 కోట్లు, హైదరాబాద్‌సహా మరో మూడు ప్రాంతాల్లో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ హిందీ సంస్థకు రూ.39.77 కోట్లు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకు రూ.19 కోట్లు, స్వాతంత్య్ర సమరయోధుల(పెన్షన్లు)కు రూ.653.08 కోట్లు, తెలంగాణ, ఏపీల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు కలిపి రూ.37.67 కోట్లు, హైదరాబాద్‌సహా 12 నగరాల్లో ఉన్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీ–డాక్)కు రూ. 270 కోట్లు, హైదరాబాద్ జాతీయ పోలీసు అకాడమీసహా పోలీసు విద్య, ట్రైనింగ్, పరిశోధనలకు మొత్తం రూ.442.17 కోట్లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ సంస్థకు రూ.30.50 కోట్లు, మణుగూరుసహా కోట(రాజస్తాన్)లోని భారజల ప్లాంట్లకు రూ.1,473.43 కోట్లు, బీబీనగర్, మంగళగిరిసహా దేశంలో 22 కొత్త ఎయిమ్స్ నిర్మాణానికి రూ.6,835 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. -
Union Budget 2022: విశాఖ ఉక్కుకు రూ.910 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: విభజన హామీల ప్రస్తావన లేకపోయినప్పటికీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ ఉక్కు )కు కేంద్రం బడ్జెట్లో రూ.910 కోట్లు కేటాయించింది. వెనకబడిన జిల్లాలకు నిధులు, దుగరాజపట్నం పోర్టు తదితర హామీలకు నిధులు కేటాయించలేదు. విశాఖలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ యూనివర్సిటీకి రూ.150 కోట్లు, వైజాగ్ పోర్టు ట్రస్టుకు రూ.207 కోట్లు కేటాయించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా గత బడ్జెట్‌తో పోలిస్తే పెరిగింది. గత బడ్జెట్లో రూ.30,356.31 కోట్లు వస్తే.. ఈ సారి రూ.33,049.80 (4.047 శాతం) కోట్లు రానుంది. దీంట్లో కార్పొరేషన్ పన్ను రూ.10,319.40 కోట్లు, ఆదాయపు పన్ను రూ.9,966.37 కోట్లు, సంపద పన్ను రూ. 0.37 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.10,851.95 కోట్లు, కస్టమ్స్ రూ.1,432.93 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ.446.34 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ రూ.33.18 కోట్లు. చదవండిః చెంగల్పట్టులో రోడ్డు ప్రమాదం.. తెలుగు ప్రముఖుల దుర్మరణం -
ఈ నెలా జీతాల కోత!
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ నిబంధనలు సడలించినా రాష్ట్ర ఖజానాకు పెద్దగా ఆదాయం సమకూరకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మే నెల వేతనాల్లోనూ కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లాక్డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో కార్మికులు, కూలీలకు పనులు దొరికే పరిస్థితి ఉన్నందున, ప్రతి కుటుంబానికి నెలకు రూ.1,500 ఇచ్చే కార్యక్రమాన్ని జూన్ నెల నుంచి నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించి, ఖజానాకు ఆదాయం తగ్గిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఆసరా పింఛన్లను యథావిధిగా అందించడంతో పాటు, పేదలకు ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యాన్ని జూన్‌లోనూ పంపిణీ చేయాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతలు కొనసాగించాలని నిర్ణయిస్తూ.. ప్రజాప్రతి నిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసు ఉద్యోగుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం చొప్పున మే నెల వేతనంలో కోత విధిస్తామని సీఎం ప్రకటించారు. వచ్చింది రూ.3,100 కోట్లే.. ‘రాష్ట్రానికి ప్రతి నెలా రూ.12 వేల కోట్ల మేర ఆదాయం రావాల్సి ఉండగా, లాక్డౌన్ కారణంగా ఆదాయం పూర్తిగా పడిపోయింది. మే నెలకు సంబంధించిన కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా రూ.982 కోట్లు కలుపుకొంటే మొత్తంగా రాష్ట్ర ఖజానాకు రూ.3,100 కోట్లు సమకూరింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనల్లో కొన్నింటిని సడలించినా రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదు. కొద్ది మొత్తంలో వచ్చిన ఆదాయంతోనే అవసరాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.37,400 కోట్లు కిస్తీల కింద క్రమం తప్పకుండా చెల్లించాల్సి ఉంది. అప్పులను రీషెడ్యూలు చేయాలని కేంద్రాన్ని కోరినా స్పందించక పోవడంతో కిస్తీలు తప్పనిసరిగా కట్టాల్సిన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచినా కేంద్రం విధించిన షరతులతో అదనపు రుణాలు సమకూర్చుకునే పరిస్థితి రాష్ట్రానికి లేదు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపునకు రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చవుతుంది. వేతనాలు పూర్తిగా చెల్లిస్తే ఖజానా ఖాళీ కావడంతో పాటు ఇతర చెల్లింపులకు అవకాశం ఉండదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగిన వ్యూహం అనుసరించాలి’అని అధికారులకు సీఎం నిర్దేశించారు. హైదరాబాద్‌లో అన్ని షాప్‌లకూ ఓకే.. రాజధానిలో గురువారం నుంచిమాల్స్ మినహా అన్ని రకాల షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నగరంలో ఒక షాపు తప్పించి మరో షాపు (సరి–బేసి) తెరిచే వెసులుబాటు కల్పించింది. దీంతో ఒకే షాపులో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఎక్కువ షాపులు తెరిచి, తక్కువ మంది వచ్చే విధానం అనుసరించాలని నిర్ణయించింది. అవతరణ వేడుకలకు దూరంగా.. కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ అవతరణ వేడుకలను ఈసారి నిరాడంబరంగా జరపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించడం, జాతీయ పతాకావిష్కరణ మాత్రమే జరపాలని సూచించారు. ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించొద్దని చెప్పారు. మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు,ఇతర ప్రజాప్రతినిధులు తమ కార్యాలయాల్లోనే జాతీయ పతాకావిష్కరణ జరుపుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి, ప్రగతి భవన్లో పతాకావిష్కరణ చేస్తారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ముందు అమరవీరులకు నివాళి అర్పించి, పతాకావిష్కరణ చేస్తారు. జిల్లా కేంద్రంలో ముఖ్యమైన అధికారులతో చిన్నపాటి ఎట్ హోమ్ నిర్వహిస్తారు. -
కీలక నిర్ణయం: కేసీఆర్ 1500 ఇక పడవు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఆదాయం బాగా తగ్గిపోయిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘తెలంగాణ రాష్ట్రానికి ప్రతీ నెలా 12వేల కోట్ల వరకు ఆదాయం రావాలి. కానీ లాక్డౌన్ కారణంగా ఆదాయం మొత్తం పడిపోయింది. మే నెలలో కేంద్రానికి వెళ్లే పన్నుల్లో రాష్ట్ర వాటాగా రావాల్సిన 982 కోట్ల రూపాయలతో కలిపి కేవలం 3,100 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇటీవల ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదు. రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదు. ఫలితంగా కొద్ది మొత్తంలోనే ఆదాయం వచ్చింది. ఈ డబ్బులతోనే అన్ని అవసరాలు తీరాలి. రాష్ట్రం ఏడాదికి 37,400 కోట్ల రూపాయలను అప్పులకు కిస్తీలుగా చెల్లించాలి. ఇవి ప్రతీ నెలా ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. (చదవండి: బోరు బావిలో పడిపోయిన మూడేళ్ల చిన్నారి!) అప్పులను రీ షెడ్యూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్రం ఆ పని చేయలేదు. దీంతో కిస్తీలు తప్పక కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితి పెంచినప్పటికీ, కేంద్రం విధించిన అనేక షరతుల కారణంగా అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితి లేదు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు పూర్తిగా చెల్లించాలంటే మూడు వేల కోట్లకు పైగా వ్యయం అవుతుంది. ఖజానా ఖాళీ అవుతుంది. ఇక ఏ చెల్లింపు, ఏ పనీ చేసే వీలుండదు. కాబట్టి తగిన వ్యూహం అనుసరించాలి’ అని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అధికారులతో చర్చించిన అనంతరం సీఎం ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలి. ఆసరా పెన్షన్లను యధావిధిగా అందించాలి. లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని మే నెలలో కూడా అందించాలి. లాక్డౌన్ సడలింపుల కారణంగా కార్మికులు, కూలీలకు మళ్లీ పని దొరకుతుంది. కాబట్టి ప్రతీ కుటుంబానికి నెలకు 1500 రూపాయల నగదు ఇచ్చే కార్యక్రమం మే నెల నుంచి కొనసాగదు. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలి. హైదరాబాద్‌లో రేపటి నుంచి మాల్స్ మినహా అన్ని రకాల షాపులకు అనుమతి ఇప్పటివరకు ఒకషాపు తప్పించి మరో షాపు తెరిచే వెసులుబాటు దీనివల్ల ఒకే షాపులో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం ఎక్కువ షాపులు తెరిచి తక్కువ మంది ఉండేలా చూడాలని నిర్ణయం (చదవండి: మంథని జైలు మరణంపై హైకోర్టు విచారణ) -
పన్నుల్లో రాష్ట్రాల వాటా విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం తాజా ఆర్థిక సంవత్సరానికి చేసిన మధ్యంతర సిఫారసుల మేరకు ఏప్రిల్ వాయిదా మొత్తం రూ.46,038.10 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఇందులో ఏపీకి రూ. 1,892.64 కోట్లు, తెలంగాణకు రూ.982 కోట్లు విడుదలయ్యాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ. 8,255 కోట్లు, బిహార్‌కు రూ. 4,631 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ. 3,630 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ. 3,461 కోట్లు, మహారాష్ట్రకు రూ. 2,824 కోట్లు, రాజస్తాన్‌కు రూ. 2,752 కోట్లు, ఒడిశాకు రూ. 2,131 కోట్లు, తమిళనాడుకు రూ. 1,928 కోట్లు విడుదలయ్యాయి. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు వాటాను నిర్దేశించడంతో తెలుగు రాష్ట్రాలు కొంతమేర నష్టపోయాయి. -
అలా ఇచ్చి.. ఇలా లాక్కుంది!
హైదరాబాద్: రాష్ట్రాలకు సముచిత వాటా ఇస్తున్నట్లు ఘనంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం మొండిచెయ్యి చూపింది. ఒక చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి.. మరో చేత్తో లాక్కుంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను పది శాతం పెంచినట్లు ఊరించింది. అయితే ఆ మేరకు గ్రాంట్లలో భారీగా కత్తెర వేసింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే వాటా నిధులు ఈ ఏడాది తగ్గనున్నాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏటేటా కాస్తోకూస్తో పెరుగుతాయని అంచనా వేసుకున్న రాష్ర్ట ఆర్థిక శాఖ అసలు లెక్కలు చూసుకుని బిత్తరపోయింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దీంతో పది శాతం నిధులు అదనంగా వస్తాయని, అలాగే నిర్దేశిత పథకాలకు కచ్చితంగా ఖర్చు చేయాలనే నిబంధనలు కూడా లేకపోవడం కలిసొస్తుందని రాష్ట్ర ప్రభుత్వం సంబురపడింది. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూశాక నివ్వెరపోయింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్లానింగ్ పద్దులో రాష్ట్రాలకు కేటాయించే గ్రాంట్లను కేంద్రం భారీగా తగ్గించింది. గత ఏడాది కేటాయింపులతో పోల్చితే దాదాపు 39 శాతం కోత పెట్టింది. దీంతో పన్నుల వాటాలో పెరుగుదల ఉన్నప్పటికీ.. ఆ మేరకు ప్రాయోజిత పథకాల గ్రాంట్లు భారీగా తగ్గిపోయాయి. మొత్తంగా రాష్ట్రానికి దక్కే నిధులను చూస్తే గతంలో కంటే తక్కువగానే వస్తాయని లెక్క తేలుతోంది. పథకాలకు భారీ కోత కేంద్ర పథకాల కుదింపు వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. దీనికి తోడు పన్నుల వాటా పంపిణీ విషయంలో పాత జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం కూడా రాష్ట్రానికి నష్టం చేకూర్చింది. ప్రస్తుతమున్న 63 పథకాల్లో కేవలం 31 పథకాలను మాత్రమే కొనసాగించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 8 ప్రధాన పథకాలను ఉపసంహరించుకుంది. బీఆర్జీఎఫ్, మోడల్ స్కూళ్లు, జాతీయ ఈ-గవర్నెన్స్, రాజీవ్‌గాంధీ సశక్తీకరణ్ అభియాన్, ఆహార ఉత్పత్తుల జాతీయ మిషన్, పర్యాటక మౌలిక సదుపాయాల కల్పన, పోలీసు బలగాల ఆధునీకరణ, ఎగుమతులకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పన పథకాలను విరమించుకుంది. దీంతో వీటి ద్వారా రావాల్సిన నిధులను రాష్ట్రాలు కోల్పోయాయి. బీఆర్జీఎఫ్ ద్వారా తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఏటా రావాల్సిన రూ. 250 కోట్లు నష్టపోయినట్లయింది. గ్రామ పంచాయతీల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు నిర్దేశించిన రాజీవ్ సశక్తీకరణ్ రద్దు కావటంతో ఏటా రూ. 150 కోట్ల మేర నిధులు తగ్గిపోయాయి. వీటితో పాటు 24 పథకాలకు కేటాయించే కేంద్ర నిధులు కూడా నిలిచిపోయాయి. అలాగే చిన్నారులు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్యం, పౌష్టికాహారానికి ఇచ్చే నిధులను సగానికి సగం కుదించింది. ఐసీడీఎస్ ప్రాజెక్టులకు గత ఏడాది రూ. 16,316 కోట్లు మంజూరు చేయగా ఈసారి కేవలం రూ. 8 వేల కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు కింద గత ఏడాది తెలంగాణకు రూ. 1,172 కోట్లు మంజూరు కాగా, ఇప్పుడు అది రూ. 500 కోట్లు దాటే అవకాశం లేదని అధికారులు తలపట్టుకుంటున్నారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య పథకాల్లోనూ కేంద్రం తన వాటాను తగ్గించింది. స్వచ్ఛభారత్ అభియాన్ కింద అమలు చేసిన ఈ కార్యక్రమాలకు గత బడ్జెట్లో రూ. 11,938 కోట్లు ఖర్చు చేయగా.. ఈసారి కేవలం రూ. 6 వేల కోట్లను కేటాయించింది. ఫలితంగా కేంద్ర పథకాలకు సంబంధించి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు అదే దామాషాలో తగ్గిపోనున్నాయి. రాష్ట్రంలో భారీ అంచనాలతో తలపెట్టిన వాటర్‌గ్రిడ్‌కు భారీగా నిధులు వస్తాయని ఆశిస్తే.. ఆ శాఖకు నిధుల కోత పడటం గమనార్హం. ఈ లెక్కన రాష్ట్రాలకు వచ్చే కేంద్ర పన్నులు, గ్రాంట్లలో గత ఏడాదితో పోల్చితే పెద్ద మార్పేమీ లేదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంచనాలు తలకిందులు.. గత ఏడాది బడ్జెట్లో అప్పటి 13వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాను రూ. 3.82 లక్షల కోట్లుగా కేంద్రం లెక్కగట్టింది. తాజాగా 14వ ఆర్థిక సంఘం సిఫారసులతో ఈ వాటాను రూ. 5.79 లక్షల కోట్లకు పెంచింది. దీంతో పన్నుల వాటా కింద తెలంగాణకు 14,185 కోట్లు వస్తాయని రాష్ర్ట ఆర్థిక శాఖ అంచనా వేసింది. అదే సమయంలో కేంద్ర పథకాలను పునర్వ్యవస్థీకరించడంతో రాష్ట్రానికి చేటు జరిగింది. ఈసారి కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రాలకు రూ. 2.04 లక్షల కోట్లు కేటాయించింది. జనాభా ప్రాతిపదికన 2.5 శాతం లెక్కన ఇందులో తెలంగాణకు రూ. 5,119 కోట్లు వస్తాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది. పన్నుల వాటా, కేంద్ర పథకాల గ్రాంట్లు కలిపితే ఈసారి కేంద్రం నుంచి రూ. 19,304 కోట్లు వచ్చే అవకాశముంది. దీంతో రాష్ర్ట బడ్జెట్ తయారీలో ఈ పద్దును రూ. 20 వేల కోట్లలోపే చూపనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది రాష్ట్ర బడ్జెట్లో కేంద్ర పన్నులు, గ్రాంట్ల రూపంలో రూ. 21,720 కోట్ల పద్దును చూపింది. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి దాదాపు రూ. 2,416 కోట్ల రాబడి తగ్గిపోనుంది. డబుల్ బెడ్రూం ఇళ్లపై డౌట్ రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం భారీ సాయం చేస్తుందన్న ఆశతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి అరుణ్‌జైట్లీ ఊహించని షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించే ఇళ్లకు కేంద్రం ఇందిరా ఆవాస్ యోజన(ఐఏవై) కింద భారీ కేటాయింపులు చేస్తూ వచ్చింది. దేశంలో మరే రాష్ట్రం పొందనన్ని ఐఏవై నిధులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పొందుతూ వచ్చింది. ఈసారి మరిన్ని నిధులు పొంది రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ భారం రాష్ట్ర ఖజానాపై పడకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కానీ కేంద్ర బడ్జెట్ కేటాయింపుల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఐఏవై కింద కేంద్రం ఈసారి కేవలం రూ. 10,025 కోట్లను కేటాయించింది. ఇది గత బడ్జెట్ కంటే ఏకంగా రూ. 6 వేల కోట్లు తక్కువ. ఫలితంగా రాష్ట్రాలకు కేటాయింపులు భారీగా తగ్గిపోనున్నాయి. ఇది రెండు పడక గదుల పథకానికి కచ్చితంగా శరాఘాతంగానే మారనుంది. దీంతో రాష్ట్ర బడ్జెట్ తయారీపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపుల విషయంలో పునరాలోచనలో పడింది. -
కొంచెం మోదం.. కొంచెం ఖేదం
సాక్షి, హైదరాబాద్: కొంచెం మోదం.. కొంచెం ఖేదం అన్నట్లుగా 14వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రాన్ని ఊరించి ఉసూరుమనిపించాయి. ప్రత్యేక నిధుల ఊసేమీ లేకుండా మిగులు రెవెన్యూ ఉన్న ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణకూ కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా మొత్తం పెరిగింది. అయితే పాత జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకుని నిధుల పంపిణీ శాతాన్ని తగ్గించడంతో ఆ మేరకు రాష్ర్టం కొంత నష్టపోవాల్సి వస్తోంది. ఆర్థిక సంఘం కొత్త సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల్లో ప్రస్తుతం రాష్ట్రాలకున్న వాటా 32 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. దీంతో రాబోయే ఐదేళ్లలో(2015-2020) తెలంగాణకు కేంద్ర పన్నుల ద్వారా మొత్తం రూ. 96,217 కోట్లు అందుతాయని అంచనా. ప్రస్తుతం ఏటా రూ. 10 వేల కోట్ల నుంచి రూ. 11 వేల కోట్లు మాత్రమే వస్తున్నాయి. ఒక్కసారిగా పది శాతం వాటా పెంపుతో రాష్ట్రాలకు నిధుల రాక భారీగా పెరగడం శుభపరిణామం. అదే సమయంలో పన్నుల వాటాను రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడంలో అనుసరించే విధానం వల్ల తెలంగాణకు కొంత నష్టం జరిగింది. ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రాలకు 42 శాతం పన్నుల వాటాలో తెలంగాణకు 2.437 శాతం నిధులు పంపిణీ అవుతాయి. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 2.91 శాతం పన్నుల వాటా విడుదలైంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాతిపదికనే కేంద్రం నిధులు కేటాయించింది. తాజాగా 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా.. 2001లో ఉన్న జనాభా ప్రకారమే వాటాలను ఆర్థిక సంఘం లెక్కించింది. దీంతో రాబోయే ఐదేళ్లు తెలంగాణకు 2.43 శాతం చొప్పునే నిధులు దక్కుతాయి. దీంతో 0.5 శాతం నిధుల వాటాను రాష్ర్టం నష్టపోయినట్లయింది. కొత్త జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. స్థానిక సంస్థలకు రూ. 8,764.38 కోట్లు జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లలో తెలంగాణకు వచ్చే ఐదేళ్లలో రూ. 8,764.38 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక సంఘం ప్రకటించింది. ప్రాథమిక గ్రాంట్లు, పనితీరు ఆధారంగా ఇచ్చే గ్రాంట్లుగా వీటిని రెండుగా విభజించింది. జనాభా ప్రాతిపదికన ఇచ్చే ఈ గ్రాంట్లను తలసరిగా రూ. 488 చొప్పున ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఈ లెక్కన తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ఐదేళ్లలో రూ. 4,837.75 కోట్లు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ. 2,711.12 కోట్లు గ్రాంట్లుగా అందుతాయి. ఇక స్థానిక సంస్థల పనితీరు ఆధారంగా ఫెర్ఫార్మెన్స్ గ్రాంట్లను 2016 నుంచి విడుదల చేస్తారు. ఈ పద్దులో గ్రామ పంచాయతీలకు రూ. 537.53 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 677.78 కోట్లు అందే అవకాశముంది. అలాగే రాబోయే ఐదేళ్లలో విపత్తుల నిర్వహణకు విడుదల చేసే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద తెలంగాణకు రూ. 1,515 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఇందులో పది శాతం రాష్ర్ట వాటా కాగా, మిగతా 90 శాతం కేంద్రం గ్రాంట్లు. రాష్ట్ర విజ్ఞప్తులు బుట్టదాఖలు లోటు రెవెన్యూ ఉన్నందున ఏపీకి భారీ మొత్తంలో గ్రాంట్లు సిఫారసు చేసిన ఆర్థిక సంఘం.. తెలంగాణకు మొండిచెయ్యి చూపింది. ఐదేళ్లలో కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 20,950 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘాన్ని సీఎం కేసీఆర్ కోరారు. వాటర్‌గ్రిడ్‌కు రూ. 7,700 కోట్లు, హరితహారానికి రూ. 1,046 కోట్లు, రోడ్లు, వంతెనల నిర్వహణకు రూ. 1,000 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 1,316 కోట్లు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకపోవడంతో ప్రత్యేక గ్రాంట్లేమీ రాష్ట్రానికి దక్కలేదు. దీనికి తోడు రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీకి 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వం కోరినా వినలేదు.