
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం తాజా ఆర్థిక సంవత్సరానికి చేసిన మధ్యంతర సిఫారసుల మేరకు ఏప్రిల్ వాయిదా మొత్తం రూ.46,038.10 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఇందులో ఏపీకి రూ. 1,892.64 కోట్లు, తెలంగాణకు రూ.982 కోట్లు విడుదలయ్యాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ. 8,255 కోట్లు, బిహార్‌కు రూ. 4,631 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ. 3,630 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ. 3,461 కోట్లు, మహారాష్ట్రకు రూ. 2,824 కోట్లు, రాజస్తాన్‌కు రూ. 2,752 కోట్లు, ఒడిశాకు రూ. 2,131 కోట్లు, తమిళనాడుకు రూ. 1,928 కోట్లు విడుదలయ్యాయి. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు వాటాను నిర్దేశించడంతో తెలుగు రాష్ట్రాలు కొంతమేర నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment