characters
-
'పుష్ప'లో ఈ పాత్రలను వదులుకున్న స్టార్స్ ఎవరెవరో తెలుసా..?
-
రణ్వీర్ దశావతార్
తమ అభిమాన హీరో బొమ్మ గీసి ముచ్చటపడే అభిమానులు మనకు కొత్తేమీ కాదు. అయితే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ అభిమాని పౌమిల్ కత్రి వినూత్న శైలితో తన అభిమానాన్ని చాటుకున్నాడు. రకరకాల స్కెచ్‌లు ఉన్న పరికరంతో కాన్వాస్‌పై ఒకే సమయంలో వివిధ సినిమాలలోని రణ్వీర్ క్యారెక్టర్లను గీసి నెటిజనులను ఆశ్చర్యచకితుల్ని చేశాడు. ‘మేడ్ 10 స్కెచెస్ ఆఫ్ రణ్‌వీర్‌సింగ్ ఎట్ ఏ సేమ్ టైమ్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో ఎనిమిది మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియో చూసి ముచ్చటపడిన రణ్‌వీర్‌సింగ్ పౌమిల్ను ప్రశంసిస్తూ కామెంట్ పెట్టడం మరో విశేషం. ఇక టాలెంటెడ్ ఆర్టిస్ట్ పౌమిల్ కత్రి విషయానికి వస్తే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన కత్రికి ఇన్‌స్టాగ్రామ్‌లో వందలాదిమంది ఫాల్వర్స్ ఉన్నారు. -
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను– సంతోష్ శోభన్
‘‘వందేళ్ల ఇండియన్ సినిమాల్లో ఎన్నో పాత్రలు, ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకూ చెప్పని కథ, ఎవరూ చేయని పాత్రను ఎలివేట్ చేయటం అనేది ఓ ఆర్టిస్ట్‌కి కొత్తగా ఉంటుంది. అలా పెళ్లి మండపంపై మిగిలిపోయేవాడి కథే ‘ప్రేమ్ కుమార్’’ అని హీరో సంతోష్ శోభన్ అన్నారు. సంతోష్ శోభన్, రాశీ సింగ్, రుచితా సాధినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’.అభిషేక్ మహర్షి దర్శకత్వంలో శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ–‘‘అభిషేక్ కొన్ని సినిమాల్లో నటుడిగా చేశాడు. దర్శకుడు కావాలనుకున్నప్పుడు ‘ప్రేమ్ కుమార్’ కథ రాసుకుని, చక్కగా తీశాడు. వరుసగా వరుడు, పెళ్లి వంటి సినిమాలు చేస్తున్నాను. అయితే నిజ జీవితంలో నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను (నవ్వుతూ). నేనిప్పటి వరకు మంచి డైరెక్టర్స్‌తో సినిమాలు చేశాను. అయితే నేను చేసిన సినిమాలన్నీ కరెక్ట్‌గానే ఎంచుకున్నానా? అంటే లేదనే అంటాను. ‘ప్రేమ్ కుమార్’ నాకు సరైన హిట్ ఇస్తుందనుకుంటున్నాను’’ అన్నారు. -
కలర్‌ఫుల్ ఎంఆర్ఐ స్కానర్
న్యూఢిల్లీ: ఎంఆర్ఐ స్కానింగ్ అంటే చాలా మందికి భయం. వింత శబ్దాలతో గుహలోకి వెళ్లిన ఫీలింగ్. చిన్నారులకు ఎంఆర్ఐ అంటే మరీ కష్టం. పిల్లలు భయపడకుండా స్కాన్ తీయడం కోసం ‘చిన్నారి’ ఎంఆర్ఐ మిషన్లు వస్తున్నాయి. మిషన్‌కు రంగులద్దడంతో పాటు దానిపైన ఫిక్షనల్ కేరక్టర్స్, బొమ్మలు చిత్రీకరించి పిల్లల్ని ఆకర్షించేలా రూపొందిస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో ఇలాంటి ఎంఆర్ఐ మిషన్లు ఉంటున్నాయని పారిశ్రామికవేత్త హర్షగోయెంక ఒక ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ మిషన్‌ను చూసిన నెటిజన్లు భలేగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. -
‘డీ గ్లామరస్’ హీరోయిన్లు.. దేనికైనా రెడీ
హీరోయిన్ అంటే అమాయకంగా ఉండి.. హీరో ఏడిపిస్తే ఉడుక్కుని.. నాలుగు పాటల్లో స్టెప్పులేసి... ఎండ్ కార్డులో గ్రూపు ఫొటోలో కనిపించే రోజులు పోయాయి. ‘గ్లామరస్ హీరోయిన్’ అనిపించుకున్న నాయికలు ‘డీ గ్లామరస్’గా కనిపిస్తున్న రోజులు ఇవి. క్యారెక్టర్ కోసం క్యారెక్టర్‌కి తగినట్లుగా కనబడుతున్నారు. 2021లో తెరపై నాయికల క్యారెక్టర్ కనబడింది. ఆ క్యారెక్టర్స్‌ని చూద్దాం. ‘పరేశానురా.. పరేశానురా.. ప్రేమన్నదే పరేశానురా’.. అంటూ ‘ధృవ’లో మెరుపు తీగలా కనిపించిన రకుల్ ప్రీత్‌సింగ్‌ని చూసి యూత్ పరేశాన్ అయ్యారు. కెరీర్ ఆరంభించిన ఏడేళ్లల్లో రకుల్ చేసినవన్నీ గ్లామరస్ రోల్సే కాబట్టి ‘గ్లామరస్ హీరోయిన్’ అనే స్టాంప్ బలంగా పడిపోయింది. అయితే అందుకు భిన్నంగా ‘కొండపొలం’లో గొర్రెల కాపరి ఓబులమ్మగా కనిపించారామె. ఈ అమ్మాయి ఎప్పుడూ గ్లామర్ పాత్రలే చేస్తుందేంటి? అనే ముద్రను ఓబులమ్మ చెరిపేయగలుగుతుందని రకుల్ నమ్మారు. ఆ నమ్మకం నిజమైంది. రకుల్ కంటే సీనియర్ అయిన ప్రియమణి ఖాతాలో కూడా గ్లామరస్ క్యారెక్టర్లు చాలానే ఉన్నాయి. అయితే ‘నారప్ప’లో సుందరమ్మగా నల్లని మేకప్‌తో ఆకట్టుకున్నారు ప్రియమణి. మరోవైపు హీరోయిన్గా దూసుకెళుతున్న రష్మికా మందన్నా కూడా గ్లామర్ ఇమేజ్‌కి దూరంగా వెళ్లడానికి వెనకాడలేదు. ఇటీవల రిలీజైన ‘పుష్ప’లో ‘సామీ.. సామీ’ అంటూ అసలు సిసలైన పల్లె పిల్లలా కనిపించి, అందర్నీ ఆశ్చర్యపరిచారీ బ్యూటీ. గ్లామర్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోయిన్లకు రచయితలు డీ–గ్లామరస్ రోల్స్ రాయడం, ఆ పాత్రలను సవాల్‌గా తీసుకుని నాయికలు ఒప్పుకోవడం అనేది మంచి మార్పు. మంచి మార్పు ఎప్పుడూ ఆహ్వానించదగ్గదే. 2022లోనూ తారల ‘క్యారెక్టర్ కనబడే’ పాత్రలు మరిన్ని వస్తున్నాయి. 2022లోనూ... 2021లో ‘నారప్ప’లో సుందరమ్మగా కనిపించిన ప్రియమణి ‘విరాటపర్వం’లో నక్సలైట్‌గా కనిపించనున్నారు. అడవిలో ఉండేవాళ్లు ఎలా ఉంటారు? కమిలిపోయిన చర్మంతో, ఎర్రబారిన జుత్తుతో.. ఈ సినిమాలో ప్రియమణి ఇలానే కనిపించనున్నారు. ఇదే సినిమాలో మరో సీనియర్ తార, దాదాపు డీ–గ్లామరస్ రోల్స్ చేసే నందితా దాస్ కూడా నక్సలైట్‌గా కనిపించనున్నారు. ఇక నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్ అంటే సాయిపల్లవి డేట్స్ ఉన్నాయేమో కనుక్కోండి అంటుంది ఇండస్ట్రీ. సాయిపల్లవి మీద గ్లామరస్ హీరోయిన్ అనే ముద్ర లేదు. అయితే ఇప్పటివరకూ కనిపించినదానికన్నా కాస్త డిఫరెంట్‌గా ‘విరాటపర్వం’లో కనిపించనున్నారామె. నిజానికి 2021లోనే ‘విరాటపర్వం’ విడుదల కావాలి. కానీ కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడింది. ఇక నటనకు అవకాశం ఉన్న పాత్ర, ఫుల్ ట్రెడిషనల్‌గా కనిపించే పాత్ర అంటే మహానటికి ఫోన్ వెళుతుంది. ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో అంత అద్భుతంగా ఒదిగిపోయారు కీర్తీ సురేష్. కీర్తికి గ్లామరస్ హీరోయిన్ ట్యాగ్ లేదు. అయితే ఇప్పటివరకూ కనిపించని విధంగా తమిళ సినిమా ‘సాని కాయిదమ్’లో కనిపించనున్నారామె. ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. -
రియల్ సినతల్లికి రూ. 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్
తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ హీరో అయినప్పటికీ ఆయనకు తెలుగులోనూ ఎంతో క్రేజ్ ఉంది. ఒక పక్క కమర్షియల్ సినిమాలతో పాటు నటనకి ప్రాధాన్యం, కథ బలం ఉన్న సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా సూర్య జస్టిస్ చంద్రు అనే అడ్వకేట్ బయోపిక్‌తో అద్భుతమైన విజయం సాధించాడు. నిజ జీవితంలో అన్యాయంగా జైలుపాలైన భర్తను కాపాడుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటంలో.. చంద్రూ అనే అడ్వకేట్ నిస్వార్థంగా ఆమెకు సాయం చేసి తన తరపున కోర్టులో వాదించి గెలిచిన ఓ కేసును స్ఫూర్తిగా తీసుకుని ‘జై భీమ్’ సినిమాను చేశాడు సూర్య. చదవండి: షణ్ముఖ్, సిరిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన జెస్సీ.. అరియాన షాక్ ఈ సినిమాతో ఇందులోని రియల్ పాత్రలు కూడా ప్రపంచానికి పరిచయమయ్యాయి . సినిమాలో సినతల్లి పాత్రకి నిజ జీవితంలో పార్వతి అమ్మాళ్ అనే మహిళ స్ఫూర్తి. ప్రస్తుతం ఆమె ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. పిల్లలు పోషించలేక, వృద్ధాప్యంతో చాలా కష్టాల్లో ఉంది. ఈ సినిమాతో తన గురించి బయటి ప్రపంచానికి తెలియడంతో హీరో, కొరియోగ్రఫర్ రాఘవ లారెన్స్ ఆమెకు సొంత ఇల్లు కటిస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో సూర్య సైతం పార్వతి అమ్మాళ్కు అండగా నిలిచాడు. తన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి.. మొత్తంపై నెల నెలా వచ్చే వడ్డీ పార్వతి అమ్మాళ్కు చేరేలా చేశాడు. చదవండి: అందంతో కట్టిపడేస్తోన్న అవికా, ఫొటోలు వైరల్ అంతేగాక తన తదనంతరం ఆమె పిల్లలకు ఈ వడ్డీ అందజేస్తామని సూర్య తెలిపారు. ఇప్పటికే అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవలు చేస్తున్నాడు. ఎంతో మంది పిల్లల్ని చదివిస్తున్నాడు. ఎన్నో సేవా కార్యక్రమాల్ని చేపడుతున్నాడు. ఇవి మాత్రమే కాక తరచూ విరాళలు ప్రకటిస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటాడు. కరోనా సమయంలో కూడా తనవంతుగా కోటీ రూపాయలు ప్రకటించి తమిళ నాడు ప్రభుత్వానికి అండగా నిలిచాడు. అంతేగాక జై భీమ్ చిత్రం స్ఫూర్తితో గిరిజనుల సంక్షేమం కోసం కూడా సూర్య కోటీ రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా సూర్య రీల్ హీరోగా మాత్రమే కాకుండా రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. చదవండి: కేబీఆర్ పార్క్ వద్ద నటిపై దాడి.. ముఖంపై పిడిగుద్దులు, హత్యాయత్నం -
జై భీమ్: రాసాకన్ను సతీమణికి ఇల్లు కట్టిస్తా: రాఘవ లారెన్స్
తమిళ సినిమా : రాసాకన్ను సతీమణి పార్వతికి ఇల్లు కట్టిస్తానని నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ తెలిపారు. కొండ ప్రాంతానికి చెందిన ఈ దంపతుల యదార్థ ఘటనల ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రం జై భీమ్. ఇటీవల ఓటీటీలో విడుదలై ప్రశంసలు అందుకుంటోంది. రాసాకన్ను భార్య పార్వతి ఉండడానికి సరైన ఇల్లు కూడా లేక కడు పేదరికాన్ని అనుభవిస్తోంది. చేయని నేరానికి రాసాకన్ను హత్యకు గురికావడం.. ఆయన సతీమణి పార్వతి దీన పరిస్థితి గురించి సామాజిక మాధ్యమాల్లో తెలుసుకున్న రాఘవ లారెన్స్ చలించిపోయారు. ఆమెకు తన సొంత డబ్బుతో ఇల్లు కట్టిస్తానని సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 28 ఏళ్ల క్రితం జరిగిన ఘోరమైన సంఘటనలను ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకునేలా చేసిన జై భీమ్ చిత్ర యూనిట్‌కు, ఆ చిత్రాన్ని సంచలనంగా మార్చిన నటుడు సూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే.జ్ఞానవేల్‌కు హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు. -
ఇవి ‘బాహుబలి’ విత్తనాలు.. శివగామి, కట్టప్పవీ ఉన్నాయ్
న్యూఢిల్లీ: రైతుల కష్టార్జితం వారికి కడుపు నింపుతుందా? అన్నది ప్రకృతి చేతుల్లోనే ఉంటుంది. నాణ్యమైన విత్తనాలు, ప్రకృతి అనుకూలత, ఆరోగ్యకరమైన దిగుబడి, మార్కెట్లో మద్దతు ధరలు ఇవన్నీ కలిస్తేనే అన్నదాత కష్టానికి ఫలితం దక్కినట్టుగా భావించాలి. మహారాష్ట్రలో వరి, ఉల్లి రైతులు ఈ సీజన్లో బాహుబలి, కట్టప్ప, శివగామి, భీమ, దుర్గ బ్రాండ్ల విత్తనాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అకాల వర్షాలు, లాక్డౌన్లు, పెరిగిన ఖర్చుల మధ్య వారు ప్రజాదరణ పొందిన పౌరాణిక పాత్రల పేర్లతో విక్రయిస్తున్న విత్తనాలపై ఆశలు ఎక్కువగా పెట్టుకున్నారు. మహారాష్ట్రలో సాగు ఊపందుకోవడంతో ఇటువంటి బ్రాండ్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. పేర్లతో అనుబంధం వేరు.. పేర్లలో ఏముందిలే అనుకోవద్దు. కొనుగోళ్ల విషయంలో బ్రాండ్ల పేర్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని.. ముఖ్యంగా కరువు, సంక్షోభ సమయాల్లో వీటికి ఉన్న ప్రాముఖ్యత ఎక్కువని మహారాష్ట్ర విత్తన పరిశ్రమ సమాఖ్య ఈడీ ఎస్బీ వాంఖడే పేర్కొన్నారు. ‘‘నిర్ణీత పరీక్షలు, అనుమతుల తర్వాతే విత్తన కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెడతాయి. సినిమాల్లోని పాత్రల పేర్లు, దేవతల పేర్లను పెట్టడం ద్వారా రైతుల దృష్టిని ఆకర్షించడానికి వీలుంటుంది’’అని వాంఖడే వివరించారు. సినిమాల్లో ప్రజాదరణ పొందిన పాత్రల పేర్లు అయితే ప్రజలకు పరిచయం చేయక్కర్లేదని.. దీంతో ప్రచారం కోసం పెద్దగా ఖర్చు చేయకుండానే ఆయా పేర్లతో తేలిగ్గా చేరువ కావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించడం తెలిసిందే. ఇందులోని బాహుబలి, కట్టప్ప, శివగామి పాత్రలు ఎంతో విజయవంతం అయ్యాయి. అందుకే ఈ పేర్లను విత్తన కంపెనీలు తమ ఉత్పత్తులకు తగిలించేశాయి. వీటితోపాటు భీష్మ, అర్జున్, కరణ్ వంటి పౌరాణిక పేర్లతో ఉన్న విత్తనాలను అక్కడి రైతులు నాణ్యమైనవిగా భావిస్తుండడం గమనార్హం. వరికి సంబంధించి సోనా, నవాబ్, ఉల్లికి సంబంధించి కోహినూర్ బ్రాండ్లకూ అక్కడ మంచి ఆదరణే ఉంది. మ్యాజిక్.. పత్తి సాగు రైతులకు పెద్దగా మిగిల్చిందేమీ లేకపోయినా.. మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో మ్యాజిక్, మనీ మేకర్, ఫోర్స్ పేర్లతో ఉన్న పత్తి విత్తనాలు బాగా అమ్ముడుపోతున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్కెటింగ్ చేసుకునే విషయంలో ఈ పేర్లకు ఎంతో ప్రాధాన్యత ఉన్నట్టు కమ్యూనికేషన్ నిపుణుడు ఫ్రొఫెసర్ ఆర్ఎల్ పండిట్ పేర్కొన్నారు. ప్రజలకు చేరువ కావడమే ఈ పేర్ల వెనుక వ్యూహమని చెప్పారు. ‘‘తమ అనుభవం, నేపథ్యం, అవగాహన ఆధారంగా పేర్లతో వ్యక్తులకు అనుబంధం ఏర్పడుతుంది. ప్రజాదరణ పొందిన పాత్రల పేర్లు ప్రజల జ్ఞాపకాల్లో సులభంగా నిలిచిపోవడమే కాకుండా ఆయా పేర్లతో ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేసే దిశగా ప్రోత్సహిస్తుంది’’అని పండిట్ వివరించారు. అయితే, అనుభవం కలిగిన రైతులు మాత్రం నాణ్యమైన విత్తనాల వైపే మొగ్గు చూపిస్తున్నారు. గత సీజన్లో నాణ్యతలేమి విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులు.. సోయాబీన్, ఉల్లి, పత్తి విత్తనాలపై ఫిర్యాదులు కూడా చేశారు. -
ఇప్పుడు సీన్ రివర్స్.. ఆ పాత్రలైనా ఓకే!
సాధారణంగా స్క్రీన్ మీద తమ వయసు కన్నా తక్కువ వయసున్న పాత్రలు చేస్తుంటారు స్టార్స్. వాళ్ల అభిమానులు కూడా అదే కోరుకుంటుంటారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కథ కోరుకుంటే వయసుకి మించిన పాత్రలైనా ఫర్వాలేదంటున్నారు. క్యారెక్టర్లో కంటెంట్ ఉంటే స్క్రీన్ మీద ముసలి పాత్రలైనా సై అంటున్నారు స్టార్స్. ప్రస్తుతం వయసుకు మించిన పాత్రలు చేస్తున్నారు కొందరు తారలు. ఆ విశేషాలు... భారతీయుడు రిటర్న్స్ అవినీతిని నిర్మూలించడానికి భారతీయుడి అవతారమెత్తారు కమల్‌హాసన్ . ఇప్పుడు మరోసారి భారతీయుడిగా మారారాయన. 1996లో శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ చేసిన చిత్రం ‘భారతీయుడు’. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో 90 ఏళ్ల వృద్ధుడి పాత్రలో కనిపించనున్నారు కమల్. ఆయన లుక్ కరెక్ట్‌గా రావడం కోసం హాలీవుడ్ మేకప్ నిపుణులతో ప్రొస్థెటిక్ మేకప్‌ను వినియోగిస్తున్నారు. కోవిడ్ బ్రేక్ తర్వాత ఈ సినిమా ప్రారంభం కాలేదు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కొమురం భీమ్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో కొమురంభీమ్ పాత్ర చేస్తున్నారు ఎన్టీఆర్. ఇందులో ఆయన వృద్ధుడిగా నటించే సన్నివేశాలు కూడా ఉంటాయని సమాచారం. దీనికి సంబంధించిన లుక్ కూడా హైలైట్‌గా ఉంటుందని వార్తలు వచ్చాయి. నిజానికి కొమురం భీమ్ చిన్న వయసులోనే చనిపోయారు. మరి ఈ ఓల్డ్ లుక్‌కి సంబంధించిన సన్నివేశాలను రాజమౌళి ఎలా ప్లాన్ చేశారో చూడాలి. అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కానుంది. అరణ్య అడవి.. తల్లి లాంటిది. ఆ తల్లిని కాపాడుకోవాలి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘అరణ్య’. ఈ సినిమాలో అడవిలో నివశించే ముసలి వ్యక్తి పాత్రలో రానా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం చాలా బరువు తగ్గిపోయారు. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఈ సినిమా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కింది. మార్చి 26న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. భారతీయుడి భార్య ‘భారతీయుడు 2’ సినిమాలో కమల్‌హాసన్ భార్య పాత్రలో నటిస్తున్నారు కాజల్ అగర్వాల్. ఈ సినిమాలో ఆమె 85 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో కనిపించనున్నారు. ఇలాంటి రోల్లో కాజల్ కనిపించడం ఇదే తొలిసారి. అలాగే ఈ సినిమా కోసం కళరియపయట్టు అనే యుద్ధ విద్య కూడా నేర్చుకున్నారీ బ్యూటీ. గ్యాంగ్‌స్టర్ కథ ‘పవర్ పేట’ చిత్రం కోసం పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా మారారు నితిన్ . ‘ఛల్ మోహన్ రంగా’ తర్వాత ‘పవర్ పేట’ అనే గ్యాంగ్‌స్టర్ చిత్రం కోసం కలిశారు దర్శకుడు కృష్ణ చైతన్య, హీరో నితిన్ . ఓ గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ సినిమాలో 20, 40, 60 ఏళ్ల వ్యక్తిగా మూడు దశల్లో కనిపిస్తారట నితిన్ . ఈ వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. తలైవి దివంగత తమిళ నటి, రాజకీయ నాయకురాలు జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తున్నారు. జయ సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి సీయంగా ఎన్నికైన వరకూ ముఖ్యమైన విషయాలను ఈ సినిమాలో చర్చించనున్నారు. జయలలిత చివరి దశలో ఉన్నప్పటి సన్నివేశాలకు ప్రోస్థటిక్ మేకప్‌ను ఉపయోగించి కంగనాను 60 ఏళ్లకు పైబడిన జయలలితగా మార్చారు. జయగా మారడానికి చాలా హోమ్‌వర్క్ చేశాను అని పేర్కొన్నారు కంగన. ‘తలైవి’ చిత్రం ఏప్రిల్ 23న విడుదల కానుంది. కోబ్రా సినిమా సినిమాకి భిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తుంటారు విక్రమ్. ఆయన చేస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’. ఈ సినిమాలో సుమారు 20 గెటప్స్‌లో కనిపిస్తారని టాక్. అయితే ఇందులో ఓ ముసలి వ్యక్తిగా కనిపించే పాత్ర కీలకం అని తెలిసింది. ఈ లుక్ కోసం, బాడీ లాంగ్వేజ్ కోసం చాలా శ్రమించారట విక్రమ్. ఈ సినిమాలో ఈ లుక్ ఓ హైలెట్‌గా ఉంటుందట. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. వెన్నెల పాట రానా, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాట పర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాలోని ‘కోలు కోలమ్మ కోలో కోలో...’ అంటూ సాగే పాట గురువారం విడుదలయింది. ఈ పాట లిరికల్ వీడియోను వెంకటేశ్ రిలీజ్ చేశారు. ఇందులో వెన్నెల అనే అమ్మాయి పాత్రలో నటిస్తున్నారు సాయిపల్లవి. హీరో కోసం వెన్నెల పాడుకునే పాట ఇది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటకు సురేశ్ బొబ్బిలి సంగీత దర్శకుడు. దివ్యమల్లిక, సురేశ్ బొబ్బిలి ఈ గీతాన్ని ఆలపించారు. ఏప్రిల్ 30న ‘విరాట పర్వం’ విడుదల కానుంది. కొత్త ఉడ్.. కొత్త ఇల్లు! క్యూట్ గర్ల్ రష్మికా మందన్నా ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలకే కాదు.. కొత్త ఉడ్కి కూడా వెళుతున్నారు. హిందీ సినిమాలకు కూడా ఓకే చెప్పి బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ‘మిషన్ మజ్ను’ అనే సినిమా ద్వారా హిందీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారామె. అలాగే మరో హిందీ సినిమా కూడా అంగీకరించారని సమాచారం. బ్యాక్ టు బ్యాక్ రెండు హిందీ సినిమాలు ఒప్పుకోవడంతో ఇటు తెలుగు సినిమాల కోసం హైదరాబాద్ అటు హిందీ కోసం ముంబై ప్రయాణం చేస్తున్నారామె. అయితే ముంబై వెళ్లిన ప్రతిసారీ హోటల్స్‌లో ఉండటం ఇబ్బందిగా అనిపించడంతో కొత్త ఇల్లు తీసుకోవాలని నిశ్చయించుకున్నారట రష్మిక. అనుకున్నట్లే ఇల్లు కొనుక్కున్నారని సమాచారం. షారుక్‌కి అతిథి షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘జీరో’ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర చేశారు. ఇప్పుడు మరోసారి షారుక్‌కి అతిథి కానున్నారు సల్మాన్ . సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా ‘పఠాన్ ’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో సల్మాన్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలోని ఓ స్టూడియోలో జరుగుతోంది. షారుక్ ఖాన్ , సల్మాన్ ఖాన్ ... ఇద్దరూ షూటింగ్లో పాల్గొంటున్నారు. దాదాపు పది నుంచి పన్నెండు రోజులు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. పిశాచికి ఓకే మిస్కిన్ దర్శకత్వంలో 2014లో వచ్చిన హిట్ మూవీ ‘పిశాచి’. ఈ సినిమాకు సీక్వెల్‌గా మిస్కిన్ దర్శకత్వంలోనే ఆండ్రియా ప్రధాన పాత్రధారిగా ‘పిశాచి 2’ తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ సేతుపతి గెస్ట్ రోల్ చేస్తున్నారు. ‘పిశాచి 2’లోని ఓ కీలక సన్నివేశంలో వచ్చే పాత్ర కోసం విజయ్ సేతుపతిని అడిగారట మిస్కిన్ . క్యారెక్టర్ నచ్చితే చాలు.. హీరోనా? విలనా? అని చూడరు సేతుపతి. ఓకే అన్నారట. ఆయన పాల్గొనగా సీన్స్ కూడా తీశారని కోలీవుడ్ టాక్. ఈ ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఇంటిప్స్
నాన్‌స్టిక్ పాత్రలు, పెనాలను సులభంగా శుభ్రం చేయాలంటే... వాటిలో వేడినీటిని పోసి పది నిమిషాలసేపు అలాగే ఉంచి తర్వాత క్లీనింగ్ పౌడర్‌తో కాని డిటర్జెంట్‌తో కాని కడగాలి. షూస్ మీద మొండి మరకలు ఉండి వదలకపోతే వాటి మీద ఆఫ్టర్ షేవ్ లోషన్ కొద్ది చుక్కలు వేసి తుడవాలి. -
ఇష్టకష్టాలు
ఉలి తీసుకుని చెక్కడం మొదలుపెడితే... విగ్రహం చూసిన ఆనందం కలుగుతుంది. కానీ విగ్రహానికి కలిగిన కష్టం అర్థం కాదు. విక్రమ్‌కి పాత్రలు విగ్రహాల్లాంటివి. ఆ పాత్రల్లో లీనమైపోవడం తనకు విగ్రహాన్ని ఆవహించడం లాంటిదే. విక్రమ్ చేసిన పాత్రల్లో క్లిష్టమైనవి చాలా ఉన్నాయి. ఆ పాత్రల్లో తను పడ్డ కష్టాన్ని మనతో పంచుకున్నారు విక్రమ్. మరొకరైతే అష్టకష్టాలు అనేవారు.. విక్రమ్ వీటిని ఇష్టకష్టాలు అంటున్నారు. ఓన్లీ పండ్ల రసాలతో ఆరు నెలలు (‘సేతు’ 1999) విక్రమ్: నా కెరీర్లో మర్చిపోలేని చిత్రాల్లో ‘సేతు’ ఒకటి. ఆ సినిమా సెకండాఫ్‌లో మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తిగా మారిపోతాను. దాని కోసం 16 కిలోల బరువు తగ్గాను. ఆరు నెలల పాటు ఓన్లీ పండ్ల రసాలు తీసుకున్నా. విగరస్‌గా వర్కవుట్లు చేశా. ఆ తర్వాత అదే బరువు మెయిన్టైన్ చేయడం కోసం ఒక ఎగ్‌వైట్, ఒక గ్లాసు బీట్రూట్ లేదా క్యారెట్ జ్యూస్, ఒక చపాతీ... రోజు మొత్తంలో ఇవి తీసుకున్నాను. ఆకలనిపిస్తే, ఆ ఫీలింగ్‌ని మైండ్‌కి ఎక్కించుకోకుండా నా ఆలోచనలను డైవర్ట్ చేసేవాణ్ణి. ఆ సినిమాలో నా కాళ్లకు ఇనుప గొలుసులు కడతారు. వాటి తాలూకు మచ్చలు చాన్నాళ్లు ఉండిపోయాయ్. అవి చూసుకుని, ‘ఇవి సేతు’ గుర్తులు అని నవ్వుకునేవాణ్ణి. గతాన్ని మర్చిపోయిన వ్యక్తిగా కనిపించే పాత్రలో పెద్దగా జుత్తు ఉండదు. దానికోసం గుండు చేయించుకున్నాను. దాంతో వేరే సినిమా ఒప్పుకోలేదు. సరిగ్గా అప్పుడే తమిళ ఇండస్ట్రీలో స్ట్రైక్ జరగడం, రిలీజ్ టైమ్‌కి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాకపోవడం.. ఒకటే టెన్షన్. ఆ బాధను మర్చిపోలేను. అప్పుడు కంటి చూపు తగ్గింది (‘కాశి’ 2001) మలయాళంలో కళాభవన్ మణి చేసిన ‘వసంతి యుమ్ లక్ష్మియుమ్ పిన్నె న్యానుమ’కి రీమేక్ ‘కాశి’. మలయాళ సినిమా చూడగానే, ‘ఏం క్యారెక్టర్రా ఇది’ అనిపించింది. అంధుడిగా నటించాలంటే చాలెంజే. మణికి కొంచెం నల్లగుడ్డు కనిపించేది. నేను అది కూడా కనపడనివ్వకూడదనుకున్నాను. ప్రాక్టీస్ మొదలుపెట్టాను. 10, 15 రోజులు చేశాక దర్శకుడు వినయన్ దగ్గరికెళ్లి నల్లగుడ్డు కనిపించనివ్వకుండా కళ్లు పెట్టి చూపిస్తే, ‘వావ్..’ అన్నారు. షూటింగ్ సమయంలో డైలాగ్ చెప్పేటప్పుడు నాకు తెలియకుండా కళ్లు మామూలు స్థితికి వచ్చేసేవి. ఒక నిముషం మాత్రమే పెట్టగలిగేవాణ్ణి. అందుకే ప్రాక్టీస్ టైమ్ పెంచాను. దాంతో రెండు మూడు నిముషాలు నల్లగుడ్డు కనపడనివ్వకుండా కళ్లు స్టేబుల్‌గా పెట్టగలిగా. షూటింగ్లో ఎవరైనా సరిగ్గా చేయకపోతే టేక్స్ మీద టేక్స్‌తో చచ్చిపోయేవాణ్ణి. కళ్లు స్ట్రైన్ అయ్యేవి. తలనొప్పి, కళ్ల నొప్పి.. పరిస్థితి ఘోరంగా ఉండేది. డాక్టర్ అయితే, ‘నువ్వు రిస్క్ చేస్తున్నావ్.. సైట్ వస్తుంది’ అన్నారు. సినిమా పూర్తయిన నెలా నెలన్నరకు కూడా నా కంటి చూపు మామూలు కాలేదు. పేపర్ చదవలేకపోయేవాణ్ణి. టీవీ స్క్రీన్ బ్లర్‌గా కనిపించేది. ఆ తర్వాతసెట్ అయ్యింది. అవి స్వీట్ పెయిన్స్ (శివపుత్రుడు 2003) కాళ్లకు, పళ్లకు నరకం చూపించిన సినిమా ‘శివపుత్రుడు’. జనరల్‌గా నేను ఇంట్లో స్లిప్పర్స్ వేసుకుంటాను. కానీ, ‘శివపుత్రుడు’లో నా కాళ్లకు చెప్పులు ఉండవ్. పైగా స్మశానం, అడవుల్లో, రఫ్ రోడ్ల మీదే సీన్స్ ఉండేవి. అడవుల్లో సీన్స్ తీసినప్పుడు నా పాట్లు చూడాలి. రాళ్లు, ముళ్లు ఉండేవి. కాళ్లు పుండ్లు పడ్డాయి. పళ్లకు నలుపు రంగు వేయడానికి అరగంట, తీయడానికి మూడు గంటలు పట్టేది. వరుసగా నెల రోజులు ఇదే తంతు. ఫిజికల్‌గా ఇవన్నీ చేస్తే.. మానసిక ఎదుగుదల లేని వ్యక్తిగా కనిపించాలి. ఫిజికల్‌గా, మెంటల్‌గా కష్టపెట్టిన సినిమా ఇది. ఆ సినిమా చేసినన్నాళ్లు కాళ్ల నొప్పులు ఇబ్బందిపెట్టేవి. షూటింగ్ పూర్తయ్యాక ఆ నొప్పులు పోవడానికి చాన్నాళ్లు పట్టింది. అవన్నీ స్వీట్ పెయిన్స్ అన్నమాట. పెరిగి... తగ్గాను (‘అపరిచితుడు’ 2005) ‘అపరిచితుడు’లో చేసిన రామానుజం, రెమో, అపరిచితుడు.. ఈ మూడు పాత్రలూ ఒకదానికి ఒకటి పోలిక లేకుండా పూర్తి భిన్నంగా ఉంటాయి. ఈ మూడు పాత్రల కోసం బరువు తగ్గి, పెరిగాను. రామానుజం సంప్రదాయబద్ధంగా ఉంటాడు. రెమో మోడ్రన్‌గా, అపరిచితుడు ఫెరోషియస్‌గా ఉంటాడు. ఈ మూడు పాత్రలకూ బాడీ లాంగ్వేజ్‌లో వ్యత్యాసం చూపించడానికి చాలా హోమ్‌వర్క్ చేశాను. ఈ సినిమా పెద్దగా కష్టపెట్టలేదు కానీ, బరువు పెరిగి, తగ్గడం కొంచెం ఇబ్బంది అనిపించింది. నాన్నలానే బిహేవ్ చేసేవాణ్ణి (‘నాన్న’ 2011) ‘నాన్న’లో చేసిన కృష్ణ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా రావడానికి పది రోజులు పట్టింది. ఇందులో స్పెషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్‌లా చేశా. చూపులు, నడక, మాట తీరు, భుజాలు ఎగరేయడం అన్నీ వాళ్లలానే చేయాలి. షూటింగ్లో అదే మూడ్‌లో ఉంటేనే సాధ్యమవుతుంది. ఎవరైనా పలకరించినా ఆ క్యారెక్టర్లానే సమాధానం ఇచ్చేవాణ్ణి. కృష్ణలానే నడిచేవాణ్ణి. ‘అయ్యయ్యో.. ఏమైంది’ అనేవారు. షూటింగ్ ప్యాకప్ చెప్పి, రూమ్‌కి వెళ్లి స్నానం చేసి, మోడ్రన్ డ్రస్ వేసుకుని అద్దం ముందు నిలబడి.. ‘విక్రమ్, యు ఆర్ విక్రమ్. రిలాక్స్, నువ్ కృష్ణవి కాదు’ అని చెప్పుకునేవాణ్ణి. ఈ సినిమా కోసం చెన్నై బస్‌స్టాండ్‌లో ఓ సీన్ చేశాం. కృష్ణ గెటప్‌లో నేను జనాల్లోకి వెళ్లా. కెమేరా ఎక్కడో ఫిక్స్ చేశారు. ఆటోలో బస్‌స్టాండ్‌కి వెళ్లా. సుమారు వందమంది ఉన్నారు. నన్నెవరూ గుర్తుపట్టలేదు. ఓ వ్యక్తి దగ్గరికి వెళితే, నా అవతారం చూసి, చిరాకుపడ్డాడు. అప్పుడు స్పెషల్లీ చాలెంజ్డ్ పీపుల్ని తల్చుకుని బాధపడ్డా. ‘ఐ’దేళ్లు కోల్పోయేలా చేసింది (‘ఐ’ 2015) ‘ఐ’ నాకు వెరీ చాలెంజింగ్. బాడీ బిల్డర్ పాత్ర కోసం మజిల్స్ పెంచాను. రియల్ బాడీ బిల్డర్‌లా మారిపోయాను. ఆ తర్వాత మోడల్‌గా చేసిన క్యారెక్టర్ కోసం మజిల్స్ ఉండకూడదని దర్శకుడు శంకర్ చెప్పారు. సన్నగా ఉండాలి. కానీ, ఫేస్ ఫ్రెష్‌గా ఉండాలన్నారు. ఫేస్ గురించి కేర్ తీసుకుంటూ, తగ్గాను. కేవలం మూడు నెలల్లో తగ్గాను. ఆ తర్వాత అనారోగ్యం బారిన పడే మనిషిగా చేసినప్పుడు ఇంకా తగ్గాను. అది మోస్ట్ చాలెంజింగ్ రోల్. నార్మల్‌గా తింటున్నప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, మధ్యహ్నాం రెండు చపాతీలు, రాత్రిపూట ఓ సూప్, రెండు చపాతీలు తీనుకునేవాణ్ణి. కానీ, ఈ పాత్ర కోసం ఫుడ్ తగ్గించేశాను. ఒకే ఒక్క ఎగ్ వైట్. సగం ఆపిల్, బనానా జ్యూస్. అంతే. రోజు మొత్తంలో 50 కేలరీలు మాత్రమే తినాలి. కానీ, అంతకు రెండింతలు కేలరీలు కరిగించాలి. 50 కేజీల బరువుకి చేరుకోవాలన్నది టార్గెట్. 52 వరకూ వచ్చాను. ప్రతి రెండు వారాలకు డాక్టర్ దగ్గరకు వెళ్లి అన్ని టెస్టులు చేయించుకునేవాణ్ణి. ‘హార్ట్ రేట్ తేడా అవుతోంది. ఎసిడిటీ.. ఇంకా అన్నిటిలో సడన్‌గా ఫ్లక్చ్యువేషన్ వచ్చింది. ఏదైనా మేజర్ ఆర్గాన్స్ ఫెయిల్ అయితే మేం కాపాడలేం’ అని డాక్టర్ అన్నారు. అప్పుడు 52 కిలోల దగ్గర ఆపేశాను. సరైన ఆహారం లేకపోవడం, ప్రోస్థెటిక్ మేకప్ వల్ల మూడీగా ఉండేవాణ్ణి. చిరాకుపడేవాణ్ణి. ‘ఐ’ సినిమా వల్ల నా హెల్త్ స్పాయిల్ అవుతుందని తెలిసినా చేశా. ఈ సినిమా కారణంగా ఓ ఐదేళ్ల జీవితాన్ని కోల్పోయా. కానీ, చాలా పేరొచ్చింది. పోస్ట్‌మ్యాన్ నుంచి పాలవాడి వరకూ జాతీయ అవార్డు ఎందుకు రాలేదని అడిగారు. నా దృష్టిలో అదే పెద్దది. ⇔ ఒకప్పుడు పాస్తా, బర్గర్, పిజ్జా.. తినాలనుకున్నప్పుడు నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. ఇప్పుడు అవి ఎన్నైనా తినగలిగేంత డబ్బు ఉంది. అయినా తినలేను. చేసే క్యారెక్టర్స్ కోసం నోరు కట్టేసుకున్నాను. మూడేళ్లకు ముందు అయితే మరీ స్ట్రిక్ట్‌గా ఉండేవాణ్ణి. ఆ తర్వాత మా అమ్మాయి ఏ పిజ్జానో తింటుంటే.. నేనూ ఒక్కో స్లైస్ తింటున్నా. ⇔ నేను 15-20 చపాతీలు తినగలను. 25-30 ఇడ్లీలు తినగలను. కానీ, గడచిన పదీ పదిహేనేళ్లల్లో నా తిండి పూర్తిగా తగ్గిపోయింది. దాంతో ఒకప్పటిలా ఇప్పుడు తింటే సరిపడటంలేదు. జనరల్‌గా ఒక్క గులాబ్ జామ్కీ, ఐస్‌క్రీమ్‌కీ ఎవరూ లావు కారు. కానీ, నేనిప్పుడు ఒక్క గులాబ్ జామ్ తిన్నా బరువు పెరిగిపోతాను. కఠినమైన డైటింగ్ చేయడంవల్ల ఎంత తక్కువగా తిన్నా అది ఎక్కువే. ఒకప్పటిలా నేనెప్పటికీ 20 చపాతీలు, 30 ఇడ్లీలు తినలేనేమో. అమ్మాయల కష్టం తెలిసింది (‘ఇంకొక్కడు’ 2016) ఇప్పటివరకూ నేను డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాను. ‘ఇంకొక్కడు’లో మొదటిసారి రెండు పాత్రలు చేశాను. ఒకటి అఖిలన్. ఇది నార్మల్ క్యారెక్టర్. ఇంకోటి లవ్. అమ్మాయిలా కనిపించే అబ్బాయి లవ్. ఈ పాత్ర కోసం ఆరు నెలలు హోమ్‌వర్క్ చేశా. ఇలా కనిపించేవాళ్ల నడక, చూపులు ఎలా ఉంటాయో అబ్జర్వ్ చేశా. నడవటం, చూడటం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. కానీ, హీరోయిన్లా హెయిర్ స్టైల్ చేశారు. మామూలుగా హీరోయిన్లు పది గంటల షూటింగ్‌కి ఏడు గంటలకే నిద్ర లేచి, హెయిర్ స్టైల్ చేసుకుని రెడీ అవుతుంటారు. నేనలా తయారు కావాల్సి వచ్చింది. నయనతారకు చేసిన హెయిర్ డ్రెస్సర్ నాకూ చేశారు. నయనతార కూడా టిప్స్ ఇచ్చింది. ఒక్కో సీన్‌కి డిజైనర్ డ్రెస్సులు వాడాం. అమ్మాయిల కష్టం తెలిసింది. ఆ క్యారెక్టర్ ఎలాంటి పెయిన్‌ని మిగల్చలేదు కానీ, లవ్లానే నడవడం, చేతులు అదోలా తిప్పడం, చూడటం చేసేవాణ్ణి. అది మార్చుకోవడానికి టైమ్ పట్టింది. - డి.జి. భవాని -
బ్రేక్‌ఫాస్ట్ షో : ఎన్టీఆర్ దశావతారాలు Part2
-
కామిక్ ఎక్స్‌ప్రెస్