వైఎస్ రాజశేఖర రెడ్డి 'చరిత్రకే ఒక్కడు'
అట్లాంటా: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్రపై రాసిన 'చరిత్రకే ఒక్కడు' పుస్తక ముఖ చిత్రాన్ని అమెరికాలోని అట్లాంటా నగరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రేమ రెడ్డి మాట్లాడుతూ తన మిత్రుడు , రాజనీతిజ్ఞుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ” చరిత్రకే ఒక్కడు“ పుస్తక రూపం లోకి తీసుకు వస్తున్నందుకు పుస్తక రచయత చెరకు కరణ్ రెడ్డిని అభినందించారు. డాక్టర్ మల్లా రెడ్డి మాట్లాడుతూ "చరిత్రకే ఒక్కడు“ పుస్తకంలోని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పారు. డాక్టర్ సంజీవ రెడ్డి మాట్లాడుతూ తెలుగు వాళ్లకు, డాక్టర్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు మరువలేనివన్నారు. డాక్టర్ హరనాథ్ పొలిచర్ల మాట్లాడుతూ రాజశేఖర రెడ్డితో ప్రవాసాంధ్రుల అనుబంధం మరువలేనిదన్నారు.
ప్రవాసాంధ్ర పాత్రికేయుడు వేణుగోపాల ఉడుముల మాట్లాడుతూ 'చరిత్రకే ఒక్కడు' పుస్తకం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో తమతో గల అనుబంధాన్ని రాజేశ్వర్ రెడ్డి గంగసాని, మొండిఎద్దు వెంకట్, కిరణ్ కందుల, మోహన్ తలమాటి, వెంకట్ మేడపాటి, ఆళ్ళ రామి రెడ్డి, చిన్న బాబు రెడ్డి వివరించారు.
ఈ పుస్తకాన్ని డిసెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తారు. హైదరాబాద్‌తోపాటు తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నా దేశాల్లో ఆరోజునే విడుదల చేస్తారు.