Cheraku Sudhakar
-
ఎమ్మెల్సీ ఫలితాలు: ఏం జరుగుతుందో?
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికలను తలపిస్తూ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈసారి పట్టభద్రుల తీర్పు రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలను దిశానిర్దేశం చేస్తుందన్న అంచనాలు ఉండటంతో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ ప్రధాన రాజకీయ పక్షాల్లో నెలకొంది. కాంగ్రెస్‌కు చావోరేవో... మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్ట భద్రుల స్థానంతోపాటు వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగ్గా ప్రస్తుతం హైదరాబాద్ స్థానం నుంచి బీజేపీ, నల్లగొండ స్థానం నుంచి టీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానాలు నిలబెట్టుకోవడంతోపాటు మరో స్థానంలో పాగా వేయడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు పట్టభద్రుల ఎన్నికల్లో తలపడ్డాయి. అయితే ఈసారి అనుకూల ఫలితాలు వస్తే గతంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల వల్ల ప్రజల్లో కలిగిన అభిప్రాయం మారుతుందని, పట్టభద్రుల మెప్పు పొందగలిగితే మళ్లీ అనుకూల పవనాలు వీస్తాయని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇక బీజేపీ మాత్రం టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకోవాల్సిన పరిస్థితుల్లో జరిగిన ఈ ఎన్నికల్లో అనుకున్న ఫలితం వస్తే తమకు ఎదురు ఉండదని, 2023 ఎన్నికలకు ధీమాగా వెళ్లవచ్చని లెక్కలు వేసుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో మాత్రం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. గతంలో జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ తాజా రాజకీయ పరిస్థితులు తమకు లాభిస్తాయని, కేంద్ర, రాష్ట్రాలపై వ్యతిరేకతతో పట్టభద్రులు తమవైపే మొగ్గు చూపారని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. ఈ ఎన్నికల్లో ఒక్క స్థానంలో గెలిచినా 2023 ఎన్నికల వరకు ఆందోళన అవసరం ఉండదని భావిస్తోంది. ఒకవేళ ఈ ఎన్నికల్లోనూ ఓడితే పార్టీ పరిస్థితి ఖల్లాసేననే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. ప్రొఫెసర్లు... ఉద్యమకారులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న ఇద్దరు ప్రొఫెసర్లు ఎం. కోదండరాం, డాక్టర్. కె. నాగేశ్వర్‌ల రాజకీయ భవితవ్యాన్ని కూడా పట్టభద్రులు నిర్దేశించనున్నారు. ఈ ఎన్నికల్లో సానుకూల ఫలితం సాధించగలిగితే వారు మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తారని రాజకీయ వర్గాలంటున్నాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంతో కోదండరాం నల్లగొండ స్థానం నుంచి ప్రధాన పక్షాలకు గట్టిపోటీ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. అలాగే రంగారెడ్డి నుంచి నాగేశ్వర్ ఏ మేరకు పట్టభద్రులను ఆకర్షించగలిగారన్నది ఈ ఫలితాలు తేల్చనున్నాయి. తెలంగాణ ఉద్యమంతో దృఢ అనుబంధం ఉన్న డాక్టర్ చెరుకు సుధాకర్‌తోపాటు మరికొందరు ఈ ఫలితాలతో తమ రాజకీయ భవిష్యత్తుపై ఓ అంచనాకు రానున్నారు. -
‘మంత్రి ఈటలను సీఎంను చేయండి’
మహబూబాబాద్: తెలంగాణ ఏర్పడితే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ రాష్ట్రం ప్రకటించారని, అయితే దళితుడి బదులు సీఎం పదవిని కేసీఆర్ చేజిక్కించుకున్నారని వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ మండిపడ్డారు. దీనికి పోను ఇటీవల కేటీఆర్‌కు పట్టం కట్టనున్నట్లు ప్రచారం జరుగుతోందని, ఆయనకు బదులు మంత్రి ఈటల రాజేందర్‌ను సీఎం చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహించిన సుధాకర్.. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. (చదవండి: కలకలం రేపుతున్న ఈటల తూటాలు) ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కాగానే 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ చెప్పారని, ఇప్పుడు 1,35,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతున్నా.. లెక్కల్లో స్పష్టతలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాంకు ఎన్డీఏ నేతలు ఎందుకు మద్దతిస్తున్నారో అర్థం కావడంలేదని, కమ్యూనిస్టు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న తనను పరిగణలోకి తీసుకుని గెలిపించాలని సుధాకర్ కోరారు. -
ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. తమకు మద్దతు ఇవ్వాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌లు విడివిడిగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి ఇదివరకు విన్నవించారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకుగాను ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కమిటీ వేశారు. ఇతరులకు మద్దతు ఇచ్చే దాని కన్నా తామే బరిలో ఉందామని, పార్టీ అభ్యర్థికి గెలుపు అవకాశాలు న్నాయని ఆయా జిల్లాల మెజారిటీ నేతలు కమిటీకి సూచించినట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌తో జరిగిన టీపీసీసీ ముఖ్యుల జూమ్ కాన్ఫరెన్స్‌లో కూడా అదే అభిప్రాయం వెల్లడైంది. కాగా, ఈ స్థానానికి మొత్తం 26 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ అభ్యర్థిత్వం వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్, మరో గిరిజన నేత బెల్లయ్యనాయక్‌ల పేర్లను కూడా తీవ్రంగానే పరిశీలిస్తున్నారు. మానవతారాయ్, బెల్లయ్య నాయక్‌లు సోమవారం పార్టీ పెద్దలను కలసి టికెట్ విషయమై తమ వాదనలను వినిపించారు. అయితే, టీపీసీసీ ముఖ్యనేతలు కసరత్తు పూర్తి చేసిన తర్వాత ముగ్గురు నేతల పేర్లను ఏఐసీసీకి పంపనున్నారు. రంగారెడ్డి ఆశావహులతో చర్చలు కాగా, రంగారెడ్డి–హైదరాబాద్– మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక పై సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజులు సమావేశమై పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించారు. ఈ స్థానానికి టికెట్ ఆశిస్తున్న ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.జి.వినోద్‌రెడ్డిలతో కూడా సంప్రదింపులు జరిపారు. టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, ఓబీసీ సెల్ చైర్మన్ కత్తి వెంకటస్వామి, ఉపాధ్యాయ నేత హర్షవర్ధన్‌రెడ్డిలతోసహా 24 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలోంచి మూడు పేర్లను ప్రతిపాదించి మంగళవారం ఏఐసీసీకి పంపనున్నట్టు సమాచారం. పిటిషన్ పునర్విచారించాలని రేవంత్ అభ్యర్థన ఏసీబీ అభిప్రాయం కోరుతూ 18కి విచారణ వాయిదా సాక్షి, హైదరాబాద్: తమపై ఏసీబీ నమోదు చేసిన అభియోగాలను విచారించే పరిధి ఈ కోర్టుకు లేదంటూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం సిద్ధమవుతుండగా, పిటిషన్‌ను తిరిగి విచారించాలంటూ రేవంత్ ఏసీబీ ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. తన తరఫు న్యాయవాది వీడియో కాన్ఫరెన్స్‌లో కొన్ని కీలక అంశాలపై వాదనలు వినిపించలేకపోయారని అందులో పేర్కొన్నారు. మరోసారి విచారణ జరిపితే తమ వాదనలు పూర్తిగా వినిపిస్తామని విన్నవించారు. ఈ మేరకు అనుమతి మంజూరు చేసిన న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు... ఈ పిటిషన్‌పై అభ్యంతరం ఉంటే తెలియజేయాలని ఏసీబీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు. తమపై నమోదు చేసిన అభియోగాలను ఎలక్షన్ ట్రిబ్యునల్ మాత్రమే విచారించాలని, ఏసీబీ ప్రత్యేక కోర్టుకు విచారించే పరిధి లేదని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. కాగా, చంద్రబాబు అక్రమ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నందమూరి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం ఈ నెల 18న వెలువరించనుంది. -
సేవామూర్తులకు ఇదేనా గౌరవం?!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టాక మానవ విలువల్ని ఎత్తిపడు తున్న అనేక ఉదంతాలు జరుగుతున్నాయి. మనిషి సగర్వంగా తలెత్తుకునేలా చేస్తున్నాయి. అదే సంద ర్భంలో కొన్ని సంఘటనలు అందరినీ ఆగమాగం చేస్తూ తలదించుకునేలా చేస్తున్నాయి. ఇరవై లక్షలకు చేరు వవుతున్న కరోనా కేసులు, రెండు లక్షలకు చేరుకో బోతున్న మరణాలు ప్రపంచ ప్రజానీకాన్ని భయ పెడుతున్నాయి. భూగోళం మొత్తం మీద జానాబెత్తెడు భూమిలో తప్ప కరోనా అన్నిచోట్లా అల్లుకుపోయి హారర్ సినిమాను తలపిస్తోంది. చైనాలోని వుహా న్లో మొదలైన ఆ వైరస్ అన్నిచోట్లకూ విస్తరిం చింది. ఆఫ్రికాలో ప్రపంచ ప్రఖ్యాత వైరాలజిస్టు గీతా రాంజీ, బ్రిటన్‌లో నైజీరియా సామాజిక వైద్యులు అల్ఫా సాదూ, అమెరికాలో సీనియర్ కార్డియాలజిస్టు, తెలుగువారు నటరాజన్ తదితర ప్రముఖులెందరినో కరోనా మింగేసింది. సాదూ మృతికి బ్రిటన్ ప్రభుత్వం నివాళులర్పించింది. మన దేశంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పేదల కాలనీలో వైద్య సేవలు అందిస్తున్న శతృఘ్న పంజ్వాని తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ కరోనా బారినపడి కన్నుమూశారు. ఆయనను చికిత్స కోసం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పుడు ఐసీయూలో చేర్చడానికి ఆయన సామాజిక వర్గానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు అవసరమైంది! ఆయన అంత్యక్రియలకు ప్రముఖులెవరూ హాజరు కాలేదు సరికదా కనీసం నివాళులర్పించే దిక్కు కూడా లేకుండా పోయింది. నెల్లూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి లాక్‌డౌన్‌కు ముందు వైద్య సేవలు అందిస్తూనే కరోనాతో అస్వస్థులై కన్ను మూశారు. చెన్నైలో ఒక వైద్యుడు కరోనా రోగులకు చికిత్స చేస్తూ, అదే రోగం బారినపడి మరణిస్తే ఆయన ఖననానికి కూడా జనం అడ్డుతగిలారు. చివరకు రాత్రివేళ ఎవరికీ తెలియకుండా ఆ ప్రక్రియ పూర్తి చేయవలసివచ్చింది. ఢిల్లీ, అహ్మదా బాద్, వరంగల్ తదితర నగరాల్లో వైద్యులనూ, నర్సులనూ ఇళ్లు ఖాళీ చేయమని వారి ఇంటి యజ మానులు ఘర్షణ పడిన వార్తలు చూశాం. ప్రధాని నరేంద్ర మోదీ, ఆరోగ్యమంత్రి కూడా ఈ ఉదంతా లను ప్రస్తావించవలసి వచ్చింది. ప్రస్తుత సంక్షోభంలో వైద్యులు అందిస్తున్న సేవలు చూస్తుంటే చైనా–జపాన్ యుద్ధ సమ యంలో మన వైద్యులు చేసిన అసాధారణ సేవలు గుర్తుకొస్తాయి. తుపాకి గుళ్ల బారినపడిన సైనికు లకు శస్త్ర చికిత్సలు చేయడానికి చేతి తొడుగులు కూడా లేని ఆ సమయంలో ద్వారకానాథ్ శాంతా రామ్ కొట్నీస్ ఎన్నో ఆపరేషన్లు నిర్వహించారు. ఆ క్రమంలో ఆయన సెప్టిసీమియా బారినపడి చని పోయారు. ఇలాంటి ధైర్యసాహసాలు కలిగిన వైద్యులు అప్పుడే కాదు... ఇప్పుడూ వున్నారని వర్త మాన సంక్షోభం నిరూపిస్తోంది. అటువంటివారు అదే వ్యాధిబారిన పడి చని పోయినప్పుడు కనీసం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలన్న ధ్యాస పాలకులకు లేకుండాపోయింది. ఎంతో కర్తవ్యనిష్టతో పనిచేసి ప్రాణాలు కోల్పోతున్నవారిని ఇలా అనామకు లుగా, అవమానాల మధ్య వీడ్కోలు పలకడం న్యాయమేనా అని మనలను మనం ప్రశ్నించు కోవాలి. మట్టిలో కలిసే వేల ప్రాణాలను నిలబెట్టే డాక్టర్ చనిపోతే మట్టిలో కప్పడానికి కుస్తీ పడాలనా? అద్భుతమైన, అనన్యమైన, అసమా నమైన త్యాగాలు చేసేవారికి మనం అర్పించ వలసిన నివాళులు ఇలాగేనా? మృతదేహం నుంచి వైరస్ సోకే ప్రమాదం చాలా తక్కువని ప్రముఖ వైరాలజిస్టులు చెబుతున్నా మనుషులు ఇలా మూర్ఖత్వంతో దాడులకు దిగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అమెరికాలో మన దేశానికి చెందిన డాక్టర్ ఉమా మధుసూదన కరోనా రోగులకు చేసిన వైద్య సేవలు గుర్తించి 200 కార్లతో ర్యాలీ జరిపి ఆమెకు వినూత్న రీతిలో రోగులు, రోగుల కుటుంబాలకు చెందినవారు, స్థానికులు తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇకపోతే చైనాలోని జుహై నగరంలో వైద్య సేవలందించిన వైద్యులకు 300 డ్రోన్లతో అపూర్వ స్వాగతం పలికారు. చావుకు తెగించి సేవలం దిస్తున్న మన డాక్టర్లకు మరణానంతర పురస్కా రాలు, కిరీటాలేమీవద్దుగానీ అంతిమ సంస్కారం కాస్త గౌరవంగా జరిగేటట్లు చూడటం మన సమా జానికి గౌరవాన్ని తెస్తుంది. డా. చెరుకు సుధాకర్ వ్యాసకర్త తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు మొబైల్ : 98484 72329 -
బీసీ లీడర్లు పాలెగాళ్లు అయ్యారు: ఇంటి పార్టీ
హైదరాబాద్: మహా కూటమి తరపున తెలంగాణ ఇంటి పార్టీకి సీట్లు కేటాయించకపోవడంపై ఆ పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..కూటమి జాబితా అమరావతిలో తయారవుతుందని, ఇంటి పార్టీని మొదటి నుంచి దూరం చేయాలని చూశారని ఆరోపించారు. కూటమిలో ఉద్యమకారులకు ద్రోహం జరిగిందన్నారు. తాము మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలో రెండు సీట్లు అడిగామని వెల్లడించారు. ఢిల్లీలో బీసీ లీడర్లు పాలెగాళ్లు అయ్యారని ఆరోపించారు. కూటమి సీట్లలో సామాజిక న్యాయమే లేదని వ్యాక్యానించారు. సీట్ల జాప్యానికి కోదండరాం, ఉత్తమ్ కుమార్ రెడ్డిలే కారణమన్నారు. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో తాను పోటీ చేయదలచుకున్నానని తెలిపారు. ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ కూడా మోసం చేసిందని విమర్శించారు. ఆర్ధిక సమానత్వం కోసం పోరాటం చేయాల్సి ఉందన్నారు. ఇంటి పార్టీ నేత జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సామాజిక, ఆర్ధిక న్యాయం దొరకడం లేదని వ్యాఖ్యానించారు. ఉద్యమంలో ఆత్మత్యాగం చేసిందెవరని ప్రశ్నించారు. త్యాగాలు ఒకరివి భోగాలు మరొకరికి చేరుతున్నాయన్నారు. ఎదుగుతున్న బీసీ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, చెరకు సుధాకర్లకు సీట్లు ఇవ్వలేదని విమర్శించారు. సీపీఐ, కాంగ్రెస్, టీజేఎస్ పార్టీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకుల చేతిలో ఉన్నాయని, సామాజిక న్యాయం చేయని వారికి తమ మద్ధుతు ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. తెలంగాణ ఇంటి పార్టీ ఉద్యమ కారులకు అండగా ఉంటుందని, మంచి కూటమితో ముందుకు వస్తామని తెలిపారు. డబ్బులు, మద్యానికి లొంగకుండా ప్రజలు ఓటు వేయాలని కోరారు. అంతకుముందు తెలంగాణ ఇంటి పార్టీ ఆద్వర్యంలో అమరుల స్థూపానికి చెరకు సుధాకర్, చంద్రకుమార్‌లు నివాళులు అర్పించారు. -
త్వరలోనే మహ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో
-
త్వరలోనే పీపుల్ మేనిఫెస్టో
హైదరాబాద్: గోల్కొండ రిసార్ట్‌లో ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ మీటింగ్ శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రూపొందించడం కోసం ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ విషయానికి సంబంధించి మహాకూటమిలోని ఇతర పార్టీల నేతలు కూడా వారి సూచనలు సలహాలను ఇచ్చారు. అన్ని విషయాలను క్రోడీకరించి త్వరలోనే పీపుల్ మేనిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు. మహాకూటమి ఉమ్మడి మేనిఫెస్టో అనేది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి అన్ని ప్రయోజనాలు తీర్చే విధంగా ఉంటుందన్నారు. కేవలం ఉమ్మడి మేనిఫెస్టో ఏర్పాటు గురించి మాత్రమే సమావేశం జరిగిందన్నారు. టిక్కెట్ల సర్దుబాటు గురించి చర్చించలేదన్నారు. దానికి మరొక కమిటీ సమావేశం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరకు సుధాకర్ మాట్లాడుతూ..తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్‌కి వ్యతిరేకంగా పనిచేయడం కోసం కూటమిగా పనిచేయడం కోసం కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఆహ్వానించిందన్నారు. మా పార్టీ తరపున కొన్ని సూచనలు సలహాలను ఇచ్చామన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ను అధికారికంగా అమలు చేయాలని సూచించామని చెప్పారు. 34 శాతం రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని కోరామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల వారికి జిల్లా కేంద్రాల్లో కూడా ఇంటి స్థలాలు కేటాయించాలని కోరామని, ఇంకా అనేక విషయాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఉమ్మడి మేనిఫెస్టోకి తుది రూపునివ్వడానికి చర్చిస్తున్నామని, కేసీఆర్ మాదిరి చెప్పినటువంటి హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందకుండా అన్నీ బేరీజు వేసుకుంటున్నామని వివరించారు. బడ్జెట్ ఎంత అవుతుంది అన్న విషయాలను కూడా సరిచేసుకుంటున్నామని, ఆర్ధిక నిపుణులతో కూడా సంప్రదించాలని, అదే విధంగా రిటైర్డ్ అధికారులతో కూడా దీనిపై సంప్రదించాలని కాంగ్రెస్‌కి సలహా ఇచ్చామని వివరించారు. -
'కేసీఆర్ టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా'
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సమితిలో టికెట్ల లొల్లి మొదలైంది. టికెట్ ఆశించిన సభ్యులకు అధినేత నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో పలువురు నాయకులు ఆందోళన గురవుతున్నారు. నల్గొండ జిల్లాలో ముఖ్యనేతగా, టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా సేవలందిస్తున్న చెరకు సుధాకర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వాలంటూ చెరకు సుధాకర్ సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభించకపోతే ఆత్మహత్య చేసుకుంటాని చెరకు సుధాకర్ బెదిరించారు. 2011 డిసెంబర్ లో పీడీయాక్ట్ కింద చెరుకు సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం వివాదస్పదమైంది. ఆతరువాత చెరకు సుధాకర్ కేసును నాసా చట్టం కిందకు చేర్చి 12 నెలల నిర్భంధం విధిస్తూ జీవో విడుదల చేయడంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.