'కేసీఆర్ టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా'
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సమితిలో టికెట్ల లొల్లి మొదలైంది. టికెట్ ఆశించిన సభ్యులకు అధినేత నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో పలువురు నాయకులు ఆందోళన గురవుతున్నారు. నల్గొండ జిల్లాలో ముఖ్యనేతగా, టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా సేవలందిస్తున్న చెరకు సుధాకర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వాలంటూ చెరకు సుధాకర్ సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభించకపోతే ఆత్మహత్య చేసుకుంటాని చెరకు సుధాకర్ బెదిరించారు.
2011 డిసెంబర్ లో పీడీయాక్ట్ కింద చెరుకు సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేయడం వివాదస్పదమైంది. ఆతరువాత చెరకు సుధాకర్ కేసును నాసా చట్టం కిందకు చేర్చి 12 నెలల నిర్భంధం విధిస్తూ జీవో విడుదల చేయడంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.