chicken Center
-
చికెన్ సెంటరులో కొండ చిలువ కలకలం
అనంతపురం: ఓ చికెన్ సెంటరులోకి కొండచిలువ ప్రవేశించడంతో కలకలం రేగింది. ఈ ఘటన సోమవారం పుట్టపర్తి మండల పరిధిలో జరిగింది. స్థానిక ఎనుములపల్లి చెరువు సమీపాన చిత్రావతి బైపాస్ రోడ్డుకు ఆనుకుని ముక్తార్ అనే వ్యక్తి చికెన్ సెంటరు నిర్వహిస్తున్నాడు. వెనుక ఉన్న కొండలో నుంచి ఆదివారం రాత్రి కొండ చిలువ చికెన్ సెంటరులోకి ప్రవేశించింది. నాలుగు బ్రాయిలర్ కోళ్లను తినేసిన తర్వాత నీటి డ్రమ్ములోకి చేరుకుంది. సోమవారం ఉదయం ముక్తార్ నీటి కోసం డ్రమ్ము వద్దకు వెళ్లగా..కొండ చిలువ కన్పించింది. దాదాపు తొమ్మిది అడుగుల పొడవు ఉంది. భయభ్రాంతులకు గురైన అతను చుట్టుపక్కల వారికి చెప్పడంతో వారు కూడా భయంతో పరుగులు తీశారు. చివరకు పుట్టపర్తికి చెందిన స్నేక్ క్యాచర్ మూర్తికి సమాచారం ఇవ్వడంతో అతను అక్కడికి చేరుకుని కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నాడు. తర్వాత అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు. -
ఇష్టారాజ్యంగా చికెన్ విక్రయాలు ఊరికో ధర..!
‘కోతిరాంపూర్‌కు చెందిన మల్లేశం బంధువులొచ్చారని చికెన్ కొందామని మార్కెట్‌కు వెళ్లాడు. పేపర్ ధర ప్రకారం జనరల్ కిలో కోడి ధర రూ.94 ఉండగా రూ.130కి విక్రయించారు. స్కిన్లెస్ కిలో రూ.155 కాగా రూ.200లు వసూలు చేశారు. కిలో కోడికి రూ.30కి పైగా వసూలు చేస్తుండగా చికెన్‌కు రూ.40కి పైగా అదనంగా తీసుకుంటున్నారు. పేపర్ రేట్లో తక్కువ ఉందంటే గిట్టుబాటు కాదని చికెన్ సెంటర్ యజమాని సమాధానం చెప్పారు. నగరంలోనే ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మరీ అదనం. ఇది ఒక్క రాజు పరిస్థితే కాదు.. జిల్లావ్యాప్తంగా చికెన్ కొనుగోలు చేసే సగటు వినియోగదారుని పరిస్థితి.’ కరీంనగర్ అర్బన్: కోడి కూర.. ఈ పేరు వింటేనే నోరూరుతోంది. చుట్టాలు వచ్చిన.. శుభకార్యమైనా.. విషాధమైనా ముక్కలు ఉడకాలి సందే.. జిల్లాలో నిత్యం 40 వేల క్వింటాళ్ల చికెన్ విక్రయమవుతుండటంతో చికెన్ సెంటర్ల నిర్వాహకులకు కాసుల పంట పండుతోంది. కాగా చికెన్ ధరలు భారీగా పడిపోగా చికెన్ సెంటర్లలో దోపిడీ మాత్రం ఆగడం లేదు. పేరుకు పేపర్ రేటని చెబుతూ వీలైనంత మేర దండుకుంటున్నారు. పేపర్ ధర ఒకటైతే విక్రయించేది మాత్రం కిలోకు రూ.40 అదనం. ఇదేంటంటే మేమింతే..ఈసడింపు సమాధానం. జిల్లాలో నిత్యం రూ.5.20 కోట్ల వ్యాపారం సాగుతుండగా అదనంగా రూ.1.20కోట్లు దోచుకుంటున్నారు. ఈలెక్కన నెలకు రూ.36కోట్ల మేర వినియోగదారులను పిండేస్తుండగా నియంత్రించే వారు లేకపోవడంతో అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. చికెన్ సెంటర్లు.. దళారులకే లాభం కోళ్ల పరిశ్రమ స్వయం ఉపాధిగా వెలుగొందుతుండగా దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి అ«ధికారం లేదు. హెచరీస్, కోళ్ల ఫారం యజమానులు, ట్రేడర్స్, చికెన్ సెంటర్ల నిర్వాహకులు ఇలా వినియోగదారులకు చికెన్ చేరుతుండగా యజమానుల పరిస్థితి అటుంచితే ట్రేడర్లు, చికెన్ సెంటర్ల నిర్వాహకులే ధరలను శాసిస్తున్నారు. సొమ్మొకడిది సోకొకరిదన్నట్లు గంటల వ్యవధిలోనే లాభాలు గడిస్తున్నారు ట్రేడర్లు. పుట్టగొడుగుల్లా ట్రేడర్లు పుట్టుకొస్తుండగా చికెన్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. కోళ్లను 45–50 రోజుల పాటు పెంచిన రైతుకు మిగిలేది అరకొర కాగా ట్రేడర్లు, చికెన్ సెంటర్లు మాత్రం దండిగా దోచుకుంటున్నారు. ఫలితంగా కోళ్ల ఫారం రైతులు, వినియోగదారులపైనే భారం పడుతోంది. పుట్టగొడుగుల్లా ట్రేడర్లు జిల్లాలో కోళ్ల ఫారంల నుంచి కోళ్లను కొనుగోలు చేసి చికెన్ సెంటర్లకు సరఫరా చేసేవారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. దీంతోనే ఎక్కువ లాభం ఉండటం.. మైనస్ మంత్రాన్ని జపించడంతో అనతికాలంలో ల క్షలు వెనకేస్తున్నారు. ఈ జాబితాలో కోళ్ల ఫారం య జమానులు చేరిపోతున్నారు. ఫారం ద్వారా వచ్చే ఆ దాయం కంటే సరఫరా చేస్తే వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండగా అదీ రెండు, మూడు రోజుల్లోనే వస్తుండటంతో ఈ వ్యాపారం వైపే మొగ్గుచూపుతున్నారు. కోళ్ల ఫారం యజమానుల పరిస్థితి దారుణం ట్రేడర్లు, చికెన్ సెంటర్ నిర్వాహకులు, హెచరీస్‌లు వీలైనంత సంపాదిస్తుంటే కోళ్ల ఫారం యజమానులది దారుణ పరిస్థితి. రోజుల వ్యవధిలోనే వారంతా లాభాలు గణనీయంగా పొందుతుంటే పిల్లల నుంచి కోళ్ల వరకు రూపాంతరం చెందే వరకు శ్రమించే య జమానులకు మాత్రం మిగిలేది చిన్నమొత్తమే. జిల్లాలో సుమారు 5వేల వరకు కోళ్ల ఫారాలున్నాయి. హె æచరీస్లు కోడి పిల్లలను కోళ్ల ఫాం యజమానులకు సరఫరా చేస్తుండగా 45–50 రోజులకు పెంచి వాటి ని సంరక్షించాలి. దాణాలో వాడే ముడి పదార్థాలపై ధర ఉండటం లేదు. కంపెనీని నమ్ముకుని దాణా వేయడమే. ఈలోపే ఏదైనా వైరస్ వచ్చినా.. మరణించినా రైతుపైనే భారం. ఇవన్ని తట్టుకుని కోళ్లను విక్రయించే సమయానికి ట్రేడర్ల దోపిడీ అధికమవుతోంది. చేసేది లేక మైనస్లకు విక్రయిస్తూ పెట్టిన పెట్టుబడిలో పావు వంతు కూడా లాభం పొందడం లేదు. కోళ్ల పరిశ్రమను నమ్ముకున్న వారికి ఆశించిన ప్రయోజనం లేదని ప్రభుత్వ నియంత్రణలో చేర్చాలని ఫారం యజమానులు కోరుతున్నారు. పౌల్ట్రీ మీట్ ఫెడరేషనే మార్గం ► కోళ్ల పరిశ్రమపై ఒకప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణ ఉండేది. ► ఫారం యజమానులు నష్టపోయినా, ఏవైనా విపత్తులు సంభవించినా అరకొర సాయమందేది. ► దీనికి తోడు ప్రభుత్వ రాయితీలుండేవి. ► ప్రభుత్వ కనుసన్నలో 1985 వరకు పౌల్ట్రీ మీట్ ఫెడరేషన్ ఉండేది. ► కాలక్రమేణ ఫెడరేషన్ కనుమరుగైంది. ► నిరుద్యోగ యువతకు ఇదో చక్కని అవకాశమే కానీ సంస్కరణలు అవసరమన్నది యజమానుల వాదన. పౌల్ట్రీ రంగాన్ని బతికించాలి కోళ్ల ఫారంతో పదేళ్లుగా ఉపాధి పొందుతున్న. ఇటీవల కాలంలో మోసాలు ఎక్కువయ్యాయి. కంటికి రెప్పలా పిల్లలను కాపాడితే విక్రయించే సమయానికి ట్రేడర్లు తక్కువ ధర చెల్లిస్తున్నారు. దీంతో ఒకసారి కోళ్లు వేసిన వారు మళ్లీ వేయాలంటే వెనుకడుగు వేస్తున్నారు. – మహేందర్‌రెడ్డి, పౌల్ట్రీ ఫాం రైతు, మానకొండూరు మేమేం చేయలేం కోళ్ల పరిశ్రమ స్వయం ప్రతిపత్తి గల ప్రైవేట్ రంగం. వీటి ధరలపై మాకెలాంటి అధికారం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు, ప్రొత్సాహకాలు లేవు.– డా.బండారి నరేందర్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి -
బర్డ్ ఫ్లూ: 15 రోజుల పాటు చికెన్ సెంటర్లు బంద్
భోపాల్: కరోనా వైరస్ ఇంకా కంట్రోల్ కాలేదు. మరో వైపు బర్డ్ ఫ్లూ ముంచుకోస్తుంది. ఇప్పటికే కేరళ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇక మధ్యప్రదేశ్ మాంద్సౌర్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంద్సౌర్ జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు చికెన్ సెంటర్లు ముసివేయడమే కాక, కోడిగుడ్ల విక్రయాలను నిషేధించారు. మంద్సౌర్ ప్రాంతంలో ఒకే రోజు 100 కాకులు చనిపోవడమే కాక.. ఇక ఇండోర్ ప్రాంతంలో చనిపోయిన కాకుల్లో బర్డ్ ఫ్లూ వైరస్‌ని గుర్తించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మరికొన్ని జిల్లాల్లో కూడా బర్డ్ ఫ్లూ మరణాలు వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ మాట్లాడుతూ ‘ఇండోర్‌లో చనిపోయిన కాకుల్లో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ) గుర్తించారు. దాంతో ఇక్కడ రాపిడ్ రెస్పాన్స్ టీం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తోందని’ తెలిపారు. (చదవండి: కరోనా వల్ల మేలెంత? కీడెంత? ) 2020 డిసెంబర్ 23 నుంచి 2021 జనవరి 3 వరకు మధ్యప్రదేశ్ ఇండోర్‌లో 142, మాంద్సౌర్లో 100, అగర్-మాల్వాలో 112, ఖార్గోన్లో 13, సెహోర్ జిల్లాలో తొమ్మిది కాకులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇక కేరళలో కేరళలోని కొట్టాయం, అలపూజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించారు. దీని కారణంగా ఇప్పటికే ఈ ప్రాంతంలో 12 వేల బాతులు చనిపోగా.. మరో 36,000 బాతులు చనిపోయే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. -
మృతిచెందిన కోళ్ల విక్రయం
విజయనగరం, సాలూరు: కరోనాపై అవగాహన కల్పించేందుకు, సాధారణ తనిఖీల నిమిత్తం శుక్రవారం పెదబజారులో మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు సిబ్బందితో కలిసి పర్యటించారు. ఈ క్రమంలో ఓ చికెన్ దుకాణం సమీపంలో వేలాడదీసి ఉన్న మృతిచెందిన కోళ్లను గుర్తించారు. కమిషనర్‌ను చూసిన సదరు దుకాణదారుడు పారిపోయాడు. వెంటనే సిబ్బందితో కలిసి కమిషనర్ దుకాణంలోకి వెళ్లి పరిశీలించారు. మరణించిన కోళ్లను శుభ్రపరిచి ఐస్‌బాక్స్‌లో పెట్టి ఉండడాన్ని గమనించారు. ఆ కోళ్లను సిబ్బందితో ప్రత్యేక మున్సిపల్ వాహనంలో స్థానిక డంపింగ్ యార్డ్‌కు తరలించి, వాటిని పాతిపెట్టారు. సదరు చికెన్ వ్యాపారి కొలిసి అక్కయ్యకు రూ.10 వేల జరిమానా విధించినట్లు కమిషనర్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేయాలని పట్టణ ఎస్సై శ్రీనువాసరావును కోరారు. -
రెచ్చిపోతున్న చికెన్ మాఫియా
హోటళ్లలో రకరకాల చికెన్ ముక్కలు నోరూరిస్తున్నాయని లాగించారో అంతే.. ఆస్పత్రిలో బెడ్ ఎక్కాల్సిందే. మాంసం దుకాణం నుంచి కొని తెచ్చుకుని వండుకు తిన్నా అదే పరిస్థితి.. జిల్లాలో చికెన్ మాఫియా రెచ్చిపోతోంది. పొరుగు రాష్ట్రాల్లో నిల్వ ఉంచిన, చెడిపోయిన మాంసాన్ని తీసుకువచ్చి చెలగాటమాడుతోంది. నెలరోజులుగా అధికారులు దాడులు చేస్తున్నారు. రోజుకో మోసం వెలుగుచూస్తోంది. చెన్నై, బెంగళూరు నగరాల్లో డంపింగ్ యార్డుకు వెళ్లాల్సిన వేల కేజీల చికెన్ జిల్లాకు తీసుకువచ్చి విక్రయిస్తుండటాన్ని తాజాగా గుర్తించిన అధికారులు విస్తుపోయారు. ప్రజలు మాంసం దుకాణాలకు, హోటళ్లకు వెళ్లాలన్నా భయపడుతున్నారు. జిల్లాలో జరుగుతున్న నయా చికెన్ దందాపై ప్రత్యేక కథనం. సాక్షి, నెల్లూరు: జిల్లాలో నయా చికెన్ దందా వెలుగుచూసింది. ఇతర రాష్ట్రాల్లో పనికి రాకుండా డంపింగ్ యార్డుకు వెళ్లే చికెన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసి విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లా మార్కెట్లోకి రోజూ ఏకంగా వెయ్యి కిలోలకు పైగా పనికిరాని చికెన్‌ను దిగుమతి చేస్తోంది. నగరంలోని అనేక బార్లు, హోటళ్లకు వీటినే సరఫరా చేస్తోంది. నెల్లూరు నగరపాలక సంస్థ అధికారుల దాడులతో చెన్నై చికెన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నగరంతో పాటు సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, తదితర ప్రాంతాలకు నిత్యం చెన్నై మార్కెట్ నుంచి నాసిరకం చికెన్ దిగుమతవుతోంది. బెంగళూరు నుంచి వారంలో రెండుసార్లు జిల్లా మార్కెట్‌కు చికెన్ దిగుమతవుతోంది. చెన్నై, బెంగళూరుల్లో చికెన్ లివర్‌ను, కందనకాయలు, కోడి వెనుక భాగాన్ని వేస్ట్‌గా తీసేసి డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. దీన్ని స్థానిక వ్యాపారులు ఆదాయవనరుగా మార్చుకున్నారు. మార్కెట్లో సగటున చికెన్ ధర నాణ్యతను బట్టి రూ.140 నుంచి రూ.170 వరకు ఉంటుంది. ఈ క్రమంలో స్థానిక వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన చెన్నై చికెన్ భారీగా లాభాల ఆర్జనకు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నాసిరకం మాంసంతో కల్తీకి పాల్పడుతున్నారు. కొద్ది నెలలుగా నగరంలో ఇదే తంతు జరుగుతున్నా అధికారులు దృష్టి సారించకపోవడంతో వాస్తవాలు వెలుగులోకి రాలేదు. ఈ క్రమంలో కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలతో ఫుడ్ కంట్రోల్ విభాగాధికారులు నెల్లూరు నగరంలో నగరపాలక సంస్థ అధికారులు, మున్సిపాల్టీల్లో స్థానిక అధికారులు వరుస దాడులు నిర్వహిస్తుండడంతో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. కొద్ది రోజులుగా హోటళ్లలో నిల్వ ఉంచిన చికెన్, ఇతర మాంసంతో వంటలు చేస్తున్నట్లు గుర్తించి పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశారు. కొనసాగింపుగా చికెన్ స్టాళ్లపై దృష్టి సారించారు. దీంతో చికెన్ స్టాళ్లలో దిగుమతి చికెన్‌ను ఫ్రిజ్‌లలో ఉంచి మూడు, నాలుగు రోజులు గడిచాక కూడా విక్రయిస్తున్నారు. దిగుమతి చికెన్ కిలో రూ.30 నుంచి రూ.40 చెన్నై, బెంగళూరు చికెన్ మార్కెట్లో నిత్యం విక్రయాలు వేల కిలోల్లో జరుగుతుంటాయి. అక్కడ నాసిరక చికెన్‌ను స్థానిక చికెన్ స్టాల్ నిర్వాహకులు కిలో సగటున రూ.30 నుంచి రూ.40కు రవాణా ఖర్చులతో కలిపి కొనుగోలు చేసి ఇక్కడి స్టాళ్లలో రోజువారీ చికెన్‌తో కలిపి విక్రయిస్తుంటారు. వినియోగదారుడే కాకుండా నిర్వాహకుడు సైతం గుర్తుపట్టలేని విధంగా కలిపేస్తారు. నగరంలో ప్రతి వారం సగటున 60 శాతం మంది చికెన్‌ను కొనుగోలు చేస్తుంటారు. ఒక్క ఆదివారం రోజే నగరంలో సగటున 16 వేల కిలోల చికెన్ విక్రయాలు జరగుతుంటాయి. ఇక రోజువారీగా హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లకు వెయ్యి కిలోలపైనే సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో అక్రమంగా తెచ్చి కల్తీ చేసిన చికెన్‌ను ఎక్కువగా బార్ అండ్ రెస్టారెంట్లకు, నగర, శివార్లలోని దాబాలకు ఎక్కువగా విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే చికెన్‌ను సరఫరా చేస్తుండటంతో నాణ్యత గురించి ఎవరూ పట్టించుకోని పరిస్థితి. వారానికి మూడు నుంచి నాలుగు వేల కిలోల చికెన్ ఎక్కువగా చెన్నై నుంచి వస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ప్రజారోగ్యం గాలికి కల్తీ, నిల్వ ఉంచిన చికెన్‌ను విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ, నిల్వ ఉంచిన చికెన్‌లో బ్యాక్టీరియా సాధారణ స్థాయి కంటే ఐదు వందల రెట్లు అధికంగా ఉంటుంది. దీర్ఘకాలంలతో మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రధానంగా కడుపునొప్పి, విరేచనాలు, నరాల సంబంధిత జబ్బులతో పాటు నిల్వ ఉంచి మాంసంలో ఎలాంటి పోషక గుణాలు ఉండవు. దీని వల్ల టైఫాయిడ్ జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. మెగ్డీలో నిల్వ చికెన్ గుర్తింపు నెల్లూరు సిటీ: దర్గామిట్టలోని రిలయన్స్ సూపర్ ఎదురుగా ఉండే మెగ్డీలో నగరపాలక సంస్థ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ మంగళవారం తనిఖీలు చేశారు. ఈ క్రమంలో నిల్వ ఉండే చికెన్, ఎక్స్పైరీ డేట్ పూర్తయిన బ్రెడ్, తదితర ఆహార పదార్థాలను గుర్తించారు. యజమానికి రూ.50 వేల జరిమానా విధించారు. వెటర్నరీ డాక్టర్ మదన్మోహన్, శానిటరీ సూపర్వైజర్ సాయీపీరా, ఇన్స్పెక్టర్ శేషయ్య, తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ప్రియుడిపై క్లబ్ డాన్సర్ హత్యాయత్నం
సికింద్రాబాద్: తనను ప్రేమించి పెళ్లి చేసుకోలేదన్న కోపంతో మాజీ ప్రియుడిపై ఓ మహిళ కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసింది. చిలకలగూడ ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాసులు కథనం ప్రకారం...సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన ఖలీమ్ (40) చికెన్ సెంటర్ వ్యాపారి. మలక్‌పేట్‌కు చెందిన క్లబ్ డ్యాన్సర్ గులాబీ అలియాస్ సుల్తానా మోనా (42) అనే మహిళతో అతడికి కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లు ప్రేమించుకుని విడిపోయూరు. ఇటీవల ప్రమాదంలో గాయుపడి చికిత్స పొందుతున్న ఖలీమ్‌ను పరామర్శించేందుకు గులాబీ వచ్చింది. దాంతో వారిమధ్య మళ్లీ మాటలు కలిశాయి. పెళ్లి చేసుకుందామని సుల్తానా, ఖలీమ్‌పై ఒత్తిడి తెచ్చింది. ఇదివరకే తనకు పెళ్లయిందని, అందువల్ల కుదరదని అతడు తిరస్కరించాడు. ఈ విషయుంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆమె ఫిర్యాదును తిస్కరించారు. తనను తిరస్కరించిన ఖలీమ్‌ను హతమార్చాలని సుల్తానా నిర్ణయించుకుంది. పథకం ప్రకారం శుక్రవారం రాత్రి సుల్తానా అంబర్‌నగర్‌లోని టైలర్‌షాపు ముందు నిల్చున్న ఖలీమ్‌పై కత్తితో దాడి చేసింది. పోలీసులు గాయుపడ్డ ఖలీమ్‌ను ఆస్పత్రికి తరలించారు. నిందితురాలి కోసం గాలిస్తున్నారు.