మాజీ ప్రియుడిపై క్లబ్ డాన్సర్ హత్యాయత్నం | club dancer tries to kill former lover in secunderabad | Sakshi
Sakshi News home page

మాజీ ప్రియుడిపై క్లబ్ డాన్సర్ హత్యాయత్నం

Published Sat, May 9 2015 5:12 PM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

మాజీ ప్రియుడిపై  క్లబ్ డాన్సర్ హత్యాయత్నం

మాజీ ప్రియుడిపై క్లబ్ డాన్సర్ హత్యాయత్నం

సికింద్రాబాద్: తనను ప్రేమించి పెళ్లి చేసుకోలేదన్న కోపంతో మాజీ ప్రియుడిపై ఓ మహిళ కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసింది.  చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ కావేటి శ్రీనివాసులు కథనం ప్రకారం...సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన ఖలీమ్ (40) చికెన్ సెంటర్ వ్యాపారి. మలక్‌పేట్‌కు చెందిన క్లబ్ డ్యాన్సర్ గులాబీ అలియాస్ సుల్తానా మోనా (42) అనే మహిళతో అతడికి కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లు ప్రేమించుకుని విడిపోయూరు. ఇటీవల ప్రమాదంలో గాయుపడి చికిత్స పొందుతున్న ఖలీమ్‌ను పరామర్శించేందుకు గులాబీ వచ్చింది.

దాంతో వారిమధ్య మళ్లీ మాటలు కలిశాయి. పెళ్లి చేసుకుందామని సుల్తానా, ఖలీమ్‌పై ఒత్తిడి తెచ్చింది. ఇదివరకే తనకు పెళ్లయిందని, అందువల్ల కుదరదని అతడు తిరస్కరించాడు. ఈ విషయుంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆమె ఫిర్యాదును తిస్కరించారు. తనను తిరస్కరించిన ఖలీమ్‌ను హతమార్చాలని సుల్తానా నిర్ణయించుకుంది. పథకం ప్రకారం శుక్రవారం రాత్రి సుల్తానా అంబర్‌నగర్‌లోని టైలర్‌షాపు ముందు నిల్చున్న ఖలీమ్‌పై కత్తితో దాడి చేసింది. పోలీసులు గాయుపడ్డ ఖలీమ్‌ను ఆస్పత్రికి తరలించారు. నిందితురాలి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement