Chiefs
-
చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించండి
సాక్షి, అమరావతి: చంద్రబాబు అరెస్టయినా జాతీయ పార్టీల నాయకులు ఎవరూ పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలు రంగంలోకి దిగి ఎలాగైనా వారితో మాట్లాడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు లాబీయింగ్ చేసి మరీ స్పందించాలని కోరడంతోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్, అకాలీదళ్ నేత సుఖబీర్‌సింగ్ బాదల్ స్పందించినట్టు తెలుస్తోంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు అరెస్టయి నాలుగురోజులైనా ఆయనకు జాతీయ స్థాయిలో కనీసమద్దతు లభించలేదు. ఎవరూ స్పందించకపోవడంతో పలువురు టీడీపీ నేతలు రంగంలోకి దిగి ఢిల్లీ స్థాయిలో జాతీయ పార్టీల నేతలతో లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు అనుయాయుడు కంభంపాటి రామ్మోహనరావు ఢిల్లీలో తనకు తెలిసిన వారందరినీ కలిసి చంద్రబాబు అరెస్ట్‌పై మాట్లాడాలని కోరుతున్నట్టు తెలిసింది. తనకు తెలిసిన ఎంపీల ద్వారా మమతా బెనర్జీని బతిమలాడటంతో ఆమె మొక్కుబడిగా స్పందించారు. అఖిలేశ్‌ను కూడా టీడీపీ నేతలు ఒత్తిడి చేయడంతో ఆయన ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. సుఖబీర్‌సింగ్ బాదల్ కూడా లాబీయింగ్ వల్లే మూడురోజుల తర్వాత స్పందించారు. పట్టించుకోని జాతీయ పార్టీలు వివిధ జాతీయపార్టీలు, నేతలతో చంద్రబాబుకు సంబంధాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా జాతీయ రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. జాతీయ రాజకీయాలను ఎప్పుడూ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు, అవకాశవాదం కోసం ఉపయోగించడంతో ఆయన నమ్మదగని నేతగా ముద్రపడ్డారు. ప్రస్తుతం అన్ని పార్టీలు ఆయన్ను దూరం పెట్టాయి. అటు ఎన్డీయే దగ్గరకు రానీయడం లేదు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదు. ఏ కూటమిని అయినా తన రాజకీయ అవసరాల కోసమే వాడుకోవడంతో ఇప్పుడు ఆయన దేశ రాజకీయాల్లో ఏకాకిగా మారిపోయారనే వాదన వినిపిస్తోంది. మద్దతు కోసం ఢిల్లీలో లాబీయింగ్ చంద్రబాబు అనుయాయుడు కంభంపాటి, బీజేపీలోని ఆయన కోవర్టులు సీఎం రమేష్, సుజనాచౌదరి వంటి నేతలు చంద్రబాబుకు అనుకూలంగా లాబీయింగ్‌కు దిగారు. అయినా ఆశించినస్థాయిలో జాతీయనేతలు చంద్రబాబుకు మద్దతు పలకలేదు. కనీసం మరికొంత మందితో అయినా ట్వీట్లు చేయించాలనే ఉద్దేశంతో ఢిల్లీలో తంటాలు పడుతున్నట్టు తెలుస్తోంది. -
ప్రభుత్వ బ్యాంకుల చీఫ్‌లతో ఆర్థిక శాఖ సమీక్ష
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) అధిపతులతో కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి వివేక్ జోషి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జన సురక్ష, ముద్రా యోజన వంటి వివిధ ఆర్థిక స్కీములను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రధాని బీమా పథకాల్లో మరింత మందిని చేర్చే దిశగా బ్యాంకులు తమ బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రాంతీయ భాషల్లోన వీటి గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జోషి సంనట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు రోజంతా సాగిన ఈ సవవేశంలో పశు సంవర్ధక శాఖ, ఫిషరీస్, హౌసింగ్ తదితర శాఖల సీనియర్ అధికారులు, నాబార్డ్ చైర్మన్, ఎన్పీసీఐ సీఈవో మొదలైన వారు కూడా పాల్గొన్నారు. స్టాండప్ ఇండియా, పీఎం స్వానిధి తదితర స్కీముల పురోగతిని సైతం ఇందులో సమీక్షించారు. -
అగ్నిపథ్‌పై త్రివిధ దళాధిపతులపై రాజ్‌నాథ్ సింగ్ భేటీ
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర ఉద్రిక్తత కారణంగా త్రివిధ దళాధిపతులతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరిగిన హింస్మాతక, విధ్వంసక ఘటనలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే, అగ్నిపథ్‌పై మరోసారి కూలంకషంగా త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ చర్చించనున్నారు. #WATCH | Agnipath Recruitment Scheme: Defence Minister Rajnath Singh to hold a meeting with the service chiefs in Delhi. Navy Chief Admiral R Hari Kumar and IAF chief Air Chief Marshal Vivek Ram Chaudhari arrive at the Defence Minister's residence. pic.twitter.com/pakZMCHtmv — ANI (@ANI) June 18, 2022 ఇది కూడా చదవండి: అగ్నిపథ్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు -
పార్టీ బలోపేతంపై సీఎం జగన్ ఫోకస్
-
కొలిన్ పావెల్ కన్నుమూత
వాషింగ్టన్: అమెరికా మాజీ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కొలిన్ పావెల్ సోమవారం (84) కోవిడ్‌తో కన్నుమూశారు. అమెరికా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి చేపట్టిన మొట్టమొదటి నల్లజాతీయుడిగా పేరు తెచ్చుకున్న ఆయన.. ఇరాక్‌పై యుద్ధాన్ని సమరి్థంచుకునే క్రమంలో అపప్రథ మూటగట్టుకున్నారు. డెమోక్రాటిక్, రిపబ్లికన్ పారీ్టలకు చెందిన దేశాధ్యక్షుల హయాంలో ఆయన సమర్థవంతమైన సేవలందించారు. అమెరికా సేనల పనామా ఆక్రమణ, 1991లో ఇరాక్ ఆర్మీ నుంచి కువాయిట్‌కు విముక్తి కలిగించడం వంటి వాటిలో ఆయన కీలకంగా వ్యవహరించారు. అయితే, 2003లో భద్రతామండలిలో అమెరికా విదేశాంగ మంత్రిగా పావెల్ చేసిన ప్రసంగంతో ఆయన ప్రతిష్ట మసకబారింది. జనహనన ఆయుధాలను ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ రహస్యంగా నిల్వ చేసినట్లుగా ఆయన తప్పుడు ఆరోపణలు చేయడం.. అప్పటికే ఇరాక్‌పై అమెరికా యుద్ధం వెనుక అంతర్జాతీయ సమాజం అనుమానాలను మరింత బలపరిచింది. కొలిన్ పావెల్ ప్రతిష్టను దెబ్బతీసింది. -
ప్రైవేట్ బ్యాంక్ చీఫ్‌లకు ఆర్బీఐ షాక్!
సాక్షి, ముంబై: దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంక్‌లలో సీఈఓ, ఎండీ, ఫుల్ టైం డైరెక్టర్ల (డబ్ల్యూ్టటీడీ) పదవీకాలాన్ని15 ఏళ్లుగా.. ఆయా వ్యక్తులకు గరిష్టంగా 70 ఏళ్ల వయస్సును నిర్ణయిస్తూ రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలను జారీ చేసింది. బోర్డ్ సమావేశాలు, కమిటీ ఏర్పాటు, వయసు, పదవీకాలం, డైరెక్టర్ల వేతనాలు వంటివి ఆర్బీఐ జారీ చేసిన సూచనలలో భాగంగా ఉన్నాయి. బ్యాంక్లలోకార్పొరేట్ గవర్నెన్స్‌పై మాస్టర్ డైరెక్షన్స్‌తో వస్తామని ఆర్బీఐ తెలిపింది. అవసరమైన చట్టబద్ధమైన ఆమోదాలకు లోబడి ఎండీ, సీఈఓ లేదా డబ్యూటీడీలను పదిహేనేళ్లకు మించి ఒకే పదవిలో ఉంచలేరని పేర్కొంది. ఒకవేళ అదే వ్యక్తులను పునర్నియామకానికి బోర్డ్ ఆమోదిస్తే గనక.. కనీసం మూడు సంవత్సరాల వ్యవధి తర్వాత.. కొన్నిషరతులకు లోబడి నియమించుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే ఈ మూడేళ్ల కాలంలో ఆయా వ్యక్తులు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ బ్యాంక్‌తో లేదా అనుబంధ కంపెనీలతోఎలాంటి సంబంధం లేదా నియామకాలను చేపట్టరాదని ఆదేశించింది. అదేవిధంగా సీఈఓ, ఎండీ, డబ్ల్యూటీడీలు 70 ఏళ్ల వయస్సుకు మించి ఆయా పదవుల్లో కొనసాగలేరని.. అంతకంటేతక్కువ వయసు లోపే పదవీ విరమణను బోర్డ్‌లు సూచించవచ్చని పేర్కొంది. చైర్మెన్, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల (ఎన్ఈడీ) గరిష్ట వయోపరిమితిని 75 ఏళ్లుగా నిర్ణయించింది. ఎన్‌ఈడీల మొత్తం పదవీకాలం నిరంతరం లేదా బ్యాంక్ బోర్డ్‌లో ఎనిమిది సంవత్సరాలకుమించి ఉండకూడదు. వీరి పునర్నియామకానికి కూడా మూడేళ్ల వ్యత్యాసం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అదేవిధంగా ఎన్‌ఈడీల వార్షిక వేతనం రూ.20 లక్షలకు మించరాదనిఆదేశించింది. -
బ్యాంకులతో ఆర్బీఐ భేటీ: ఎజెండా ఏంటి?
సాక్షి, ముంబై : కరోనా వైరస్ సంక్షోభ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ శనివారం పలు బ్యాంకుల ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు. ఆర్థిక రంగాన్ని, పరిశ్రమను బలోపేతం చేయడానికి తీసుకోవలసిన చర్యలపై ఆయన చర్చించనున్నారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి తీసుకోవలసిన చర్యలపై బ్యాంక్ చీఫ్ ల సలహాలను శక్తి కాంత దాస్ కోరనున్నారు. కరోనా వైరస్ కష్టకాలంలో వాయిదాలు చెల్లించేందుకు ఆర్బీఐ మూడు నెలల పాటు మారటోరియానికి సంబంధించి మార్చి 27 నాటి మార్గదర్శకాల కనుగుణంగా కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆర్బీఐ తాజా సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. వడ్డీ రేట్ల నియంత్రణ, ఇది వినియోగదారులకు చేరడం, పరిశ్రమలకు లాభించే లిక్విడిటీ ఇన్ఫ్యూషన్ చర్యలు వంటి ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చర్యలపై శక్తికాంత్ దాస్ చర్చించనున్నారు. దీంతోపాటు సూక్ష్మ, చిన్న మధ్య తరగతి పరిశ్రమ, గ్రామీణ రంగానికి అందించిన సౌకర్యాలుపై సమక్షించనున్నారు. రుణగ్రహీతలు, రుణదాతలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇతర సంస్థలు ఎదుర్కొంటున్నఒత్తిడిని అంచనా వేయడానికి ఆర్బీఐ అనేక చర్యలు తీసుకుంది. ఎప్పటికపుడు పరిస్థితిని అంచనా వేస్తూ మరిన్ని చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చింది. ద్రవ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి జీడీపీలో 3.2 శాతాన్ని ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో తాజా సమావేశంలో పై బ్యాంకింగ్ వర్గాల్లో, మార్కెట్లో వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా మరో రెండువారాలపాటు లాక్డౌన్ పొడగింపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ -19 కేసులు లేని ప్రాంతాల్లో సడలింపులతో ఆరెంజ్, గ్రీన్ జోన్ల రిస్క్ ప్రొఫైలింగ్ ఆధారంగా ఎంపిక చేసిన కార్యకలాపాల నిర్వహణకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. -
బ్యాంకు సీఈవోలతో శక్తికాంత దాస్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సమావేశమయ్యారు. బ్యాంకింగ్ రంగం నుంచి ప్రభుత్వం ఏమి ఆశిస్తోందో తెలియజెప్పే ఉద్దేశంతో పలు బ్యాంకుల సీఈవోలతో భేటీ అయినట్టు ఆయన వివరించారు. దీంతోపాటు ప్రస్తుత, భవిష్యత్తు అంశాలపై చర్చంచామని సమావేశం అనంతరం శక్తికాంత్ దాస్ వెల్లడించారు. 2018-19 సంవత్సరానికి ఆరవ ద్వైమాసిక మానిటరీ పాలసి రివ్యూ ఫిబ్రవరి 7వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత ఆధ్వర్యంలో ఇది మొదటి పరపతి విధాన సమీక్ష. మరోవైపు ఈ పరపతి సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఐసీఐసీఐ -వీడియోకాన్ కుంభకోణంలో బ్యాంకు మాజీ సీఈవో చందాకొచర్‌పై కేసు నమోదు, దాదాపు సగానికిపైగా బ్యాంకులు ఆర్బీఐ సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) నిబంధనల కిందికి రావడం తదితర అంశాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
కౌన్సిలర్ భర్త కక్కుర్తి!
పింఛన్ సొమ్ము స్వాహా లబోదిబోమంటున్న వృద్ధులు, వికలాంగులు పట్టించుకోని అధికారులు రేపోమాపో రాలిపోయే ఎండుటాకులు కొందరు... పరుల సహాయం లేనిదే పదడుగులన్నా వేయలేని నిస్సహాయులు మరికొందరు...జీవిత చరమాంకంలో ఉన్న వీరు బతికేందుకు ప్రభుత్వం ఎంతో కొంత పింఛన్ ఇస్తోంది . అయితే ఓ కౌన్సిలర్ భర్త కక్కుర్తి నిర్వాకానికి వీరంతా బలయిపోయారు. వీరికొచ్చే ఆ అరకొర పింఛన్ కాస్తా ఈ ‘మహానుభావుడు’ మింగేశాడు. మచిలీపట్నం : పేదలకు అందాల్సిన పింఛన్ల సొమ్ము పెద్దల పరమవుతోంది. అధికారులను, పింఛను ఇచ్చే సీఎస్పీలను గుప్పెట్లో పెట్టుకున్న వార్డు స్థాయి నాయకులు చక్రం తిప్పుతున్నారు. వృద్ధులకు రూ.200 నుంచి రూ.1,000కి, వికలాంగులకు రూ. 500 నుంచి రూ.1,500కు పెంచి ప్రభుత్వం అందజేస్తోంది. అయితే కాసులకు కక్కుర్తిపడ్డ కొంతమంది కౌన్సిలర్లు, వారి భర్తలు పింఛన్లు పేదలకు అందకుండా స్వాహా చేస్తున్నారు. మచిలీపట్నం పురపాలక సంఘంలో కోనేరుసెంటరుకు అత్యంత సమీపంలో ఉన్న ఓ వార్డు కౌన్సిలర్ భర్త 50 మందికి చెందిన పింఛన్లను జేబులో వేసుకున్నట్లు బయటకు పొక్కింది. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఈ 50 మందిలో 49 మంది రూ.1,000 పింఛను తీసుకునేవారు కాగా, మరొకరిది వికలాంగ పింఛను ఉంది. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం గమనార్హం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కౌన్సిలర్ భర్త మొదటి నెలలో రూ. 5వేలు, రెండో నెలలో రూ. 9వేలు, మూడో నెలలో ఏకంగా రూ.49,500లు కాజేయడం విమర్శలకు దారితీస్తోంది. అన్నీ తానై వ్యవహరిస్తూ... కోనేరుసెంటరు సమీపంలో ఉన్న వార్డులో 376 మందికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయి. వీటిలో తొమ్మిది మందికి పింఛన్లను వివిధ కారణాలతో నిలిపివేశారు. లబ్ధిదారులు తమకు అన్నీ అర్హతలు ఉన్నాయని చెప్పడంతో ముగ్గురికి మళ్లీ పింఛను ఇచ్చేందుకు అంగీకరించారు. జన్మభూమి కార్యక్రమంలో కోనేరుసెంటరుకు సమీపంలోని వార్డుకు, మరో వార్డుకు కలిపి ఒకేచోట కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇదే అదనుగా భావించిన కౌన్సిలర్ భర్త.. తన వార్డుకు సంబంధించిన ఎక్విడెన్స్ రిజిస్టర్‌ను సీఎస్పీ నుంచి తీసేసుకున్నట్లు సమాచారం. నగదు సీఎస్పీ వద్ద ఉంచి సొంత నగదును పింఛన్‌దారులకు అరకొర పంచాడని స్థానికులు చెప్పుకుంటున్నారు. అనంతరం సీఎస్పీ వద్దకు వచ్చి జాబితాలో ఉన్న సంఖ్య ఆధారంగా ప్రభుత్వం నుంచి వచ్చిన నగదు మొత్తాన్ని వసూలు చేసుకున్నాడని తెలిసింది. అయితే ఫినోమిషన్పై వేలిముద్రలు వేయడంతో పాటు ఎక్విడెన్స్ రిజిస్టర్లో నగదు తమకు అందినట్లు లబ్ధిదారులు వేలిముద్రలు లేదా సంతకం చేయాల్సి ఉంది. 50 మందికి సంబంధించిన పింఛను నగదును కాజేసిన కౌన్సిలర్ భర్త.. తన అనుచరులతో వేలి ముద్రలు వేయించినట్లు విశ్వసనీయ సమాచారం. పింఛను సొమ్ము అందని వారు తమకు ఆ మొత్తాన్ని ఇప్పించాలని కౌన్సిలర్ భర్త చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ‘ప్రభుత్వం మాది, పాలకవర్గం మాది, అధికారులు మేము చెప్పినట్లు వినాల్సిందే...మీరేం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ కౌన్సిలర్ భర్త వీరంగం వేయడం గమనార్హం. కాగా ఇంత మందికి పింఛన్లు ఇవ్వకుంటే తాను ఇబ్బందుల పాలవుతానని కౌన్సిలర్ భర్తతో వార్డు సీఎస్పీ వాగ్వాదానికి దిగారు. ఆమెకు మొదటి విడతగా రూ.6 వేలు, రెండో విడతగా రూ.9 వేలు రూ.15 వేలు ఇచ్చి మిన్నకుండిపొమ్మని హుకుం జారీ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని సీఎస్పీ పురపాలకశాఖ అధికారులకు తెలియజేశారు. తాను ఈ వార్డులో పనిచేయలేనని, వేరే వార్డుకు బదిలీ చేయాలని మొరపెట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కౌన్సిలర్ భర్తను ఆదర్శంగా తీసుకున్న పక్కవార్డులో ఉన్న కౌన్సిలర్ ఇదే తరహాలో వ్యవహరిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. మా దృష్టికి రాలేదు... కోనేరుసెంటరు సమీపంలో ఉన్న వార్డులో వంద మందికి పింఛన్లు ఇచ్చినట్లు వేలిముద్రలు తీసుకుని నగదు ఇవ్వని విషయం మా దృష్టికి రాలేదు. అయినప్పటికీ సంబంధిత విభాగం అధికారి నుంచి వివరాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటాం. - మారుతీ దివాకర్, మున్సిపల్ కమిషనర్ -
యడ్డికి నేడు బీజేపీ ఆహ్వానం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పను బీజేపీలో చేర్చుకోవడానికి అన్ని లాంఛనాలు పూర్తయ్యాయి. పార్టీలో చేరాల్సిందిగా శనివారం ఆయనకు అధికారికంగా ఆహ్వానం అందనుంది. నగరంలో శుక్రవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో యడ్యూరప్ప పునరాగమనానికి అంగీకారం తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సమాచారాన్ని ఆయనకు తెలియజేయడం ద్వారా పార్టీలోకి అధికారికంగా ఆహ్వానించాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, ఎంపీ అనంత కుమార్, మాజీ ముఖ్యమంత్రులు సదానంద గౌడ, జగదీశ్ శెట్టర్ ప్రభృతులు యడ్యూరప్పను ఆయన నివాసంలో కలుసుకుని పార్టీ నిర్ణయాన్ని తెలియజేయనున్నారు. చప్పట్లతో సమ్మతి కార్యవర్గ సమావేశంలో అనంత కుమార్ మాట్లాడుతూ పార్టీని వదలి వెళ్లిన నాయకులను తిరిగి ఆహ్వానించడానికి చప్పట్లు కొట్టడం ద్వారా అంగీకారం తెలపాలని సూచించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న వారంతా జోరుగా చప్పట్లు చరిచారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను బీజేపీ సమైక్యంగా ఎదుర్కొంటుందన్నారు. బయటకు వెళ్లిపోయిన వారంతా తిరిగి రావడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం లభించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని కారణాల వల్ల కొందరు నాయకులు పార్టీని వీడారని, వారిని తిరిగి తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ రహిత భారత్‌ను నెలకొల్పాలన్న పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పిలుపు మేరకు అందరూ పార్టీ విజయం కోసం శ్రమించాలని ఆయన కోరారు. యడ్యూరప్ప సమాలోచనలు బీజేపీలోకి రావాలంటూ అధికారిక ఆహ్వానం అందనున్న నేపథ్యంలో యడ్యూరప్ప ఇక్కడి తన నివాసంలో పార్టీ ముఖ్యులతో సమాలోచనలు జరిపారు. పార్టీలో చేరిన తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను బీజేపీలో ఎప్పుడు చేరేదీ నాలుగైదు రోజుల్లో ప్రకటిస్తానని తెలిపారు. బీజేపీలో విలీనంపై పార్టీలో తన నిర్ణయమే అంతిమమని ఆయన వెల్లడించారు.