Chieftains
-
నేతల ఆస్తులపై సమీక్ష ఏదీ?
న్యూఢిల్లీ: ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడబెట్టే మితిమీరిన ఆస్తులపై సమీక్షకు శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవీకాలంలో విపరీతంగా ఆస్తులు సంపాదించుకుంటూ ఎన్నికల్లో ప్రభావం చూపుతున్నారనీ, ఇటువంటి ధోరణులకు అడ్డుకట్ట పడేందుకు నామినేషన్ల సమయంలోనే వారు తమ ఆస్తుల వివరాలు వెల్లడించేలా శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలంటూ ‘లోక్ ప్రహరీ’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్ వేసింది. ‘ప్రజా ప్రతినిధులు పదవీ కాలంలో అతిగా ఆస్తులు కూడబెట్టుకోవడం ప్రజాస్వామ్యం విఫలమైందనడానికి గట్టి సూచిక’ అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇటువంటి ధోరణులను నివారించేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎన్నికల నామినేషన్ల సమయంలోనే తమ ఆస్తుల వివరాలు, ఆదాయ మార్గాలు వంటి వాటిని ధ్రువీకరించాలని, దీనిని బట్టి పదవీ కాలంలో వారు ఎలాంటి ఆస్తులు కూడబెట్టిందీ సమీక్షించేందుకు వీలుంటుందని పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వం వెంటనే ఒక శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటూ ‘లోక్‌ప్రహరీ’ కోర్టు ధిక్కార పిటిషన్ వేసింది. దీనిపై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈసీపై ధిక్కార పిటిషన్ న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా తమ నేర చరిత్రను బహిర్గతం చేయాలన్న తమ ఆదేశాలను అమలు చేయనందుకు కేంద్రంతోపాటు ఈసీపై ధిక్కార నేరం కింద సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ‘ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు తమ నేర చరిత్రను ఈసీకి వెల్లడించాలి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆ వివరాలివ్వాలి’ అంటూ గత ఏడాది రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఇటీవలి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా కేంద్రం, ఈసీ ఆ ఆదేశాలను పట్టించుకోలేదంటూ ఓ లాయర్ వేసిన పిటిషన్‌పై గురువారం ప్రత్యేక ధర్మాసనం వాదనలు వింటుందని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఈ పిటిషన్ ప్రతిని ఎన్నికల సంఘం కార్యదర్శికి అందజేయాలని కూడా ఆదేశించింది. -
బళ్లో మందుబాబుల చిందులు
తానూరు(ముథోల్): ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్న క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఇక్కట్ల మధ్య చదువును కొనసాగించే పరిస్థితి నెలకొంది. అదనపు తరగతి గదులు, నీటివసతి, ఆటస్థ లాలు, పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో మూగజీవాలు సంచారం చేస్తున్నాయి. దీంతో పాఠశాల మైదానాలు దుర్గంధమవుతున్నాయి. విద్యార్థులు ఆటలు ఆడుకోలేని పరిస్థితి తలెత్తుతోంది. పాఠశాలల్లో దుర్గంధం వెదజల్లుతుండడంతో వాసన భరించలేకపోతున్నారు. ప్రహరీలు లేకపోవడం తో పాఠశాలలకు రక్షణ కరువైంది. మధ్యాహ్న భోజన సమయాల్లో మూగ జీవాలు విద్యార్థులకు ఇ బ్బందులు గురి చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప ర్యావరణ పరిరక్షణకు ప్రతిష్ఠాత్మ కంగా ప్రా రంభించిన హరితహారంలో భాగంగా నాటిన మొ క్కలు జంతువులు తినేస్తున్నాయి. దీంతో మొ క్కలు నాటిన మూన్నాళ్ల ముచ్చటగా మారుతోంది. సగానికిపైగా .... నిర్మల్ జిల్లాలోని సగానికిపైగా ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రహరీలు లేవు. జిల్లాలో మొత్తం 953 పాఠశాలలున్నాయి. ఇందు లో 126 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 90 ప్రాథమికోన్నత పాఠశాలలు, 737 ప్రాథమిక పాఠశాలాలున్నాయి. ఇందులో 43 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో, 24 ప్రాథమికోన్నత పాఠశాలల్లో, 102 ప్రాథమిక పాఠశాలల్లో మాత్రమే ప్రహారీలు నిర్మించారు. మిగితా పాఠశాలాలకు ప్రహరీలు లేకపోవడంతో ,విద్యార్థులకు ఇబ్బందులు తప్ప డం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో మూగ జీవా లు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలలో చిన్నారులు విద్యను అభ్యసిస్తుండడంతో మూగ జీవాలతో ప్రమాదం పొంచి ఉందని పోష కులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి చర్యలు తీసుకుంటున్న క్షేత్ర స్థాయిలో సరైన రీతి లో అమలు కావడం లేదని సర్వత్రా చర్చించుకుంటున్నారు. హరితహారం మొక్కలకు రక్షణ ఏది? రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన హరితహారంలో భా గంగా నాటిన మొక్కలు పెరిగే దశలోనే మూగజీ వాలు తమ ఆహారంగా వినియోగించుకుంటున్నా యి. పచ్చని తెలంగాణ ధ్యేయంగా ప్రభుత్వ పా ఠశాలలు, కార్యాలయాలు, కళాశాలల్లో మొక్కల ను నాటే కార్యక్రమాన్ని నిర్వహించి పాఠశాలలో సిబ్బంది, విద్యార్థులు సైతం మొక్కల రక్షణకు తమవంతుగా కృషి చేస్తున్నారు. పాఠశాలలకు ప్రహారీ లేకపోవడంతో హరితహారం మొక్కలకు జంతువులు నష్టం కలిగిస్తున్నాయి. రూ.లక్షల్లో ఖర్చు పెట్టి నాటిన మొక్కలకు రక్షణ కరువైందని పేర్కొంటున్నారు. వ్యయ ప్రయాసలకు గురై నాటిన మొక్కలు తమ కళ్ల ఎదుట జంతువులకు ఆహారంగా మారడంతో విద్యార్థులు, ఉపాధ్యా యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రహరీలు నిర్మించాలని కోరుతున్నారు. మందుబాబులకు అడ్డాగా .. బెల్తరోడ పాఠశాలలో మందు సీసాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో రాత్రి వేళలో మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. రాత్రి వేళలో పాఠశాల ఆవరణలో కూర్చుని మందు తాగి బాటిళ్లను అక్కడే పారేస్తున్నారు. దీంతో పాఠశాల మైదానం మందు బాబులకు స్థావరంగా మారింది.రాత్రి వేళల్లో పేకాటరాయుళ్లకు ఆవరణ అనుకూలంగా మారింది. ప్రతి రోజు పాఠశాల ఆవరణలో మందు సీసాలు, సారా ప్యాకెట్లు ,గూట్కా ప్యాకెట్ల ఉంటున్నాయి. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. సంబంధిత శాఖాధికారులు స్పందించి పాఠశాలలకు ప్రహరీని నిర్మించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
అవినీతి ‘ప్రతినిధులు’
బినామీ రుణాల కుంభకోణంలో ప్రముఖుల పేర్లు రుణగ్రహీతల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ కుటుంబ సభ్యులు భార్యల పేరున దర్జాగా పాసుపుస్తకాల సృష్టి బుచ్చెయ్యపేట : వారంతా ప్రజాప్రతినిధులు. తమకేదో మంచి చేస్తారన్న నమ్మకంతో ప్రజలు ఏరికోరి గెలిపించుకున్నవారు. తప్పుచేసే వారిని సక్రమమార్గంలో పెట్టాల్సిన వారే వక్రమార్గం అనుసరించారు. జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ పాసుపుస్తకాలు, బినామీ రుణ వ్యవహారంలో వెల్లడవుతున్న పేర్లు చూసి అధికారులే నోరెళ్లబెడుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే అడ్డదారులు వెతకడంపై మండిపడుతున్నారు. తహశీల్దార్, ఆర్డీఓ వంటి ఉన్నతాధికారుల సంతకాలే ఫోర్జరీచేసి, నకిలీ స్టాంప్‌లతో పాసుపుస్తకాలు సృష్టించి లేని భూముల్ని ఉన్నట్లుగా రికార్డులు సృష్టించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మండలంలో బినామీ రుణాల వ్యవహారం వెలుగు చూడడంతో అధికారులు అనుమానం ఉన్న 255 పట్టాదారు పాసుపుస్తకాలు స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా విచారిస్తున్నారు. ఇప్పటి వరకు 75 పుస్తకాలు పరిశీలించగా 52 నకిలీవని తేలింది. నీలకంఠాపురం సర్పంచ్ భార్య ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికాగా అదే గ్రామానికి చెందిన మరో సామాజిక వర్గం వ్యక్తి కుమార్తెగా పట్టాదారు పాసుపుస్తకం సృష్టించారు. వాస్తవంగా భూమి లేకపోయినా సర్వే నంబర్ 86/3, 94/2, 95/1లో 4.72 ఎకరాల భూమి ఆమెకు ఉన్నట్లు పాసుపుస్తకం సృష్టించి బ్యాంకు నుంచి రుణం పొందారు. మల్లాం ఎంపీటీసీ మాజీ సభ్యురాలికి ఆర్.భీమవరంలోని సర్వే నంబర్ 816లో సెంటు భూమి లేదు. కానీ తనకు 4.32 ఎకరాల భూమి ఉన్నట్లు నకిలీ పాసుపుస్తకం సృష్టించి రుణం పొందారు. కొండెంపూడి, కోమళ్లపూడి, తురకలపూడి, గంటికొర్లాం, పెదపూడి, చినభీమవరం, బుచ్చెయ్యపేట, పోలేపల్లి, కొండపాలెం, పెదమదీన, గున్నెంపూడి, రాజాం, చిట్టియ్యపాలెం, తైపురం తదితర గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధుల పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి. సర్పంచ్‌లు, మాజీలు, ఎంపీటీసీ సభ్యులు, మాజీలు, ఎంపీటీసీలు, సహకార, డెయిరీ సభ్యులు, పలుకుబడి ఉన్న నాయకులు, ఉద్యోగులు కూడా ఈ వ్యవహారంలో తమవంతు భాగాన్ని సొంతం చేసుకున్నారు. జేసీ విచారణ జరపడం, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించడం, రెవెన్యూ అధికారులు పరిశీలన వేగవంతం చేయడంతో ‘బినామీ’దార్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తుండడంతో ఎమ్మెల్యే, మంత్రులను ఆశ్రయించి విచారణ తప్పుతోవ పట్టించేం దుకు అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది చూడాల్సి ఉంది. మరోవైపు అన్నిపుస్తకాల పరిశీలన అనంతరం మరెంతమంది బినామీలు వెలుగు చూస్తారో చూడాలి. -
పోరు మాని పోజులు!
సమైక్యాంధ్ర ఉద్యమంతో జిల్లా రగిలిపోతోంది. ఉద్యోగ సంఘాల సమ్మె బాటతో పాలన స్తంభించింది. రూ.కోట్లు నష్టం వస్తున్నా వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి రాష్ట్ర విభజనకు వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్నారు. పదహారు రోజులుగా జిల్లాలో తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ ప్రజాప్రతినిధులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కేవలం మద్దతుకే పరిమితమవుతున్నారు. ప్రజలు, ఉద్యోగ సంఘాలు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు ఒకటి రెండు రోజులు వచ్చి ఫొటోలకు పోజులివ్వడం మినహా.. ప్రత్యక్ష ఉద్యమానికి దిగడం లేదు. దీనిపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా అన్ని వర్గాలవారు ఉద్యమాలు చేస్తున్నారు. ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ప్రజలు సైతం రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం అప్పుడప్పుడు కనిపించి వెళ్లడం తప్ప ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనడం లేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. దీక్ష, ధర్నా, ర్యాలీలు చేస్తున్న వారి శిబిరాలకు ఎమ్మెల్యేలు రావడం, మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పడం, పత్రికల కోసం ఫొటోలు దిగడం, అనంతరం వెళ్లిపోవడం మినహా చేసేదేమీ ఉండడం లేదని విమర్శిస్తున్నారు. ఒకవైపు సమైక్యాంధ్ర అంటూనే మరోవైపు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామనడం వారి చిత్తశుద్ధికి అద్దంపడుతోంది. పీఎన్జీవోలు సమ్మెకు దిగి పాలనను స్తంభింపచేశారు. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఆందోళనలతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. త్వరలోనే విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెబాట పడుతున్నారు. అంటే ఉద్యమం తీవ్రత రెట్టింపవుతోంది. కానీ ప్రజాప్రతినిధులు మాత్రం సొంత పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరూ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదు. ప్రత్యక్ష పోరాటానికి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహారశైలిపై ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. రాజీనామాలు చేశారా! : రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే జిల్లాలో ఉద్యమం పెల్లుబికింది. ఎమ్మెల్యేలు, మంత్రుల రాజీనామాకు ఒత్తిడి తీవ్రమైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు మినహా మిగిలినవారంతా రాజీనామాలు చేసినట్లు ప్రకటించారు. వారి రాజీనామాలు అసెంబ్లీ స్పీకర్‌కు చేరాయా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వపరమైన సౌకర్యాలను పొందుతున్నారు. ప్రభుత్వ వాహనాలతో పాటు సెక్యూరిటీ కూడా కొనసాగుతోంది. దీంతో వీరు నిజంగా రాజీనామాలు చేశారా అన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. సమైక్యాంధ్ర కోసం ఉద్యమించకపోగా ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సిన ప్రజాప్రతినిధులు సమైక్యవాదులలో వేరు కుంపట్లు పెట్టేలా ప్రేరేపిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో మూడు శిబిరాల వెనుక ఓ మంత్రి ‘హస్తం’ ఉందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా మంత్రి బాలరాజు తీరుపై ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నా రాజీనామా చేయకపోవడంతో పాటు చేయమని అడిగిన ఉపాధ్యాయ సంఘాలపై ఒంటికాలిపై లేవడం పట్ల ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు.