Chimakurthy
-
వెలుగులు విరజిమ్మనున్న చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్
(బివి రాఘవ రెడ్డి) ఈ భూ మండలంలో రెండు విలువైన సంపదలు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో పెరిగే ఎర్రచందనం చెట్లు కాగా.. మరొకటి ప్రకాశం జిల్లా చీమకుర్తి భూగర్భంలో ఉన్న గెలాక్సీ బ్లాక్ గ్రానైట్. 45 ఏళ్ల కిందట.. తనకు రోజూ మంచి కాఫీ ఇస్తున్నాడన్న అభిమానంతో చీమకుర్తి తహశీల్దార్ వెంకటేశ్వర్లు.. ఆఫీసు ఎదురుగా ఉన్న ఓ టీస్టాల్ యజమానికి సాగు చేసుకోమంటూ రెండెకరాలకు పట్టా రాసిచ్చారు. పశువుల మేత కూడా మొలవని ఆ భూమి నాకెందుకంటూ అతను పట్టా తీసుకోకుండానే వెళ్లిపోయాడు. ఆ భూమి విలువ ఇప్పుడు ఎకరా రూ.3 కోట్లు! చీమకుర్తికి 4 కి.మీ దూరంలో రాళ్లు, రప్పలు, రేగుచెట్లతో నిండిన 400 ఎకరాల ప్రభుత్వ భూమిని సద్వినియోగం చేయాలన్న ఉద్దేశంతో 1978లో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఉన్న వేమా ఎల్లయ్య రామతీర్థం కేంద్రంగా పశుక్షేత్రం ఏర్పాటు చేయించారు. అదే భూమి గర్భంలో రూ.వేల కోట్ల విలువైన గ్రానైట్ ఉన్నట్లు తర్వాత కాలంలో బయట పడింది. చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ మరింతగా వెలుగులు విరజిమ్మనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో విదేశాలకు ఎగుమతులు పెరగటంతో పాటు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో పాదయాత్రకు వచ్చిన సందర్భంగా గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులకు ఇచ్చిన హామీ మేరకు జీఓ నంబరు 58ని ఇటీవల విడుదల చేశారు. ఆ ప్రకారం అక్టోబర్ 1 నుంచి కొత్త స్లాబ్ సిస్టం అమలులోకి రానుంది. సింగిల్ కట్టర్ బ్లేడ్ ఉన్న ఫ్యాక్టరీ యజమాని రూ.27 వేలు చెల్లిస్తే 22 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ రాయిని ప్రాసెస్ చేసుకునేందుకు అనుమతి వస్తుంది. మల్టీ కట్టర్ బ్లేడ్ ఫ్యాక్టరీ అయితే రూ.54 వేలు చెల్లించి 44 క్యూబిక్ మీటర్ల రాయిని ప్రాసెస్ చేసుకోవచ్చు. విద్యుత్ చార్జీల రాయితీపైనా త్వరలో జీవో విడుదల కానుంది. ఆ మేరకు యూనిట్‌కు రూ.2 రాయితీ లభిస్తుంది. ఫలితంగా ఒక్కో ఫ్యాక్టరీ యజమానికి నెలకు కనీసం రూ.లక్ష ప్రయోజనం కలుగుతుంది. దీంతోపాటు రా మెటీరియల్‌ను క్వారీ యజమానుల వద్ద నేరుగా కొనుగోలు చేసుకునే వెసులుబాటు వచ్చింది. విజిలెన్స్ దాడుల భయం లేకుండా చెన్నై, కృష్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేయవచ్చు. రామాయపట్నం పోర్టు ఇక్కడి ఎగుమతిదారులకు వరం కానుంది. రంగంలోకి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో ఇప్పటికే 1650 గ్రానైట్ యూనిట్లు ఉన్నాయి. వాటిలో దాదాపు 60 అధునాతన ఫ్యాక్టరీలు. ఒక్కొక్కటి రూ.50 నుంచి రూ.200 కోట్ల వ్యయంతో ఏర్పాటయ్యాయి. కొత్తగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే యజమానులకు రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం జనరల్ కేటగిరీ, బీసీ వర్గాలకు 30 శాతం, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 45 శాతం సబ్సిడీ వస్తుంది. దీంతో బ్యాంకుల్లో రుణం తీసుకున్న రెండు మూడు సంవత్సరాల్లోనే తీర్చేందుకు వెసులుబాటు కలుగుతుంది. ప్రభుత్వ సహకారం బాగుండటంతో ఏటేటా ఫ్యాక్టరీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన మూడేళ్లలోనే 250కి పైగా గ్రానైట్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది మరో 90 మంది పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఏడాదికి 8 లక్షల క్యూబిక్ మీటర్ల ఎగుమతి జిల్లా నుంచి ఏడాదికి 8.82 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ చైనా, ఇటలీ, వియత్నాం, ఈజిప్ట్, టర్కీ వంటి పలు దేశాలకు ఎగుమతి అవుతోంది. అందులో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఒక్కటే 6.25 లక్షల క్యూబిక్ మీటర్లు ఎగుమతి అవుతుంది. బ్లాక్ గ్రానైట్ ఏడాదికి 80 వేల క్యూబిక్ మీటర్లు, కలర్ గ్రానైట్ 1.77 లక్షల క్యూబిక్ మీటర్లు ఎగుమతవుతోంది. వెలికితీసిన గ్రానైట్ విలువ రూ.1.26 లక్షల కోట్లు! ఇక్కడ గ్రానైట్‌ను గుర్తించిన తొలినాళ్లలో ఏడాదికి 11 వేల క్యూబిక్ మీటర్ల రాయిని వెలికి తీసినా ప్రస్తుతం పది లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని తీస్తున్నారు. 35 ఏళ్లలో సరాసరిన ఏడాదికి 4 లక్షల క్యూబిక్ మీటర్ల వంతున లెక్కగట్టినా 1.40 కోట్ల చ.మీటర్ల గ్రానైట్ రాయిని తవ్వి తీసినట్లు అంచనా. క్యూబిక్ మీటర్ గ్రానైట్ నాణ్యతను బట్టి రూ.35 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర పలుకుతుంది. క్యూబిక్ మీటర్‌కు సరాసరిన రూ.90 వేలు లెక్కగట్టినా ఇప్పటి వరకు రూ.1.26 లక్షల కోట్ల విలువ చేసే గ్రానైట్‌ను బయటకు తీసినట్లు అంచనా. ఇప్పటి వరకు భూగర్భంలో ఉన్న గ్రానైట్‌లో 30 శాతం గనుల ద్వారా వెలికితీయగా.. రానున్న 30 ఏళ్ల అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కరువు జిల్లాలో కనకవర్షం... ఒకప్పుడు ప్రకాశం జిల్లా కరువుకు పెట్టింది పేరు. అలాంటి జిల్లా నేడు పారిశ్రామిక కేంద్రంగా మారిందంటే దానికి చీమకుర్తి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ కారణం. అప్పట్లో ఎందుకూ పనికి రాదనుకున్న రామతీర్థం పరిసరాల్లోని భూమి నేడు ఎకరం రూ.3 నుంచి రూ.4 కోట్లకు పైనే పలుకుతోంది. చీమకుర్తితో పాటు ఒంగోలు శివారులో నున్న పేర్నమిట్ట ఎస్టేట్, సంతనూతలపాడు, మార్టూరు, గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్ తదితర ప్రాంతాల్లో 1650 గ్రానైట్ ఫ్యాక్టరీలు వెలిశాయి. వీటిలో ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తోంది. రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, తమిళనాడు, యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ వంటి పలు రాష్ట్రాల కార్మికులు ఇక్కడి పరిశ్రమలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆదుకున్న వైఎస్... 2008లో ఆర్థిక మాంద్యం కారణంగా గ్రానైట్ గనుల లీజుదారులు తీవ్రంగా నష్టాల బారిన çపడ్డారు. 2009లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్పందించి లీజుదారులు చెల్లించాల్సిన రాయల్టీలో మొదటి సంవత్సరం 40 శాతం, రెండో సంవత్సరం 20 శాతం రాయితీని ప్రకటిస్తూ జీఓ నంబర్లు 104, 105 ను జారీ చేశారు. దాంతోనే తాము ఒడ్డున పడ్డామని చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమల యజమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. బ్లాక్ గెలాక్సీ.. పేరెలా వచ్చిందంటే చీమకుర్తి పరిసర ప్రాంతాల్లోని వందల ఎకరాల్లో గ్రానైట్ ఉన్నట్లు 1983లో బయటపడింది. 1985లో మైనింగ్ లీజుకు తీసుకున్న జూబ్లీ గ్రానైట్ యజమాని నన్వాని వెలికి తీసిన గ్రానైట్‌ను మార్కెటింగ్ కోసం చైనా తీసుకెళ్లారు. నల్లని బండపై నగిషీలు అద్దినట్టున్న ఆ గ్రానైట్‌కు బ్లాక్ గెలాక్సీ అని పేరుపెట్టారు. దాని డిమాండ్‌ను గుర్తించిన చైనా అధునాతన కటింగ్ మిషన్లతో పెద్దఎత్తున యూనిట్లను నెలకొల్పింది. రూ.11,015 ఆదాయంతో మొదలు రామతీర్థం పరిసరాల్లో గ్రానైట్ ఉన్నట్లు గుర్తించిన అనంతరం మొట్టమొదటి సారిగా 8.094 హెక్టార్లలో ఒకే ఒక లీజుతో రాయల్టీ ద్వారా రూ.11,015 ఆదాయం వచ్చినట్లు ఒంగోలు భూగర్భ గనుల శాఖాధికారుల వద్దనున్న గణాంకాలు చెబుతున్నాయి. 2013లో రాయల్టీ రూçపంలో ప్రభుత్వానికి రూ.100 కోట్లు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం 1081 హెక్టార్లలో 327 లీజులతో ఏడాదికి రూ.566 కోట్ల ఆదాయం రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి వస్తోందని మైన్స్ డీడీ తెలిపారు. జీఎస్టీ, డెడ్రెంట్లు, పెనాల్టీల ద్వారా ప్రభుత్వానికి మరో రూ.200 కోట్లు ఆదాయం వస్తోంది. ఏటా రూ.500– రూ.600 కోట్లు బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.500 నుంచి రూ.600 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. 85 శాతం చైనాకు ఎగుమతి అవుతోంది. గ్రానైట్ రాయి కటింగ్‌కు, పాలిషింగ్‌కు ఉపయోగించే మిషనరీ, డైమండ్ కట్టర్లు, సెగ్మెంట్లు అన్నీ చైనా లో పెద్దఎత్తున అభివృద్ధి చేసి యూనిట్లు స్థాపించారు. కొన్నేళ్లుగా మన పారిశ్రామికవేత్తలు చైనా నుంచి మిషనరీ దిగుమతి చేసుకుని ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. – బి.జగన్నాథరావు, మైన్స్ డీడీ, ఒంగోలు చైనా మార్కెట్‌తోనే డిమాండ్ చీమకుర్తిలోని బ్లాక్ గెలాక్సీ గ్రానైట్‌కు చైనాలో మంచి డిమాండ్ ఉంది. మొట్టమొదటి సారిగా గెలాక్సీ గ్రానైట్‌ను నేనే చైనాకు తీసుకుపోయి మార్కెటింగ్ చేశాను. ఆ తర్వాత మరో రెండు కంపెనీలు నాతో కలిసి వ్యాపారం చేశాయి. క్వారీలు పెరిగాక ఎగుమతి కూడా భారీగా పెరిగింది. – ఎల్.టి.నన్వాని, జూబ్లీ గ్రానైట్ యజమాని స్లాబ్ సిస్టంతో మంచి రోజులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల చీమకుర్తి వచ్చినప్పుడు స్లాబ్ సిస్టం అమలు చేస్తున్నట్లు చెప్పి, ఆమేరకు జీఓ ఇచ్చారు. ఈ విధానం వల్ల ఫ్యాక్టరీల యజమానులకు నిర్ణీత ధరకు రాయి దొరుకుతోంది. విద్యుత్ చార్జీలపై యూనిట్‌కు రూ.2 రాయితీ వల్ల చాలా కలిసి వస్తుంది. మొత్తం మీద ఫ్యాక్టరీల యజమానులకు నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రయోజనం కలుగుతుంది. – యర్రంనేని కోటేశ్వరరావు, ఫ్యాక్టరీ అసోసియేషన్ ప్రెసిడెంట్, గుండ్లాపల్లి -
CM YS Jagan: ఏడాదిలో వెలిగొండ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టును 2023 సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల ప్రజల ఈ చిరకాల కోరికను తీర్చాకే 2024లో ఎన్నికలకు వెళతామని అన్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తిలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఆమె తనయుడు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఏర్పాటు చేసిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి (బీఎస్సార్)ల కాంస్య విగ్రహాలను బుధవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం బూచేపల్లి ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి 18.80 కిలోమీటర్ల మొదటి టన్నెల్, 18.78 కిలోమీటర్ల రెండో టన్నెల్ పనులను 2014కు ముందు నాన్నగారు ఉరుకులు, పరుగులు పెట్టించారని తెలిపారు. 2014 వరకు మొదటి టన్నెల్‌ను ఏకంగా 11.58 కి.మీ పూర్తి చేశారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్ల పాలనలో మొదటి టన్నెల్‌ను కేవలం 4.33 కి.మీ. మాత్రమే తవ్వాగా, మనం అధికారం చేపట్టిన రెండేళ్లలోనే 2.89 కిలో మీటర్లు తవ్వి పూర్తి చేశామని చెప్పారు. రెండో టన్నెల్ పనులు 2014 వరకు 8.74 కిలో మీటర్లు తవ్వితే, చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కేవలం 2.35 కిలో మీటర్లు మాత్రమే తవ్వి, చేతులు దులుపుకున్నారన్నారు. మన ప్రభుత్వం వచ్చాక రెండో టన్నెల్‌ను ఇప్పటికే 3.71 కిలో మీటర్లు పూర్తి చేశామని, ఇక మిగిలిన 3.96 కి.మీలు కూడా 2023 సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళతామని, ఈ ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లా రూపు రేఖలన్నీ సమూలంగా మారిపోతాయని అన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సభలో ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్ మంచి చేసే మనుషులు చిరస్థాయిగా ఉంటారు ► మంచి చేసే మనుషులు చనిపోయినా, చిరస్థాయిగా మనస్సుల్లో నిలిచి ఉంటారు. మంచి చేసిన వారికి చావు ఉండదు. ఒకవైపు నాన్నగారు.. మరో వైపు సుబ్బారెడ్డి అన్న.. ఇలాంటి నాయకులను ఎవరూ మరిచిపోలేరు. – గాంధీ, అంబేడ్కర్, మహాత్మా పూలే, జగ్జీవన్ రామ్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, మహానేత వైఎస్సార్.. ఇలాంటి వారందరినీ కలకాలం తలుచుకుంటూ ఉంటాం. ఎందుకంటే వీరి శరీరాలకు మరణం ఉంటుందేమో కానీ, వీరు చేసిన మంచి పనులకు, వీరి భావాలకు ఎప్పటికీ మరణం ఉండదు. వీళ్లంతా తెలుగు నేల మీద గుర్తుండిపోయే శిఖరాలు. ► నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా ఎప్పటి నుంచో నా తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ చాలా సందర్భాల్లో అడిగారు. నాన్నగారి విగ్రహంతోపాటు, ఆయనతో కలిసి అడుగులు వేసిన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి (శివప్రసాదరెడ్డి నాన్న) గారి విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ► రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏప్రిల్ 14న ఆవిష్కరించనున్నాం. ఆ అడుగులు మరచిపోలేం ► రైతులకు ఉచిత విద్యుత్ అన్నప్పుడు.. కుయ్.. కుయ్ అని అంబులెన్స్ శబ్ధం విన్నప్పుడు, ఆరోగ్యశ్రీ అన్నప్పుడు మనకు ఆ దివంగత మహానేతే గుర్తుకు వస్తారు. ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పినప్పుడు.. కొందరు తీగలు చూపి, బట్టలు ఆరేసుకునేందుకే అవి పనికొస్తాయని ఎద్దేవా చేశారు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అట్టడుగున ఉన్న పేద వారు నిజంగా జీవితంలో పైకి రావాలంటే ముఖ్యమైనది చదువు మాత్రమే. పేదల పిల్లలు చదువుకోవాలని ఆ మహానేత తపించారు. అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చారు. లక్షల కొద్దీ ఇళ్ల నిర్మాణం, జల యజ్ఞం.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియతమ నేత రాజశేఖరరెడ్డి వేసిన అడుగులు ఇప్పటికీ మరిచిపోలేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. ► అలా మంచి చేసిన రాజశేఖరరెడ్డి కొడుకుగా, మీ బిడ్డగా జగన్ నాలుగు అడుగులు ముందుకు వేస్తాడని మాట ఇస్తున్నా. మీ చల్లని దీవెనలతో ఎన్నికలప్పుడు చెప్పిన హామీలలో 95 శాతం పూర్తి చేశాం. మీ చిరునవ్వులు, మీ ఆప్యాయతలు పంచి పెడుతున్న ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, సోదరుడికి, స్నేహితునికి, మిత్రునికి, అవ్వకు, తాతకు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు. గ్రానైట్ పరిశ్రమకు భరోసా ► స్టోన్ కటింగ్ మిషన్లకు సంబంధించి చిన్న చిన్న యాజమాన్యాల కింద పది మందికి పైగా పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. నా పాదయాత్ర సమయంలో వారి కష్టాలు చెప్పుకున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను నా దృష్టికి తీసుకొచ్చారు. ఆరోజు నేను ఏదైతే చెప్పానో.. ఆ విధంగా మళ్లీ స్లాబ్ సిస్టమ్ విధానాన్ని తీసుకొచ్చాను. ఈరోజు ఇక్కడకు వచ్చే ముందే జీవో నంబరు 58 విడుదల చేశాం. ► నాన్న గారి హయాంలో తీసుకొచ్చిన ఈ స్లాబ్ పద్ధతిని 2016లో చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో చిన్న చిన్న గ్రానైట్ పరిశ్రమలు కష్టాల్లో కూరుకుపోయాయి. అందుకే దాదాపు ఏడు వేల యూనిట్లకు లబ్ధి చేకూరేలా జీవో 58 తీసుకొచ్చాం. ► ప్రకాశం జిల్లాలో గెలాక్సీ గ్రానైట్ ఎక్కువగా ఉంటుంది. 22 క్యూబిక్æ మీటర్ల ముడి గ్రానైట్ ప్రాసెస్ యూనిట్లకు సింగిల్ బ్లేడ్‌కు రూ.27 వేలు, మల్టీ బ్లేడ్‌కు రూ.54 వేలు నెలకు ఇచ్చేలా సీనరేజ్ స్లాబు నిర్ణయించాం. శ్రీకాకుళం, రాయలసీమ జిల్లాల్లో సింగిల్ బేŠల్డ్కు రూ.22 వేలు, మల్టీ బ్లేడ్‌కు రూ.44 వేల సీనరేజ్ స్లాబ్ నిర్ణయించాం. ► ఇలా స్లాబ్ విధానం అమలు చేయడం వల్ల మన ప్రభుత్వానికి రూ.135 కోట్లు నష్టం వాటిల్లితుందని తెలిసినా, మీ బాగు కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ప్రకటించిన కొత్త విధానం వల్ల చిన్న చిన్న గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు స్పీడ్ అందుకుంటాయి. వాటికి అనుబంధంగా రవాణా, మార్కెట్ రంగాల్లో అవకాశాలు మెరుగుపడి కార్మికులకు మేలు జరుగుతుంది. విద్యుత్ యూనిట్‌కు రూ.2 రాయితీ ► గ్రానైట్ పరిశ్రమకు విద్యుత్ చార్జీలు తగ్గిస్తున్నాను. దీంతో చిన్న చిన్న పరిశ్రమలు సైతం పుంజుకుంటాయి. చిన్న చిన్న గ్రానైట్ పరిశ్రమలకు చంద్రబాబు ప్రభుత్వం యూనిట్‌కు హెచ్టీకి రూ.6.30, ఎల్టీకీ యూనిట్ రూ.6.70 చొప్పున వసూలు చేసేది. ఆ చార్జీల్లో ఇక మీదట నుంచి ప్రతి యూనిట్‌కు రూ.2 రాయితీ ప్రకటిస్తున్నా. అటు స్లాబ్ సిస్టం అమలు చేయటం, ఇటు విద్యుత్ యూనిట్లలో రాయితీలు ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. అయినా పరిశ్రమల అభివృద్ధి, కార్మికుల ప్రయోజనం దృష్ట్యా ఈ నిర్ణయం సరైనదేనని భావించాను. ► విద్యుత్ రాయితీ వల్ల ఏకంగా ప్రభుత్వానికి రూ.210 కోట్లు భారం పడుతుంది. మరో వైపు సీనరేజ్ మార్పు వల్ల రూ.135 కోట్ల భారం పడుతుంది. వెరసి రెండింటి మీద దాదాపు రూ.350 కోట్లు భారం పడుతుంది. ఈ రోజు నుంచి ఈ రెండూ అమలులోకి వస్తాయి. జెడ్పీ భవనం కోసం రూ.20 కోట్లు ► ఒంగోలులో కొత్త జిల్లా పరిషత్ కార్యాలయం భవనం శిథిలావస్థకు చేరిందని.. రూ.20 కోట్లు మంజూరు చేయాలని.. ఇక్కడకు వచ్చేటప్పుడు జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ అడిగారు. రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నాను. తాళ్లూరు మండలం శివరామ్పురంలోని మొగిలిగుండాల చెరువును మినీ రిజర్వాయర్‌గా మార్చే పనిని చేపట్టాం. ఆ అమ్మ కోరిక మేరకు ఈ సందర్భంగా ఆ రిజర్వాయర్ పేరును బూచేపల్లి సుబ్బారెడ్డి మినీ రిజర్వాయర్‌గా మారుస్తూ ఆదేశాలు ఇచ్చాం. ► మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర బాబు, కనిగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బుర్రా మధుసూదన్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎక్కడున్నావు రాజశేఖరన్నా.. ఒంగోలు సబర్బన్:ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్న ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం చీమకుర్తి సభలో బుధవారం నవ్వుల.. పువ్వులు విరిశాయి. బూచేపల్లి సుబ్బారెడ్డి సతీమణి, ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ.. డాక్టర్ వైఎస్సార్‌పై స్వయంగా రాసిన పాటను వినిపించారు. ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ.. ‘ఎక్కడున్నావు రాజశేఖరన్నా.. మళ్లెప్పుడొస్తావు రాజశేఖరన్నా.. ఏమైపోయావు రాజశేఖరన్నా.. మంచి మనసున్న రాజశేఖరన్నా.. చందమామ రూపున్న వాడా.. మా కుటుంబానికి ఆత్మీయ సోదరుడా’ అంటూ భావోద్వేగంతో పాట పాడారు. సీఎం వైఎస్ జగన్ ఆమె వద్దకు వచ్చి.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని తను ఆశీనులైన కుర్చీ వద్దకు తోడ్కొని వెళ్లాడు. ఈ దృశ్యం చూసిన వారు కరతాళ ధ్వనులు చేస్తూ మనసారా నవ్వుకున్నారు. -
సీఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటన (ఫొటోలు)
-
చీమకుర్తి సభలో సరదా సన్నివేశం
సాక్షి, ప్రకాశం: సీఎం జగన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న చీమకుర్తి విగ్రహావిష్కరణ సభలో సరదా సన్నివేశం జరిగింది. జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రసంగ సమయంలో.. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం.. ఆమె మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఉద్దేశిస్తూ.. పాట పాడడంతో అభిమానుల కోలాహాలం నెలకొంది. అయితే సభా సమయం మించి పోతుండడంతో ఆమెను వచ్చి కూర్చోవాలంటూ సైగ చేశారు సీఎం జగన్. అయినా ఆమె వినిపించుకోకపోవడంతో.. స్వయంగా ఆయనే వెళ్లి అమ్మా అని పిలుచుకునే వెంకాయమ్మను వెంటపెట్టి తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. -
ఇద్దరు మహానుబావుల విగ్రహాలు ఆవిష్కరించడం సంతోషంగా ఉంది
-
రాజన్న అంటూ పాట పాడిన బూచేపల్లి వెంకాయమ్మ
-
మహనీయులకు మరణం ఉండదు: సీఎం జగన్
సాక్షి, ప్రకాశం: మంచి చేస్తే మనిషికి మరణం ఉండదని, ప్రతీ గుండెలోనూ సజీవంగా నిలిచే ఉంటారనడానికి నిదర్శనం ఇవాళ జరిగిన విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమమే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చీమకుర్తిలో మహానేత వైఎస్సార్, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణ అనంతరం.. బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పేదల సంక్షేమం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వైఎస్సార్. రైతుల సంక్షేమం, ఉచిత విద్యుత్, ఫీజు రీయంబర్స్మెంట్, ఆరోగ్యం.. ఇలా ఎంతో మంచి చేశారాయన. ఆయన ఒక అడుగు వేస్తే.. వైఎస్సార్ బిడ్డగా తాను నాలుగు అడుగులు ముందుకు వేస్తానని సీఎం జగన్ మరోసారి వేదిక సాక్షిగా ప్రకటించారు. ఇచ్చినమాట ప్రకారం.. 95 శాతం మేనిఫెస్టో హామీలను ఇప్పటికే నెరవేర్చామని, దేవుడి దయ.. ప్రజల ఆశీస్సులతో మరింత మంచి చేస్తామని సీఎం జగన్ తెలిపారు. మహానేతతో పాటు ఆయనతో అడుగులు వేసిన నేత బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహం కూడా ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్న సీఎం జగన్.. వచ్చే ఏప్రిల్ 14న విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉంటుందని ప్రకటించారు. గాంధీ, అంబేద్కర్, పూలే, అల్లూరి, ప్రకాశం, మహానేత వైఎస్సార్.. ఇలా మహనీయులను కలకాలం ప్రజలు గుర్తుంచుకుంటారు. ఎందుకంటే వీళ్లకు భౌతికంగా మరణం ఉన్నా.. వీళ్లు చేసిన మంచికి, భావాలకు మరణం ఉండదు అనేది వాస్తవమని సీఎం జగన్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం.. చిన్నచిన్న పరిశ్రమలకు మేలు జరిగేలా నిర్ణయాలు అమలు చేయబోతున్నామని సీఎం జగన్ చీమకుర్తి సభా వేదికగా ప్రకటించారు. చిన్న గ్రానైట్ పరిశ్రమలకు కరెంట్ ఛార్జీల్లో రూ.2 తగ్గింపు ఉంటుందన్న సీఎం జగన్ ప్రకటించారు. గ్రానైట్ పరిశ్రమకు కొత్త స్లాబ్ సిస్టమ్ తీసుకురాబోతున్నట్లు తెలిపారాయన. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కోరినట్లు.. ఒంగోలులో శిథిలావస్థలో ఉన్న కొత్త జిల్లా పరిషత్ కార్యాలయం కోసం రూ. 20 కోట్ల మంజూరు చేయడంతో పాటు తుళ్లూరు మండలంలోని శివరాంపురంలో ఉన్న మొగిలిగుండ్ల చెరువును మినీ రిజర్వాయర్ పేరును బూచేపల్లి సుబ్బారెడ్డి రిజర్వాయర్‌గా మారుస్తున్నట్లు ఆదేశాలు జారీ చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఇదీ చదవండి: సంక్షేమం తలుపు తడుతోంది (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో సీఎం వైఎస్ జగన్
-
CM Jagan: చీమకుర్తిలో పర్యటించనున్న సీఎం జగన్
సాక్షి, ప్రకాశం జిల్లా: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 24న చీమకుర్తిలో పర్యటించనున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మలికాగార్గ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఏఎస్పీ నాగేశ్వరరావు ఏర్పాట్ల పరిశీలనలో పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. దానితో పాటు బహిరంగ సభ కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం హెలికాప్టర్ దిగేందుకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు. బూచేపల్లి ఇంజినీరింగ్ కాలేజీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలను పరిశీలించారు. బూచేపల్లి కల్యాణ మండపం పక్కనే చీమకుర్తి మెయిన్‌రోడ్డులో ఇప్పటికే నిర్మాణం పూర్తి కావస్తున్న వైఎస్ రాజశేఖరరెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో బహిరంగ సభ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో అధికారులతో బాలినేని, బూచేపల్లి ఆధ్వర్యంలో సీఎం జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యులు వేమా శ్రీనివాసరావు, క్రిష్టిపాటి శేఖరరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. చదవండి: (సోనియాగాంధీ వద్దకు కోమటిరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి!) -
ప్రేమించి పెళ్లి చేసుకుంది.. భరించలేక భస్మం చేసింది
సాక్షి, చీమకుర్తి (ప్రకాశం): వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక కోర్టు నుంచి విడాకులు కూడా తీసుకుని విడిపోయారు. బంధువులు సర్ది చెప్పటంతో మళ్లీ కలిసి కాపురం చేస్తున్నారు. అయినా తీరు మారని భర్త వేధింపులతో భార్య తట్టుకోలేక లీటర్ పెట్రోల్ తెచ్చి మందు తాగి మత్తులో పడుకున్న భర్తపై పోసింది. అగ్గిపుల్లతో నిప్పంటించి తలుపు గడియ పెట్టి తాళం వేసి పరారైంది. ఇంట్లో నుంచి పొగలు, మంటలు రావడంతో చుట్టుపక్కల వారు ఫైర్‌స్టేషన్‌కు, పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సంతనూతలపాడులో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిపాడు మండలం గాజులపాలెం గ్రామానికి చెందిన క్రిష్టిపాటి మోహన కృష్ణారెడ్డి (31) సంతనూతలపాడులో మద్ది శ్రీనివాసరావు, జ్యోతి దంపతుల కుమార్తె రుక్మిణిని 2011లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. మోహన కృష్ణారెడ్డి అప్పటి నుంచి సంతనూతలపాడులోనే నివాసం ఉంటున్నాడు. ఆ దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. కారు, లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్న కృష్ణారెడ్డి మద్యానికి బానిసై భార్య, కుమారుడిని తరుచూ వేధించేవాడు. అంతే కాకుండా అత్తామామలను కూడా హింసించేవాడు. వేధింపులు తట్టుకోలేక రుక్మిణి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. ఇంట్లో వారు సర్ది చెప్పడంతో ఓర్చుకున్న రుక్మిణి ఆ తర్వాత రోజుల్లో భర్త ఆగడాలు తట్టుకోలేక 2016లో కోర్టు ద్వారా విడాకులు కూడా తీసుకుంది. చదవండి: (భర్త సంసారానికి పనికి రాడని చెప్పి.. జాతరకు వెళ్లి..) కృష్ణారెడ్డి సోదరి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి పెటాకులైన కాపురాన్ని నిలబెట్టింది. అయినా మార్పు లేకుండా రోజూ మద్యం తాగి వచ్చి రుక్మిణిని, కుమారుడిని వేధిస్తున్నాడు. ఆదివారం రాత్రి కూడా భార్య, కుమారుడిని కృష్ణారెడ్డి కొట్టి హింసించాడు. విసిగిపోయిన రుక్మిణి మద్యం తాగి ఇంటికొచ్చి మత్తులో పడుకున్న కృష్ణారెడ్డిపై పెట్రోలు పోసి నిప్పంటించింది. వెంటనే తలుపు గడియపెట్టి తాళం వేసి పరారైంది. పెట్రోల్ పోయడంతో మంటలు వేగంగా వ్యాపించి ఆ మంటల్లో కృష్ణారెడ్డి గుర్తు పట్టలేని విధంగా కాలి బూడిదయ్యాడు. సంతనూతలపాడు ఎస్ఐ బి.శ్రీకాంత్‌తో కలిసి సంఘటన జరిగిన ప్రాంతాన్ని ఒంగోలు డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. రుక్మిణి తల్లిదండ్రులతో పాటు స్థానికులను విచారించారు. ఒంగోలులో ఉంటున్న కృష్ణారెడ్డి సోదరి హారిక ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు: పావు గంటలో.. పని కానిచ్చేశారు!
చీమకుర్తి(ప్రకాశం జిల్లా): ఆ మాల్ వద్దకు ముగ్గురు వచ్చారు. ఒకరు బయట కాపలా ఉన్నారు.. ఇద్దరు లోపలకు వెళ్లారు. క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.4.60 లక్షలు తీసుకున్నారు. అక్కడే డబ్బులు లెక్కేసుకున్నారు. పావు గంటలో పని ముగించేసుకొని గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన దారిలోనే వెళ్లారు. గురువారం తెల్లవారు జామున చీమకుర్తిలోని కర్నూల్ రోడ్డుకు సమీపంలో ఉన్న బీవీఎస్ఆర్ ఫర్నిచర్ మాల్లో ఈ దొంగతనం జరిగింది. షాపు యజమాని సతీష్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ ఆస్పత్రికి సమీపంలో ఉన్న బీవీఎస్ఆర్ ఫర్నిచర్ మాల్ నాలుగంతస్తులు ఉంటుంది. మొదటి అంతస్తులో దొంగతనం జరిగింది. రెండో అంతస్తులో ఫ్రిజ్‌లు, ఏసీలు, మూడో అంతస్తులో జిమ్ నిర్వహిస్తున్నారు. నాలుగో అంతస్తులో షాపు యజమానులు నివాసం ఉంటున్నారు. షాపునకు బయట, షాపు లోపల ఉన్న సీసీ పుటేజీలో ఎంత మంది దొంగలు వచ్చారు. వారు ఎలా దొంగతనం జరిగిందనే విషయాలు పూర్తిగా సీసీ పుటేజీలో రికార్డు అయింది. రోజూలాగే బుధవారం కూడా షాపులో ఫర్నిచర్‌ను అమ్మిన డబ్బులు క్యాష్ కౌంటర్లో ఉంచి దానికి తాళం వేసి రాత్రి పైన నాలుగో అంతస్తులో యజమాని కుటుంబం నిద్రించింది. దొంగతనానికి ముగ్గురు వచ్చినట్లు బయట ఉన్న సీసీ పుటేజీలో రికార్డు అయింది. ఒకరు బయట ఉన్నారు. మిగిలిన ఇద్దరూ మొదటి అంతస్తులో డోర్‌ను చాకచక్యంగా తీశారు. లోపల క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న అద్దాల బాక్స్‌లో అమ్మకానికి తెచ్చన రూ.4 లక్షల విలువ చేసే సెల్ఫోన్ల జోలికి వెళ్లలేదు. యజమాని సెల్‌ఫోన్ రూ.70 వేలు ఉంటుంది. దాన్ని కూడా వారు టచ్ చేయలేదు. అదే అంతస్తులో విలువైన సామగ్రి, రెండో అంతస్తులో విలువైన ఫ్రిజ్‌లు, ఏసీలు కూడా ఉన్నాయి. వాటిలో వేటిని తీసుకోకుండా కేవలం కౌంటర్లో ఉన్న రూ.4.60 లక్షలు తీసుకున్నారు. అక్కడే లెక్కేసుకున్నారు. వేకువ జామున 3.15 గంటలకు మొదలైన దొంగతనం మొత్తం పావుగంట సమయంలో ముగించేసి వచ్చిన దారిలోనే వెళ్లినట్లు సీసీ పుటేజీలో స్పష్టంగా కనిపిస్తోందని యజమాని పోలీసులకు తెలిపారు. షాపు డోర్ లాక్ చేయకుండా వేలితో లోపల గడిని తీసే విధంగా ఉందని, దాన్ని తెలిసిన వారు తప్ప మిగిలిన వారు తీసే అవకాశం లేదని షాపు యజమాని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. షాపు యజమాని బొమ్మిశెట్టి సతీష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగశివారెడ్డి, క్లూస్ టీమ్ సభ్యులు వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. వేలిముద్రలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: ‘పెళ్లి అంటేనే నాకు ఇష్టం లేదు.. పుట్టింటికి వచ్చేస్తా’ రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి.. -
చులకన భావం; బావమరిదిపై బావలు దాడి
సాక్షి చీమకుర్తి: లెక్కలేని తనం, చులకన భావం, అహంకారం వెరసి నిండు ప్రాణం గాలిలో కలిసింది. మేనల్లుడిని ఒక దెబ్బ కొట్టినందుకు ఇద్దరు బావలు కలిసి బావమరిదిని తలపై ఇనుప పైపుతో బలంగా కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృత్యువాతపడ్డాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సంతనూతలపాడు మండలం గుమ్మనంపాడుకు చెందిన తాడి చిరంజీవి (30) తలపై తన బావలు వెలుగు శ్రీనివాస్, కోటిలు ఇనుప పైపు తీసుకొని బలంగా బాదారు. మంగళవారం సాయంత్రం ఈ సంఘటన జరగగా రాత్రి ఒంటి గంట సమయంలో ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ దాసరి రాజారావు తెలిపారు. మృతదేహాన్ని సీఐ సుబ్బారావు, ఎస్ఐ రాజారావు పరిశీలించారు. మృతుడి భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: ప్రియుడి మోసం.. నర్సు ఆత్మహత్య చదవండి: ‘నన్ను చూసి నవ్వుతావంట్రా.. ఎంత ధైర్యంరా నీకు’ గాయపడిన సాయి మణికంఠ సాక్షి, అద్దంకి : ఉన్న సమస్యను కూర్చొని మాట్లాడుకుందాం..అంటూ పిలిపించి యువకుడిపై కత్తితో దాడి చేశారు. ఆ యువకుడు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ సంఘటన పట్టణంలోని బస్టాండ్ సెంటర్ సమీపంలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జె.పంగులూరుకు చెందిన గుంజి సాయి మణికంఠ హైదరాబాద్‌లో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పాలెపు శ్రీను కుమార్తె తనను ప్రేమించమంటూ సాయి మణికంఠ వెంట పడేది. ఆమె పదే పదే అలాగే చేస్తుండటంతో అతడు ఆమె తండ్రితో విషయం చెప్పి కుమార్తెను జాగ్రత్త చేసుకోమని కోరాడు. శ్రీను కుమార్తె అదే పనిగా మళ్లీ మణికంఠకు ఫోన్లు చేస్తోంది. కుమార్తెకు నచ్చజెప్పినా వినక పోవడంతో ఆమె తండ్రి హైదరాబాద్‌లో ఉన్న సాయి మణికంఠను ఊరికి రమ్మని కోరాడు. వస్తే తమ కుమార్తె విషయం మాట్లాడాలని చెప్పి పిలిపించాడు. యువకుడు అద్దంకి బస్టాండ్ వద్దకు రాగానే శ్రీను పథకం ప్రకారం కత్తితో దాడి చేశాడు. హఠాత్ పరిణామానికి భీతిల్లిన మణికంఠ బతుకు జీవుడా అంటూ పారిపోయి ఓ చోట దాక్కుని ప్రాణాలు దక్కించుకున్నాడు. తేరుకున్న తర్వాత 108కి ఫోన్ చేశాడు. 108 సిబ్బంది వచ్చి క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు. -
కళ తప్పిన గెలాక్సీ
► గ్రానైట్ వ్యాపారానికి గడ్డుకాలం ► అంతర్జాతీయ మార్కెట్లో గెలాక్సీకి తగ్గిన గిరాకీ ► అలవెన్సులలో కొట్టుకుపోతున్న యజమానుల లాభాలు ►ప్రభుత్వానికి మాత్రం రాయల్టీ రాబడి రెట్టింపు చీమకుర్తి రూరల్: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గెలాక్సీ గ్రానైట్‌కు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ తగ్గింది. 15 ఏళ్ల క్రితం పది పన్నెండు దేశాలకు ఎగుమతయ్యే గెలాక్సీ గ్రానైట్‌కు ఇప్పుడు చైనా ఒక్కటే దిక్కయింది. డిమాండ్ తగ్గటంతో చైనా కూడా సగానికి సగం ఉచితంగా ఇస్తానంటేనే కొనుగోలు చేస్తామని మెలిక పెడుతోంది. ఒక క్యూబిక్ మీటరు గ్రానైట్ కొనుగోలు చేస్తే మరో క్యూబిక్ మీటరు రాయిని ఉచితంగా ఇవ్వాలి. ఇలాగైతేనే గ్రానైట్‌ను కొంటామని కొర్రీలు వేస్తుండటంతో చేసేది లేక చీమకుర్తి మండలంలోని రామతీర్థంలో ప్రసిద్ధి చెందిన గ్రానైట్ క్వారీల్లో వ్యాపారాలు కళతప్పాయి. చైనాకు అమ్మినదానిలో సగానికి మాత్రమే ఆదాయం వస్తోంది. మిగిలిన సగం రాయిని ఉచితంగానే ఇవ్వాల్సి వస్తోందని గ్రానైట్ యజమానులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఒక క్యూబిక్ మీటరు కొనుగోలు చేస్తే కూబిక్ మీటరుకు చుట్టుపక్కల అదనంగా రెండు మూడు అంగుళాల కొలతలలో అలవెన్స్ రూపంలో ఉచితం ఇచ్చేవారు. డిమాండ్ తగ్గేకొద్దీ క్యూబిక్ మీటరుకు మరో క్యూబిక్ మీటరు ఫ్రీగా ఇవ్వాల్సి రావడంతో గ్రానైట్ యజమానులు అమ్మినదానిలో సగం రాయికే ఆదాయం వస్తుందంటున్నారు. ప్రభుత్వానికి రెట్టింపు రాయల్సీ రాబడి..: గ్రానైట్ యజమానులకు ఆదాయం తగ్గినా ప్రభుత్వానికి మాత్రం రాయల్టీలో డబుల్ ఇన్‌కం వస్తోంది. ఎగుమతి చేసే రాయిలో అలవెన్స్‌ల కింద ఉచితంగా ఇచ్చే రాయికి కూడా రాయల్టీ లెక్కగట్టటమే ఇందుకు కారణం. ఒక గ్రానైట్ యజమాని నెలకు వెయ్యి క్యూబిక్ మీటర్లు ఎగుమతి చేస్తే దానిలో మరో వెయ్యి క్యూబిక్ మీటర్లును ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. దాని వలన గ్రానైట్ యజమానికి వెయ్యి క్యూబిక్ మీటర్లకే బయ్యరు డబ్బులు చెల్లిస్తారు. కాని గ్రానైట్ యజమాని మాత్రం రెండు వేల క్యూబిక్ మీటర్లుకు రాయల్టీ చెల్లించాల్సి వస్తోంది. దానితో ప్రభుత్వానికి రాయల్టీలో రాబడి రెట్టింపయింది. క్వారీలపై భారం మీద భారం..: ఇప్పటికే గ్రానైట్ ఎగుమతులలో అలవెన్సుల భారం కుంగదీస్తుంటే ఇది చాలదన్నట్లుగా ఇటీవల రాయల్టీ పెంచటం, డీఎంఎఫ్ అదనపు పన్నును విధించటం గ్రానైట్ యజమానులను మరింత భారంగా మారింది. 2015 నవంబర్లోనే రాయల్టీని 30 శాతం పెంచగా డీఎంఎఫ్ పేరుతో మరో 30 శాతం పన్ను విధించారు. గ్రానైట్ యజమానులు, ఫ్యాక్టరీ యజమానుల విజ్ఞప్తి మేరకు ఇటీవలే డీఎంఎఫ్‌ను 30 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించటంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది. గత మూడేళ్ల ఎగుమతులు, రెవెన్యూ లాభాలపై మైన్స్ ఏడీ కార్యాలయం నుంచి సేకరించిన పీసీçల్లిగణాంకాలను పరిశీలిస్తే .. మొదటి రెండేళ్లతో పోల్చుకుంటే 2016–17 జనవరి 31 నాటికే మొదటి రెండేళ్ల ఆదాయాన్ని ప్రభుత్వం రాబట్టుకుంది. ఇక మిగిలిన రెండు నెలలు కాలంలో వచ్చే ఎగుమతులు, ఆదాయం చూస్తే గత మూడేళ్ల కంటే ఎక్కువుగానే ఉన్నట్లు కనిపిస్తోంది. -
సాగుకు చివరి వరకు నీరు అందించేనా ?
చీమకుర్తి : దుక్కి దున్నటం, దమ్ముచేయటం కానేలేదు. వరినాట్లు వేసుకోవడం ఇంకా పూర్తికాలేదు. అప్పుడే సాగర్ కాలువలపై వారబందీ విధానం అమలు చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు ఆకస్మికంగా ప్రకటించడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత సోమవారం నుంచి వారబందీ విధానం అమలు చేస్తున్నట్లు ఇరిగేషన్ చీమకుర్తి డివిజన్ ఈఈ ప్రకటించిన సంగతి తెలిసిందే. వారబందీ విధానంలో రామతీర్థం రిజర్వాయర్‌కు దిగువనున్న మేజర్లకు మూడు రోజులు, ఎగువ నున్న మేజర్లకు మూడు రోజులు సాగర్ నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. దాని వలన నీటిని నిలిపేసిన మూడురోజుల పాటు వరినాట్లు వేసుకునే ందుకు, దమ్ముచేసుకునే భూములకు సాగునీరు అందక ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వరినాట్లు పూర్తయ్యాక ఎప్పుడో డిసెంబర్ నెలాఖరులోనో లేక జనవరి నెలలోనో సాగర్‌లో నీటి మట్టం తగ్గడం, రామతీర్థం రిజర్వాయర్‌లో నీటి మట్టాలు పడిపోతే వారబందీ విధానం అమలు చేయటం సర్వసాధారణం. కానీ ప్రస్తుతం సాగర్‌లో నీటిమట్టం పుష్కలంగా ఉంది. పైగా సాగర్ కాలువ ప్రారంభమైన మొదటి నుంచి వారబందీ విధానం అమలు చేయకుండా కేవలం ఓబీసీ బీద 0/0 మైలు వద్ద చీమకుర్తి డివిజన్‌లోనే విధించడంతో రిజర్వాయర్ పరిధిలోని రైతులు మాత్రమే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వచ్చాయి. సాగర్ ప్రారంభం నుంచి వచ్చే సాగర్ జలాలను గుంటూరు, పమిడిపాడు బ్రాంచ్ కాలువలకు జిల్లా సరిహద్దు 85/3వ మైలుకు పైభాగంలో రైతులు ఎంచక్కా వాడుకుంటుంటే ఓబీసీ ప్రారంభం 0/0 మైలు వద్ద నుంచి దిగువనున్న వారికి మాత్రమే వారబందీ విధానం ఎందుకు అమలు చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. వారబందీ ఇలా... ఓబీసీ మీద రామతీర్థం రిజర్వాయర్‌కు ఎగువనున్న కరవది మేజరు, బూదవాడ, లక్కవరం, నిప్పట్లపాడు, కొర్లమడుగు వంటి 38 మేజర్లు, మైనర్లు, డీపీల ద్వారా గురువారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మాత్రమే సాగర్ నీటిని అం దిస్తారు. ఆ సమయంలో రిజర్వాయర్‌కు దిగువనున్న మేజర్లకు నీటిని పూర్తిగా నిలిపేస్తారు. అదే విధంగా సోమవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు రామతీర్థం రిజర్వాయర్‌కు దిగువనున్న కారుమంచి మేజర్, చీమకుర్తి-1, 2 మేజర్లు, మైలవరం, అగ్రహారం, త్రోవగుంట, చిలకపాడు, కొప్పోలు, ఈతముక్కల వంటి 40 మేజర్లకు సాగర్ నీటిని అందిస్తారు. అదే సమయంలో పైనున్న మేజర్లకు నీటిని నిలిపేయాలి. దిగువ రైతులకు అన్యాయం... రిజర్వాయర్‌కు దిగువనున్న మేజర్లకు నీటిని నిలిపేయాల్సి వచ్చిన ప్పుడు రిజర్వాయర్ నుంచి రావాలి కాబట్టి నీటిని పూర్తిగా ఆపేసే అవకాశం ఉంది. కానీ ఎగువనున్న మేజర్లకు నిలిపేయాల్సి వచ్చినప్పుడు ఆయా మేజర్ల మీదుగా రిజర్వాయర్‌లోకి రావాలే తప్ప రిజర్వాయర్ నుంచి ఎగువనున్న మేజర్లకు నీటి విడుదల ఉండదు. అలాంటప్పుడు కాలువల్లో వచ్చే నీటిని వారబందీ సమయంలో మేజర్లలో ఒక్కో తూము వద్ద రాత్రి, పగలనే తేడా లేకుండా అధికారులు కాపలా ఉండి నీటిని ఆపడం సాధ్యం కాదు. ఇలా వారబందీ విధానంలో రిజర్వాయర్‌కు దిగువనున్న వారికే అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. -
డీజిల్ డ్రమ్ములకు మంటలు
చీమకుర్తి : ఓ ఇంట్లో నిల్వ ఉంచిన డీజిల్ డ్రమ్ములు ఉన్నట్టుండి పేలాయి. గాలిలో తేలుతూ పల్టీలు కొట్టాయి. ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. ఫలితంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారు భయంతో బయటకు పరుగులు తీసి క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన చీమకుర్తి నడిబొడ్డున బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగింది. వివరాలు.. పాడి ఆంజనేయులు అనే వ్యక్తి గ్రానైట్ క్వారీలకు చెందిన టిప్పర్లు, ట్రాలీల నుంచి అక్రమంగా డీజిల్ సేకరిస్తుంటాడు. అనంతరం డ్రమ్ముల్లో నిల్వ చేసి అడ్డదారిలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటుంటాడు. పాలపర్తి ప్రభుదాస్ అనే వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకొని దానిలో డీజిల్ డ్రమ్ములు నిల్వ ఉంచాడు. ఆంజనేయులు వద్ద మస్తాన్(45)తో పాటు మరో 15 మంది పని చేస్తుంటారు. వీరు డీజిల్‌ను సేకరించి డ్రమ్ముల్లోకి మారుస్తూ ఉంటారు. డీజిల్ డ్రమ్ములు నిల్వ చేసే ఇంట్లో మస్తాన్‌తో పాటు ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. డీజిలే కాకుండా తక్కువ మోతాదులో పెట్రోలు కూడా నిల్వ ఉంచినట్లు సమాచారం. డీజిల్‌ను వేరే డ్రమ్ముల్లోకి మార్చే సమయంలో సిగరెట్ కాలుస్తుండటంతో ప్రమాదవశాత్తూ మంటలు డీజిల్, పెట్రోల్‌కు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు ఇంటి నిండా వ్యాపించాయి. అదే సమయంలో ఇంట్లో డీజిల్‌ను మార్చే ఇద్దరితో పాటు మస్తాన్ భార్య, ఇద్దరు పిల్లలు భయంతో బయటకు పరుగులు తీశారు. మస్తాన్ మాత్రం మంటల్లో చిక్కుకొని కాలి బూడిదయ్యాడు. ఒక్కసారిగా మంటలు పెద్దవి కావడంతో డీజిల్ డ్రమ్ములు పెద్దగా పేలి గాలిలో పల్టీలు కొట్టాయి. చుట్టుపక్కల వందలాది మంది జనం సంఘటన స్థలానికి చేరుకుని భయంతో వణికిపోయారు. తహశీల్దార్ పి.మధుసూదన్‌రావు, ఎస్సై నాగరాజులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇంతలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. అడిషనల్ ఎస్పీ రామానాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. -
టీడీపీ పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించింది
ఎస్‌ఎన్‌పాడులో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి తానేనన్న సాంబయ్య చీమకుర్తి, న్యూస్‌లైన్ : సంతనూతలపాడులో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని తానేనని దారా సాంబయ్య ప్రకటించుకున్నారు. చీమకుర్తిలోని ఎన్ఎస్పీ కాలనీలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సాంబయ్య.. ప్రచార రథానికి ఒక వైపు బీజేపీ జెండాలు, మరో వైపు టీడీపీ జెండాలు ఏర్పాటు చేశారు. వాహనం బంపర్‌పై మోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబు ఫొటోలు ఉంచి ఎన్నికల ప్రచారం సాగించడంతో టీడీపీ నేతలు అయోమయంలో పడ్డారు. పొత్తులో భాగంగా టీడీపీ వారు సంతనూతలపాడును బీజేపీకి కేటాయించారు, అయితే టీడీపీ నేతలు పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించి విజయ్‌కుమార్‌కు అడ్డదారిలో బీ ఫారం ఇచ్చారని సాంబయ్య మండిపడ్డారు. టీడీపీ నేతలు, విజయ్‌కుమార్ రాజకీయాలను వ్యాపారంగా మార్చారన్నారు. ప్రచారంలో బీజేపీ నాయకులు బత్తిని నరసింహారావు, ఎంవీ రమణారావు పాల్గొన్నారు.