వివాహిత ఆత్మహత్య
ముదిగుబ్బ: చిన్నకోట్లకు చెందిన లక్ష్మీదేవి (28)అనే వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... లక్ష్మీదేవి, నాగరాజు దంపతులు ధర్మవరం పట్టణంలో నివాసం ఉంటూ మగ్గం పనులు చేసుకునేవారు. కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న లక్ష్మీదేవి ఇటీవల పుట్టినిల్లు అయిన ముదిగుబ్బ మండలం చిన్నకోట్లకు వచ్చింది. ఆదివారం కడుపునొప్పి భరించలేక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్ఐ రహీం కేసు నమోదు చేసుకున్నారు.