chiranjeevi reddy
-
చిరంజీవి రెడ్డి దంపతులపై కాల్పులు
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని పెనుగొండలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక వ్యాపారి మేడపాటి చిరంజీవి రెడ్డి, ధనలక్ష్మీ దంపతులపై దుండగులు తపంచాతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ధనలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి.ఆమె తలలోకి 28 సైకిల్ ఇనుపగుళ్లు, మేకులు దూసుకెళ్లాయి. వాటిని గుర్తించిన తణుకు వైద్యులు మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. మార్టేరులో వివాహానికి వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు... దంపతులపై కాల్పులు దిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మలుపులు తిరుగుతున్న కాల్పుల వ్యవహారం.. రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారం చేస్తున్న చిరంజీవి రెడ్డి నివాసంపై కస్టమ్స్ అధికారులు దాడులకు దిగారు. ఇంట్లో వ్యక్తులను బయటకు రానివ్వకుండా తలుపులు మూసేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
ఇతడు చిరంజీవి
► తిరుపతి స్విమ్స్‌లో చిరంజీవిరెడ్డి బ్రెయిన్‌డెడ్ ► అవయవదానానికి కుటుంబసభ్యుల అంగీకారం ► గుండె, కాలేయం, మూత్రపిండాలు సేకరించిన వైద్యులు ► హైదరాబాద్ స్టార్ ఆస్పత్రికి గుండె.. ► విశాఖ అపోలోకు కాలేయం తిరుపతి : బ్రెయిన్ డెడ్‌కు గురైన ఓ వ్యక్తి శరీరంలోని అవయవాలను అతని కుటుంబసభ్యులు ఆదివారం దానం చేశారు. నలుగురికి అవయవాలు దానం చేసి ఆ వ్యక్తి చిరంజీవిగా నిలిచాడు. వివరాలు.. తిరుపతి గాంధీపురంలో నివసించే పెద్దపాపమ్మ కుమారుడు బి.చిరంజీవి రెడ్డి(45) నగరంలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. అవివాహితుడైన చిరంజీవి తీవ్రమైన జ్వరం, అనారోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ఈనెల 27న స్విమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న చిరంజీవి శనివారం బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు స్విమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. దీంతో చిరంజీవి అవయవాలు దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. స్విమ్స్ వైద్యులు, జీవన్‌దాన్ ట్రస్ట్ నిర్వాహకులు ఆదివారం మధ్యాహ్నం వరకు దశల వారీ శస్త్ర చికిత్సలు చేసి 4 అవయవాలు తీశారు. అందులోగుండెను హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రికి, కాలేయాన్ని విశాఖలోని అపోలో ఆసుపత్రికి విమానం ద్వారా తరలించారు. ఒక కిడ్నీని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులోని నా రాయణ ఆసుపత్రికి చేర్చారు. మరొక దానిని స్విమ్స్ ఆసుపత్రిలోనే ఓ రోగికి అమర్చారు. చిరంజీవి మృతదేహానికి స్విమ్స్ సి బ్బంది పూ లమాలలు వేసి నివాళులర్పించారు. చిరంజీవి రెడ్డి నుంచి సేకరించిన గుండెను హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో ఓ మహిళకు, కాలేయాన్ని విశాఖ అపోలో మరో వ్యక్తికి ఆదివారం విజయవంతంగా అమర్చారు. మహబూబ్‌నగర్ జిల్లా వట్టివర్లపల్లికి చెందిన పరమేశ్వర్ భార్య విజయలక్ష్మి(36) పదేళ్లుగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ మన్నెం గోపీచంద్‌ను ఆశ్రయించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెకు గుండె మార్పిడి అవసరమని తేలింది. దీంతో దాత కోసం జీవన్‌దాన్‌లో ఆమె పేరు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవిరెడ్డి గురించి తెలుసుకున్న స్టార్ వైద్య బృందం వెంటనే తిరుపతి చేరుకుని గుండెను సేకరించింది. మధ్యాహ్నం 2.15 నిమిషాలకు తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 3.05 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి, అంబులెన్స్‌లో అక్కడి నుంచి ‘గ్రీన్‌చానల్’ద్వారా 15 నిమిషాల్లో స్టార్ ఆస్పత్రికి గుండెను చేర్చింది. అనంతరం వైద్య బృందం విజయవంతంగా విజయలక్ష్మికి గుండెను అమర్చింది. అలాగే విజయవాడకు చెందిన ఓ వ్యక్తి కాలేయ వ్యాధితో బాధపడుతూ విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కాలేయ మార్పిడి అవసరమని తేల్చిన వైద్యులు.. బ్రెయిన్‌డెడ్ అయిన చిరంజీవిరెడ్డి నుంచి కాలేయాన్ని ప్రత్యేక విమానంలో విశాఖ తీసుకొచ్చారు. గ్రీన్ చానల్ ద్వారా అంబులెన్స్‌లో సాయంత్రం 7.25 గంటలకు ఆస్పత్రికి చేర్చి ఆపరేషన్ ప్రారంభించారు. శస్త్రచికిత్స పూర్తయ్యేసరికి 9 నుంచి 10 గంటలు పడుతుందని వైద్యులు తెలిపారు. -
ఒక కిడ్నీ నెల్లూరుకు, మరో కిడ్నీ చెన్నైకి
-
బ్రెయిన్‌డెడ్ కావడంతో అవయవదానం
తిరుపతి మెడికల్ : అనారోగ్యంతో బాధపడుతూ బ్రెయిన్ డెడ్‌కు గురైన ఓ వ్యక్తి శరీరంలోని అవయవాలను అతని కుటుంబ సభ్యులు ఆదివారం దానం చేశారు. తిరుపతి గాంధీపురంలో నివాసం ఉండే పెద్దపాపమ్మకు కుమారుడు బి.చిరంజీవి రెడ్డి(45) ఉన్నాడు. అవివాహితుడైన చిరంజీవి తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తీవ్రమైన జ్వరంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న చిరంజీవిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఈనెల 27న స్విమ్స్‌లో చేర్చారు. అత్యవసర విభాగం నుంచి ఆర్‌ఐసియు విభాగంలో వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్న చిరంజీవికి శనివారం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో చిరంజీవి బ్రెయిన్ డెడ్‌కు గురైనట్టు స్విమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా అవయవదానానికి ముందుకు వచ్చారు. స్విమ్స్ అధికారులు, జీవన్‌దాన్ ట్రస్ట్ నిర్వాహకులు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దశల వారీగా శస్త్ర చికిత్సలు చేసి నాలుగు అవయవాలను తీసుకున్నారు. అందులో గుండెను హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌కు విమానం ద్వారా తీసుకెళ్లారు. లివర్‌ను విశాఖపట్నంలోని అపోలో హాస్పిటల్‌కు విమానం ద్వారా తరలించారు. రెండు కిడ్నీల్లో ఒకటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులోని నారాయణ హాస్పిటల్‌కు, మరొకటి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని ఓ రోగికి అమర్చారు. మరణించినా తన అవయవాలను మరో నలుగురికి దానం చేసిన చిరంజీవి మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, దాత కుటుంబ సభ్యులకు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్, డిప్యూటీ డెరైక్టర్లు ఆదిక్రిష్ణ, డాక్టర్ వెంకటరామరెడ్డి,అవయవ దాన కోఆర్డినేటర్ ప్రసాద్ రెడ్డి, జయశ్రీ,సుదర్శన్, ప్రకాష్‌లు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
చిరంజీవిరెడ్డి బ్రేయిన్డెడ్
తిరుపతి: నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్వీ జూనియర్ కాలేజీ వాచ్మెన్ చిరంజీవిరెడ్డి బ్రేయిన్ ఆదివారం డెడ్ అయింది. అవయవదానం చేసేందుకు చిరంజీవి రెడ్డి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. అతడి గుండెను హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే లివర్ విశాఖకు, ఓ కిడ్నీ నెల్లూరుకు, మరో కిడ్నీ చెన్నైకి తరలించనున్నారు. అందుకోసం అధికారులు చర్యలు చేపట్టారు. ఈ రోజు మధ్యాహ్నం 1.15 గం.లకు చిరంజీవిరెడ్డి గుండెను హైదరాబాద్ తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక కో-కన్వీనర్,చిరంజీవిరెడ్డితో సాక్షి వేదిక
-
సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక కో-కన్వీనర్ చిరంజీవిరెడ్డితో-సాక్షి వేదిక