తిరుపతి: నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్వీ జూనియర్ కాలేజీ వాచ్మెన్ చిరంజీవిరెడ్డి బ్రేయిన్ ఆదివారం డెడ్ అయింది. అవయవదానం చేసేందుకు చిరంజీవి రెడ్డి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. అతడి గుండెను హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
అలాగే లివర్ విశాఖకు, ఓ కిడ్నీ నెల్లూరుకు, మరో కిడ్నీ చెన్నైకి తరలించనున్నారు. అందుకోసం అధికారులు చర్యలు చేపట్టారు. ఈ రోజు మధ్యాహ్నం 1.15 గం.లకు చిరంజీవిరెడ్డి గుండెను హైదరాబాద్ తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.