Chitra Singh
-
నా కష్టసుఖాల్లో ఉన్నది ఆ ఇద్దరే: ఎన్టీఆర్
‘‘నాకు 20 ఏళ్ల నుంచి దేవుడిచ్చిన శక్తి మీరైతే (ఫ్యాన్స్).. నాకు దేవుడిచ్చిన కుటుంబం, నాకు తెలిసిన ఒకే ఒక కుటుంబం మా కీరవాణి, జక్కన్న (రాజమౌళి) కుటుంబం’’ అని హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. చిత్రా శుక్లా, మిషా నారంగ్ కథానాయికలుగా నటించారు. మణికాంత్ దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘మా అబ్బాయిలు అభయ్, భార్గవ్ వారికి ఇష్టం వచ్చిన రంగంలో ఏదైనా సాధించిన రోజు వాళ్ల గురించి నేను మాట్లాడాలంటే ఎంత ఇబ్బందిగానూ, బ్లాంక్‌గానూ ఉంటానో.. నా తమ్ముళ్లు భైరవ, సింహా సాధించిన విజయం, స్థానం గురించి మాట్లాడటానికి మాటలు, పదాలు సమకూర్చుకోలేకపోతున్నా. వాళ్లిద్దర్నీ చూసి ఈరోజు నేనెలా ఫీలవుతున్నానో భవిష్యత్తులో అభయ్, భార్గవ్‌లను చూసి ఇంతే ఆనందపడతానేమో. నా మంచీ చెడుల్లో, కష్ట సుఖాల్లో, నా ప్రతి నిర్ణయం వెనకాల పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ ఉన్న ఒకే ఒక కుటుంబం కీరవాణి, జక్కన్నలదే. ‘తెల్లవారితే గురువారం’ తో మా భైరవ, మా సింహా ఇంకో మెట్టు పైకి ఎదిగాలని, మణికాంత్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఇంకా ఎన్టీఆర్ మాట్లాడుతూ –‘‘వేగంగా పరిగెడుతున్న ఈ పోటీ ప్రపంచంలో పిల్లల్ని ఎలా పెంచాలి అనేది పెద్ద టాస్క్. మనం మంచి పేరెంట్స్ ఎలా అవుతాం అనే డౌట్ నాకు, ప్రణతి (ఎన్టీఆర్ భార్య)కి రోజూ వస్తుంటుంది. ఎలా చేద్దాం అనిపించిన ప్రతిసారీ నాకు గుర్తొచ్చేది ఇద్దరే.. మా శ్రీవల్లి, రమగార్లు. ప్రతి కొడుకు విజయం వెనకాల ఓ తల్లి ఉంటుంది. నా పిల్లలకు మంచి ఉదాహరణలు కాలభైరవ, సింహా, కార్తికేయ. వీళ్ల సక్సెస్‌కి కారణం శ్రీవల్లి, రమగార్లు’’ అన్నారు. డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ –‘‘బయటివారు ఎలా చేశారో ఈజీగా చెప్పేస్తుంటాం.. కానీ ఇంట్లో పిల్లల గురించి చెప్పాలంటే టెన్షన్‌గా ఉంటుంది. మా పిల్లలు బాగానే చేశారనిపిస్తుంటుంది. కానీ ఎలా చేశారన్నది సినిమా చూశాక మీరు చెప్పాలి. కాలభైరవ విషయంలో నాకు టెన్షన్ లేదు. క్లాస్, మాస్ సాంగ్స్ ఇరగ్గొట్టేస్తున్నాడు. చిన్నోడు కాబట్టి శ్రీసింహాకి కొంచెం భయం.. మీరు తొందరగా ఆ భయాన్ని పోగొడతారని ఆశిస్తున్నా. ఈ సినిమాని నిర్మాతలు గ్రాండ్‌గా నిర్మించారు.. మొదటి సినిమా అయినా మణికాంత్ బాగా తీశాడు. సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ –‘‘తండ్రులు రెండు రకాలుంటారు.. వారిలో గూగుల్ మ్యాప్ ఫాదర్స్ ఒకరు.. అలా వెళ్లు, ఇలా వెళ్లు అంటూ పిల్లలకు గైడెన్స్ ఇస్తుంటారు. కానీ నేను నా పిల్లల కెరీర్ తొలి నాళ్లలో ఏం చేయాలో చెప్పానంతే.. ఇప్పుడు వారి పనిలో కల్పించుకోవడం లేదు’’ అన్నారు. ‘‘మీరందరూ వచ్చి మా సినిమా ‘అదుర్స్’ అంటే చాలు’’ అన్నారు మణికాంత్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరిని కోల్పోయా: ఎన్టీఆర్ -
‘మీ భార్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’
‘గజల్ కింగ్’గా పేరుగాంచిన ప్రఖ్యాత గాయకుడు, సంగీత దర్శకుడు జగ్జీత్ సింగ్ వర్ధంతి నేడు. భౌతికంగా దూరమైనప్పటికీ.. ‘తుమ్ ఇత్నా జో ముస్కురా రహే హో’ పాటకు గాత్రదానం చేసిన ఆయన.. నేటికీ అభిమానుల మనస్సులో సజీవంగా ఉన్నారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తన శ్రావ్యమైన గొంతుతో ఎంతో మందికి ఊరట కలిగించిన జగ్జీత్ జీవితంలో మాత్రం విషాదఘటనలే ఎక్కువగా ఉండటం విచారకరమైన అంశం. కాగా గురువారం నాటికి జగ్జీత్ తుదిశ్వాస విడిచి ఎనిమిదేళ్లు అయిన సందర్బంగా సగటు అభిమానులతో పాటు.. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయనను స్మరించుకుంటున్నారు. ‘ నా గాయాలను తన గొంతులో పలికించారు. ఆర్త్ సినిమా పాటలు ఇంకా నా గుండెలో నిలిచే ఉన్నాయి. నా జీవితాన్ని సార్ధకం చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ జగ్జీత్ సింగ్‌తో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. 1982లో మహేష్ భట్ దర్శకత్వంలో షబానా అజ్మీ, కుల్‌భూషణ్ కర్బందా, స్మితా పాటిల్, రోహిణి హట్టంగడి తదితర తారాగణంతో తెరకెక్కిన ఆర్త్ సినిమా ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. భర్త వదిలేసిన స్త్రీగా, ఒంటరి మహిళగా షబానా అద్భుత నటనకు.. జాతీయ ఉత్తమ నటి అవార్డును సైతం తెచ్చిపెట్టింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు జగ్జీత్ సింగ్, చిత్రా సింగ్ సంగీతం అందించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే తొలుత జగ్జీత్తో కలిసి పనిచేయడానికి ఇష్టపడని చిత్రా.. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో భార్యగా ఆయన జీవితంలో అడుగుపెట్టడం విశేషం. 1967లో ప్రారంభమైన జగ్జీత్-చిత్రాల పరిచయం క్రమేపీ బలపడి ప్రేమ బంధానికి దారితీసింది. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలకు కలిసి పనిచేసిన వీరు ‘హిట్ పెయిర్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో చిత్రా ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చారట జగ్జీత్. అయితే అప్పటికే తనకు డెబో ప్రసాద్‌తో పెళ్లి కావడం, ఓ కూతురు కూడా ఉండటంతో జగ్జీత్ ప్రేమను ఆమె నిరాకరించారట. భర్తకు దూరంగా ఉన్నంత మాత్రాన మరో పెళ్లి చేసుకోలేనని కరాఖండిగా చెప్పారట. అయితే జగ్జీత్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలాగా తన ప్రయత్నాలు కొనసాగించారట. చిత్ర మీద ఉన్న అమితమైన ప్రేమతో ఏకంగా ఆమె మొదటి భర్త దగ్గరికి వెళ్లి... ‘ నేను మీ భార్యను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను’ అని చెప్పారట. చెప్పినట్లుగానే ప్రసాద్- చిత్ర విడాకులు తీసుకున్న అనంతరం 1969లో జగ్జీత్ ఆమెను పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు చిత్ర మొదటి భర్త కూతురు మోనికాకు కూడా తండ్రిప్రేమ పంచారు. కొడుకు మరణం.. కూతురు ఆత్మహత్య సాఫీగా సాగిపోతున్న సంగీత జంట జగ్జీత్- చిత్రాల జీవితంలో వారి కొడుకు వివేక్ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. 1990లో జరిగిన ఓ కారు ప్రమాదంలో వివేక్(20) దుర్మరణం పాలయ్యాడు. ఈ బాధతో చిత్ర.. సంగీతాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మిక బాటను ఎంచుకున్నారు. జగ్జీత్ కూడా ఏడాది పాటు సంగీతానికి దూరం అయినప్పటికీ.. తన జీవితంలో చోటుచేసుకున్న ఘటనలను సంగీతం రూపంలో ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇక కొడుకు మరణంతో కుంగిపోయిన చిత్ర దంపతులను 2009లో మరో విషాదం వెంటాడింది. తన వైవాహిక జీవితం విఫలమైందనే బాధతో చిత్ర కూతురు మోనికా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో 2011, అక్టోబరు 10న తన 70వ ఏట.. తన భార్య చిత్రను ఒంటరిని చేస్తూ జగ్జీత్ తుదిశ్వాస విడిచి ఆమెను మరింత విషాదంలోకి నెట్టారు. అభిమానులను శోకసంద్రంలో ముంచారు. He made my ‘wounds’ sing. The songs of Arth still resonate in my heart. Thank u for touching my life. 🙏🙏🙏 https://t.co/7h6pYYaXnf — Mahesh Bhatt (@MaheshNBhatt) October 10, 2019 -
సామాజికాంశాలే నేపథ్యంగా..నేటి నుంచి రంగోత్సవ్
న్యూఢిల్లీ: సామాజికాంశాలను కథావస్తువుగా తీసుకొని, దానికి తమ నైపుణ్యాన్ని అద్ది, సమాజాన్ని తట్టి లేపే రంగస్థల ప్రదర్శనలకు నగరం వేదిక కానుంది. ఇక్కడి సాయిరామ్ సెంటర్లో ‘రంగోత్సవ్’ నేటినుంచి ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరగనున్న ఈ ఫెస్టివల్లో రంగ్‌భూమి థియేటర్ గ్రూప్‌కు చెందిన కళాకారులు తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. దయా ప్రకాశ్ సిన్హా రాసిన ‘సామ్రాట్ అశోకా’తో ఉత్సవం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. మిగతా రెండు రోజుల్లో జయవర్ధన్, చిత్రాసింగ్ రాసి, దర్శకత్వం వహిస్తున్న ‘కిస్సా మౌజ్‌పుర్ కా’, ‘హాయ్! హాండ్సమ్’ ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. పతి ప్రదర్శన మైమరపించే అభినయంతో, చక్కని స్టోరీలైన్‌తో ఉంటుందన్నారు. సహజత్వం ఉట్టి పడే పాత్రలు కట్టిపడేయడం ఖాయమని, పలువురి బహుముఖ ప్రతిభకు ఈ ఉత్సవం వేదిక కాబోతోందన్నారు. ఆత్మన్యూనతాభావంతో కుంగిపోయే అశోకుడిని ‘సామ్రాట్ అశోకా’ తొలిరోజు ప్రేక్షకుల ముందుకు తెస్తుందని, ఇంకా ఈ లోకంలోకి అడుగుపెట్టని ఓ ఆడ శిశువు జీవితం భవిష్యత్తులో ఎలా ఉంటుందో ‘కిస్సా మౌజ్‌పుర్ కా’ ప్రదర్శన కళ్ళకు కడుతుందని, ఇది రెండో రోజు ఉంటుందన్నారు. ఇక ఉత్సవంలో చివరిరోజు ప్రదర్శనలోభాగంగా ‘హాయ్! హాండ్సమ్’ ప్రదర్శన ఉంటుందని, సమాజంలో కన్నవారిపట్ల కడుపులో పుట్టిన బిడ్డలే చూపుతున్న వివక్షతను ఈ ప్రదర్శన ప్రేక్షకుల ముందుకు తెస్తుందన్నారు. ‘ప్రేక్షకులు తమ సందేహాలను నేరుగా వ్యక్తం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం. వారి అభిప్రాయా న్ని కూడా కోరతాం. సమాజంలో మార్పు కోసం సలహాలు, సూచనలు తీసుకుంటామ’ని రంగ్‌భూమి కార్యదర్శి జేపీ సింగ్ అన్నారు.