Chlorination
-
తాగునీటి సరఫరాలో జలమండలి నిర్లక్ష్యం
హైదరాబాద్: మహా నగరానికి సురక్షిత తాగునీటి సరఫరాలో జలమండలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నీటి క్లోరినేషన్ నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ లోపం ప్రజలకు ప్రాణ సంకటంగా పరిణమిస్తోంది. ప్రభుత్వం నీటి శుద్ధి చేసేందుకు క్లోరిన్ గ్యాస్‌పై రూ.కోట్లు వెచ్చిస్తున్నా.. ఆచరణ అమలు మేడిపండు చందంగా మారింది. మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి చివరి సర్వీస్ రిజర్వాయర్ వరకు క్లోరినేషన్ నిర్వహణ అంతంత మాత్రంగానే మారింది. ఫలితంగా నీటిలో తగిన మోతాదులో క్లోరిన్ మెయింటెన్ కాకుండానే సరఫరా కావడంతో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నది నుంచి నీరు రిజర్వాయర్‌కు చేరే క్రమంలో మట్టి, ఇతరత్రా వ్యర్థాలు కలిసి వస్తుండటంతో ప్రతి పాయింట్‌కు నీటి శుద్ధి అవసరం ఉంటుంది. క్లోరినేషన్ సరిగా జరగకపోవడంతో రిజర్వాయర్ అడుగు భాగంలో పేరుకుపోయిన మట్టి బ్యాక్టీరియా, ఇకొలి వైరస్‌కు కారణమవుతున్నాయి. మరోవైపు రిజర్వాయర్లలో చేరిన మట్టి క్లోరిన్‌ను తినేస్తోంది. క్లోరినేషన్ చేయకుండా నీరు సరఫరా కావడంతో జనం వాంతులు, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు గురికాక తప్పదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మూడంచెల క్లోరినేషన్ నామమాత్రమేనా? కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు నదుల నుంచి తరలిస్తున్న జలాలపై మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియ అంతంతగా తయారైంది. నదుల నుంచి మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మీదుగా సర్వీస్ రిజర్వాయర్లు, ఓవర్ హెడ్ ట్యాంకులకు నీరు సరఫరా అవుతోంది. మొదటి విడతగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాట్ (డబ్లూటీపీ) వద్ద, రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల (ఎంబీఆర్) వద్ద, చివరగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంది. కానీ సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమితో క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కానరాని మెయింటెనెన్స్.. ► నీటి సరఫరా క్లోరిన్ మెయింటెనెన్స్ ప్రశ్నార్థకంగా తయారైంది. రిజర్వాయర్ వద్ద కోర్లిన్ రెండు పీపీఎం (పార్ట్ పర్ మిలియన్) మెయింటెన్ జరగాలి. నల్లా ద్వారా వినియోగదారుడికి నీరు చేరే సమయంలో కచ్చితంగా అందులో 0.5 పీపీఎం క్లోరిన్్ మెయింటెన్ కావాల్సి ఉండగా ఆచరణలో లేకుండా పోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నీటి సరఫరా సమయంలో కోర్లిన్ శాతంపై ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. సూక్ష్మక్రిములు వృద్ధి చెందే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ► రిజర్వాయర్‌లో నీటిలో క్లోరిన్ ప్రభావం తగ్గగానే తిరిగి కలిపితేనే ఆ నీటి నాణ్యత మెరుగుపడుతుంది. క్లోరిన్ శాతం నిర్దేశించిన దానికంటే తక్కువ ఉంటే ఆ నీరు సురక్షితం కానట్లే. క్లోరిన్ ప్రభావం లేని కారణంగా సూక్ష్మ క్రిములు వృద్ధి చెంది నీరు ప్రజా ఆరోగ్యానికి హానికరంగా మారే ప్రమాదం లేకపోలేదు. నీటి శాంపిల్ సర్వేలో మాత్రం పలు రిజర్వాయర్ పరిధిలో క్లోరిన్ మెయింటెన్ కావడంలేదని బహిర్గతం కావడం ఆందోళన కలిగిస్తోంది. కొన్నిసార్లు ఔట్లెట్ టాప్ వద్ద సైతం క్లోరిన్ నిల్‌గా ఉండటం నిర్వహణ తీరుకు అద్దం పడుతోంది. లాగ్‌బుక్ నిర్వహణేదీ? సర్వీస్ రిజర్వాయర్లలో లాగ్‌బుక్ నిర్వహణ మొక్కుబడిగా తయారైంది. కేవలం ప్రధాన పాయింట్ మినహా మిగతా పాయింట్లల్లో ఎప్పటికప్పుడు లాగ్‌బుక్‌లో నమోదు లేదు. వారానికోసారి నమోదు చేస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. నిబంధనల ప్రకారం ఎగువ నుంచి రిజర్వాయర్‌లోకి వచ్చి చేరే నీటి ప్రవాహంలో క్లోరిన్ శాతంతో పాటు దిగువ నీటిని విడుదల చేసే సమయంలో క్లోరిన్ శాతాన్ని లాగ్‌బుక్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. సర్వీస్ రిజర్వాయర్ నుంచి లైన్లకు నీటిని సరఫరా జరిగే సమయంలో సైతం క్లోరిన్ శాతాన్ని లాగ్ బుక్‌లో నమోదు చేయాలి. గంట గంటకూ నమోదు చేయాల్సి ఉండగా ఆచరణలో మాత్రం అమలు కావడంలేదని తెలుస్తోంది. 30 నిమిషాల ముందే.. సర్వీస్ రిజర్వాయర్ నుంచి లైన్‌కు సరఫరా చేసే అర్ధ గంట ముందు క్లోరిన్ గ్యాస్‌ను నీటిలో విడుదల చేయాల్సి ఉండగా ఇందుకు భిన్నంగా తయారైంది పరిస్థితి. ప్రతి లైన్‌కు క్లోరిన్ శాతం పరిశీలించి సరఫరా చేయాల్సి ఉండగా.. నీటి ప్రవాహంలోనే క్లోరిన్ గ్యాస్ కలిసేటట్లు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో క్లోరిన్ శాతం హెచ్చు తగ్గులై ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఊళ్లలో మాస్కు లేకుంటే రూ.1,000 ఫైన్
సాక్షి, హైదరాబాద్: మాస్కు ధరించకుండా గ్రామాల్లో తిరిగితే రూ.1,000 జరిమానా విధించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గ్రామ పంచాయతీలకు అధికారం కట్టబెడుతూ మంగళవారం పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. పనిచేసే చోట్ల, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుండా కనిపిస్తే ఫైన్ వసూలు చేయాలని స్పష్టంచేశారు. అలాగే వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా పంచాయతీ పాలకవర్గాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా పల్లెప్రగతి మాదిరి కార్యక్రమాలను తాజాగా నిర్వహించాలని ఆదేశించారు. అందులో భాగంగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, శానిటేషన్ కమిటీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని పేర్కొన్నారు. వానాకాలానికి ముందు, తర్వాత పక్కా, కచ్చా మురుగు కాల్వల్లో పూడికతీత తీయాలని, ప్రధాన రోడ్లపై ఉన్న గుంతలను మొరంతో కప్పేయాలని సుల్తానియా సూచించారు. ప్రతి ఇంట్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు ఉండేలా చూడాల్సిన బాధ్యత పంచాయతీలదేనని స్పష్టంచేశారు. రక్షిత నీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రతి పది రోజులకోసారి ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని, నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహించి గ్రామస్తులకు మాధ్యమాల ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. -
రోగాల భయం..
►గ్రామాల్లో కలుషిత నీటితో పొంచి ఉన్న ముప్పు ► కానరాని క్లోరినేషన్ పనులు ► పట్టించుకోని అధికారులు ‘మా గ్రామంలో రక్షిత మంచినీటి పథకం నిర్మించారు. కానీ అది పని చేయడం లేదు. వర్షాకాలమైనా ఎండకాలమైనా వాగునీటినే తాగుతున్నం. అప్పుడప్పుడు రోగాలు వచ్చినా తప్పడం లేదు. వానలు వచ్చినపుడు మురికిగా ఉన్న వాగునీళ్లే దిక్కు’ అని చింతలమానెపల్లి మండలానికి చెందిన మోర్లె లలిత ఆవేదనగా తెలిపింది. ఈ సమస్య లలిత ఒక్క దానిదే కాదు జిల్లాలోని చాలా గ్రామాల్లో ప్రజలు కలుషిత నీటిని తాగి రోగాల బారిన పడుతున్నారు. చింతలమానెపల్లి(సిర్పూర్): వర్షాలు మొదలయ్యాయి. వాగులు పొంగిపారుతున్నా యి. బావుల్లోకి కొత్తనీరు చేరింది. కానీ ప్రభుత్వం క్లోరినేషన్ పనులు చేపట్టకపోవడంతో గత్యంతరం లేక కలుషిత నీటినే తాగాల్సి వస్తోంది. కలుషిత నీరే సకల వ్యాధులకు కారణం. స్వచ్ఛభారత్‌లో భాగంగా నీటి కాలుష్యాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు ప్ర చారం చేస్తున్నా ఆచరణలో మాత్రం కనిపిం చడం లేదు. జిల్లాలోని చాలా గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు పని చేయడం లేదు. దీంతో సమీపంలోని వాగులు, చెరువుల్లోని నీరు లేదా వ్యవసాయ బావుల నీటినే తాగునీటిగా వాడుతున్నారు. వర్షాకాలంలో సైతం చాలా గ్రామాల ప్రజలు వాగునీటినే తాగుతున్నారు. వాగు నీరు తాగితే ప్రజలకు రోగాలు వ్యాపించే ప్రమాదం అధికంగా ఉంది. అతిసార, రక్తవిరోచనాలు, ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రాణాలకు హాని కలిగించే పచ్చ కామెర్ల వ్యాధి నీటి కాలుష్యంతోనే సంభవిస్తుందని వైద్యులు అంటున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. చింతలమానెపల్లి మండలంలోని బాబాసాగర్, రుద్రాపూర్, చిత్తాం, గంగాపూర్, రణవెల్లి కౌటాల మండలంలోని కుంబారి, విర్దండి, సిర్పూర్ మండలంలోని లోనవెల్లి, డోర్‌పెల్లి, పారిగాం, దహెగాం మండలంలోని కొంచవెల్లి, గెర్రె సహా మండలాల్లో చాలా గ్రామాల ప్రజలు తాగునీటికి వాగులపై ఆధార పడుతున్నారు. ఈ గ్రామాలే కాకుండా మండలల్లోని చాలా గ్రామాల్లో మంచినీటికి వాగులే దిక్కు. గ్రామాల్లో తాగునీటికి ఏర్పాటు చేసిన బావులు చాలా వరకూ శిథిలావస్థలో ఉన్నాయి. వినియోగంలో ఉన్న బావుల నుంచి డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు బావుల చుట్టూ నిలుస్తోంది. జాడలేని ప్రభుత్వ చర్యలు ఏటా ప్రభుత్వం నీటి కాలుష్యం నివారించడానికి పలు రకాల చర్యలు తీసుకుంటోంది. నీటి కాలుష్యం గుర్తించడానికి ప్రత్యేక కిట్లను పంపిణీ చేస్తోంది. వర్షాలు పడగానే బావుల్లో, చేతిపంపుల్లో క్లోరినేషన్ నివారించాలి, మురుగు కాలువల్లో బయోటెక్ స్ప్రేను పిచి కారీ చేయాలి. కానీ ఈఏడాది ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారుల సమన్వయలోపంతో నీటి కాలుష్యాన్ని గుర్తించే కిట్లను ఇప్పటివరకు ఉపయోగించిన దాఖలాలు లేదు. గ్రామాల్లో క్లోరినేషన్ చేయడానికి బ్లీచింగ్ పౌడర్ కాని క్లోరిన్ ద్రావణం కాని సరఫరా చేయలేదని అధికారులే తెలియ జేస్తున్నారు. గతంలో కలుషిత నీటితో జరిగిన సంఘటనలు కౌటాల మండలంలోని నాగెపల్లి గ్రామంలో గత నాలుగు సంవత్సరాల క్రితం కలుషిత నీరు కారణంగా ఊరు మొత్తం డయేరియా బారిన పడి విరోచనాలు వాంతులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాల క్రితం 40మందికి పైగా ప్రజలకు కలుషిత నీటి కారణంగా జ్వరాలతో మంచం పట్టారు.చింతలమానెపల్లి మండల కేంద్రంలోని హేటిగూడెంలో మూడు సంవత్సరాల క్రితం నీటి కాలుష్యంతో గ్రామస్తులు జ్వరాల బారినపడ్డారు. -
ఇసిగెత్తిపోతున్న ఇమానాల మంత్రి!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : అధికారులా... బ్రోకర్లా!: గతంలో మాదిరి గా వ్యవహరించొద్దు. షాడో నేతను గుర్తుకు తెచ్చేలా నడవొద్దు. అధికారులై ఉండి బ్రోకర్లుగా ఒక రాజకీయ నాయకుడు ఇంటికి వెళ్లడం సిగ్గు అన్పించలేదా? అటువంటివి జరిగితే సహించను. ఏం మీరు బొట్టుపెట్టలేరా?: రామతీర్థంలో రాములవారిని దర్శించుకున్న అనంతరం బొట్టు పెట్టుకోమని అర్చకులు కుంకుమ భరిణి అందించినప్పుడు అసహనంతో చిందులు. ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఉత్తర రాజగోపురం వద్దకు వచ్చేటప్పటికీ బేడాలో దేవస్థానానికి చెందిన సామాన్లు అడ్డుగా ఉండడాన్ని చూసి ఆలయ అధికారులపై శివాలు. మున్సిపల్ ఇంజనీరా...మంగలి వాడా!: ఇన్‌ఫిల్టరేషన్ బావుల్లో క్లోరినేషన్ చేయాల్సి ఉన్నప్పటికీ ట్యాంక్‌లలో క్లోరినేషన్ చేయడం శాస్త్రీయం కాదు. ఇదే తరహాలో ముషిడిపల్లి రక్షిత మంచినీటి పథకం వద్ద ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే కనీసం పట్టించుకోలేదు. ఇదేనా ప్రజాప్రతినిధుల మాటలకిచ్చే గౌరవం అంటూ మండిపాటుపునరావృతమైతే సహించను: ఆదివారం ఉదయం 7.30గంటలకు ప్రొగ్రామ్ ఉందని ముందుగా చెప్పినా అధికారులు ప్రోటోకాల్ వాహనం ఏర్పాటు చేయలేదు. ఆగ్రహాన్ని ఆపుకోలేక తానే స్వయంగా డ్రైవ్ చేసుకుని సొంతవాహనంలో విశాఖపట్నం ప్రయాణం. అసలు విషయం తెలుసుకుని ఆర్డీఓ హుటాహుటిన వచ్చి ఎంత విజ్ఞప్తి చేసినా ప్రభుత్వ వాహనాన్ని స్వీకరించేందుకు ససేమిరా.... ఆయనపైనా ధ్వజం. కలెక్టర్, ఎస్పీకి ఫోన్ చేసి ఆగ్రహం. పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరిక.ఇలా ఒక వైపు జిల్లా అధికారులను, మరో వైపు పార్టీ నేతలను హడలెత్తిస్తూ...అసహనాన్ని వెళ్లగక్కుతూ ఇంతగా మండిపడుతున్న ఆ ప్రజాప్రతినిధి ఎవరో తెలుసా.... ఇంతవరకూ అధికార ఆర్భాటాలకు, నీచ రాజకీయాలకు దూరంగా ఉంటారని, చిన్న చిన్న విషయాలను అసలు పట్టించుకోరని పేరున్న అశోక్ గజపతిరాజు. కేంద్ర మంత్రి అయిన తరువాత మారిన తీరు గత పదేళ్లు అధికారంలో లేమన్న అక్కసో, గత ప్రభుత్వంలో అధికారులు తమను పట్టించుకోలేదన్న ఆక్రోశమో తెలియదు గానీ కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అధికారులపై చిర్రెత్తుతున్నారు. గతాన్ని గుర్తు చేసుకుని చిన్నదానికే శివతాండవం చేస్తున్నారు. ఇన్నాళ్లూ అణుచుకున్న ఆగ్రహంతో ఇప్పుడు శివాలెత్తుతున్నారు. అనుమానిస్తూ మాట్లాడుతున్నారు. తప్పు చేసినవాళ్లూ, చేయని వాళ్లపై ఒకేలా మండి పడుతున్నారు. అత్తమీద కోపం దుత్తమీద చూపిస్తున్నట్టు ప్రతి విషయంలో షాడో నేతను గుర్తు చేయడంతో అధికారులు వ్యక్తిగతంగా వివరణ ఇచ్చుకుంటున్నారు. తామెవరమూ ఆ నేతను కలవలేదని, ఆయన ఇంటికి వెళ్లలేదని ఒట్టేసే విధంగా చెప్పుకుంటున్నారు. అశోక్ పర్యటన అంటేనే వణికిపోతున్నారు. ఆయనొస్తే ఎలాంటి మాటలు విసిరేస్తారోనని అభద్రతాభావానికి లోనవుతున్నారు. పార్టీ నేతలపైనా.... అధికారులపైనా, పాలనా వ్యవస్థపైనా ఉన్న కోపాన్ని చివరికి తమ పార్టీ నేతలపైనే చూపిస్తున్నారు. పార్టీజెండాను మోసి, తన గెలుపును భుజానకెత్తుకున్న నాయకులని కూడా చూడకుండా మండి పడుతున్నారు. తన వెంటే ఉండి, కష్టనష్టాలకు ఓర్చి పనిచేసిన నాయకులపైనా శివాలెత్తుతున్నారు. ఆదివారం రాత్రి అదే జరిగింది. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరుతూ అశోక్ బంగ్లాలో సుమారు 400మంది నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. పార్టీకి అందించిన సేవల దృష్ట్యా ఎమ్మెల్సీ పదవి ఇస్తే గుర్తింపు ఇచ్చినట్టు అవుతుందని నాయకులంతా ఒక అభిప్రాయానికొచ్చారు. ఇదే విషయాన్ని అశోక్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంకేముంది ఆయన చిర్రెత్తిపోయారు. ‘పార్టీకి క్రమశిక్షణ ఉందని, పార్టీలో పద్ధతులున్నాయని, ఎవరికి పడితే వారికి ఇచ్చేయడానికి కుదరదని, ఐవీపీరాజుకి మంచి చేస్తున్నారో, చెడ్డ చేస్తున్నారో తెలియడం లేదు’ అంటూ విసుక్కున్నారు. పార్టీ పరమైన విషయాలను వదిలేసి వీటికోసం మాట్లాడడమేంటని మండిపడ్డారు. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని గట్టిగా కసురుకున్నారు. దీంతో సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు అవమాన భారంతో బయటికొచ్చి, ఒక్కొక్కరూ ఒక్కో విధంగా మాట్లాడుకున్నారు. కష్టపడిన వారికి పదవులు అక్కర్లేదా అని ప్రశ్నించుకోవడమే కాకుండా, ఐవీపీ రాజుకిచ్చిన గౌరవమిదేనా అని గుసగుసలాడుకుంటున్నారు. అందరి మధ్య ఐవీపీ రాజు గురించి ఇలా మాట్లాడితే రానున్న రోజుల్లో ఆయనకు ఎవరు గౌరవిమిస్తారని చర్చించుకున్నారు. పదవులు ఆశిస్తున్న నేతలంతా అశోక్ తీరుతో నిర్వేదం చెందుతున్నారు. ఈ విధంగా అటు అధికారులతోను, ఇటు పార్టీ నాయకులతోను అశోక్ కోపావేశంతో మాట్లాడడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఏదో చేస్తారనుకుంటే ప్రతికూలంగా వ్యవహరిస్తున్నారని మధనపడుతున్నారు. -
నీటి పరీక్షలు.. నిర్వహిస్తే ఒట్టు
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : వ్యాధుల బారిన పడి పల్లెలు తల్లడిల్లుతున్నా నీటి పరీక్షల జాడ కరువైంది. క్లోరినేషన్ చేసిన నీటిని ప్రజలకు తాగునీరుగా అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పట్టింది. గ్రామాల్లో రక్షిత నీటి నిర్ధారణ పరీ క్షల కోసం రెండేళ్ల కిందట పంపిణీ చేసిన కిట్లు పంచాయతీ కార్యాలయాల్లోని స్టోర్ రూముల్లో మూలుగుతున్నాయి. పల్లె ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్న సంకల్పంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కిట్లను పంపిణీ చేశారు. అయితే పంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది తాగునీటి పరీక్షలను విస్మరించా రు. జిల్లావ్యాప్తంగా ఏ ఒక్క గ్రామ పంచాయతీలో కూడా తాగునీటి పరీక్షలు జరిపిన దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదు. నీటి పరీక్షల నిర్వహణ కోసం గతం లో మండల స్థాయిలో పంచాయతీ సిబ్బందికి నామ్‌కే వాస్తేగా శిక్షణ తరగతులను నిర్వహించారు. ఒకటి రెండు రోజులు పంచాయతీ సిబ్బందికి నీటి పరీక్షలపై అవగాహన కల్పించి వేలాది రూపాయల విలువ చేసే కిట్లు, సామగ్రిని అందజేసి చేతులు దులుపుకున్నారు. గ్రామ పంచాయతీల్లో రక్షిత మంచినీటి ట్యాంకుల శుభ్రం, క్లోరినేషన్ పనుల నిర్వహణను వాటర్మెన్లు చూస్తుంటారు. వారికి నీటి పరీక్షలపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రభుత్వం ద్వారా వచ్చిన పరీక్షల కిట్లను పట్టించుకోలేదు. దీంతో కిట్లు పంచాయతీ కా ర్యాలయాల్లో వృథాగా పడి ఉన్నాయి. సిబ్బంది చేపట్టి న క్లోరినేషన్ పనులను పంచాయతీల కార్యదర్శులు, కారోబార్లు, స్థానిక వైద్య సిబ్బంది నీటి పరీక్షలను ని ర్వహించాలి. గ్రామాల్లో తాగునీటి సరఫరా పనుల నిర్వహణ వాటర్మెన్లపై వదిలేయడంతో వారు పట్టించుకోవడం మానేశారు. గ్రామంలోని రక్షిత ట్యాంకు శుభ్రత, బ్లీచింగ్ పౌడర్ వాడకం క్లోరినేషన్ మోతాదును కిట్ల ద్వారా గుర్తించి, స్థానిక పంచాయతీ రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే గ్రా మ పంచాయతీల్లో నీటి నిర్ధారణ పరీక్షల జాడ కరువైం ది. ఆర్‌డబ్ల్యూస్ శాఖ వారు పంపిణీ చేసిన కిట్లు కొన్ని పంచాయతీల్లో స్టోర్‌రూమ్‌ల్లో మూలుగుతుండగా.. మిగతా పంచాయతీల్లో వాటి ఆచూకీ కన్పించని దుస్థితి ఉంది. వారోత్సవాలకే పరిమితం.. ప్రభుత్వం ఏటా పారిశుద్ధ వారోత్సవాలను నిర్వహిస్తోంది. అధికారులు ఆ సమయంలో చూపిన శ్రద్ధ, త ర్వాత కాలంలో తాగునీటి సరఫరాపై చూపడం లేదని విమర్శలు విన్పిస్తున్నాయి. గ్రామాల్లో తాగునీటి ట్యాం కుల క్లోరినేషన్ పనులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో రక్షిత మం చి నీటి ట్యాంకులను శుభ్రపర్చడానికి, నీటి క్లోరినేషన్‌కు ఉపయోగపడే బ్లీచింగ్ పౌడర్ సైతం మైనర్ గ్రా మపంచాయతీల్లో అందుబాటులో ఉండడం లేదు. కొ న్ని గ్రామాల్లో పైపులైన్ల లీకేజీల వల్ల రక్షిత మంచినీరు కలుషితమవుతోంది. ట్యాంకు నుంచి నీటిని వదిలి మొదటి కుళాయి, మధ్యభాగం, చివరి కుళాయి నీటిని పట్టుకొని పంచాయతీ సిబ్బంది పరీక్షలను చేపట్టాలి. కాని పంచాయతీల్లో నీటి పరీక్షల మాటే మరిచారు. నీటిలోని క్రి మి కీటకాలు ప్రజలకు హాని కల్గిస్తున్నాయి. పల్లె ప్రజలు వ్యాధుల బారిన పడి మంచాన పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీల్లో నీటి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పల్లె ప్రజలు కోరుతున్నారు. -
ప్రజారోగ్యంతో చెలగాటమొద్దు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: మంచినీటి ట్యాంకులను శుభ్రపర్చడం లేదు.. కోరినేషన్ను పట్టించుకోవడం లేదు.. శానిటేషన్‌పై దృష్టి సారించడం లేదు.. ఈవిధంగా ప్రజారోగ్యంతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఈవోఆర్డీలను హెచ్చరించారు. మంచినీటి ట్యాంకుల దుస్థితి.. అధికారుల అలసత్వంపై ‘సమరసాక్షి’ శీర్షికన ఈనెల 9న నియోజకవర్గాల వారీగా ప్రచురించిన కథనాలకు కలెక్టర్ స్పందించారు. గురువారం ఈవోఆర్డీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మండలాల వారీగా మంచినీటి ట్యాంకుల తాజా స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ ట్యాంకులు క్లీన్ చేశామని చెబితే సరిపోదని.. తేదీలతో కూడిన ఫొటోలు చూపాలని ఆదేశించారు. ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్‌పై ఇక నుంచి డీఎల్పీఓలు, ఈఓఆర్డీలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మేజర్, మైనర్ పంచాయతీలకు స్వయంగా వెళ్లి పర్యవేక్షించాలని ఆదేశించారు. కల్లూరు ఈఓఆర్డీ ట్యాంకు క్లీనింగ్‌కు సంబంధించి ఒక్క ఫొటో కూడా చూపకపోవడంతో కలెక్టర్ ఆగ్రహించారు. ప్రతి శుక్రవారం విధిగా ట్యాంకులన్నింటినీ శుభ్రం చేసి ఆరబెట్టాలన్నారు. నీటిని క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేయాలని వివరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని డీపీఓను ఆదేశించారు. 13 ఆర్థిక సంఘం నిధులతో గ్రామ పంచాయతీల్లో డ్రైనేజీల నిర్మాణానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. పని ప్రారంభానికి ముందు, పూర్తయిన తర్వాత ఫొటోలు తీయాలన్నారు. జిల్లా పరిషత్ నిధులను సీసీ రోడ్లకు వెచ్చించాలని సూచించారు. మంచినీటి బోర్ల చుట్టూ ప్లాట్‌ఫాం నిర్మించి నీరు కాల్వలో కలిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులను జనవరి చివరికల్లా పూర్తి చేసి యూసీలు అందజేయాలన్నారు. పంచాయతీ భవన నిర్మాణాలకు తగిన స్థలం లేకపోతే తహశీల్దార్లను సంప్రదించాలని కోరారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్, డీపీఓ శోభ స్వరూపరాణి, కర్నూలు, నంద్యాల, ఆదోని డీఎల్పీఓలు, అన్ని మండలాల ఈఓఆర్డీలు పాల్గొన్నారు.