citrus fruits
-
నారింజ పండులా ఉంటుంది.. కానీ తొక్కతో పాటు తినేయొచ్చు
కుమ్ఖాత్ సిట్రస్ జాతి పండు. నారింజలాగే ఉంటుంది. కానీ, గుండ్రంగా కాకుండా కోడి గుడ్డు మాదిరిగా ఓవెల్ ఆకారంలో చిన్నగా (1–2 అంగుళాలు) ఉంటుంది. చైనా దీని పుట్టిల్లు. 500 ఏళ్ల క్రితం దీన్ని ఫార్చునెల్లా అని పిలిచేవారట. చైనీస్ భాషలో గామ్ (అంటే బంగారం), గ్వాత్ (టాంగెరిన్స్కు మరో పేరు) మాటల కలయిక వల్ల కుమ్ఖాత్ అనే పేరు ఈ పంటకు, పండుకు స్థిరపడింది. 400 ఏళ్ల క్రితమే ఈ పంట యూరప్‌కి, అమెరికాకు చేరింది. ఇది అతి చలిని, అతి వేడిని కూడా తట్టుకొని బతకగల విలక్షణ నారింజ జాతి పంట. దీన్ని తొక్క తీపిగా ఉంటుంది. దాంతో పాటుగా తినేయొచ్చు. కుమ్ఖాత్ పండ్లు వగర, పులుపు, కొద్దిగా తీపి కలగలిసిన రుచి కలిగి ఉంటుంది. కట్ చెయ్యాల్సిన అవసరం లేకుండా నోట్లో పెట్టుకొని తినెయ్యగలిగే ఈ పండ్లలో విటమిన్ సి, పీచు పదార్థం పుష్కలంగా ఉన్నాయి. ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్లు, మాంగనీసు, రాగి, కాల్షియం తదితర పోషకాలు కూడా ఉన్నాయి. కుమ్ఖాత్ పండులోని విత్తనాలు కూడా తినదగినవే. ఆరోగ్యదాయకమైన ఒమెగా –3 ఫ్యాటీ ఆసిడ్స్ వున్నాయి. నీటి శాతం కూడా ఎక్కువే. కుమ్ఖాత్ పండ్ల జాతిలో అనేక రకాలున్నాయి. జనాదరణ పొందిన రకాలు.. నగమి, మరుమి, మీవ. మురుమి, మీవ కుమ్ఖాత్ రకాల పండ్లు గుండ్రంగా ఉంటాయి. ఓవెల్ షేప్‌లో కొంచెం పుల్లగా ఉండే నగమి పండ్ల కన్నా తియ్యగా ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్నారింజ జాతి పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్న వారిలో ఈ పండ్లు బ్లడ్ గ్లూకోజ్‌ను పెంచవు. అతి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌తో పాటు పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున కుమ్ఖాత్ పండ్లు షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి.అధిక పీచుకుమ్ఖాత్ పండ్లలో పీచుతో కూడిన సంక్లిష్ట పిండిపదార్థాలుంటాయి. కాబట్టి, జీర్ణకోశంలో ఎక్కువ సేపు అరిగిపోకుండా ఉంటాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. అందువల్ల బరువు పెరగకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. దీనిలోని జీర్ణమయ్యే పీచుకు విరేచనాలను అరికట్టే గుణం ఉంది. ఇది జీర్ణకోశంలోని అదనపు నీటిని పీల్చుకొని, జెల్ మాదిరిగా ఏర్పడుతుంది. అందువల్ల, ఎక్కువ సార్లు విరేచనాలు అవుతూ ఉంటే గుప్పెడు కుమ్ఖాత్ పండ్లు నోట్లో వేసుకుంటే సరి.ఆరోగ్యదాయకమైన కొవ్వులుకుమ్ఖాత్ పండ్లలో కొవ్వు చాలా తక్కువ. కాబట్టి, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు వారి దినసరి ఆహారంలో కుమ్ఖాత్ పండ్లను చేర్చుకుంటే మంచిది. ఈ పండ్లలోని విత్తనాలను కూడా నమిలి తినాలి. ఈ విత్తనాల్లో ఒమెగా ఫాటీ ఆసిడ్లు ఉంటాయి కాబట్టి దేహంలో బాడ్ కొలెస్ట్రాల్ తగ్గి, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.యాంటీఆక్సిడెంట్‌గా ఉపయోగంకుమ్ఖాత్ పండ్లలో విటమిన్ ఎ, సి వంటి యాంటీఆక్సిడెంట్ విటమిన్లు ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ దేహంలో ఎక్కువైతే కణ నిర్మాణం దెబ్బతింటుంది. మన దేహంలో ఫ్రీ రాడికల్స్ కలిగించే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను కుమ్ఖాత్ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు తగ్గిస్తాయి.గుండె ఆరోగ్యానికి మేలుకుమ్ఖాత్ పండ్లలోని విటమిన్ సి, పీచు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ వంటి పోషకాలు రక్తనాళాల్లో కొవ్వు పేరుకు పోయి గుండెపోటు రాకుండా చూస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలా అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. మొత్తంగా గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఎల్‌డిఎల్‌ను తగ్గించటం ద్వారా గుండె సమస్యల్ని నిరోధిస్తాయి.ఇన్ఫ్లమేషన్కు చెక్కుమ్ఖాత్ పండ్లలో కీంప్‌ఫెరాల్, లుటియోలిన్, హెస్పెరిడిన్, క్యుఎర్సెటిన్, సి–గ్లైకోసైడ్ వంటి ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి. సి–గ్లైకోసైడ్ దేహంలో వాపును నివారించే గుణం కలిగిఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. రోగనిరోధక వ్యవస్థలో ఇన్ఫ్లమేటరీ రీయాక్షన్ను, ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ పుట్టుకను తగ్గించటంలో సి–గ్లైకోసైడ్ ఉపయోగపడుతుంది.యాంటీబాక్టీరియల్ ప్రభావంకుమ్ఖాత్ పండు తొక్కలోని నూనెకు సూక్ష్మక్రిములను హరించే గుణం ఉందని పరిశోధనల్లో తేలింది. ఆహార పదార్థాలపై పెరిగే బూజు, సూక్ష్మజీవులను నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుంది. తద్వారా ఆహార పదార్థాలు త్వరగా చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఇది దోహదం చేస్తుంది.కేన్సర్‌నూ అరికడుతుందికుమ్ఖాత్ పండులో ఉండే అపిజెనిన్ అనే ఫ్లేవనాయిడ్ కేన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుందని పరిశోధనల్లో తేలింది. అపిజెనిన్ కేన్సర్ కణాలను ఇతర ఆరోగ్యకరమైన కణాలకు సోకకుండా అరికట్టగలుగుతుందని భావిస్తున్నారు.ఊబకాయాన్ని తగ్గిస్తుందికుమ్ఖాత్ పండ్లలోని పోన్సిరిన్ అనే ఓ ఫ్లావనాయిడ్ ఊబకాయాన్ని తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. దేహం కొత్త కొవ్వు కణాలను తయారు చేసుకోకుండా అడ్డుకోవటం ద్వారా బరువు పెరగకుండా ఉండేందుకు పోన్సిరిన్ దోహదపడుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీనితో పాటు ఈ పండ్లలోని అధిక పీచుపదార్థం కడుపులో ఎక్కువ సేపు దన్నుగా ఉండటం వల్ల ఆకలి భావనను త్వరగా కలగనివ్వదు.కంటి చూపునకు మంచిదికుమ్ఖాత్ పండ్లలో బీటా కరోటెన్ రూపంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంది. ఈ పండ్లలో ఉన్న 11 కెరొటెనాయిడ్లలో ఇదొకటి. బీటీ కరోటెన్, జియాక్సాంతిన్, లుటీన్ వంటి కెరొటెనాయిడ్లు కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కంటి చూపు బాగుండాలంటే విటమిన్ ఎ తోడ్పాటుతో రోడోస్పిన్ ఉత్పత్తి అవుతుంది.మూడ్ డిజార్డర్లకూ... వత్తిడి సమస్యలను, మూడ్ డిజార్డర్లను, నిద్ర సమస్యలను విటమిన్ సి ఆహారాలు అరికడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వత్తిడి, కుంగుబాటు, ఆందోళనల తీవ్రతను తగ్గించటం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యాంటీడిప్రెసెంట్ మాదిరిగా కుమ్ఖాత్ పండ్లు పనిచేస్తాయి. ఆరోగ్యదాయకమైన నిద్రకు దోహదం చేస్తాయి. అయితే, అది ఏ విధంగా దోహదపడతాయో ఇంకా స్పష్టంగా తెలియదు.ఎముక పుష్టికి.. ఎముక పెరుగుదలలో విటమిన్ సి పాత్ర కీలకమైనది. విటమిన్ సి కొల్లజెన్ ఏర్పడటానికి దోహదపడుతుంది. కుమ్ఖాత్ పండ్లలో కాల్షియం, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఎముకలు పటుత్వాన్ని కోల్పోయే ఆస్టియోపోరోసిన్ వంటి సమస్యలను విటమిన్ సి తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకల నుంచి కాల్షియంను హరించే యాసిడ్ ఫుడ్స్ ఎముక సమస్యల్ని పెంచుతాయి. కుమ్ఖాత్ పండ్లు ఆల్కలిన్ ఫ్రూట్స్ కాబట్టి ఆస్టియోపోరోసిన్కు దారితీయకుండా కాపాడుతాయని చెప్చొచ్చు.రోగనిరోధక శక్తి కుమ్ఖాత్ పండ్లలోని బీటా–క్రిప్టోక్సాంతిన్, ఎల్–లైమోనెనె మన దేహంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని ఓ అధ్యయనం చెబుతోంది. సహజ సిద్ధమైన కిల్లర్ సెల్స్ కార్యకలాపాలను పెంపొందించటం ద్వారా దేహంలో మెటబాలిక్ స్ట్రెస్‌ను తగ్గించటంలో ఇవి ఉపయోపడతాయి.చదవండి: పొలాల్లో రసాయనాల వాడకంతో మనుషుల్లో జబ్బుల పెరుదలకుమ్ఖాత్ పోషక విలువలు: 100 గ్రాముల కుమ్ఖాత్ పండ్లలో పోషకవిలువలు ఇలా ఉంటాయి... శక్తి : 71 కిలోకేలరీలు; పిండిపదార్థాలు : 15.9 గ్రా; మాంసకృత్తులు : 1.8 గ్రా; కొవ్వు : 0.8 గ్రా; పీచు : 6.5 గ్రా; విటమిన్ ఎ : 15 మిల్లీ గ్రాములు; విటమిన్ సి : 43.9 ఎం.జి; రిబొఫ్లేవిన్ : 0.09 ఎం.జి; క్లోరిన్ : 8.4 ఎం.జి; కాల్షియం : 62 ఎం.జి; ఐరన్ : 0.87 ఎం.జి; మెగ్నీషియం : 20 ఎం.జి; మాంగనీసు : 0.13 ఎం.జి; జింక్ : 0.17 ఎం.జి; -
Health Tips: చిగుళ్లనుంచి తరచూ రక్తం వస్తుందా? ఇవి తిన్నారంటే..
Vitamin C Rich Foods In Telugu: మీ శరీరంపై గాయాలు మానడానికి చాలా కాలం పడుతుందా? బ్రష్ చేసేటప్పుడు చిగుళ్లనుంచి రక్తం వస్తుందా? ..ఇంకా అలసట, నీరసం, చర్మం ముడతలు పడటం... మీ సమాధానం అవునైతే.. మీరు విటమిన్ ‘సి’లోపంతో బాధపడుతున్నారేమో! ఐతే ఇతర వైద్య కారణాల వల్ల కూడా ఇవే సమస్యలు సంభవించవచ్చు. విటమిన్ సి లోపాన్ని సకాలంలో గుర్తించకపోతే.. రక్తహీనత, మైయాల్జియా, ఎడీమా, పెరియోడాంటైటీస్, పెటెచియా వంటి తీవ్ర ఆనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందుగా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. అలాగే కొద్దిపాటి ఆహారపు అలవాట్లతో కూడా విటమిన్ సి లోపాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ‘సి’ అధికంగా ఉండే కొన్ని రకాల ఆహారాలు మీకోసం.. సిట్రస్ ఫ్రూట్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నూట్రిషన్ ప్రకారం.. ప్రతిరోజూ మన శరీరానికి 40 గ్రాముల చొప్పున విటమిన్ ‘సి’ అవసరం అవుతుంది. సిట్రస్ పండ్లను తరచూ తీసుకుంటే ఇమ్యునిటీ సిస్టం బలపరచటమేకాకుండా, చర్మం, ఎముకల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించే కొల్లాజెన్ హార్మోన్ ఏర్పడటానికి కూడా కీలకంగా వ్యవహరిస్తాయి. బొప్పాయి యాంటీఆక్సిడెంట్లు బొప్పాయిలో పుష్కలంగా ఉంటాయి. ‘హీలింగ్ ఫుడ్స్’ బుక్ ప్రకారం యాంటీ బ్యాక్టీరియల్ కారకాలు కూడా దీనిలో అధికంగా ఉంటాయని తెలుస్తోంది. చదవండి: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..! టమాట విటమిన్ ‘ఎ’, ‘సి’లు టమాటాలో నిండుగా ఉంటాయి. మన శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్ నుంచి రక్షణ కల్పించడంలో ఈ రెండు విటమిన్లు ఎంతో సహాయపడతాయి. అందువల్లనే రోజు వారి వంటకాల్లో టమాటాను వాడకం పరిపాటైంది. స్ట్రాబెర్రీ పండ్లు స్ట్రాబెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు మాత్రమేకాకుండా విటమిన్ ‘సి’ కూడా అధికంగా ఉంటుంది. నిజానికి ఆరెంజ్ పండ్లలో కన్నా స్ట్రాబెర్రీ పండ్లలోనే విటమిన్ ‘సి’ కంటెంట్ అధికంగా ఉంటుంది. బ్రొకోలి వంద గ్రాముల బ్రొకోలిలో 89 గ్రాముల విటమిన్ ‘సి’ఉంటుంది. యాంటీ ఆక్సిటెంట్లకు, అనేక ఖనిజాలకు బ్రొకోలి స్థావరం వంటిదని బెంగళూరుకు చెందిన ప్రముఖ నూట్రీషనిస్ట్ డా.అంజు సూద్ పేర్కొన్నారు. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! -
Nalgonda Mosambi: కలిసొచ్చిన ‘కత్తెర’.. రైతుల్లో ఆనందం!
సాక్షి ప్రతినిధి నల్లగొండ: బత్తాయి రైతులకు ఈ సారి కాలం కలిసొచ్చింది. కరోనా వైరస్ బారిన పడుతున్న వారికి విటమిన్–సీ అత్యంత అవసరమని డాక్టర్లు పదేపదే చెబుతున్న వేళ బత్తాయికి డిమాండ్ పెరిగింది. కోవిడ్ విజృంభణతో అల్లకల్లోలంగా మారిన ఢిల్లీలో నల్లగొండ బత్తాయికి గిరాకీ పెరిగింది. అక్కడ బత్తాయికి రిటైల్‌లో కిలో కనీసం రూ.200 ధర ఉండటంతో వ్యాపారులంతా ఇక్కడి బత్తాయి తోటలపై వాలిపోయారు. కాయ సైజుతో సంబంధం లేకుండా.. చెట్టు మీద ఎంత పంట ఉంటే అంత కొనుగోలు చేస్తున్నారు. కత్తెర దిగుబడి తక్కువగా.. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. కరోనా ఉన్న ప్రధాన నగరాల్లో బత్తాయికి ఎక్కువగా డిమాండ్ ఉంది. గత ఏడాది కరోనా సమయంలో సంపూర్ణ లాక్డౌన్ ఉండి.. రవాణా ఆంక్షలతో టన్ను ధర రూ.10 వేలకే అమ్ముకున్న రైతులకు ఈసారి మాత్రం పంట పండింది. గరిష్ట ధర.. టన్నుకు రూ.60 వేలు.. సాధారణంగానే కత్తెర పంట దిగుబడి తక్కువగా వస్తుంది.. దీంతో ధర అధికంగా ఉంటుంది. కానీ, ఈసారీ దిగుబడి తక్కువగా ఉండటం.. కరోనా డిమాండ్ కలిసివచ్చింది. దీంతో టన్ను బత్తాయి గరిష్టంగా రూ.60 వేల దాకా పలుకుతోంది. జిల్లా లో 42,558 ఎకరాల్లో బత్తాయి సాగు చేస్తున్నారు. ఇందులో 31,917 ఎకరాల నుంచి బత్తాయి దిగుబడి వస్తోంది. ఇక, కత్తెర పంట దిగుబడి 40వేల టన్నుల దాకా వస్తుందని ఉద్యానవన శాఖ అంచనా. సాధారణ రోజుల్లో టన్నుకు రూ.39వేల దాకా ధర ఉంటుందని అధికారులు అంచనా వేయగా.. అనూహ్యంగా టన్నుకు రూ.40వేల నుంచి రూ.60వేలు పలుకుతోంది. జిల్లా నుంచి మొత్తంగా రూ.156 కోట్ల బత్తాయి టర్నోవర్ జరిగినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. తోట వద్దే రూ.52 వేలకు అమ్మిన.. దళారులు టన్నుకు రూ.52వేల చొప్పున ధర చెల్లించి తోట వద్దే కొన్నరు. 8 ఎకరాల్లో బత్తాయి సాగు ఉండగా.. 6 టన్నుల కాతవచ్చింది. పూర్తిస్థాయిలో పూత, పిందె రాలేదు. టన్ను రూ.60వేలు చెబితే చివరికి రూ.52వేలకు అమ్ముడుపోయింది. గత ఏడాది కత్తెర దిగుబడి 7 టన్నులు రాగా.. రూ.10వేలకైనా కొనుగోలు కాలేదు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులుపడ్డం. – ఇంద్రసేనారెడ్డి, ముషంపల్లి రూ.6 లక్షల ఆదాయం బత్తాయి ధరలో ఇప్పటివరకు నాదే రికార్డు. తోట వద్దే టన్ను రూ.56 వేలకు అమ్మిన. ఆరు ఎకరాల్లో 11 టన్నుల కత్తెర దిగుబడి రాగా.. రూ.6 లక్షల ఆదాయం వచ్చింది. ఇంకా 20 టన్నుల వరకు సీజన్ పంట ఉంది. సాధారణంగా బత్తాయితోట నాటిన ఐదేళ్ల నుంచి దిగుబడి మొదలవుతుంది. మా తోటలో మూడో ఏడాది నుంచే కత్తెర కాపు కాస్తోంది. మూడో ఏడాదే 11 టన్నులు కత్తెర కాపు కాయడం రికార్డే. – చింతరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆరెగూడెం, గుర్రంపోడు మండలం -
బత్తాయికి సర్కారు ‘మద్దతు’
సాక్షి, అమరావతి: ధరలు లేక కొట్టుమిట్టాడుతున్న బత్తాయి (స్వీట్ లెమన్) రైతుల్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించి బత్తాయిలు టన్ను రూ.10 వేల చొప్పున 10 వేల టన్నులను సేకరించేలా సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో రైతు నుంచి గరిష్ఠంగా వెయ్యి క్వింటాళ్లు (100 టన్నులు) సేకరిస్తారు. రాష్ట్రంలో సుమారు 86 వేల హెక్టార్లలో బత్తాయి సాగువుతుంది. కోవిడ్–19 మూలంగా బత్తాయి రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవడంతో పాటు కనీస మద్దతు ధర పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రివర్గ బృందం ధరల స్థిరీకరణ నిధితో ప్రభుత్వమే కొనుగోలు చేస్తే బాగుంటుందని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం బత్తాయి సేకరణకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ► వ్యవసాయ మార్కెట్ కమిటీ అందించే ఎన్‌ఇఎంఎల్ సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే రైతుల నుంచి బత్తాయి సేకరించాలి. ► టన్ను ధర రూ.10 వేల వంతున 10 వేల మెట్రిక్ టన్నుల బత్తాయిలు సేకరించాలి. ► ఒక్కో రైతు నుంచి ఎకరానికి 20 టన్నుల చొప్పున గరిష్ఠంగా ఐదెకరాలకు వందటన్నుల కాయలు కొంటారు. ► వీటిని రైతుబజార్లు, సెర్ప్, మెప్మాల ఆధ్వర్యంలోని నెట్‌వర్క్‌ల ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విక్రయిస్తారు. ► ఏఎంసీ కార్యదర్శి నిర్ణయించే అమ్మకపు ధరలో రవాణా, నిర్వహణ, ఇతరత్రా యాధృచ్ఛిక చార్జీలు కలుపుతారు. ► అమ్మకాలపై కిలోకు రూ.5 సబ్సిడీ ఇస్తారు ► బత్తాయిలను విక్రయించే స్వయం ఉపాధి సంఘాలకు ఒక రూపాయి కమీషన్ ఇస్తారు. ► 2 శాతం తరుగు (డామేజీ) అనుమతిస్తారు. ► రైతుబజార్లలో అమ్మ కాలతో వచ్చే నగదును సంబంధిత కార్యనిర్వహణాధికారి రైతుబజారు సీఇవో ఖాతాకు జమచేయాలి. ► పట్టణ ప్రాంతాలలో మెప్మాకు అప్పగించే అవకాశాన్ని పరిశీలించే ముందు రైతుబజార్ల ద్వారా అమ్మకాలకు ప్రాధాన్యత ఉంటుంది. ► ఏపీఎం, సెర్ప్, సీఎంఎం, మెప్మాల నుంచి అమ్మకపు మొత్తాన్ని.. కాయలు సరఫరా చేసిన ఏఎంసీ సేకరిస్తుంది. ► గ్రామీణ ప్రాంతాల్లో లావాదేవీలను డీఆర్డీఏ పీడీ, పట్టణ ప్రాంతాల్లో మెప్మా పీడీ పర్యవేక్షిస్తారు. ► మార్కెటింగ్‌శాఖ తరఫున ఈ మొత్తం వ్యవహారాన్ని ఏడీఎం, డీడీఎం, జేడీఎం పర్యవేక్షిస్తారు. డీఆర్డీఏ పీడీ, మెప్మా పీడీలతో ఏడీఎం సంప్రదింపులు జరుపుతూ కార్యక్రమం సజావుగా సాగేలా చూస్తారు. -
బత్తాయి రైతుకు సర్కారు అండ
సాక్షి, అమరావతి: కొవిడ్–19 కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మార్కెట్లు పూర్తిగా ప్రారంభం కాకపోవడంతో ఎగుమతుల్లేక రాష్ట్రంలో చీనీ (బత్తాయి) ధర పతనమైంది. దీంతో ఆ రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. పంటకు మంచి ధర వచ్చే వరకు రైతుల నుంచి కొనుగోలు చేసి రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో విక్రయించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లోని రైతుల నుంచి టన్ను రూ.14 వేల చొప్పున తొలి విడతగా 120 మెట్రిక్ టన్నులను సోమ, మంగళవారాల్లో కొనుగోలు చేసింది. వీటిని లారీల ద్వారా రాష్ట్రంలోని వివిధ రైతుబజార్లకు పంపించింది. రవాణా ఖర్చులు, హమాలీ చార్జీలు, స్వయం సహాయక గ్రూపుల కమీషన్లతో కలిపి రైతుబజార్లలో కిలో రూ.20 లకు విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. కాగా, కొనుగోలు చేసిన బత్తాయిని శ్రీకాకుళం జిల్లాకు 5 టన్నులు, విజయనగరం 10, విశాఖ సిటీ 10, విశాఖ జిల్లా 20, తూర్పుగోదావరి 10, పశ్చిమ గోదావరి 10, విజయవాడ 10, కృష్ణాజిల్లా 15, గుంటూరు 10, ప్రకాశం 5, నెల్లూరు 5, చిత్తూరు 5, కర్నూలు జిల్లాకు 5 టన్నుల చొప్పున కేటాయించారు. ఇక విజయవాడ, విశాఖ రైతుబజార్లలో బుధవారం నుంచి ఇవి అందుబాటులో ఉంటాయి. మిగిలిన రైతుబజార్లలో ఒకట్రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తాయి. ఎగుమతులు మొదలయ్యే వరకూ కొనుగోళ్లు ఇదిలా ఉంటే.. ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్లు మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అక్కడి వ్యాపారులు బత్తాయి కొనుగోలుకు రాష్ట్రానికి వస్తే టన్ను రూ.20వేలకు పైగానే పలుకుతుందని రైతులు చెబుతున్నారు. ఆ ధర వచ్చే వరకు రైతుల నుంచి బత్తాయిని కొనుగోలు చేస్తామని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఇస్సార్ అహ్మద్ తెలిపారు. -
బత్తాయి, అరటికి సర్కార్ ‘మద్దతు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గణనీయమైన విస్తీర్ణంలో సాగు చేసే రెండు ప్రధాన పంటలు.. అరటి, బత్తాయి (స్వీట్ ఆరెంజెస్)లకు సేకరణ ధరను ప్రకటిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ప్రకటించిన పసుపు సేకరణ ధరను కూడా పెంచింది. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ) ప్రకటించే పంటల్లో అరటి, బత్తాయి లేవు. రాష్ట్రంలో ప్రస్తుతం 88,029 హెక్టార్లలో బత్తాయి, 69,894 హెక్టార్లలో అరటి (టిష్యూ కల్చర్) రకం, 43,101 హెక్టార్లలో అరటి (స్థానిక) రకం సాగవుతోంది. కొంత కాలంగా ధరల విషయంలో రైతులు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ రెండు పంటలకు సేకరణ ధరలు ప్రకటించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారులు గత కొన్నేళ్ల మార్కెట్ రేటును ప్రాతిపదికగా తీసుకుని సగటు ఆధారంగా అరటికి క్వింటాల్‌కు రూ.800, బత్తాయి క్వింటాల్‌కు రూ.1,400గా సేకరణ ధరలను నిర్ణయించారు. పసుపు ధరను క్వింటాల్‌కు రూ.6,850గా ప్రకటించారు. ఇందుకు స్థిరీకరణ నిధిని ఉపయోగించుకుంటుంది. -
ఆ పండ్లతో కిడ్నీ రాళ్లు కరుగుతాయ్!
కిడ్నీల్లో రాళ్లు రావడం ఈ రోజుల్లో కామన్ అయిపోతోంది.. చాలా చిన్న వయసులో కూడా ఈ బాధ అనుభవించేవారి సంఖ్య పెరుగుతోంది. దీనికి చికిత్స కూడా కాస్త కఠినంగానే ఉంటుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా మారని ఈ చికిత్స పద్ధతికి ప్రత్యామ్నాయం త్వరలోనే రానుంది. మూత్రపిండాల్లోని రాళ్లను కొన్ని రకాల పండ్లలో ఉండే హైడ్రాక్సీ సిట్రేట్ రసాయనం ఇట్టే కరిగిస్తుందని హ్యూస్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. కాల్షియం ఆక్సలేట్ కారణంగా వచ్చే ఈ కిడ్నీ రాళ్లను రాకుండా నివారించాలంటే నీరు ఎక్కువగా తాగాలని, ఆక్సలేట్లు ఎక్కువగా ఉండే పాలకూర, టమోటాలు తినొద్దని డాక్టర్లు చెబుతారు. అలాగే పొటాషియం సిట్రేట్ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలని కూడా చెబుతుంటారు. కాకపోతే పొటాషియం సిట్రేట్‌తో వచ్చే దుష్ఫలితాలు ఎక్కువ కాబట్టి కిడ్నీ రాళ్ల నివారణకు ప్రత్యామ్నాయం కోసం హ్యూస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రయత్నించారు. హైడ్రాక్సీ సిట్రేట్ ఉన్న పండ్లు తీసుకుంటే కిడ్నీ రాళ్లు కరిగిపోయే అవకాశం ఉందని గుర్తించారు. కిడ్నీ రాళ్ల సమస్యతో బాధపడుతున్న కొందరిపై ఈ మందును ప్రయోగించగా సత్ఫలితాలు సాధించినట్లు జెఫ్రీ రిమ్మర్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఇంకా పరిశోధనలు నిర్వహించి మరింత మెరుగైన మందు తయారు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.