Vitamin C Rich Foods In Telugu: మీ శరీరంపై గాయాలు మానడానికి చాలా కాలం పడుతుందా? బ్రష్ చేసేటప్పుడు చిగుళ్లనుంచి రక్తం వస్తుందా? ..ఇంకా అలసట, నీరసం, చర్మం ముడతలు పడటం... మీ సమాధానం అవునైతే.. మీరు విటమిన్ ‘సి’లోపంతో బాధపడుతున్నారేమో! ఐతే ఇతర వైద్య కారణాల వల్ల కూడా ఇవే సమస్యలు సంభవించవచ్చు. విటమిన్ సి లోపాన్ని సకాలంలో గుర్తించకపోతే.. రక్తహీనత, మైయాల్జియా, ఎడీమా, పెరియోడాంటైటీస్, పెటెచియా వంటి తీవ్ర ఆనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందుగా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. అలాగే కొద్దిపాటి ఆహారపు అలవాట్లతో కూడా విటమిన్ సి లోపాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ‘సి’ అధికంగా ఉండే కొన్ని రకాల ఆహారాలు మీకోసం..
సిట్రస్ ఫ్రూట్స్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నూట్రిషన్ ప్రకారం.. ప్రతిరోజూ మన శరీరానికి 40 గ్రాముల చొప్పున విటమిన్ ‘సి’ అవసరం అవుతుంది. సిట్రస్ పండ్లను తరచూ తీసుకుంటే ఇమ్యునిటీ సిస్టం బలపరచటమేకాకుండా, చర్మం, ఎముకల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించే కొల్లాజెన్ హార్మోన్ ఏర్పడటానికి కూడా కీలకంగా వ్యవహరిస్తాయి.
బొప్పాయి
యాంటీఆక్సిడెంట్లు బొప్పాయిలో పుష్కలంగా ఉంటాయి. ‘హీలింగ్ ఫుడ్స్’ బుక్ ప్రకారం యాంటీ బ్యాక్టీరియల్ కారకాలు కూడా దీనిలో అధికంగా ఉంటాయని తెలుస్తోంది.
చదవండి: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..!
టమాట
విటమిన్ ‘ఎ’, ‘సి’లు టమాటాలో నిండుగా ఉంటాయి. మన శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్ నుంచి రక్షణ కల్పించడంలో ఈ రెండు విటమిన్లు ఎంతో సహాయపడతాయి. అందువల్లనే రోజు వారి వంటకాల్లో టమాటాను వాడకం పరిపాటైంది.
స్ట్రాబెర్రీ పండ్లు
స్ట్రాబెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు మాత్రమేకాకుండా విటమిన్ ‘సి’ కూడా అధికంగా ఉంటుంది. నిజానికి ఆరెంజ్ పండ్లలో కన్నా స్ట్రాబెర్రీ పండ్లలోనే విటమిన్ ‘సి’ కంటెంట్ అధికంగా ఉంటుంది.
బ్రొకోలి
వంద గ్రాముల బ్రొకోలిలో 89 గ్రాముల విటమిన్ ‘సి’ఉంటుంది. యాంటీ ఆక్సిటెంట్లకు, అనేక ఖనిజాలకు బ్రొకోలి స్థావరం వంటిదని బెంగళూరుకు చెందిన ప్రముఖ నూట్రీషనిస్ట్ డా.అంజు సూద్ పేర్కొన్నారు.
చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..!
Comments
Please login to add a commentAdd a comment